Janaki Kalaganaledu January 10th: డబ్బు మొత్తం ఇవ్వాలని ఒత్తిడి.. రామ కారణంగా కుటుంబంలో గొడవలు!

జానకి కలగనలేదు రోజురోజుకు మరింత ఆసక్తికరమైన ఎపిసోడ్స్ తో ముందుకు కొనసాగుతోంది. ఇక అఖిల్ జాబ్ కోసం రామ చేసిన అప్పు అందరిని ఇబ్బందుల్లో పడేస్తుంది. రామ తమ్ముడి కోసం ఆలోచించి స్నేహితుడి చేతిలో మోసపోతాడు. కానీ ఆ సమస్యల వలన జానకి గొడవలు రాకుండా చూడాలని అనుకుంటుంది. ఇక జానకి కలగనలేదు సీరియల్ కు గత వారం కంటే ఈ వారం రేటింగ్స్ మరింత పెరిగాయి. 7.95 రేటింగ్ తో గత వారం మంచి క్రేజ్ అందుకుంటోంది. నేడు ప్రసారం కాబోయే 474 వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం..

రామ అతిపెద్ద పొరపాటు

రామ అతిపెద్ద పొరపాటు

రామచంద్ర కుటుంబం కోసం ఎంతగానో ఆలోచిస్తూ అందరూ కలిసి ఉండాలి అని అనుకుంటాడు. జానకి కూడా అదే తరహాలో ఆలోచిస్తుంది. అయితే ఊహించిన విధంగా రామచంద్ర చేసిన ఒక పొరపాటు కుటుంబం మొత్తం పై కూడా తీవ్ర ప్రభావం చూపిస్తుంది. అఖిల్ కు మంచి జాబ్ రావాలి అని తన స్నేహితుడికి రామచంద్ర 20 లక్షలు ఇస్తాడు. ఇల్లుని తాకట్టుపెట్టి మరి 20 లక్షలు ఇవ్వడంతో మొదట కొంత టెన్షన్ పడతాడు. కానీ ఎవరికి విషయాన్ని చెప్పడు. అయితే అనుకున్నట్లే రామచంద్ర స్నేహితుడు చరణ్ మోసం చేసి పారిపోతాడు. దీంతో ఇల్లు తాకట్టు పెట్టడంతో ఆ విషయం తెలుసుకున్న అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు.

ఇంటికి వచ్చిన భాస్కరరావు

ఇంటికి వచ్చిన భాస్కరరావు

ఇక అప్పు ఇచ్చిన భాస్కరరావు కూడా ఇంటికి వస్తాడు. త్వరగా మూడు రోజుల్లోనే తన డబ్బు తిరిగి ఇవ్వాలి అని లేదంటే ఇల్లు జప్తు చెప్తాను అని అంటాడు. ఇక ఆయన మాటలకు భయపడిన రామచంద్ర ఎలాగైనా డబ్బులు తీసుకురావాలని చాలామంది దగ్గర మళ్ళీ అప్పు అడుగుతూ ఉంటాడు. అయితే ఎవరూ కూడా రామచంద్రకు డబ్బు ఇవ్వడానికి ముందుకు రారు. ఇక రామచంద్ర డబ్బులు తెస్తాడు అని ఇంట్లో వాళ్ళు నమ్మకంతో ఉంటారు. ముఖ్యంగా గోవిందరాజులు అయితే రామచంద్రపై చాలా నమ్మకంగా ఉంటాడు.

ఆందోళనలో జ్ఞానాంబ

ఆందోళనలో జ్ఞానాంబ

రామచంద్ర ఎప్పుడు కూడా తప్పు చేయడు అని ఎప్పుడూ కూడా కుటుంబం గురించి ఆలోచిస్తూ ఉంటాడు అని తన భార్యకు చెప్పుకుంటూ ఉంటాడు. అయితే జ్ఞానాంబ మాత్రం ఏం జరుగుతుందో అని టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక గోవిందరాజులు మాత్రం ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కష్టాలు ఎప్పటికీ ఉండవు అని మళ్లీ అన్నీ సర్దుకుంటాయి అని చెబుతాడు. ఇక జ్ఞానాంబ మాత్రం ఈసారి వచ్చిన కష్టం చాలా పెద్దది అని ఇంటి పోగొట్టుకునే పరిస్థితి వచ్చింది అని బాధపడుతూ ఉంటుంది.

భర్త కోసం జానకి ఎదురుచూసి..

భర్త కోసం జానకి ఎదురుచూసి..

ఇక మరోవైపు రామచంద్ర కోసం జానకి ఎదురుచూస్తూ ఇంటి గుమ్మం దగ్గరే పడుకొని ఉంటుంది. ఆమెను పనిమనిషి వచ్చి లేపుతుంది. ఆ తర్వాత తన భర్త ఇంకా రాలేదు అని తెలుసుకున్న జానకి ఫోన్ చేయాలని అనుకుంటుంది. కానీ ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో ఆమె మరింత టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక ఇంట్లో హాల్లో అందరూ కూడా రామచంద్ర కోసం. ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటారు. రామచంద్ర డబ్బు తీసుకువచ్చి భాస్కరరావుకు ఇస్తాడు అని ఆశతో అందరూ గుమ్మం దగ్గరే మాట్లాడుకుంటూ ఉంటారు.

డబ్బు దొరకలేదు

డబ్బు దొరకలేదు

ఇక ఇంతలో భాస్కర రావు వచ్చి అప్పు గురించి అడుగుతాడు. మా రామచంద్ర బయటకు వెళ్ళాడు అని తప్పకుండా మీ డబ్బు తీసుకువస్తాడు అని గోవిందరాజులు చెబుతాడు. ఇక ఇంతలో వచ్చిన రామచంద్ర కాళీ చేతులతోనే కనిపిస్తాడు. ఎంత ప్రయత్నం చేసిన కూడా డబ్బు దొరకలేదు అని దీనంగా చెబుతాడు. అయితే అందరూ బాధలో ఉన్న సమయంలో మల్లిక మాత్రం చాలా కఠినంగా మాట్లాడుతుంది. మీ స్వార్థం కోసం అప్పు చేసారు మళ్ళీ ఇప్పుడు ఈ కొత్త తరహా నాటకాలు ఏమిటి అని ఆమె ప్రశ్నిస్తుంది.

వడ్డీతో సహా అప్పు ఇవ్వాలి

వడ్డీతో సహా అప్పు ఇవ్వాలి

కానీ జానకి మాత్రం భర్త పై నిందలు చేస్తూ ఉంటే తట్టుకోలేకపోతోంది. ఫ్యామిలీ గురించి ఆయన ఎంతగానో ఆలోచిస్తారు అని మా స్వార్థం కోసం ఇంటికి తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చుకునే చెడ్డవాళ్ళం కాదు అని జానకి చెబుతుంది. ఇక జ్ఞానాంబ కలుగజేసుకొని అందరూ సైలెంట్ గా ఉండాలి అని చెబుతుంది. ఇక భాస్కరరావు మాత్రం తనకు రావాల్సిన 20 లక్షలు అలాగే చిన్న కొడుకు తీసుకున్న 5 లక్షల కూడా వడ్డీతో సహా రావాలి అని అంటాడు. అయితే ప్రస్తుతం 5 లక్షలు ఉన్నాయని జ్ఞానాంబ ఆ డబ్బులు తెస్తుంది.

బయటకు వెళ్లే పరిస్థితి..

బయటకు వెళ్లే పరిస్థితి..

అయితే మిగతా డబ్బులు వచ్చే వరకు కూడా ఇంటిని కాళీ చేయాలి అని అలాగే వడ్డీ కింద కారు కూడా తీసుకుంటామని భాస్కరరావు చెప్తాడు. అంతే కాకుండా మీ స్వీట్ షాప్ కూడా అప్పు కట్టే వరకు తమ ఆధీనంలో ఉంటుంది అని భాస్కరరావు అంటాడు. ఇక జ్ఞానాంబ చేసేదేమీ లేక మాట తప్పను అని మీరు చెప్పినట్లే కానివ్వండి అని భాస్కరరావుకు చెబుతుంది. ఇక రామచంద్ర తల్లికి క్షమాపణలు చెప్పాలని అనుకున్నాడు ఇలా జరుగుతుంది అని అనుకోలేదు అని అంటాడు. భాస్కరరావు మాత్రం ఇంట్లో అందరి చేత సంతకాలు చేయించుకుంటాడు. అలాగే ఇంట్లో వాళ్ళు అందరూ కూడా బయటకు వెళ్లే పరిస్థితి ఏర్పడుతుంది. మరి ఈ కఠిన సమయంలో జానకి ఏ విధంగా అడుగులు వేస్తుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X