Janaki Kalaganaledu January 28th: బాధలో ఉన్న భర్తకు జానకి అద్భుతమైన సలహా.. రామచంద్ర సరికొత్త వ్యాపారం..

జానకి కలగనలేదు సీరియల్ మరింత ఎమోషనల్ గా ఆకట్టుకుంటోంది. తమ్ముడు అఖిల్ జాబ్ కోసం రామ చేసిన అప్పు కారణంగా ఫ్యామిలీ మొత్తం కూడా ఆస్తులు పోగొట్టుకొని కష్టాలపాలవుతుంది. ఇక ఆ సమస్యల వలన జానకి గొడవలు రాకుండా ఎవరు విడిపోకుండా చూడాలని అనుకుంటుంది.

ఇక జానకి కలగనలేదు సీరియల్ కు గత వారం కంటే ఈ వారం రేటింగ్స్ మరింత పెరిగాయి. 8.95 రేటింగ్ తో గత వారం మంచి క్రేజ్ అందుకుంటోంది. నేడు ప్రసారం కాబోయే 489 వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం..

కుటుంబం కోసం..

కుటుంబం కోసం..

పరిస్థితులు ఎలా ఉన్నా కూడా రామచంద్ర జానకి ఇద్దరు మాత్రం బాధపడకుండా మళ్ళీ కుటుంబ గౌరవం నిలబెట్టే విధంగా నడుచుకోవాలి అని అనుకుంటారు. ముఖ్యంగా రామచంద్ర ఎలాగైనా అప్పు తీర్చి మళ్ళి ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడే విధంగా చేయాలని ఆలోచిస్తూ ఉంటాడు.

అతను పని కోసం ఎక్కడెక్కడో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఒకప్పుడు స్వీట్ షాప్ ఓనర్ గా కొనసాగిన రామచంద్ర ఇప్పుడు మరొక స్వీట్ షాప్ లో పనిలో చేరే పరిస్థితి ఏర్పడుతుంది. ఇక అంతా సవ్యంగా కొనసాగుతుంది అనుకుంటున్న సమయంలో ఊహించని విధంగా నీలావతి ద్వారా ఒక చెడు వార్త తెలుస్తుంది.

బిచ్చగాడితో జాతకం

బిచ్చగాడితో జాతకం

ఇంటి బయట మల్లిక ఒక బిచ్చగాడితో జాతకం చెప్పించుకుంటూ ఊహించిన విధంగా కలలు కంటూ ఉంటుంది. అతను ఒకప్పుడు జాతకాలు చెప్పేవాడిని అని చెప్పడంతో మల్లిక అతనికి చేయి చూపిస్తూ తన భవిష్యత్తు ఎలా ఉందో చెప్పమని అడుగుతుంది.

ఇక అతను మల్లికను పొగడ్తలతో ముంచెత్తుతూ మరొక వారంలో మీ జాతకమే మారిపోతుంది అని మీరు మహారాణి యోగం ఉంది అని చెబుతాడు. ఇక మల్లిక అతని మాటలకు కలలు కంటూ ఉంటుంది. దీంతో అదే సమయంలో అతను మల్లిక చేతికి ఉన్న ఉంగరాన్ని దొంగలించాలని అనుకుంటాడు. కానీ అప్పుడే మల్లిక తన డ్రీమ్ నుంచి బయటకు వచ్చి అతన్ని చితకబాదుతూ ఉంటుంది.

సంతోషపడిన మల్లిక

సంతోషపడిన మల్లిక

ఇక అప్పుడే నీలావతి మల్లికను కలుద్దామని వస్తుంది. అయితే అప్పుడే మల్లికా బిచ్చగాడితో గొడవ పడుతూ ఉండడంతో నీలావతి అతన్ని వదిలించి పంపించేస్తుంది. ఇక నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలని అనుకుంటున్నాను అని నీలావతి చెప్పడంతో మల్లిక ఏమిటి అని అడుగుతుంది.

రామచంద్ర ఇటీవల ఒక షాపులో పనికి చేరాడు కదా అయితే అందులో నుంచి అతన్ని తీసేశారు అని ఎంతో సంతోషంగా చెబుతుంది. దీంతో మల్లిక కూడా చాలా ఆనంద పడుతుంది. పని దొరికింది అని చాలా సంతోషపడ్డారు ఇప్పుడు తెలుస్తుంది అని మళ్ళీ తనలో తానే ఆనందపడుతుంది. ఇక వారి మాటలను జానకి కూడా వింటుంది.

అఖిల్ అసహనంగా..

అఖిల్ అసహనంగా..

ఇటీవల పనిలో చేరిన రామచంద్ర ఇప్పుడు హఠాత్తుగా పని కోల్పోవడంతో జానకి కూడా కొంత బాధపడుతూ ఉంటుంది. ఇక ఇంట్లో అందరూ కూడా కుటుంబ పరిస్థితి గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటారు. అయితే అఖిల్ అప్పుడే ఇంటికి వస్తాడు. ఎక్కడికి వెళ్లావు అని అతని భార్య జెస్సి అడుగుతుంది.

ఏదైనా పని దొరుకుతుందేమో అని బయటికి వెళ్లాను అని అతను కాస్త అసహనంతో చెబుతూ ఉంటాడు. అంతేకాకుండా భోజనం కూడా చేయనని చెబుతాడు. ఎందుకంటే పని చేయకపోతే ఇక్కడ భోజనం పెట్టారు కదా అని వెటకారంగా మాట్లాడుతూ లోపలికి వెళ్లాలని చూస్తాడు. అయితే తండ్రి అన్న మాటలకు అతను బాధపడుతున్నాడు అని జ్ఞానాంబ గ్రహిస్తుంది. మీ నాన్నగారే కదా మంచి కోసమే కదా చెప్పింది అని మళ్లీ అతనికి చెబుతుంది. అంతేకాకుండా భార్యతో కలిసి భోజనం చేయాలి అని తల్లి ప్రత్యేకంగా వడ్డిస్తుంది.

పని నచ్చలేదు

పని నచ్చలేదు

ఆ తర్వాత రామచంద్ర కూడా అప్పుడే ఇంట్లోకి వస్తుండగా జానకి అతనికి ఎదురు పడుతుంది. ఉద్యోగం పోయింది అని కూడా జానకి రామచంద్ర తో మాట్లాడుతూ ఉంటుంది. ఇక రామచంద్ర జరిగిన విషయం గురించి చెబుతూ ఉంటాడు. నాణ్యత గల స్వీట్స్ తయారు చేయమని అడిగితే వాళ్ళు ఒప్పుకోవడం లేదు అని అలాంటి పని నేను ఎప్పటికీ చేయను అని అందుకే అక్కడ స్వీట్ షాప్ లో పనిచేయడం నాకు నచ్చలేదు.

అందుకే బయటకు వచ్చేసాను అని రామచంద్ర కారణం చెబుతాడు. ఇక జానకి కూడా రామచంద్ర కు సపోర్ట్ చేస్తుంది. మీరు చాలా మంచి పని చేశారు అని అలాంటి చెడు పనులు మనకు వద్దు అని అంటుంది.

రామ మళ్ళీ కొత్త వ్యాపారం

ఇక రామచంద్ర కు జానకి ఒక అద్భుతమైన సలహా కూడా ఇస్తుంది. మీరు మొదట్లో చక్రాల బండిమీద స్వీట్ అమ్ముతూ ఉండేవారు కదా ఇప్పుడు కూడా అదే తరహాలో పని చేయండి అని జానకి సలహా ఇస్తుంది. ఇక రామచంద్ర ఉదయమే తన పాత చక్రాల బండిని తీసుకువచ్చి ముస్తాబు చేస్తూ ఉంటాడు. ఇక కుటుంబ సభ్యులందరూ కూడా బయట నిలబడి చూస్తూ ఉంటారు.

పెట్టుబడి పెట్టడానికి డబ్బు ఎక్కడిది అని అడిగితే రామచంద్ర తన బైక్ ని అమ్మేశాను అని చెబుతాడు. ఇక తల్లిని కొబ్బరికాయ కొట్టమని అడిగినప్పటికీ ఆమె మంచి మనసుతో ఎవరు కొట్టిన బాగానే ఉంటుంది అని భర్త క్షేమం కోరుకునే భార్య కొట్టాలని అత్తగారు కోడలు జానకికి సలహా ఇస్తారు. ఇక రామచంద్రా అదేవిధంగా తన సరికొత్త వ్యాపారాన్ని మొదలు పెడతాడు. మరి ఈ వ్యాపారంలో అతను ఎంతవరకు సక్సెస్ అవుతాడో తదుపరి ఎపిసోడ్ లో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X