Janaki Kalaganaledu February 9th: జానకి నింద వేసి కుండబద్దలు కొట్టిన మల్లిక.. అఖిల్ ద్వారా మరో ట్విస్ట్!

జానకి కలగనలేదు విభిన్నమైన ఎమోషన్స్ తో ఎంతగానో ఆకట్టుకుంటోంది. కుటుంబ పరిస్థితి ఎలా ఉన్నా రామచంద్ర అందరిని బాగా చూసుకోవాలని తాపత్రయపడుతుంటాడు. అయితే అఖిల్ జాబ్ కారణంగా అప్పు చేసిన రామ ఆస్తులు పోగొట్టుకొని కష్టాలపాలవుతాడు. అయితే ఆ ఇబ్బందుల వలన ఫ్యామిలీ కూడా ఇబ్బంది పడుతుంది. అయితే జానకి గొడవలు రాకుండా చూడాలని అనుకుంటుంది.

ఇక జానకి కలగనలేదు సీరియల్ కు గత వారం కంటే ఈ వారం రేటింగ్స్ మరింత పెరిగాయి. 8.95 రేటింగ్ తో గత వారం మంచి క్రేజ్ అందుకుంటోంది. నేడు ప్రసారం కాబోయే 499 వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం..

మల్లిక దొంగ ప్లాన్

మల్లిక దొంగ ప్లాన్

రామచంద్ర కష్టపడుతూ ఉండడంతో ఇంట్లో పరిస్థితులు అన్నీ మెల్లమెల్లగా సర్దుకుంటూ ఉంటాయి. అయితే ముగ్గురు కొడుకులు కూడా ఏదో ఒక పనితో బిజీ అయ్యారు అని జ్ఞానాంబ తో పాటు గోవిందరాజులు కూడా చాలా హ్యాపీగా ఉంటాడు. అయితే ఇదే క్రమంలో అందరూ సంతోషంగా ఉంటే ఇంట్లో నుంచి వెళ్లిపోవడం కుదరదు అని ఎలాగైనా బయటకు వెళ్లి మరో కాపురం పెట్టాలి అని మల్లిక ఆలోచిస్తూ ఉంటుంది.

అందుకోసమే ఇంట్లో ఏదైనా గొడవ కూడా సృష్టించాలి అని ఆమె ఒక ప్రణాళిక రచిస్తుంది. ఎవరూ లేని సమయంలో వంటగదిలోకి వెళ్లి అక్కడ జానకి హ్యాండ్ బ్యాగ్ లో తన ఉంగరం పెడుతుంది.

జానకి పై అనుమానం అంటూ..

జానకి పై అనుమానం అంటూ..

ఇక తర్వాత హాల్లోకి వచ్చిన మల్లిక తన ఉంగరం పోయింది అని అందరితో ఏడుస్తూ చెబుతుంది. ఆ ఉంగరం మా అమ్మ ఇష్టంగా పెట్టింది అని దాన్ని ఎవరో దొంగతనం చేశారు అని అంటుంది. ఇంట్లో ఆ అవసరం ఎవరికి ఉంటుంది అని గోవిందరాజులు కూడా ఆమెను ప్రశ్నిస్తాడు. అయితే ఇంట్లో అందరూ ఏదో ఒక పనులతో బిజీగా ఉన్నారు అని ఎవరికైతే ఆదాయం తక్కువగా ఉంటుందో వారికే నా ఉంగరం అవసరమయి ఉంటుంది అని మల్లిక మాట్లాడుతుంది.

నా భర్త షాప్ లో పనిచేస్తున్నాడు అతనికి అవసరం లేదు. ఇక అఖిల్ కూడా ఉద్యోగం చేస్తున్నాడు కాబట్టి అతిబానికి కూడా అవసరం లేదు. ఇక ఆదాయం తక్కువ ఖర్చులు ఎక్కువ ఉన్నవాళ్లుల్లో జానకి మాత్రమే ఉంది అని ఆమె మీదే తన అనుమానం అంటూ కుండబద్దలు కొడుతుంది.

జానకి పై నింద వేయడంతో..

జానకి పై నింద వేయడంతో..

జానకి పై నింద వేయడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. జానకి అలాంటి పని చేయదు అని వెన్నెల కూడా మాట్లాడుతుంది. అంతేకాకుండా రామచంద్ర కూడా కాస్త సీరియస్ అవుతాడు. ఇన్ని రోజులు నీవు ఎన్ని మాటలు మాట్లాడినా కూడా ఊరుకున్నాను. అనవసరంగా జానకి గారి మీద నింద వేస్తే నేను ఊరుకోను అని అంటాడు.

ఇక జానకి అయితే ఆ విషయంలో ఏమి మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతుంది. ఇక మల్లిక మాత్రం తనకు అనుమానం ఉంది అని వంట గదిలోకి ఎక్కడైనా దాచిపెట్టి ఉంటుందేమో అని వెతుకుతుంది.

హ్యాండ్ బ్యాగ్ లో ఉంగరం

హ్యాండ్ బ్యాగ్ లో ఉంగరం

అయితే అక్కడ వెతికినట్లు నాటకం ఆడిన మల్లిక ఆ తర్వాత మళ్లీ వారి దగ్గరికి వచ్చి జానకి హ్యాండ్ బ్యాగ్ కూడా చూడాలని అనుకుంటుంది. ఇక రామచంద్ర హ్యాండ్ బ్యాగ్ ఆమెకు కోపంగానే ఇస్తాడు. ఇక జానకి బ్యాగులో ఉంగరం దొరికింది అని మల్లిక చెబుతుంది. ఇప్పుడు చూశారా ఎవరు దొంగతనం చేశారో అని జానకిపై మల్లిక నింద వేస్తుంది. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ జానకి ఆ విధంగా చేయదు అని అందరూ మాట్లాడుతూ ఉంటారు. ఇక జ్ఞానాంబ కూడా అదే తరహాలో మాట్లాడడంతో మల్లిక మళ్ళీ ఏడుస్తూ ఉంటుంది.

మన ప్రాణం పోయినా కూడా పట్టించుకోరు

మన ప్రాణం పోయినా కూడా పట్టించుకోరు

తన భర్తతో మల్లిక మాట్లాడుతూ.. చూసారా మీ అమ్మగారు జానకి దొంగతనం చేసిన కూడా ఏమీ అనలేదు అని రేపు మన ప్రాణం పోయినా కూడా ఎవరు పట్టించుకోరు అని ఇక్కడే ఉంటే మనం బ్రతకలేము అని అంటుంది. మనం వెంటనే బయటికి వెళ్లి పోదాము అని కూడా అనడంతో జ్ఞానాంబ షాక్ అవుతుంది. దీంతో నువ్వు ఈ మళ్ళీ బయటికి వెళ్లిపోతాను అని చెప్పకూడదు అని జ్ఞానాంబ ఉంటుంది.

కానీ మల్లిక మాత్రం అత్తగారి మీద గౌరవం లేకుండా మాట్లాడుతుంది. మీరు జానకిని మాత్రం ఎంత తప్పు చేసినా ఏమీ అనరు మీరు ఇలానే ఉంటే మీరు అత్తగారు అనే విషయాన్ని కూడా మేము మర్చిపోతాము అని మల్లికా దబాయిస్తుంది.

అఖిల్ కూడా అలా మాట్లాడటంతో..

అఖిల్ కూడా అలా మాట్లాడటంతో..

ఇక తర్వాత జ్ఞానాంబ మల్లిక విషయంలో ఆందోళన చెందుతూ ఉండగా.. అఖిల్ కూడా వస్తాడు. అతడు కూడా ఆఫీసుకు దూరం అవుతుంది అని అందుకే మా మామగారు ఇంటికి వెళ్లి ఉంటాము అని జెస్సి కూడా గర్భవతిగా ఉంది కాబట్టి తన ఆరోగ్యం గురించి కూడా ఆలోచించాలి అని అంటాడు. అయితే మొదట తల్లి అందుకు ఒప్పుకోదు.

కానీ గోవిందరాజులు మాత్రం అఖిల్ కూడా చెప్పింది కరెక్ట్ అని వినడంతో అఖిల్ ఆమెకు థాంక్స్ చెప్తాడు. అయితే జెస్సి మాత్రం ఇంట్లో నుంచి వెళ్లిపోవాలని అనుకోరు. కానీ ఆమె అఖిల్ నోరు మూయిస్తాడు. ఇక ఇంట్లో నుంచి ఇద్దరు కొడుకులు వెళ్లిపోవాలని అనుకుంటున్న తరుణంలో జ్ఞానాంబ ఒక్కసారిగా మౌనంగా ఉండిపోతుంది. జానకి కూడా ఏమి మాట్లాడలేని పరిస్థితుల్లో ఉంటుంది మరి ఈ విషయంలో రామచంద్ర ఏ విధంగా ఆలోచిస్తాడో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X