Janaki Kalaganaledu July 1st: మల్లికకు మరోసారి కౌంటర్ ఇచ్చిన జెస్సి.. జానకి జ్ఞాపకంలో రామ

జానకి కలగనలేదు సీరియల్ ఆకట్టుకునే ఎమోషన్స్ తో ఎంతో ఆసక్తిగా కొనసాగుతోంది. ఐపీఎస్ కావాలని అనుకున్న జానకి కానిస్టేబుల్ కావాల్సి వస్తుంది. ఇక మరోసారి ఐపీఎస్ పరీక్షలు రాసి తన కలను నిజం చేసుకోవాలి అని అనుకుంటుంది. ఇక పోలీస్ స్టేషన్లో అక్కడ ఆమెకు ఎస్ఐ మనోహర్ నుంచి ఇబ్బందులు ఎదురవుతాయి. ఇక భర్త రామ ఆమెకు సపోర్ట్ చేస్తాడు. ఇక జానకి కలగనలేదు సీరియల్ కు గత వారం కంటే ఈ వారం రేటింగ్స్ మరింత పెరిగాయి. 6.72 రేటింగ్ తో గత వారం మంచి క్రేజ్ అందుకుంటోంది. నేడు ప్రసారం కాబోయే 620 వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం..

దాదాపు 11 నెలలు విడిచి ఉండాలి: జానకి ఐపీఎస్ కావడానికి ప్రత్యేకంగా శిక్షణ తీసుకోవడానికి బయలుదేరుతుంది. ఇక ఆమెను దాదాపు 11 నెలలు విడిచి ఉండాలి అనే ఆలోచనతోనే రామచంద్ర బెంగపెట్టుకొని ఉంటాడు. ఇక జానకిని ప్రత్యేకంగా ఆటోలో బస్ స్టాప్ వరకు దింపడానికి వెళ్లిన రామచంద్ర ఆమెతో చాలా ఎమోషనల్ అవుతూ ఉంటాడు. మిమ్మల్ని ఎలా వదిలి వెళ్ళాలో అర్థం కావడం లేదు అని అంటాడు. ఇక రాత్రి పగలు అని తేడా తెలియకుండా రామచంద్ర తన భార్యను తలుచుకుంటూ ఉంటాడు. ఇక జానకి నుంచి ఎంతో ప్రేమగా ఆమె గుర్తుగా రామచంద్ర పట్టీలు తీసుకుంటాడు. ఆ విషయాన్ని కూడా గుర్తు చేసుకుని రామచంద్ర జానకిని తలుచుకుంటూ ఉంటాడు.

Janaki Kalaganaledu

మల్లిక వెటకారంగా..: మరోవైపు మల్లిక జానకి ఐపిఎస్ ట్రైనింగ్ కు వెళ్ళింది అని తెలిసినప్పటి నుంచి కూడా మరింత అసూయ చెందుతూ ఉంటుంది. ఇక ఎవరు జానకి గురించి మాట్లాడుకున్నా కూడా మధ్యలోకి వెళ్లి ఏదో ఒక విధంగా జానకిని తక్కువ చేసి మాట్లాడాలని అనుకుంటూ ఉంటుంది. ఇక జెస్సి అలాగే వెన్నెల ఇద్దరు కూడా జానకి గురించి మాట్లాడుకుంటుంటారు. ఆమె ఐపిఎస్ ట్రైనింగ్ గురించి కూడా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండడంతో మల్లిక వచ్చి జానకి ఏదో గొప్ప విజయం సాధించింది అన్నట్లు అంతలా మాట్లాడుకుంటారు.. ఐపీఎస్ అంటే నిజంగా అంత గొప్ప అని కాస్త చులకనగా మాట్లాడుతుంది. ఇక జెస్సి మాత్రం ఆమె మాటలకు సరైన కౌంటర్ ఇవ్వాలని అనుకుంటూ ఉంటుంది. నిజంగా మీ అన్ని తెలివితేటలు ఎవరికి ఉండవు అంటూ ఒకవైపు పొగుడుతూనే మరొకవైపు కౌంటర్లు ఇచ్చే ప్రయత్నం చేస్తుంది.

Janaki Kalaganaledu

పరువు పోగొట్టుకున్న మల్లిక: నువ్వు ఎంతవరకు చదువుకున్నావు అక్క అని జెస్సి అడుగుతుంది. దీంతో మల్లిక షాక్ అవుతుంది. ఇప్పుడు నా చదువు గురించి ఎందుకులే అంటూ ఆమె మ్యాటర్ పక్కకు తప్పించే ప్రయత్నం చేస్తుంటే.. నీ గొప్పతనం తెలియాలి కదా అంటూ జెస్సి మళ్ళీ అడుగుతుంది. ఇక ఇంటర్ చదువుకుందేమో అని అడిగినప్పటికీ ఆమె మరి అంత ఎక్కువ కాదు అని చెబుతుంది. ఇక చివరికి ఐదవ తరగతి అనగానే దాదాపు అదే అంటూ ఆమె కాస్త చిన్నబోయి సమాధానం ఇస్తుంది. ఇక పక్కనే ఉన్న వంటవాడు మలయాళం కూడా నవ్వుతూ మీ కంటే నేను గొప్ప అని ఎనిమిదవ తరగతి వరకు చదివాను అని అంటాడు. ఇక వెన్నెలకు సమాధానం ఇస్తున్నట్లు మాట్లాడిన జెస్సి ఎవరిని చదువును కూడా తక్కువ చేసి మాట్లాడకూడదు అని మల్లిక అక్క ట్రై చేస్తే కానిస్టేబుల్ అవ్వవచ్చు అని ఆమె కౌంటర్ వేస్తుంది.

Janaki Kalaganaledu

ఇంట్లో తగ్గింది ఒక్క మనిషి అయినా..: ఇక మల్లిక విషయం అర్థమయ్యి అక్కడి నుంచి మెల్లగా జారుకునే ప్రయత్నం చేస్తుంది. ఇక జానకి ఇంట్లో లేదు అనే విషయాన్ని గుర్తు చేసుకుంటూ గోవిందరాజులు అలాగే అతని భార్య జ్ఞానాంబ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంట్లో తగ్గింది ఒక్క మనిషి అయినా అసలు సందడి కనిపించడం లేదు అని అనుకుంటూ ఉంటారు. ఇక మలయాళం కూడా వచ్చి అదే మాట్లాడుతూ ఉండడంతో అప్పుడే మల్లిక వెటకారంగా మాట్లాడుతూ ఉంటుంది. జానకి బయటకు వెళ్లగానే అందరూ ఎందుకో ఇంతలా బాధపడుతున్నారు అర్థం కావడం లేదు అని ముఖ్యంగా బావగారు అయితే అసలు మరింత దారుణంగా బాధపడుతున్నారు అని వెటకారంగా మాట్లాడుతూ ఉంటుంది.

ఇంకా జానకినే తలచుకుంటున్న రామ:ఇక రామచంద్ర రాగానే అతనికి తల్లి భోజనం పెట్టాలని అనుకుంటుంది. చాలా ఆకలిగా ఉంది అని కూడా అతను చెప్పడంతో వెంటనే పొరపాటున జానకి గారిని కూడా పిలుస్తాను అని అంటాడు. అయితే జానకి లేదు కదా అంటూ తల్లిదండ్రులు చెప్పడంతో రామచంద్ర కాస్త అప్సెట్ అవుతాడు. మళ్ళీ జానకి గుర్తుకు రావడంతో అతనికి ఆకలి కూడా లేదు సైలెంట్ గా తన గదిలోకి వెళ్ళిపోతాడు. ఒకసారి మీరైనా రామచంద్ర తో మాట్లాడండి అని ఇలా అయితే ఎలా అని అంటుంది. అయితే అతను బాధలో ఉంటే కోపంలో ఉంటే చెప్పొచ్చు కానీ ఇలా బెంగగా ఉంటే చెప్పలేము అని జానకి ఒక్కతే అతనికి పరిష్కారం అని అర్థం చేసుకొని ముందుకు వెళ్లాలి అని గోవిందరాజులు చెబుతాడు.

Janaki Kalaganaledu
గర్వంగా ఫీల్ అయిన జానకి:ఇక రామచంద్ర తన భార్యకు ఫోన్ చేయాలని అనుకుంటాడు. మరోవైపు జానకి కూడా ఫోన్ చేస్తాడేమో అని ఎదురు చూస్తూ ఉంటుంది. ఇక అప్పుడే రామచంద్ర ఫోన్ చేసి ఎలా ఉన్నారు అని అడుగుతాడు. అంతా బాగానే ఉంది అని చెబుతుంది. ఇక కొంత సేపటి తర్వాత జానకి తన అనుకున్న ఐపీఎస్ ట్రైనింగ్ సెంటర్ కు చేరుకుంటుంది. అక్కడ జానకి తన జీవితంలో కొన్ని జ్ఞాపకాలు కూడా గుర్తు చేసుకుంటుంది. తన తండ్రి అలాగే రామచంద్ర ఐపీఎస్ కావాలని అనుకున్నారు. ఇప్పుడు వారి కోరికకు తగ్గట్టుగా నేను సిద్ధమవుతున్నాను అని జానకి గర్వంగా ఫీల్ అవుతుంది. మరి జానకి ముందు రోజుల్లో ఏవిధంగా కొనసాగుతుందో తదుపరి ఎపిసోడ్లో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X