twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Janaki Kalaganaledu January 19th: గుడిలో జ్ఞానాంబకు దారుణమైన అవమానం.. మల్లిక షాకింగ్ ప్లాన్!

    |

    జానకి కలగనలేదు సీరియల్ ఆసక్తికరమైన ఎమోషన్స్ తో ముందుకు సాగుతోంది. అఖిల్ జాబ్ కోసం రామ చేసిన అప్పు కారణంగా జ్ఞానాంబ ఫ్యామిలీ ఇబ్బందుల్లో పడుతుంది. ఇక ఆ సమస్యల వలన రామ భార్య జానకి గొడవలు రాకుండా చూడాలని అనుకుంటుంది. ఇక జానకి కలగనలేదు సీరియల్ కు గత వారం కంటే ఈ వారం రేటింగ్స్ మరింత పెరిగాయి. 7.95 రేటింగ్ తో గత వారం మంచి క్రేజ్ అందుకుంటోంది. నేడు ప్రసారం కాబోయే 481 వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం..

    అప్పులపాలు కావడంతో

    అప్పులపాలు కావడంతో

    పూర్తిగా అప్పులపాలు కావడంతో రామచంద్ర షాప్ కూడా పోగొట్టుకోవాల్సి వస్తుంది. ఇక మళ్ళీ ఎలాగైనా పరిస్థితులలో నిలదొక్కుకోవాలి అని ఎక్కడైనా పని చూసుకోవాలని అనుకుంటాడు. ఇక క్యాటరింగ్ చేసే పని దొరకడంతో రామచంద్ర ఒక దగ్గర బిజీగా మారిపోతూ ఉంటాడు. అతనితోపాటు భార్య కూడా సహాయంగా ఉంటుంది. అయితే రామచంద్ర ఒక రోజు ఒక గుడిలో అన్న ప్రాసనలకు సంబంధించిన వేడుకలో కేటరింగ్ చేస్తూ ఉంటాడు. ఇక అదే గుడికి అప్పుడే జ్ఞానాంబ కూడా వస్తుంది. అయితే ఆ వేడుక చేస్తున్న వారు జ్ఞానాంబ కు తెలియడంతో ఆమెను కూడా అక్కడికి ఇన్వైట్ చేస్తారు. అంతేకాకుండా తమ బిడ్డను ఆశీర్వదించాలని కూడా అంటారు.

     రంగంలోకి లీలావతి

    రంగంలోకి లీలావతి


    అయితే అదే అవకాశంగా చూసిన కోడలు మల్లిక అత్తగారిని ఎలాగైనా మరింత బాధకు గురి చేయాలి అని లీలావతి పెద్దమ్మను రంగంలోకి దింపుతుంది. ఇక ఆమె రాగానే తన మాటలతో మరింత ఆవేదనకు గురిచేస్తుంది. జ్ఞానాంబ పరిస్థితి గురించి అప్పటి వరకు ఎవరు ఊరిలో వాళ్లకు తెలియదు. కానీ అందరికీ ఆమె తెలిసేలా మాట్లాడుతుంది. ఒంటినిండా బంగారంతో మహాలక్ష్మి లా కనిపించే జ్ఞానాంబ ఇప్పుడు మాత్రం చాలా దీనంగా మారిపోయింది అని అంటుంది. ఇక ఎందుకు అలా జరిగింది అని మిగతా వాళ్ళు అడగడంతో ఆమె పెద్ద కొడుకు కారణంగా ఈ పరిస్థితి వచ్చింది అని చిన్న కొడుకుకు ఉద్యోగం కోసం ఒక వ్యక్తి దగ్గర మోసపోయాడు అని చెబుతుంది.

    బాధపడిన జ్ఞానాంబ

    బాధపడిన జ్ఞానాంబ


    అంతేకాకుండా ఇల్లు అలాగే షాప్ కూడా పోగొట్టుకున్నారు అని అప్పుల వాళ్ళు ఇంట్లో నుంచి బయటకు పంపించేశారు అని చెబుతుంది. ఇక లీలావతి అలా చెబుతూ ఉండడంతో జ్ఞానాంబ మరింతగా బాధపడుతుంది. ఇక ఏమీ అనలేక ఆమె మౌనంగా అక్కడ నుంచి వెళ్లిపోవాలని అనుకుంటుంది. కానీ అప్పుడే అక్కడికి ఆమె పాత శత్రువు సునంద దేవి కూడా వస్తుంది. ముందుగా జానకి అక్కడ క్యాటరింగ్ పనిచేస్తూ ఉండడంతో ఆమెను తన మాటలతో బాధకు గురిచేస్తుంది. కాబోయే ఐపీఎస్ ఆఫీసర్ ఈ విధంగా క్యాటరింగ్ చేసుకోవడం చాలా దారుణం అని కావాలని మాటలతో బాధపెట్టాలని అనుకుంటుంది.

     ఆమె మాటలు పట్టించుకోకుండా..

    ఆమె మాటలు పట్టించుకోకుండా..

    కానీ జానకి మాత్రం ఆమె మాటలు పట్టించుకోకుండా ఒకరి దగ్గర చేయి చాపడం కంటే ఇలా పని చేసుకుని బ్రతకడం మేలు అని కౌంటర్ ఇస్తుంది. ఇక తర్వాత గుడిలోకి వచ్చిన సునంద దేవి అక్కడ జ్ఞానాంబను చూసి మరింత ఎక్కువగా మాట్లాడుతుంది. మీ కోడలు ఐపీఎస్ ఆఫీసర్ కాబోతోంది అని గొప్పగా చెప్పావు కానీ ఆమె ప్లేట్స్ తుడుచుకుంటూ ఉంది అని అందరి ముందు అవమానకరంగా మాట్లాడుతుంది. అయితే ఆ పరిస్థితులలో ఉండగా వారి స్వీట్ షాప్ నుంచి వచ్చిన స్వీట్స్ ఏ మాత్రం రుచికరంగా లేవు అని అక్కడ కొందరు ఆవేదన వ్యక్తం చేస్తారు.

    స్వీట్ షాప్ గొడవ

    స్వీట్ షాప్ గొడవ

    ఇది జ్ఞానాంబ స్వీట్స్ షాప్ నుంచి వచ్చినవే అని అందరూ మాట్లాడుకుంటారు. అయితే అక్కడ ఈ మధ్యకాలంలో స్వీట్స్ ఏ మాత్రం బాగుండడం లేదు అని చెప్పడంతో రామచంద్ర సీన్ లోకి ఎంట్రీ ఇస్తాడు. ఇది మా షాప్ నుంచి వచ్చినవి కావు అని చెబుతాడు. లేదు అక్కడి నుంచి తెప్పించాము అని అంటాడు. నాణ్యత లేకుండా అమ్ముతున్నారని సునంద దేవి కూడా మాట్లాడుతుంది. పరిస్థితి మారిపోతే ఏం చేస్తారు అని మరోవైపు నీలావతి కూడా కఠినంగా మాట్లాడుతుంది.

     ఎంత చెడ్డ పేరు వస్తుందో ఆలోచించరా?

    ఎంత చెడ్డ పేరు వస్తుందో ఆలోచించరా?

    ఇక రామచంద్ర వెంటనే ఆ స్వీట్ బాక్స్ తీసుకొని వారి షాప్ దగ్గరికి వెళతాడు ఏంటి బాబాయ్ మేము షాప్ మీకు అప్పగించినంత మాత్రాన ఇలాంటి స్వీట్స్ అందుకే మా అమ్మగారికి ఎంత చెడ్డ పేరు వస్తుందో ఆలోచించరా అని అడుగుతాడు. కేవలం ఒక పావలా ఆదాయం చూసుకొని బాధ్యతగా మెయింటైన్ చేయాలి అని అంటాడు. అయితే అలా చేస్తే మాకు లాభాలు రావు అని షాప్ తీసుకున్న వ్యక్తి అంటాడు. కానీ ఇది మా అమ్మ పేరు మీద ఉంది కాబట్టి అప్పు కారణంగా మీ దగ్గర ఉంది కాబట్టి మీరు నాణ్యత గల స్వీట్స్ అమ్మాలి అని అంటాడు.

    జానకి ఏ విదంగా అడుగులు వేస్తుందో..

    జానకి ఏ విదంగా అడుగులు వేస్తుందో..

    మా ఇష్టం వచ్చినట్లు అమ్ముకుంటామని స్వీట్ షాప్ ఉన్న వ్యక్తి చెబుతూ ఉంటాడు. ఇక జానకి వచ్చి ఆ తర్వాత రామచంద్రను అక్కడి నుంచి తీసుకెళుతుంది. ఇక ఇంటికి రాగానే జ్ఞానాంబ పోయిన పరువు గురించి బాధపడుతూ ఉంటుంది. అప్పుడే ఊరి నుంచి చిన్న కూతురు వెన్నెల కూడా వస్తుంది అని తెలుస్తుంది. ఇంట్లో పరిస్థితులు తెలిస్తే వెన్నెల చాలా బాధపడుతుంది అని అందరూ అనుకుంటూ ఉంటారు. ఇక మరోవైపు మల్లిక కఠినంగా మాట్లాడుతు ఉండడంతో జానకి ఆమెకు అర్థమయ్యేలా చెప్పాలని అనుకుంటుంది. మరి ఈ పరిస్థితులను దాటి జానికి ఏ విధంగా అడుగులు వేస్తుందో చూడాలి.

    English summary
    Janaki Kalaganaledu Serial 2023 January 19th Episode 481
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X