Janaki Kalaganaledu January 20th: చాలా కాలం తరువాత వచ్చిన వెన్నెల.. చూసి తట్టుకోలేకపోయిన రామ!

జానకి కలగనలేదు సీరియల్ సరికొత్త ట్విస్ట్ లతో ఎంతో ఆసక్తిగా కొనసాగుతోంది. తమ్ముడి జాబ్ కోసం రామ చేసిన అప్పు కారణంగా జ్ఞానాంబ ఫ్యామిలీ ఇబ్బందుల్లో పడుతుంది. ఆ సమస్యల వలన రామ భార్య జానకి గొడవలు రాకుండా చూడాలని అనుకుంటుంది. ఇక జానకి కలగనలేదు సీరియల్ కు గత వారం కంటే ఈ వారం రేటింగ్స్ మరింత పెరిగాయి. 7.95 రేటింగ్ తో గత వారం మంచి క్రేజ్ అందుకుంటోంది. నేడు ప్రసారం కాబోయే 482 వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం..

ఇంటికి వచ్చిన జ్ఞానాంబ కూతురు

ఇంటికి వచ్చిన జ్ఞానాంబ కూతురు

జానకి ఇంట్లో రోజురోజుకు పరిస్థితులు మరింత దారుణంగా మారుతూ ఉంటాయి. ఇంట్లో సరుకులు కూడా కొనడానికి సరిగా డబ్బులు ఉండవు. మరోవైపు స్వీట్ షాప్ లేకపోవడం అలాగే బట్టలు కొట్టు కూడా లేకపోవడంతో ఇంట్లో ఆదాయం పూర్తిస్థాయిలో తగ్గిపోతుంది. ఇక ఈ అప్పుల నుంచి ఎలాగైనా బయటపడాలి అని రామచంద్ర తన శక్తి మేరకు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అయితే అందరూ కూడా ఇంట్లో పరిస్థితులను చూసి కొంత బాధతో ఉన్న సమయంలో అప్పుడే వెన్నెల కూడా ఇంటికి వస్తుంది. ఇన్ని రోజులు తన నానమ్మ దగ్గర ఉన్న వెన్నెల ఇంట్లో పరిస్థితుల గురించి తెలియగానే ఒక్కసారిగా షాక్ అవుతుంది.

వెన్నెల ఏడుపు

వెన్నెల ఏడుపు


అంతేకాకుండా తన తండ్రి గోవిందరాజులుకు పక్షవాతం రావడం వలన ఆమె మరింతగా బాధపడుతుంది. తండ్రి కాళ్ళ దగ్గర ఏడుస్తూ ఉంటుంది. ఇక కూతురికి గోవిందరాజులు ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తాడు. అయితే ఇదంతా ఎలా జరిగింది అని అసలు మన కుటుంబం ఎందుకు ఈ పరిస్థితికి వచ్చింది అని వెన్నెల ఏడుస్తూ అడుగుతూ ఉంటుంది. ఇక అదే సమయంలో అందరూ కూడా మౌనంగా ఉన్న సమయంలో ఊహించని విధంగా మల్లిక వచ్చి అసలు విషయం చెబుతుంది.

మొత్తం చెప్పేసిన వెన్నెల

మొత్తం చెప్పేసిన వెన్నెల

దీనికి కారణం మీ పెద్దన్నయ్య రామచంద్ర పెద్ద వదిన జానకి అని అంటుంది. ఇక అప్పుల పాలు కావడంతో ఈ పరిస్థితికి వచ్చారు అని ఇల్లు కూడా తాకట్టులో ఉంది అని స్వీట్ షాప్ కూడా పోయింది అని ప్రతి విషయాన్ని కూడా మల్లికా వివరించి చెబుతుంది. ఇక ఆ తర్వాత జ్ఞానాంబ కూడా రామచంద్ర జానకిపై కోపం వచ్చేలా మాట్లాడుతూ ఉంటుంది. ఇక రామచంద్ర మాత్రం అన్ని సర్దుకుంటాయని తన చెల్లికి సర్ది చెబుతాడు. ఇక తర్వాత అసలే ఈ ఇంట్లో పరిస్థితులు బాగా లేవు అంటూ ఇప్పుడు వెన్నెల వచ్చి కూర్చుంది అని, ఆమె పెళ్లి గురించి ప్రస్తావనకు వస్తే ఇంకా ఎన్ని సమస్యలు వస్తాయో అని మల్లికా మాట్లాడుతూ ఉంటుంది.

మల్లిక మరో అనుమానం

మల్లిక మరో అనుమానం

ఇక ఫోన్లో నీలావతి పెద్దమ్మకు ఫోన్ చేసి జరిగిన విషయాల గురించి మల్లిక చర్చిస్తూ ఉంటుంది. అప్పుడే ఆమె భర్త విష్ణు గదిలోకి వస్తాడు ఏం మాట్లాడుతున్నావు అని అడుగుతాడు. ఇక మల్లికా మెల్లగా అతనిని కూల్ చేస్తూ ఇప్పుడు వెన్నెల ఇంటికి రావడం మన మీద కూడా భారం పడే అవకాశం ఉండవచ్చు అని అతనికి అనుమానాలను కలుగజేస్తుంది. దీంతో విష్ణు మరి కొంత టెన్షన్ లో పడతాడు. ఇక కూతురికి జ్ఞానాంబ కిచెన్ గదిలోకి తీసుకువెళ్లి భోజనం పెట్టాలని అనుకుంటుంది. అప్పుడే కరెంటు కూడా పోతుంది. ఇక ఆ చీకటిలో జానకి కొవ్వొత్తి వెలిగించి తీసుకువస్తూ ఉంటుంది. ఇక అప్పుడే వెన్నెల వదినను చూసి నువ్వు కూడా భోజనం చేయి అని అడుగుతుంది. కానీ జానకి మాత్రం నేను తర్వాత తింటాను అని అంటుంది.

 వెన్నెల ప్రశ్నలు

వెన్నెల ప్రశ్నలు


ఇక జ్ఞానాంబ మాత్రం జానకి తో మాట్లాడడానికి అంతగా ఆసక్తి చూపించదు. ఇక అప్పుడే గోవిందరాజులు పిలుస్తున్నాడు అని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. కానీ ఆమెను ఎవరు పిలవరు. ఏం జరిగింది అని వెన్నెల జానకిని అడుగుతుంది. అయినప్పటికీ జానకి జరిగిన విషయాల గురించి చెప్పకుండా చిన్నచిన్న విషయాలు కొన్ని ఉంటాయి అని అవేమీ పెద్దవి కావు అని అన్ని సర్దుకుంటాయి అని అంటుంది.

 పరిస్థితి చూసి రామచంద్ర మనోవేదన

పరిస్థితి చూసి రామచంద్ర మనోవేదన


ఇక ఆ తర్వాత జానకి తన భర్త కోసం గుమ్మం బయట ఎదురు చూస్తూ ఉండగా అప్పుడే రామచంద్ర వస్తాడు. ఇక కాళ్లు కడుక్కొని రండి అని భోజనం పెడతాను అని చెబుతుంది. ఇక రామచంద్ర ఇంట్లోకి రాగానే అందరూ కూడా హాల్లో పడుకుని ఉండడం బాధను కలిగిస్తుంది. ఒకప్పుడు మన ఇంట్లో అందరూ ఎవరి గదిలో వాళ్ళు ఉండేవారు అని ఇప్పుడు నా వల్లే ఈ పరిస్థితి వచ్చింది అని బాధపడుతూ ఉంటాడు. ఇక తన గదిలోకి వెళ్లి భోజనం తినడానికి కూడా అతనికి ఆసక్తిగా అనిపించదు. ఇక మరోవైపు అఖిల్ అయితే ఇంట్లో ఎన్ని జరుగుతున్నా కూడా పట్టించుకోకుండా వీడియో గేమ్స్ ఆడుకుంటూ ఉంటాడు. దీంతో వెన్నెల అతనికి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తుంది. కానీ అతనికి మాత్రం కోపం వస్తుంది ఇక ఇలా ఉండగా మల్లికా మళ్ళీ గొడవలు సృష్టించాలని అనుకుంటుంది. కానీ జానకి మాత్రం మల్లికను అడ్డుకోవాలని ఆలోచిస్తుంది. మరి ఈ పరిస్థితుల్లో జానకి తన చదువును ఎలా కొనసాగిస్తుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X