Janaki Kalaganaledu January 27th: వంట గదిలోకి రాగానే కౌగిలింతలు.. మరింత ఇబ్బందుల్లో పడిన జానకి!
జానకి కలగనలేదు సీరియల్ రోజురోజుకు మరింత ఆసక్తికరంగా మారుతోంది. చిన్న తమ్ముడు అఖిల్ జాబ్ కోసం రామ చేసిన అప్పు కారణంగా ఫ్యామిలీ మొత్తం కూడా కష్టాలపాలవుతుంది. ఇక ఆ సమస్యల వలన జానకి గొడవలు రాకుండా ఎవరు విడిపోకుండా చూడాలని అనుకుంటుంది. ఇక జానకి కలగనలేదు సీరియల్ కు గత వారం కంటే ఈ వారం రేటింగ్స్ మరింత పెరిగాయి. 8.95 రేటింగ్ తో గత వారం మంచి క్రేజ్ అందుకుంటోంది. నేడు ప్రసారం కాబోయే 488 వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం..

సంతోషంగా ఉండాలి
ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నా కూడా అందరూ సంతోషంగా ఉండాలని రామ, జానకి అనుకుంటారు. ముఖ్యంగా గోవిందరాజులు అయితే తన భార్య కూడా చాలా సంతోషంగా ఉండాలి అని కోపాన్ని పక్కనపెట్టి పండుగ రోజు మాత్రం అందరితో నవ్వుతూ ఉండాలి అని ఒక మాట కూడా తీసుకుంటాడు. ఇక అందుకు జ్ఞానాంబ కూడా భర్త కోరిక మేరకు సరే అని అంటుంది.
అయితే జ్ఞానాంబ సంతోషంగా ఉన్నప్పటికీ కూడా ఇంట్లో ఏదో ఒక సమస్య ఎదురవుతూనే ఉంటుంది. చిన్న కోడలు మల్లిక అలాగే అఖిల్ ఇద్దరు కూడా ఇంట్లో అసంతృప్తిగానే కనిపిస్తూ ఉంటారు. ఇక వారు ఎలా ఉన్నా కూడా జానకి మాత్రం అత్తగారి మీద గౌరవంతోనే ఉంటుంది. ఆ విషయంలో రామచంద్ర తన భార్యను ఎంతగానో మెచ్చుకుంటాడు.

వంట గదిలోకి రాగానే కౌగిలించుకొని..
జానకి వంట గదిలోకి రాగానే కౌగిలించుకొని మీరు అమ్మపై చూపించే గౌరవం నాకు ఎంతో నచ్చుతుంది అని.. ఎందుకు మా అమ్మగారు అంటే అంతా గౌరవం అని అడుగుతూ ఉంటాడు. అయితే జానకి అత్తగారి గురించి చాలా విషయాలు చెబుతుంది. అత్తగారు ఒక కోడలిలా కాకుండా ఒక కూతురుగా నన్ను చూసుకుంటున్నారు.
మొదట చదువు విషయంలో ఇబ్బందులు ఎదురవుతాయని అనుకున్నాను. కానీ ఆమె కల గురించి తెలుసుకున్న తర్వాత ఎంతో గౌరవించి నేను చదువుకోడానికి ఒప్పుకున్నాను. అలాంటి అత్తయ్యలు అందరికీ దొరకరు అని ఆ విషయంలో నేను చాలా అదృష్టవంతురాలని అని జానకి ఆనంద పడుతూ చెబుతుంది.

పని దొరికిందన్న రామ
ఇక రామచంద్రా అదే సంతోషంలో తనకు ఒక దగ్గర పని దొరికింది అని స్వీట్ షాప్ లో తనకు తెలిసిన పని అని ఇక నుంచి మీరు ఇలాంటి టెన్షన్ పడకుండా కాలేజీకి వెళ్ళాలి అని రామచంద్ర చెబుతాడు. ఇక జానకి ఆ విషయంలో సంతోషించే మనసటి రోజు నుంచి కాలేజీకి వెళుతుంది.
అయితే అక్కడ కాలేజీలో ప్రిన్సిపల్ జానకితో ప్రత్యేకంగా మాట్లాడుతుంది. నువ్వు పరీక్షల్లో అంతగా రాణించడం లేదు అని చాలా వరకు యావరేజ్ మార్కులు వచ్చాయని కొన్ని సబ్జెక్టులలో ఫెయిల్ అయ్యావ్ అని కూడా ఆమె చెబుతుంది. దీంతో జానకి మళ్ళీ ఒక్కసారిగా ఆలోచనలో పడుతుంది. ఇంట్లో పరిస్థితుల కారణంగా జానకి సరిగ్గా చదవదు.

గోవిందరాజులు అలా చెప్పడంతో..
జానకి ఇంట్లో ఎవరు ఈ పని చేయకపోయినా అన్ని చూసుకుంటూ ఉంటుంది. ఇక మల్లిక మాత్రం ఏ పని చేయకుండా సేవలు చేయించుకుంటూ ఉంటుంది. అబార్షన్ అయినప్పటి నుంచి తనకు చాలా వరకు శక్తి తగ్గింది అని చెబుతుంది. ఇక పనిమనిషి కాఫీ తేవడానికి ఇంకా రాలేదు అని పిలుస్తూ ఉంటుంది.
అప్పుడే మామ గోవిందరాజులు వచ్చి అందరూ ఏదో ఒక పని చేస్తున్నారు నీ పని నువ్వు చేసుకోవచ్చు కదా అని అడుగుతాడు. కానీ ఆమె అబార్షన్ గురించి చెబుతూ ఉంటుంది. విష్ణు కూడా అలానే పడుకుంటూ ఉంటాడు. ఇక అతన్ని పిలిచిన గోవిందరాజులు రామ ఒక్కడే ఇంట్లో పనిచేస్తున్నాడు అని మీరు కూడా ఏదైనా పని వెతుక్కోవాలి అని చెబుతాడు.

అఖిల్ పై మల్లిక కామెంట్స్
దీంతో మల్లికకు కొత్త కోపం వస్తుంది వేరొకరు చేసిన తప్పుకు మీ మమ్మల్ని ఎందుకు ఇలాంటి మాటలతో బాధపెడతారు అని అంటుంది. ఇంట్లో మరొకరు కూడా ఏ పని లేకుండా తిని తిరుగుతున్నారు అని అఖిల్ గురించి మల్లికా కౌంటర్ ఇస్తుంది. దీంతో అఖిల్ కూడా కొంత అప్సెట్ అవుతాడు. నేను పని వెతుక్కునే వరకు ఇంట్లో అసలు భోజనం కూడా చేయను అని చెబుతాడు. మల్లిక చివరికి తన భర్త విష్ణుకి కూడా చెబుతూ మీరు కూడా ఏదైనా పని వెతుక్కోండి అని కోపంగా చెప్పి వెళ్ళిపోతుంది. ఇక ఆ విషయంలో తల్లి జ్ఞానాంబ కూడా బాధపడుతూ ఉంటుంది.

జానకి పుస్తకాల కోసం డబ్బు
మరోవైపు జానకి తన చదువుకు సంబంధించిన పుస్తకాలు కొనుక్కోవాలని అనుకుంటుంది. దానికోసం మూడు వేల రూపాయలు అవసరం అవుతుంది. అయితే ఆ విషయాన్ని అంతకుముందే రామచంద్ర కు కాలేజీ ప్రిన్సిపాల్ ఫోన్ చేసి చెబుతుంది. ఇక రామచంద్ర జానకికి ఫోన్ చేసే మీరు ఆ విషయం గురించి టెన్షన్ పడవద్దు అని పుస్తకాలు నేను తెస్తాను అని అంటాడు. ఇక ఇదిలా ఉండగా మరోవైపు మల్లిక ఆరు బయట బిచ్చగాడితో కూర్చుని జాతకాల గురించి మాట్లాడుతుంది. అప్పుడే నీలావతి ఇంటికి వచ్చి రామచంద్ర ఉద్యోగం పోయింది అని చెబుతుంది. ఇక ఆ విషయాన్ని జానకి కూడా తెలుసుకుంటుంది. మరి ఈ విషయంలో జానకి ఏ విధంగా రియాక్ట్ అవుతుందో చూడాలి.


Click it and Unblock the Notifications











