Janaki Kalaganaledu February 7th: తండ్రి క్షేమం కోసం రామ ఆలోచన.. లడ్డుల ఆర్డర్ లో జ్ఞానాంబ ట్విస్ట్!

జానకి కలగనలేదు విభిన్నమైన కథాంశంతో ఆకట్టుకుంటోంది. ఇక కుటుంబ పరిస్థితి కష్టాల్లో ఉన్న సమయంలో రామచంద్ర అందరిని బాగా చూసుకోవాలని తాపత్రయపడుతున్నాడు. అఖిల్ జాబ్ కారణంగా అప్పు చేసిన రామ ఆస్తులు పోగొట్టుకొని కష్టాలపాలవుతాడు. అయితే ఆ ఇబ్బందుల వలన ఫ్యామిలీ కూడా ఇబ్బంది పడుతుంది. అయితే జానకి గొడవలు రాకుండా చూడాలని అనుకుంటుంది.

ఇక జానకి కలగనలేదు సీరియల్ కు గత వారం కంటే ఈ వారం రేటింగ్స్ మరింత పెరిగాయి. 8.95 రేటింగ్ తో గత వారం మంచి క్రేజ్ అందుకుంటోంది. నేడు ప్రసారం కాబోయే 496 వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం..

మల్లికకు జానకి అదిరిపోయే కౌంటర్

మల్లికకు జానకి అదిరిపోయే కౌంటర్

రామచంద్ర మళ్ళీ చక్రాల బండిమీద తన సరికొత్త జీవితాన్ని ప్రారంభిస్తాడు. ఒకప్పుడు షాప్ లో ఓనర్ లా కూర్చున్న రామచంద్ర ఇప్పుడు తోపుడు బండిమీద స్వీట్స్ అమ్ముతూ మళ్లీ తన జీవితాన్ని అలాగే కుటుంబ పరిస్థితిని చక్కదిద్దాలి అని అనుకుంటాడు. అతనికి తోడుగా జానకి కూడా సహాయం చేస్తూ ఉంటుంది.

అయితే ఈ క్రమంలో చిన్న కోడలు మల్లికా మాత్రం రామచంద్రను కించపరిచే విధంగా మాట్లాడుతూ ఉంటుంది. తోపుడు బండి మీద ఆలస్యమైంది ఏమిటి అని తక్కువ చేసి మాట్లాడడంతో జానకి ఊహించని విధంగా మల్లికకు కౌంటర్ ఇస్తుంది.

మీ ఆయన అంటే వేరే షాప్ లో పనిచేయాలి మధ్యాహ్నం అయితే అనుమతి తీసుకుని రావాలి కానీ మా ఆయన ఎప్పుడైనా రావచ్చు అని అనడంతో మల్లికకు ఊహించని కౌంటర్ పడుతుంది. దీంతో ఆమె ఏమి మాట్లాడకుండా ఇంట్లోకి వెళ్ళిపోతుంది.

లడ్డుల ఆర్డర్

లడ్డుల ఆర్డర్

ఇక తర్వాత రామచంద్రకు తెలిసిన వ్యక్తి వచ్చి ఒక ఆర్డర్ గురించి చెబుతాడు. ఉదయం కల్లా లడ్డులు కావాలి అని అనడంతో రామచంద్ర కొంత ఆలోచిస్తాడు. ఉదయం కల్లా 70 కేజీల లడ్లు అంటే కష్టమవుతుంది అని అంటాడు. కానీ జానకి మాత్రం తన కాలేజీ ఫీజు గురించి ఆలోచిస్తూ ఎలాగైనా ఈ ఆర్డర్ తీసుకొని కష్టపడి పని చేయాలి అని అనుకుంటుంది. ఇక జానకి రామచంద్ర కు సర్ది చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఒప్పుకోమని అంటుంది. దీంతో రామచంద్ర కూడా జానకి మాటలకు ఒప్పుకుంటాడు.

పని వెతుక్కున్న గోవిందరాజులు

పని వెతుక్కున్న గోవిందరాజులు

ఇక జానకి ఇంట్లో వంట పనులు కూడా చూసుకోవాలని అనుకుంటుంది. అయితే మలయాళం మాత్రం వచ్చిరాని వంటతో ఏదో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఇక జానకి అతన్ని చూసి నవ్వుతుంది. నేను చూసుకుంటాను అని చెబుతుంది. కానీ మలయాళం మాత్రం ఏదో ఒకటి పొయ్యి మీద పడేసి ఒంటరిగా పూర్తి చేయాలని అనుకుంటాడు.

ఇక రామచంద్ర ఇంట్లోకి రాగానే ఒక ఫోన్ కాల్ వస్తుంది. తెలిసిన ఒక వ్యక్తి ఫోన్ చేసి మీ నాన్నగారు మా మిల్లులో గుమస్తాగా పనిచేయడానికి ఒప్పుకున్నారు అని ఉదయం ఆయనను మీల్లు దగ్గర దింపాలి అని అంటాడు. దీంతో రామచంద్ర ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు. నాన్న మళ్ళీ పని చేయడానికి సిద్ధమయ్యారు అని ఆలోచిస్తాడు.

నా మందుల కోసం..

నా మందుల కోసం..

వెంటనే తన తండ్రిని అడుగుతాడు. మీరు పని చేయడానికి ఒప్పుకున్నారని అడగడంతో మొదట గోవిందరాజులు అలా ఏమీ లేదు అని అంటాడు. కానీ ఫోన్ వచ్చిన సంగతి గురించి చెప్పడంతో ఖాళీగా కూర్చోవడం ఇష్టం లేదు అని అందరూ ఏదో ఒక పని చేస్తున్నారు కాబట్టి నేను కూడా పని చేయాలని అనుకున్నట్లుగా చెబుతాడు.

కనీసం నా మందులకైనా నేను సంపాదించుకోవాలి అని అనుకుంటున్నాను అని అంటారు. ఇక రామచంద్ర మాత్రం మీరు అలా చేయకూడదు అని ముగ్గురం కష్టపడి సంపాదిస్తున్నప్పుడు మీరు ఈ టైంలో ఆరోగ్యం పాడు చేసుకోవద్దని అని అంటాడు. ఇక జానకి కూడా అదే చెబుతుంది ఇక గోవిందరాజులు భార్య జ్ఞానంబ కూడా మీరు చేసే పని నాకు నచ్చడం లేదు అని చెప్తుంది. ఇక గోవిందరాజులు ఏమి అనలేక మౌనంగా ఉండిపోతాడు.

కోపంగా మల్లిక అసహనం

కోపంగా మల్లిక అసహనం

ఇక మరోవైపు మల్లిక గోవిందరాజులు అలా చెప్పడంతో కాస్త అసహనం వ్యక్తం చేస్తుంది. తన భర్త విష్ణు రాగానే మీ నాన్నగారు పని చేస్తే పోయేది ఏముంది ఇప్పుడు బాగానే ఉన్నారు కదా అని కోపంగా మాట్లాడుతుంది. అందుకు విష్ణు నాన్న గారి ఆరోగ్యం గురించి కూడా ఆలోచించాలి కదా అని అంటాడు. కానీ మల్లిక మాత్రం అతడి మాటలకు ఒప్పుకోదు. మీరు మాత్రం ఇంట్లో డబ్బులు ఇవ్వకూడదు అని చెబుతోంది. అందుకోసం నేను ఏదో ఒకటి ఆలోచిస్తాను అని చెబుతుంది.

అత్తగారే కారణం..

ఇక మరోవైపు లడ్డూలు చేసే ఆర్డర్ గురించి రామచంద్ర ఆలోచిస్తారు. ఇక వంట సామను మొత్తం రావడంతో రాత్రి మొత్తం కూర్చొని పని చేయాలని అనుకుంటారు. అయితే వారికి వెన్నెల కూడా మొదట సహాయం చేస్తుంది కాని ఆమె నిద్ర వస్తుంది అని వెళ్లిపోతుంది.

ఇక రామచంద్ర కూడా జానకిని పంపించేస్తుంది. ఇక వంట మనిషి మలయాళం కూడా అలానే పడుకుండిపోతాడు. జానకి మాత్రమే రాత్రి మొత్తం కష్టపడి లడ్డూలు తయారు చేస్తుంది. ఇక ఆ ఆర్డర్ రావడానికి ముఖ్య కారణం అత్తగారే కారణమని జానకి గ్రహిస్తుంది. మరి ఈ విషయంలో జానకి ఎలా రియాక్ట్ అవుతుందో తదుపరి ఎపిసోడ్ లో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X