Janaki Kalaganaledu January 3rd: కొడుకుపై మరింత కోపంగా జ్ఞానాంబ.. రామ మరో షాకింగ్ నిర్ణయం

జానకి కలగనలేదు సీరియల్ విభిన్నమైన ఎమోషన్స్ తో ముందుకు సాగుతోంది. రామ తన చిన్న తమ్ముడు అఖిల్ కోసం రామ చేసిన అప్పు ఇంట్లో వాళ్ళను ఇబ్బందుల్లో పడేస్తుంది. అఖిల్ పని లేకుండా ఖాళీగా ఉండడంతో అతను సెటిల్ అయితే బాగుంటుంది అని ఇంట్లో వాళ్ళు అందరూ కోరుకుంటూ ఉంటారు. ఇక జానకి, రామ కూడా అదే ఆలోచిస్తారు. అయితే అఖిల్ మాత్రం జానకి పై కోపం తెచ్చుకుంటాడు.

జానకి ఆ విషయంలో గొడవలు రాకుండా చేయాలని అనుకుంటుంది. ఇక జానకి కలగనలేదు సీరియల్ కు గత వారం కంటే ఈ వారం రేటింగ్స్ పెరిగాయి. 7.95 రేటింగ్ తో గత వారం మంచి క్రేజ్ అందుకుంటోంది. నేడు ప్రసారం కాబోయే 468 వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం..

తీవ్ర ఇబ్బందుల్లో రామ కుటుంబం

తీవ్ర ఇబ్బందుల్లో రామ కుటుంబం

రామచంద్ర తన తమ్ముడు అఖిల్ లైఫ్ సెటిల్ చేయాలి అని అతనికి మంచి జాబ్ రావాలి అని కోరుకుంటాడు. అయితే అతని స్నేహితుడు చరణ్ నుండి బిజినెస్ లో పెట్టుబడి కింద 20 లక్షలు అప్పు చేసి మరీ ఇస్తాడు. తన తమ్ముడికి జాబ్ వస్తుంది కదా అనే ఆలోచించిన రామచంద్రకు ఊహించిన విధంగా మోసం జరుగుతుంది.

చరణ్ అక్కడి నుంచి పరారవడంతో ఇప్పుడు రామచంద్ర ఇంటి కాగితాలు తాకట్టు పెట్టి తెచ్చిన 20 లక్షలు వలన తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయి. ఇప్పుడు అప్పు ఇచ్చిన వారికి డబ్బులు కట్టాలి అని షరతు విధిస్తారు. మూడు రోజుల్లోగా అప్పు మొత్తం ఇచ్చేయాలని లేదంటే ఇంటిని జప్తు చేస్తామని చెప్పడంతో ఇంట్లో వాళ్ళందరూ కూడా చర్యపోతారు.

రామ, జానకిపై అనుమానాలు

రామ, జానకిపై అనుమానాలు

దీంతో రామచంద్రకు ఏం చేయాలో తోచదు. మరోవైపు ఇంట్లో వాళ్ళందరూ కూడా రామచంద్రను ఊహించిన విధంగా అనుమానిస్తూ ఉంటారు. అంతేకాకుండా జానకి పై కూడా అనుమానాలు వ్యక్తం చేస్తారు. వీళ్ళే కావాలని 20 లక్షలు నొక్కేసి ఉంటారు అని ఎక్కడైనా ప్లాట్ తీసుకున్నారేమో అని మల్లిక కలుగజేసిన అనుమానాలకు అందరూ కూడా అటు ఇటుగా నమ్మే పరిస్థితుల్లోనే ఉంటారు.

ముఖ్యంగా రామచంద్ర తల్లి జ్ఞానాంబ, రామచంద్ర చాలా మారిపోయాడు అని మాట్లాడుతుంది. నువ్వే మారావో లేక నిన్ను ఎవరైనా ఇలా మార్చారో తెలియదు కానీ నువ్వు నీ భార్యకు చెప్పినా నిజాన్ని నాకు చెప్పకపోవడం చాలా మోసం అని ఆమె అంటుంది.ఇక రామచంద్ర ఆ విషయంలో చాలా బాధపడుతాడు.

బాధలో విష్ణు

బాధలో విష్ణు

ఇక విష్ణు ఇంట్లో పరిస్థితులు గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాడు. ఒకవైపు నాన్నకు పక్షవాతంతో మంచాన పడిపోవడం.. మరోవైపు అన్నయ్య అఖిల్ కోసం ఇల్లు తాకట్టు పెట్టడం.. మరో మూడు రోజుల్లో 20 లక్షలు కట్టకపోతే జప్తు చేస్తాను అనడం.. ఇవన్నీ పరిస్థితులను చూసి చాలా బాధగా ఉంది అని విష్ణు అంటాడు.

దీంతో మల్లిక అతని మనసును మార్చే విధంగా ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయి వేరే కాపురం పెడితే బాగుంటుంది అని అతనికి చెబుతుంది. కానీ ఇలాంటి పరిస్థితుల్లో బయటకు వెళ్లడం కరెక్ట్ కాదు అని విష్ణు ఆమెకు చెప్పి మెల్లగా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు.

భోజనం తినకుండా

భోజనం తినకుండా

ఇక మరోవైపు జానకి అందరికీ భోజనాలు పెట్టాలని అనుకుంటుంది. లేవలేని పరిస్థితుల్లో ఉన్న మామగారికి ప్రత్యేకంగా భోజనం చేసి తీసుకు వెళుతుంది. అలాగే అత్తకి కూడా భోజనం తీసుకు వెళుతుంది. కానీ జ్ఞానాంబ మాత్రం ఆ భోజనం తినకుండా జానకితో ఏమీ మాట్లాడకుండా వంటగదిలోకి వెళుతుంది.

తనే స్వయంగా మరొక వంట చేసుకుని భోజనం చేస్తుంది. ఇక ఈ పరిస్థితులను చూసే రామచంద్రం మరింత బాధపడతాడు. అయితే ఈ కఠినమైన పరిస్థితుల నుంచి ఎలాగైనా బయటపడాలి అని జానకి కూడా అంటుంది.

ఈ కుటుంబానికి ఏమీ కాదు

ఈ కుటుంబానికి ఏమీ కాదు

గోవిందరాజులు కూడా అదే విషయం గురించి మాట్లాడతాడు. అయితే గోవిందరాజులు మాత్రం రామచంద్రా తప్పు చేయడు అని నమ్ముతాడు. అతను ఎప్పుడు కూడా కుటుంబం గురించి ఆలోచిస్తాడు అని తన జ్ఞానాంబకు చెబుతాడు. అంతేకాకుండా జానకి రామచంద్ర ఉండగా ఈ కుటుంబానికి ఏమీ కాదు అని వారు తప్పకుండా ఈ గండం నుంచి బయట పడేస్తారు అని కూడా గోవిందరాజులు చెబుతాడు.

స్వీట్ షాప్ కూడా తాకట్టు

స్వీట్ షాప్ కూడా తాకట్టు

ఇక రామచంద్రకు ఏం చేయాలో తోచక మూడు రోజుల్లో 20 లక్షలు అంటే ఎవరు అప్పుగా ఇవ్వరు అని అందుకే స్వీట్ షాప్ తాకట్టు పెట్టాలని అనుకుంటున్నట్లుగా జానకితో చెబుతాడు. అంతే కాకుండా జ్ఞానాంబ అనుమతి అడగాలని అనుకుంటాడు. ఈ క్రమంలో మల్లిక తన సూటిపోటి మాటలతో అందరినీ మరింత బాధ పెడుతూ ఉంటుంది. రామచంద్ర తల్లితో మాట్లాడాలని అనుకున్నప్పటికీ కూడా ఆమెను అతని నుంచి దూరంగా వెళుతూ ఉంటుంది. ఈ క్రమంలో రామచంద్ర మరోసారి తల్లిని బ్రతీమాలలని అనుకుంటాడు. కానీ రామ మాత్రం ఎంత చెప్పినా కూడా తల్లి కూల్ అవ్వదు. మరి రామచంద్ర నిజంగానే స్వీట్ షాప్ తాకట్టు పెడతాడా లేదా అనేది తదుపరి ఎపిసోడ్ లో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X