Don't Miss!
- Lifestyle
ఆయుర్వేదం ప్రకారం కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా..కిడ్నీలో రాళ్లను కరిగించే ఆహారాలు!
- News
Hyderabad: హానీమూన్ కోసం వెళ్లి.. గుండె పోటుతో మృతి చెందిన సాఫ్ట్ వేరు ఉద్యోగి..
- Finance
Spicejet: రిపబ్లిక్ డే సేల్.. విమాన టిక్కెట్లపై భారీ తగ్గింపులు.. నాలుగు రోజులే ఛాన్స్..
- Sports
IND vs NZ:టామ్ లాథమ్ వికెట్ కోహ్లీ ఐడియానే.. ఉచ్చు బిగించి ఔట్ చేసిన శార్దూల్ ఠాకూర్!
- Automobiles
పెళ్లి కారుగా మారుతి 800 ఉపయోగించిన NRI.. మీరు ఇలానే చేశారా..?
- Technology
ఇండియా సొంత మొబైల్ OS, BharOS ను మీ ఫోన్లో అప్డేట్ చేయవచ్చా? తెలుసుకోండి.
- Travel
రథసప్తమికి ముస్తాబవుతోన్న అరసవల్లి సూర్యదేవాలయం!
Janaki Kalaganaledu January 25th: అత్తగారికి ఛాలెంజ్ విసిరి ఓడిన మల్లిక.. ఇంతలోనే మరో సమస్య!
జానకి కలగనలేదు సీరియల్ కథనంలో కీలకమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. అఖిల్ జాబ్ కోసం రామ చేసిన అప్పు కారణంగా ఫ్యామిలీ మొత్తం కూడా కష్టాలపాలవుతుంది. ఇక ఆ సమస్యల వలన జానకి గొడవలు రాకుండా ఎవరు విడిపోకుండా చూడాలని అనుకుంటుంది. ఇక జానకి కలగనలేదు సీరియల్ కు గత వారం కంటే ఈ వారం రేటింగ్స్ మరింత పెరిగాయి. 8.95 రేటింగ్ తో గత వారం మంచి క్రేజ్ అందుకుంటోంది. నేడు ప్రసారం కాబోయే 486 వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం..

పండగరోజు సంతోషంగా ఉండాలని..
ఇంట్లో ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నా కూడా పండగ రోజు మాత్రం అందరూ సంతోషంగా ఉండాలని అనుకుంటారు. ముఖ్యంగా గోవిందరాజులు అయితే తన భార్య కూడా చాలా సంతోషంగా ఉండాలి అని రామ జానకి పై ఉన్న కోపాన్ని పక్కనపెట్టి పండుగ రోజు మాత్రం అందరితో నవ్వుతూ ఉండాలి అని ఒక మాట కూడా తీసుకుంటాడు. ఇక అందుకు జ్ఞానాంబ కూడా భర్త కోరిక మేరకు సరే అని అంటుంది. మొదటి రోజు అందరూ కూడా పూజ కార్యక్రమాలకు రెడీ అవుతుంటారు. ఇక జానకి అన్ని పనులను ప్రత్యేకంగా తానే చూసుకుంటూ ఉంటుంది. ఇక పూజకు పూలు అన్నీ కూడా రెడీ చేయడంతో అత్తగారు వచ్చి పూజ చేస్తారు.

నేనే గెలుస్తాను
పూజలో జ్ఞానాంబ ప్రత్యేకంగా ఒక పాట కూడా పాడడంతో అందరూ కూడా ఎంతగానో ఆనందపడతారు. తర్వాత ముగ్గుల పోటీ పెట్టాలి అని జానకి అనుకుంటుంది. ప్రతి సంక్రాంతికి ఎలాగైతే ఇంట్లో కోడళ్లు ముగ్గుల పోటీలో పాల్గొంటున్నారో ఈసారి కూడా అలానే పాల్గొనాలి అని అందరూ నిర్ణయం తీసుకుంటారు. అయితే మల్లిక మాత్రం తనే గెలుస్తాను అనేటట్లుగా మాట్లాడుతుంటుంది. అంతేకాకుండా అత్తగారు కూడా ఈ పోటీలో పాల్గొనాలి అని చెబుతుంది. మీరు ఒకప్పుడు వేసినట్లు కాకుండా ఇప్పుడు మాతో పోటీ పడాలి అని కూడా అని అత్తగారికే ఛాలెంజ్ చేసినట్లుగా మల్లికా మాట్లాడుతుంది.

నాతోనే ఛాలెంజ్ విసురుతున్నావా?
దీంతో జ్ఞానాంబ కాస్త ఘాటుగా సమాధానం ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. నేను ఒకప్పుడు ముగ్గుల పోటీల్లో పాల్గొంటే ఎవరు కూడా పోటీపడేందుకు వచ్చేవారు కాదు అలాంటిది నువ్వు నాతోనే ఛాలెంజ్ విసురుతున్నావా అని అంటుంది. ఇక పోటీ పడదామని కూడా మల్లికా అంటుంది. అంతేకాకుండా ఒకవేళ నేను గెలిస్తే నాకు నచ్చిన పని చేయాలి అని కూడా ఆమె మాట తీసుకుంటుంది. దీంతో జ్ఞానాంబ కూడా సరే అని అంటుంది. మల్లికా మనసులో తన కోరిక ప్రకారం ఇంట్లో నుంచి వెళ్లిపోయే మాటే తీసుకుంటాను అని అనుకుంటూ ఉంటుంది.

ముగ్గుల పోటీలో..
ఇక ఆ తర్వాత ముగ్గుల పోటీ ప్రారంభమవుతుంది జానకి మల్లిక వెన్నెల అలాగే జ్ఞానాంబ అందరూ కూడా ముగ్గుల పోటీలు ప్రారంభిస్తారు. అయితే ఈ పోటీలో మల్లికా తనకి ఇష్టం వచ్చినట్టు పిచ్చిపిచ్చిగా ముగ్గులు వేస్తూ ఉంటుంది. అదే చాలా బాగుందని కూడా ఆమె అనుకుంటుంది. కానీ ఆమె భర్త విష్ణు మాత్రం ఏం చేస్తున్నావ్ అంటూ మాటలతో ఇబ్బంది పెడుతూ ఉంటాడు. ఇక చివరికి జ్ఞానాంబ ముగ్గు బాగుండడంతో ఆమె గెలిచిందని అందరూ అంటారు. ఇక మల్లిక ముగ్గుపై ఆమె భర్త సెటైర్ కూడా వేస్తూ ఉంటాడు.

సంక్రాంతి సహాయం
ఇక అప్పుడు అందరూ కూడా ఆనందంగా ఉన్న సమయంలో ఒక వ్యక్తి వచ్చి అనగా ఆశ్రమం నుంచి వచ్చాము అని ప్రతి ఏడాది మీరు అనాధ పిల్లలకు స్వీట్స్ పంచుతున్నారు అని ఈసారి కూడా ఏమైనా సహాయం చేస్తారా అని అడుగుతాడు. కానీ అప్పుడే మల్లికా ఇంట్లో ఉన్న ఆర్థిక పరిస్థితుల గురించి ఓపెన్ గా చెబుతుంది. మేమే ఇప్పుడు చాలా కష్టాల్లో ఉన్న మీకు ఎలాంటి సహాయం చేయలేము అని అంటుంది. ఇక గోవిందరాజులు అడ్డుకునే ప్రయత్నం చేస్తాడు. మనం బయట ఉన్నామని అందరూ చూస్తున్నారు అని అలా మాట్లాడకూడదు అని అంటాడు. అయినప్పటికీ కూడా మల్లికా ఆయన మాటలు పట్టించుకోకుండా తనకు ఇష్టం వచ్చినట్లుగా అగౌరపరిచే విధంగా మాట్లాడుతుంది.

తమ్ముడి కోసం
ఇక ఇంట్లోకి వెళ్లిన తర్వాత మల్లిక మాటలకు అందరూ కూడా బాధపడుతూ ఉంటారు. ప్రతి ఏడాది అసలు అత్తయ్య గారు ఎందుకోసం సహాయం చేస్తున్నారు అని జానకి అడిగినప్పుడు అమ్మ తమ్ముడు చనిపోవడంతో అతనికి గుర్తుగా ప్రతి ఏడాది అమ్మ సంక్రాంతికి అనాధ పిల్లలకు సహాయం చేస్తుంది అని రామచంద్ర చెప్తాడు. గోవిందరాజులు కూడా ఇలాంటి పరిస్థితి వస్తుంది అని అనుకోలేదు అని తన భార్యతో మాట్లాడుతూ ఉంటాడు.

జ్ఞానాంబ ఎలా రియాక్ట్ అవుతుందో..
ఇక జ్ఞానాంబ కూడా తన తమ్ముడికి గుర్తుగా కూడా నేను ఏ విధంగా సహాయం చేయలేకపోతున్నాను అని బాధపడుతుంది. ఇక విష్ణు తన భార్య మల్లికను డబ్బులు అడగాలని అనుకుంటాడు. కానీ ఆమె మాత్రం అసలు డబ్బులు ఇవ్వడానికి ఒప్పుకోదు. ఇక జానకి అప్పుడే వచ్చి మల్లికపై కోపాన్ని వ్యక్తం చేస్తుంది. పెద్దలు అంటే గౌరవం ఉండాలి అని అంటుంది. అయినప్పటికీ మల్లిక మాటలు పెద్దగా పట్టించుకోదు. ఇక చివరికి జానకి రామచంద్ర ఇద్దరు కూడా అనాధ పిల్లలకు సహాయం చేయాలని అనుకుంటారు. మరి ఆ విషయంలో జ్ఞానాంబ ఏ విధంగా రియాక్ట్ అవుతుందో చూడాలి.