twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Janaki Kalaganaledu January 30th: అవమానించేలా కన్నబాబు ప్రయత్నం.. జానకి స్ట్రాంగ్ కౌంటర్!

    |

    జానకి కలగనలేదు సీరియల్ లో ఊహించని ట్విస్ట్ లతో మరింత ఆసక్తికరంగా మారింది. అఖిల్ జాబ్ కారణంగా అప్పు చేసిన రామ ఆస్తులు పోగొట్టుకొని కష్టాలపాలవుతాడు. ఇక ఆ సమస్యల వలన కుటుంబం కూడా ఇబ్బంది పడుతుంది. ఇక జానకి గొడవలు రాకుండా ఎవరు విడిపోకుండా చూడాలని అనుకుంటుంది. ఇక జానకి కలగనలేదు సీరియల్ కు గత వారం కంటే ఈ వారం రేటింగ్స్ మరింత పెరిగాయి. 8.95 రేటింగ్ తో గత వారం మంచి క్రేజ్ అందుకుంటోంది. నేడు ప్రసారం కాబోయే 490 వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం..

    చక్రాల బండితో కొత్త వ్యాపారం

    చక్రాల బండితో కొత్త వ్యాపారం

    రామచంద్ర మళ్ళీ ఆర్థికంగా నిలదొక్కుకోవాలి అని తనకు తానే సరికొత్త వ్యాపారం పెట్టాలని అనుకుంటాడు. ముందుగా ఆ సలహా జానకి ఇస్తుంది. మనమే సొంతంగా మళ్ళీ స్వీట్ కొట్టు పెట్టే వరకు చిన్న వ్యాపారం పెట్టుకోవాలి అని జానకి చెబుతుంది. ఇక రామచంద్ర తన జీవితంలో మొదటగా చక్రాల బండి మీదనే స్వీట్స్ అమ్ముతూ ఉండేవాడు. ఇక ఇప్పుడు మళ్లీ దాని అవసరం పడటంతో సరికొత్తగా ఆలోచిస్తాడు. ఇక అతనికి తోడుగా జానకి కూడా ఉంటుంది. పెట్టుబడిగా డబ్బు అవసరం కావడంతో తన బండిని అమ్మేసిన రామచంద్ర మళ్లీ తన తల్లి ఆశీర్వాదంతోనే వ్యాపారం కొనసాగించాలని అనుకుంటాడు. ఇక తల్లిని ప్రత్యేకంగా కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ చేయమని చెబుతాడు. కానీ జ్ఞానాంబ మాత్రం ఆ విషయంలో వేరే విధంగా మాట్లాడుతూ ఉంటుంది. భార్య సపోర్ట్ ఉంటే చాలు అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.

    తక్కువ చేసి మాట్లాడిన మల్లిక

    తక్కువ చేసి మాట్లాడిన మల్లిక

    ఇక అత్తయ్య గారు సంతోషంగానే ఆ విషయం చెప్పారు అని జానకి మళ్ళీ భర్తకు ధైర్యం చెబుతుంది. ఇక తండ్రి ఆశీర్వాదం తీసుకున్న రామచంద్ర మీరే కొబ్బరికాయ కొట్టండి నాన్న అని అడుగుతాడు. ఇక తప్పకుండా అని గోవిందరాజులు కూడా కొడుకు కోసం ఆలోచిస్తాడు. అయితే బయట అందరూ కూడా సంతోషంగా ఉన్నప్పటికీ మల్లిక మాత్రం కాస్త సంతృప్తి తోనే ఉంటుంది. ఇక రామచంద్ర చెల్లెలు వెన్నెల మొదటి బోణీ చేస్తుంది. అంతేకాకుండా నువ్వు ఎదురుగా వస్తే నాకు మంచిది అంటూ రామచంద్ర చెల్లికి చెబుతాడు. ఇక ఆ తర్వాత మల్లికా ఊహించిన విధంగా కొన్ని వెటకారపు మాటలు మాట్లాడుతూ ఉంటుంది. బావగారికి మీరైనా చెప్పాల్సింది అని 20 లక్షల అప్పుని తోపుడు బండి మీద ఎలా తీరుస్తారు అని ఆశకు కూడా హద్దు ఉండాలి అని తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటుంది.

    మల్లికకు మామ కౌంటర్

    మల్లికకు మామ కౌంటర్

    ఇక గోవిందరాజులు ఆమెకు అదిరిపోయే విధంగా కౌంటర్స్ ఇస్తూ ఉంటాడు. మా జీవితం మొదలైంది ఆ బండి మీద అంటూ మళ్ళీ రామచంద్ర అదేదారిలో వెళితే తప్పు ఏమిటి అని అడుగుతూ ఉంటాడు. ఆ విధంగా మల్లిక మాట్లాడుతుంటే నువ్వైనా చెప్పవచ్చు కదరా మీ అన్నయ్య గురించి నీకు తెలుసు కదా అని గోవిందరాజులు తన రెండవ కొడుకు విష్ణు కి చెబుతూ ఉంటాడు. అయితే విష్ణు కూడా కాస్త అసంతృప్తి గానే మాట్లాడుతూ ఉంటాడు. ఇప్పటికే అన్నయ్యతో పోలుస్తూ నన్ను తక్కువ చేసి మాట్లాడారు ఇప్పుడు కూడా అలా మాట్లాడితే నా భార్య ముందు ఉన్న పరువు కూడా పోతుంది అని అంటాడు. ఇక ఇంట్లో వాళ్ళు రామచంద్రను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు అని గోవిందరాజులు భావిస్తాడు.

    కన్నబాబు పొగరుగా..

    కన్నబాబు పొగరుగా..

    ఇక ఆ తర్వాత రామచంద్ర సరికొత్తగా తన వ్యాపారాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. అయితే అలా వెళుతూ ఉండగా మధ్యలో అతని శత్రువు కన్నబాబు ఎదురుపడతాడు. స్వీట్ షాప్ నుంచి మీ పరిస్థితి మళ్ళీ రోడ్డు మీదకు వచ్చేసింది అని.. ఇలాంటివి వీధికి నాలుగు ఉన్నాయి అని హేళన చేస్తూ ఉంటాడు. ఇక జానకి గురించి కూడా అతను తప్పుగా మాట్లాడుతుండడంతో రామచంద్ర కు కోపం వస్తుంది. మా పని మేము చూసుకుంటాము నువ్వు నీ పని చూసుకో అని జానకి కూడా కౌంటర్ ఇస్తుంది. ఇక రామచంద్ర కాస్త వార్నింగ్ ఇచ్చే విధంగా కోప్పడుతూ ఉండడంతో జానకి అతన్ని కూల్ చేస్తుంది. రోడ్డు మీద చాలా కుక్కలు మొరుగుతాయి అని వాటి గురించి పట్టించుకుంటే మన సమయం వృధా అవుతుంది అని చెబుతుంది. దీంతో కన్నబాబు సైలెంట్ గా పక్కకు జరుగుతాడు.

    జ్ఞానాంబ ఆలోచన

    జ్ఞానాంబ ఆలోచన

    ఇక మరోవైపు జ్ఞానాంబ కొడుకు విషయంలో మంచి ఆలోచనతోనే ఉంటుంది. రామచంద్ర చిన్నప్పటి నుంచి కుటుంబం కోసం ఎంతో కష్టపడ్డాడు. ఇప్పుడు అతను చేసిన పొరపాటు కారణంగా ఈ పరిస్థితి వచ్చింది. ఇప్పుడు కూడా మనం అతనిన్ని వేలు పట్టి నడిపించకుండా సొంతంగా ఎదిగే విధంగా చేయాలి అని రామ విషయంలో ఎలాంటి దిగులు లేదు అని జ్ఞానాంబ తన భర్తకు చెబుతుంది.

    జాలి చూపించవద్దు అంటూ..

    జాలి చూపించవద్దు అంటూ..


    ఇక మరోవైపు మల్లికా తన భర్త కోసం షాప్ పెట్టించాలి అని ఎప్పటినుంచో దాచుకున్న డబ్బులను ఇస్తుంది. ఇన్ని రోజులు డబ్బులు లేవని చెప్పిన మల్లికా ఇప్పుడు భర్తకు పొగరుగా సహాయం చేయాలని అనుకుంటుంది. ఇక మరోవైపు రామచంద్ర కు తెలిసిన వాళ్ళు రోడ్డుమీద ఎదురుపడతారు. ఇలాంటి పరిస్థితి ఎదురయ్యింది ఏమిటి వీటిని అడుగుతారు. ఇక జాలి చూపించవద్దు అని జానకి చెబుతుంది. అయితే రామచంద్ర వారి నుంచి ఒక సహాయం అడుగుతాడు. మీకు ఏవైనా ఫంక్షన్స్ ఉంటే చెప్పండి నేను స్వీట్స్ ఆర్డర్ సప్లై చేస్తాను అని అంటాడు. ఇక వాళ్ళు అందుకు ఓకే అని అంటారు. మరి ఈ పరిస్థితిని దాటి రామచంద్ర ఎంతవరకు ఎదుగుతాడో తదుపరి ఎపిసోడ్లో చూడాలి.

    English summary
    Janaki Kalaganaledu Serial 2023 January 30th Episode 490
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X