Janaki Kalaganaledu February 8th: ఒంటరిగా కష్టపడిన జానకి.. ఉంగరం పోయిందంటూ మల్లిక గోల!
జానకి కలగనలేదు ఆసక్తికరమైన కథాంశంతో ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఫ్యామిలీ పరిస్థితి ఎలా ఉన్న సమయంలో రామచంద్ర అందరిని బాగా చూసుకోవాలని తాపత్రయపడుతున్నాడు. ఇక అఖిల్ జాబ్ కారణంగా అప్పు చేసిన రామ ఆస్తులు పోగొట్టుకొని కష్టాలపాలవుతాడు. అయితే ఆ ఇబ్బందుల వలన ఫ్యామిలీ కూడా ఇబ్బంది పడుతుంది. అయితే జానకి గొడవలు రాకుండా చూడాలని అనుకుంటుంది. ఇక జానకి కలగనలేదు సీరియల్ కు గత వారం కంటే ఈ వారం రేటింగ్స్ మరింత పెరిగాయి. 8.95 రేటింగ్ తో గత వారం మంచి క్రేజ్ అందుకుంటోంది. నేడు ప్రసారం కాబోయే 497 వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం..

ఒంటరిగా కష్టపడిన జానకి
రామచంద్రకు తెలిసిన వాళ్ళు స్వీట్స్ కావాలి అంటే ఒక ఆర్డర్ ఇస్తారు. అయితే ఒక్క రాత్రిలోనే 70 కేజీల లడ్డులు కావాలి అని చెప్పడంతో రామచంద్ర కొంత ఆలోచిస్తాడు. కానీ జానకి మాత్రం ఆర్డర్ తీసుకోమ్మని చెబుతుంది. అయితే ఒక రోజులో అన్ని లడ్డులు పూర్తి చేయడం చాలా కష్టమని రామచంద్ర చెప్పినప్పటికీ జానకి మాత్రం అందరం కష్టపడితే త్వరగా పూర్తి చేయవచ్చు అని అంటుంది. అందరూ కూడా కిచెన్ లో ఉండి లడ్డులో రెడీ చేయడం స్టార్ట్ చేస్తారు. అయితే రామచంద్ర చెల్లెలు వెన్నెల కొద్దిసేపటి తర్వాత వెళ్లి పడుకుంటుంది. అలాగే రామచంద్ర కూడా తనకు నిద్ర వస్తుంది అని పడుకుంటాడు. ఇక ఇంట్లో పని చేసే మలయాళం కూడా లడ్డులు చేస్తూ అలానే నిద్రపోతాడు. ఇక జానకి మాత్రం పడుకోకుండా లడ్డూలను మాత్రం ఉదయానికల్లా మొత్తం ప్యాక్ చేసి రెడీ చేస్తుంది.

జానకి, రామ లవ్ ట్రాక్
ఇక అది చూసి రామచంద్ర ఉదయం ఆశ్చర్యపోతాడు. మీరు ఒక్కరే రాత్రి మొత్తం పడుకోకుండా లడ్డూలు పూర్తి చేశారా? అని అడుగుతాడు. అవును అంటూ గోవిందరాజులు కూడా వచ్చి చెబుతాడు. ఇక మలయాళం మాత్రం అలానే పడుకుండిపోయాడు అని కొట్టి లేపుతాడు. ఇక వెంటనే అతన్ని కాఫీ రెడీ చేయమని చెప్తాడు. ఇక మరోవైపు జానకి కాలేజీకి టైం అవుతుంది అని త్వర త్వరగా రెడీ కావాలని అనుకుంటుంది. ఇక ఆమె వేడి నీళ్ళు పోసుకొని బాత్రూంకి వెళుతూ ఉండగా రామచంద్ర సహాయం చేస్తారని అంటాడు. అవసరం లేదు అంటూ జానకి కొంత అతనితో దోబూచులాడుతుంది. ఇక ఈ క్రమంలో అత్తగారు చేసిన సహాయం గురించి కూడా రామ భర్తకు చెబుతోంది. మనకు ఇంత పెద్ద ఆర్డర్ రావడానికి అత్తగారు కారణమని అంటుంది. దీంతో రామచంద్ర తల్లి కోపము నుంచి బయటపడింది అని ఆనందిస్తాడు.

భర్తతో గొడవలు
ఇక పక్కన ఉన్న మల్లికా వారి మాటలను వింటుంది. వీళ్ళిద్దరూ మళ్ళీ ఒకటైతే నేను ఇక్కడే ఉండి పోవాల్సి వస్తుంది అని ఎలాగైనా ఈ ఇంట్లో గొడవలు సృష్టించాలి అని అనుకుంటుంది. ఇక వెళ్లి తన భర్తతో మల్లిక గొడవ పడుతూ ఉంటుంది. మీ అమ్మగారు అక్కడ మీ అన్నయ్యకు ఎంతగానో సహాయం చేస్తున్నారు అని మనకు మాత్రం ఏమి చేయడం లేదు అని మరింత రెచ్చగొడుతుంది. అయితే విష్ణు మాత్రం మల్లికకు ఎంత చెప్పినా కూడా ఆమె మాట వినకుండా నేను ఏదో ఒకటి చేస్తానో చూస్తూ ఉండండి అని అంటుంది. అంతే కాకుండా నన్ను మీరు మాత్రం వెనుకకు లాగవద్దు అని కూడా అంటుంది. ఇక విష్ణు ఏమి అనకుండా ఉంటాడు.

జానకి బ్యాగ్ లో మల్లిక ఉంగరం
మల్లిక అప్పుడు కిచెన్ లోకి వెళ్లి ఒక ప్రణాళిక రచిస్తుంది. అక్కడ మలయాళం వచ్చిరాని వంటతో ఏదో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. యూట్యూబ్లో వీడియోలు చేస్తూ వంటలను చేయాలని అనుకుంటాడు. అయితే పాయసం సిద్ధం చేస్తున్న సమయంలో అందులో కరివేపాకు వేయాలి అని మల్లికా చెబుతుంది. దీంతో మలయాళం బయటకు వెళ్లి కరివేపాకు తీసుకు వస్తాను అని చెబుతాడు. ఇక అప్పుడే మల్లిక అక్కడ జానకి బ్యాగు ఉండడంతో అందులో తన ఉంగరం వేస్తుంది. అక్కడి నుంచి మెల్లగా బయటకు వస్తుంది. ఇక బయట గోవిందరాజులు వ్యాయామం చేస్తూ ఉండగా మలయాళం వచ్చి అడ్డుపడతాడు. అతని చేతిలో కరివేపాకు ఉండడంతో ఎందుకు అని అడుగుతాడు. పాయసంలోకి అని చెప్పడంతో అతను ఒక్కసారిగా షాక్ అవుతాడు. పాయసంలోకి కరివేపాకు ఎవరైనా వేస్తారా అంటూ.. అసలు నీకు వంటలు వచ్చా రావా అని అడుగుతాడు.

ఉంగరం పోయిందంటూ మల్లిక గోల
దీంతో మలయాళం మళ్ళీ తప్పించుకోవడానికి జోక్ చేశాను అని సాంబార్ లోకి తీసుకువెళ్తున్నారు అని అంటాడు. ఇక వారి మధ్యలో అలా గొడవకు సాగుతున్న సమయంలో జానకి కాలేజీకి వెళ్తాను అని అందరికీ చెబుతూ ఉంటుంది. ఇక అప్పుడే వచ్చిన మల్లిక ఉంగరం పోయింది అని ఏడుస్తూ ఉంటుంది. ఇంట్లో నుంచి నా ఖరీదైన ఉంగరం పోయింది అని నా ఉంగరం దొరికే వరకు ఎవరు కూడా బయటకు వెళ్లడానికి వీలులేదు అని చెబుతుంది. మొదట మలయాళం అడిగినప్పటికీ అతను నాకేమీ తెలియదు అని అంటుంది. ఇక మల్లిక ఈ ఇంట్లో ఆ అవసరం ఎవరికి ఉంటుంది అని నాకు మా ఆయనకు ఉండదని.. వెన్నెల కూడా అలాంటి పని చేయదు అని అంటుంది. పరోక్షకంగా మల్లిక జానకిపై నింద వేయాలని అనుకుంటుంది. మరి ఈ విషయంలో జానకి ఎలా తప్పించుకుంటుందో తదుపరి ఎపిసోడ్లో చూడాలి.


Click it and Unblock the Notifications











