Janaki Kalaganaledu January 24th: భర్త కోసం మనసు మార్చుకున్న జ్ఞానాంబ.. పండగ టైమ్ లో హ్యాపీగా..

జానకి కలగనలేదు సీరియల్ మరో ఆసక్తికరమైన ఎమోషన్ తో ముందుకు సాగుతోంది. తమ్ముడు అఖిల్ జాబ్ కోసం రామ చేసిన అప్పు కారణంగా జ్ఞానాంబ ఫ్యామిలీ ఇబ్బందుల్లో ఉంటుంది. ఇక ఆ సమస్యల వలన జానకి గొడవలు రాకుండా ఎవరు విడిపోకుండా చూడాలని అనుకుంటుంది. ఇక జానకి కలగనలేదు సీరియల్ కు గత వారం కంటే ఈ వారం రేటింగ్స్ మరింత పెరిగాయి. 8.95 రేటింగ్ తో గత వారం మంచి క్రేజ్ అందుకుంటోంది. నేడు ప్రసారం కాబోయే 485 వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం..

ఒక్క పొరపాటు కారణంగా..

ఒక్క పొరపాటు కారణంగా..

రామచంద్ర చేసిన ఒక పొరపాటు కారణంగా కుటుంబంలో చాలా సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ముఖ్యంగా పండగ వాతావరణం లో కూడా చేతిలో డబ్బులు ఉండవు, ప్రతి ఏడాది రామచంద్ర సంక్రాంతి పండుగ వస్తే అందరికీ కొత్త బట్టలు తెచ్చేవాడు. కానీ ఈసారి స్వీట్ షాప్ కూడా అప్పుల వాళ్ళు లాగేసుకోవడంతో తీవ్ర సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. చేతిలో అతని దగ్గర డబ్బులు కూడా ఉండవు. అయితే జ్ఞానాంబ మాత్రం ముందస్తుగా ఆలోచించి ఒకవైపు రామచంద్రపై కోపం ఉన్నప్పటికీ ఆమె ఇంట్లో అందరికీ కొత్త బట్టలు తీసుకువస్తుంది. అయితే తన చేతితో మాత్రం రామచంద్ర కు జ్ఞానాంబ కొత్త బట్టలు ఇవ్వదు. వెన్నెల చేతతో ఇప్పించాలని అనుకుంటుంది.

అమ్మను ఇబ్బంది పెట్టని రామ

అమ్మను ఇబ్బంది పెట్టని రామ

ఆ విషయంలో రామచంద్ర అమ్మ బాధపడుతున్న విధానాన్ని చూసి చాలా అప్సెట్ అవుతాడు. ఇక తర్వాత దీనంగా వంటగదిలో కూర్చొని ఉండగా జానకి వచ్చి అతనికి ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తుంది. మీరు ఏదో ఒకటి చేసి అత్తయ్య గారితో మాట్లాడాలి అని ఇలా ఎన్ని రోజులు అని ఉంటారు అని అంటుంది. అయితే అమ్మ నాతో అసలు మాట్లాడాలని అనుకోవడం లేదు. ఆమెను ఇబ్బంది పెట్టాలని నాకు లేదు. అలాగే ఇంటి సమస్యలు అమ్మకు చాలా బాధను కలిగిస్తున్నాయి. ఇప్పుడు ఉన్నప్పులన్నీ తీర్చేయాలి అంటే అమ్మకు పెద్దగా సమయం పట్టదు. ఆమె ఎవరిని అడిగినా కూడా చాలా డబ్బులు ఇస్తారు. కానీ ఆమె ఆత్మాభిమానాన్ని మాత్రం వదులుకోదు. అమ్మని ఇబ్బంది పెట్టే విధంగా నేను కూడా ప్రయత్నం చేయను అని రామచంద్ర చెబుతాడు.

మాట తీసుకున్న గోవిందరాజులు

మాట తీసుకున్న గోవిందరాజులు

ఇక మరోవైపు గోవిందరాజులు జ్ఞానాంబ మనసును మార్చాలని అనుకుంటాడు. ఎప్పటిలానే పండగ సమయంలో అందరితోనూ తన భార్య సంతోషంగా ఉండాలి అని అనుకుంటాడు. ఇక ఆమె దగ్గర నుంచి ప్రత్యేకంగా ఒక మాట కూడా తీసుకుంటాడు. ఎప్పుడు కూడా ఈ విధంగా నిన్ను అడిగే పరిస్థితి రాలేదు. అడగకముందే నువ్వు ఎంతో సహాయంగా ఉంటూ వస్తున్నావు. అలాంటిది ఇప్పుడు నీ నుంచి నాకు ఒక మాట కావాలి అని గోవిందరాజులు తన భార్య జ్ఞానాంబతో మాట్లాడుతాడు. నువ్వు రేపు పండగ సమయంలో అందరితోనూ చాలా ఆనందంగా ఉండాలి అని ముఖ్యంగా రామచంద్ర తో కూడా మాట్లాడాలి అని అంటాడు.

పండగ హడావుడి

పండగ హడావుడి

దీంతో జ్ఞానాంబ భర్త కోరిక మేరకు భోగి పండుగ రోజు కుటుంబ సభ్యుల అందరితో కూడా సంతోషంగా ఉండాలి అని అనుకుంటుంది. ఇక ఉదయాన్నే భోగి పండగ కావడంతో ముందుగా రామచంద్ర జానికి లేచి కట్టెలు తెచ్చి ఇంటి ముందు మంట పెడుతూ ఉంటారు. అయితే ఇంట్లో వాళ్ళు ఎవరు కూడా లేవకపోవడంతో జానకి రామచంద్ర హడావిడిగా అందరిని లేపే ప్రయత్నం చేస్తారు. ఇక చిన్న కోడలు జెస్సి లేచినప్పటికీ మరోవైపు రెండవ కోడలు మల్లిగా మాత్రం మత్తుగా నిద్ర పోతూ ఉంటుంది. ఆమెను జానకి లేపుతుంది. కానీ ఇంత పొద్దున్నే ఎందుకు లేపుతున్నారు అంటూ నేను రాలేను అని మల్లిక చెబుతుంది. అయినప్పటికీ కూడా జానకి తీసుకు వెళుతుంది.

కొడుకుపై జ్ఞానాంబ ప్రేమ

కొడుకుపై జ్ఞానాంబ ప్రేమ

ఇక మరోవైపు విష్ణు కూడా లేవకుండా పడుకొని ఉండడంతో రామచంద్ర వచ్చి అతనిని బలవంతంగా లేపే ప్రయత్నం చేస్తాడు. ఇక మరోవైపు గోవిందరాజులు జ్ఞానాంబ అందరూ కూడా బయటకు వస్తారు. ఇక ఆ సమయంలో మల్లిక మాత్రం ఇబ్బందికరంగా ఉంటుంది. ఇక జ్ఞానాంబ మాత్రం కొడుకు పై ఒక్కసారిగా ప్రేమను చూపిస్తుంది. రామచంద్ర కట్టెలు పట్టుకొని నడుస్తూ ఉండగా కింద పడిపోతూ ఉంటాడు. జాగ్రత్త రామా అంటూ మళ్లీ చాలా రోజుల తర్వాత జ్ఞానాంబ తన పెద్ద కొడుకుతో మాట్లాడుతుంది. ఇక అది చూసిన జానకి కూడా ఎంతగానో సంతోషిస్తుంది.

సంతోషంలో రామ

సంతోషంలో రామ

ఇక తర్వాత మల్లిక జానకి వారి భర్తలకు ప్రత్యేకంగా స్నానం చేస్తూ ఉంటారు. అయితే విష్ణు మాత్రం కుంకుడుకాయ అంటే కళ్ళు మందుతాయని నేను చేయలేను అని ఉంటాడు. ఇక బలవంతంగా అందరూ వచ్చి స్నానానికి కూర్చోబెడతారు. ఇక వారి మధ్య కొన్ని సరదా సన్నివేశాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. ఇక రామచంద్ర మాత్రం తల్లి మాట్లాడింది అని ఎంతో సంతోషంగా ఉంటాడు. జానకి కూడా భర్త సంతోషాన్ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. పండగ రోజు ప్రత్యేకంగా జ్ఞానాంబ పూజలు చేస్తుంది. మరి ఈ ఆనందకరమైన సమయంలో మల్లికా ఎలాంటి గొడవలు సృష్టిస్తుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X