Janaki Kalaganaledu January 12th: అప్పుల బాధలో జ్ఞానాంబ.. వంటగదిలో జానకి, రామ కౌగిలింతలు!
జానకి కలగనలేదు సీరియల్ విభిన్నమైన ఎమోషన్స్ తో ముందుకు సాగుతోంది. తమ్ముడు అఖిల్ జాబ్ కోసం రామ చేసిన అప్పు అందరిని ఇబ్బందుల్లో పడేస్తుంది. అయితే ఆ సమస్యల వలన రామ భార్య జానకి గొడవలు రాకుండా చూడాలని అనుకుంటుంది. ఇక జానకి కలగనలేదు సీరియల్ కు గత వారం కంటే ఈ వారం రేటింగ్స్ మరింత పెరిగాయి. 7.95 రేటింగ్ తో గత వారం మంచి క్రేజ్ అందుకుంటోంది. నేడు ప్రసారం కాబోయే 476 వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం..

అప్పు కారణంగా..
రామచంద్ర, అఖిల్ కు జీవితం బాగుండాలి అని అతని జాబ్ కోసం తన స్నేహితుడు చరణ్ ను నమ్మి 20 లక్షలు కడతాడు. ఇంటిని తాకట్టు పెట్టి మరి ఆ డబ్బులు ఇస్తాడు. చివరికి చరణ్ చేతిలో రామ మోసపోతాడు. ఇక ఇంట్లో తీవ్ర సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. రామ ఇంట్లో ఎవరికీ చెప్పకుండా ఆ డబ్బు కట్టడంతో తల్లి జ్ఞానాంబ రామచంద్రపై తీవ్ర అసహనంతో ఉంటుంది. ఏ విషయమైనా సరే నాతో చెప్పి గానీ చేయని రామ ఈసారి ఇంటిని తాకట్టు పెట్టి మరి డబ్బులు తీసుకోవడం ఏమాత్రం నచ్చలేదు అని కోపంగా ఉంటుంది. అలాగే జానకి కూడా ఈ విషయాన్ని చెప్పకపోవడంతో ఆమె మరింత అసహనం వ్యక్తం చేస్తుంది.

కొత్త ఇంట్లోకి జ్ఞానాంబ ఫ్యామిలీ
అప్పు ఇచ్చిన భాస్కరరావు అయితే రామచంద్ర ఇంటి మొత్తాన్ని కూడా తన ఆధీనంలోకి తీసుకుంటాడు. ఇల్లు ఖాళీ చేయాలని చెప్పడంతో కుటుంబ సభ్యులందరూ కూడా రోడ్డున పడే పరిస్థితి ఏర్పడుతుంది. ఇక రామచంద్ర ముందు జాగ్రత్తగా మరో ఇంటిని చూసి అందరిని అక్కడికి తీసుకెళ్తాడు. కానీ అక్కడ రెండు గదులు మాత్రమే ఉండడంతో వాటిని మల్లిక జెస్సి ఇద్దరికీ కూడా ఇచ్చేస్తారు. కానీ రామచంద్ర జానకి మాత్రం వంట గదిని చూసుకొని అక్కడే ఉంటారు. ఇక ఇంట్లో పరిస్థితులు ఎప్పటికప్పుడు మరింత సీరియస్ గా మారుతూ ఉంటాయి. అఖిల్ అయితే అన్నయ్య కారణంగా తనకు చెడ్డపేరు వస్తోంది అని తనకోసమే 20 లక్షల అప్పు చేశాడు అని ఊరంతా అనుకుంటున్నారు.. అని బాధపడుతూ తన భార్యతో చెప్పుకుంటూ ఉంటాడు.

మల్లిక ఆలోచన
ముఖ్యంగా మల్లిక అయితే అవకాశం దొరికితే చాలు ఇంట్లో నుంచి వెళ్లిపోవాలని అనుకుంటూ ఉంటుంది. కానీ ఆమె ఎన్నిసార్లు ఆ విధంగా చెప్పినా కూడా జ్ఞానాంబ మాత్రం ఆ విధంగా చేయకూడదు అని నీకు నచ్చినట్లు ఇక్కడ ఉండవచ్చు అని చెబుతోంది. మరోవైపు జానకి ఇంట్లో పనులన్నీ కూడా ఒక్కతే చూసుకుని ఉంటుంది. చిన్న కోడలు మల్లిక మాత్రం ఏ పని చేయకుండా ఉంటుంది. ఏదైనా సహాయం చేయవచ్చు కదా అని మామ గోవిందరాజులు చెప్పినప్పటికీ కూడా తనకు ఆరోగ్యం బాగోలేదు అని అబద్ధాలు చెబుతూ ఉంటుంది. అంతేకాకుండా తలనొప్పిగా ఉంది అని పాలు తేవాలి అని మల్లిక జానకిని అడుగుతుంది.. అందుకు జానకి కూడా ఏమీ అనుకోకుండా సరే అని అంటుంది.

ఎక్కువ ఖర్చులు చేయడం కరెక్ట్ కాదు
మరోవైపు ఇంట్లో పాలు పొంగించాలి అని జానకి రామచంద్ర కు చెప్పి సరుకులు అన్నీ తెప్పిస్తూ ఉంటుంది. ఇక కొన్ని సరుకులు రామచంద్ర తేకపోవడంతో కొంత ఆలోచిస్తూ ఉంటుంది. అయితే రామచంద్ర మాత్రం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎక్కువ ఖర్చులు చేయడం కరెక్ట్ కాదు అని ఆ విధంగా తక్కువ సరుకులు తెచ్చాను అని అవి తప్పనిసరిగా అవసరం అంటే తెస్తాను అని అంటాడు. ఏమీ అవసరం లేదు అని వీటితో సర్దుకోవచ్చు లే అని జానకి చెబుతుంది. ఇక జానకి రామచంద్ర పరిస్థితిని చూసి జెస్సి కూడా కొంత బాధపడుతూ ఉంటుంది. వారిద్దరూ కూడా ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటూ ఎంతో చక్కగా ముందుకు సాగుతున్నారు అని ఆలోచిస్తుంది.

పెద్దరికం ఎప్పుడో పోయింది
ఇక మరోవైపు అత్తగారి చేత ఇంట్లో పాలు పొంగించాలి అని జానకి అనుకుంటూ ఉంటుంది. ఇక అందరూ కలిసి అత్తగారిని పాలు పొంగించాలి అని అడుగుతారు. కానీ మీ ఇంట్లో పెద్దరికం నాకు ఎప్పుడో పోయింది అని ఇక్కడ చిన్నవాళ్లు నాకు చెప్పకుండా చాలా పెద్ద పెద్ద పనులు చేస్తున్నారు కాబట్టి నాకు ఏమీ అంత పెద్ద బాధ్యత ఇవ్వాల్సిన అవసరం లేదు అని బాధతో మాట్లాడుతూ ఉంటుంది. ఇక జ్ఞానాంబ కూడా చేసేదేమీ లేక సైలెంట్ గా దేవుడి ఫోటోలు ముందు దీపం వెలిగిస్తూ ఉంటుంది. ఎవరైనా సరే వెళ్లి పాలు పొంగించవచ్చు అని చెబుతోంది. ఇక తర్వాత జానకి ఏమీ అనలేక సైలెంట్ గా వెళ్లి పాలు పొంగిస్తుంది.

కిచెన్ లో రామ, జానకి కౌగిలింతలు
ఇక మల్లిక మాత్రం ఎప్పటిలానే పాలు కావాలి అని చెప్పి వెళ్ళిపోతుంది. ఇక పరిస్థితులు ఎలా ఉన్నా కూడా రామచంద్ర జానకి మాత్రం సంతోషంగా ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. జానకి పాలు పొంగించడంతో అతను సంతోషంలో ఆమెకు ముద్దులు పెడుతూ కౌగిలించుకుంటూ ఉంటాడు. ఇక తర్వాత మరోవైపు మల్లిక మాత్రం తలనొప్పి బాబోయ్ అంటూ నాటకం ఆడుతూ ఉంటుంది. ఇక తర్వాత జానకి గదిలోకి వచ్చి ఆమెకి గుణపాఠం చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఇక ఇది ఇలా ఉంటే మరోవైపు జ్ఞానాంబ చాలా బాధలో ఉండగా రామచంద్ర కూడా తన వల్లే కుటుంబ పరిస్థితి ఇంత దారుణంగా ఉంది అని బాధపడుతూ ఉంటాడు. మరి ఈ పరిస్థితుల గురించి జానకి ఏ విధంగా ఆలోచిస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











