Janaki Kalaganaledu July 3rd: ఐపీఎస్ శిక్షణ కోసం కఠినంగా మారబోతోన్న జానకి.. జెస్సి కొత్త ఆలోచన

జానకి కలగనలేదు సీరియల్ ఆకట్టుకునే ఎమోషన్స్ తో ఎంతో ఆసక్తిగా కొనసాగుతోంది. ఐపీఎస్ కావాలని అనుకున్న జానకి కానిస్టేబుల్ కావాల్సి వస్తుంది. ఇక మరోసారి ఐపీఎస్ పరీక్షలు రాసి తన కలను నిజం చేసుకోవాలి అని అనుకుంటుంది. ఇక పోలీస్ స్టేషన్లో అక్కడ ఆమెకు ఎస్ఐ మనోహర్ నుంచి ఇబ్బందులు ఎదురవుతాయి. ఇక భర్త రామ ఆమెకు సపోర్ట్ చేస్తాడు. ఇక జానకి కలగనలేదు సీరియల్ కు గత వారం కంటే ఈ వారం రేటింగ్స్ మరింత పెరిగాయి. 6.72 రేటింగ్ తో గత వారం మంచి క్రేజ్ అందుకుంటోంది. నేడు ప్రసారం కాబోయే 621 వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం..

పోలీస్ అకాడమీలో అడుగుపెట్టిన జానకి:జానకి చిన్నప్పటినుంచి కలలు కన్న ఐపీఎస్ లక్ష్యం మొత్తానికి నెరవేరే సమయం దగ్గర పడుతుంది. చిన్నప్పుడు తన తండ్రికి ఇచ్చిన మాట ప్రకారం జానకి తప్పకుండా ఐపీఎస్ అవుతాను అని చెబుతుంది. అలాగే తన భర్త రామ కూడా జానకి ఎలాగైనా ఐపిఎస్ కావాలి అని కోరుకుంటాడు. ఇక వారిద్దరిని తన మనసులో తలుచుకున్న జానకి వారి కోసం ఇంత దూరం వచ్చినందుకు ఎంతగానో ఆనందపడుతూ ఉంటుంది. ఇక పరీక్షల్లో పాస్ అయిన తర్వాత జానకి ఫైనల్ గా పోలీస్ అకాడమీ కి చేరుకుంటుంది. అక్కడ ఆమె ప్రత్యేకంగా శిక్షణ తీసుకోవడానికి సిద్ధమవుతుంది. మొదట ఆమె పోలీస్ అకాడమీలోకి అడుగుపెట్టగానే ఎంతగానో సంతోషిస్తుంది.

 Janaki Kalaganaledu Serial 2023 July 3rd Episode 622

గతాన్ని తలుచుకుంటూ:ఇక మొట్టమొదట జానకి అక్కడ ఉన్న కొంతమంది పోలీసు అధికారులను కలుసుకొని వివరాలు తెలుసుకుంటుంది. ఎక్కడ ఎవరిని కలవాలి అని అడుగుతుంది. ఇక ఆమెకు పోలీసు అధికారులు ఎంతగానో సపోర్ట్ చేస్తారు. మొత్తానికి జానకి పోలీస్ డ్రెస్ చేతుల్లోకి తీసుకుంటుంది. అప్పుడు ఆమె తన గతాన్ని తలుచుకుంటూ ఎంతగానో గర్వంగా ఫీల్ అవుతుంది. మరోవైపు జానకి అత్తగారింట్లో కుటుంబ సభ్యులు వివిధ రకాల ఆలోచనలతో ఉంటారు. ముఖ్యంగా జెస్సి తీరును చూసి ఆమె భర్త అఖిల్ కాస్త నిరుత్సాహపడతాడు. ఎందుకంటే జెస్సీ మెడలో ఒక గొలుసు కూడా ఉండదు. ఆ విషయాన్ని తలుచుకుంటూ బాధపడుతూ ఉండగా జెస్సి ఇంత చిన్న దానికి మీరు బాధపడితే ఎలా అంటూ రేపు మన కొడుకు కోసం చాలా ఖర్చులు పెట్టాల్సి ఉంటుంది అని అంటుంది.

జెస్సి కొత్త ఆలోచన:అలాగే తన మనసులో మరొక నిర్ణయాన్ని కూడా జెస్సి బయటకు చెబుతుంది. నేను కూడా ఏదైనా పనిచేసే డబ్బులు సంపాదించాలని అనుకుంటున్నాను అని అంటుంది. ఇప్పుడు నీకు తగ్గట్టుగా జాబ్ ఎక్కడ దొరుకుతుంది అని అఖిల్ అడుగుతాడు. జాబ్ కాదు అని నేను ఆన్లైన్లో చూసి బ్యూటీషియన్ కోర్స్ నేర్చుకున్నాను అని ఏదైనా మంచి బ్యూటీ పార్లర్ పెట్టుకొని డబ్బులు సంపాదిస్తాను అని చెబుతోంది. అలాగే మీ చెల్లి వెన్నెల కూడా నాకు తోడుగా ఉంటుంది అని చెబుతోంది. దీంతో అఖిల్ కాస్త సంతోషిస్తాడు. అందుకు నాకు ఎలాంటి అభ్యంతరం లేదు అని కాకపోతే అమ్మ నిర్ణయం తీసుకోవాలి అని అంటాడు. ఇక వీరిద్దరూ మాట్లాడుకుంటున్న తీరును చూసి మల్లికా అసూయ చెందుతుంది. ఒకవైపు ఐపీఎస్ జానకి ఇప్పుడు జెస్సి వ్యాపారం చేస్తూ ఉంటే తనకు ఏమాత్రం విలువ ఉండదు అని నేను కూడా ఏదో ఒకటి చేయాలి అని ఆమె అనుకుంటూ ఉంటుంది.

 Janaki Kalaganaledu Serial 2023 July 3rd Episode 622

అన్నీ గుర్తుచేసుకున్న జానకి:ఇక మరోవైపు జానకి మొత్తానికి పోలీస్ యూనిఫాం వేసుకుని చాలా గర్వంగా ఫీల్ అవుతూ ఆనందంగా కనిపిస్తూ ఉంటుంది. ఇక ఆమె ట్రైనింగ్ కు సిద్ధం కావడానికి వెళుతుంది. ఈ క్రమంలో జానకి తన తండ్రి కి ఇచ్చిన మాటను గుర్తు చేసుకుంటుంది. ఎలాగైనా నువ్వు ఐపిఎస్ కావాలి అని ఒకప్పుడు తండ్రి చెప్పిన మాటలు ఆమెను ఇంకా కదిలిస్తూనే ఉంటాయి. అలాగే రామచంద్ర కోరికకు తగ్గట్టుగా ఐపీఎస్ అయినందుకు ఆనందపడుతుంది. మరోవైపు ఎస్ఐ మనోహర్ నుంచి ఆమె ఎదుర్కొన్న ఎన్నో అనుమానాలు కూడా తలుచుకుంటుంది. మొత్తానికి వాటిని దాటి ఇంత దూరం వచ్చినందుకు ఆమె సంతోషపడుతుంది.

 Janaki Kalaganaledu Serial 2023 July 3rd Episode 622

ఐపీఎస్ ట్రైనింగ్ కోసం విక్రమ్:ఇక ఐపీఎస్ ట్రైనింగ్ కు సంబంధించిన మీటింగ్లో అందరూ కూడా సిద్ధంగా ఉంటారు. ఈ క్రమంలో అందరికీ పోలీసు అధికారులు కొన్ని నియమాలు నిబంధనల గురించి చెబుతారు. అయితే మీకు ట్రైనింగ్ ఇవ్వడానికి ఒక ప్రత్యేకమైన అధికారిని నియమించామని అతని పేరు విక్రమ్ అని చెబుతారు. ఇక విక్రమ్ రాగానే అందరికీ ఒక టెస్ట్ కూడా పెడతారు. ముందుగా మిమ్మల్ని మీరు రెగ్యులర్ గా కాకుండా ఒక టాస్క్ ద్వారా పరిచయం చేసుకోవాలి అని చెబుతారు. ఒక టేబుల్ దగ్గర పేపర్ అలాగే కొన్ని లెటర్స్ ఉంటాయి. వాటిని జతపరిచి మీ పేరును చూపించాలి అని విక్రమ్ చెబుతాడు. దీంతో అందరూ కూడా చకచకా వారి పేర్లను పేపర్ మీద అంటించుకుని వస్తారు.

 Janaki Kalaganaledu Serial 2023 July 3rd Episode 622

జానకి ఎదుర్కోబోతున్న కఠినమైన శిక్షణ:అయితే అందరిని చూసినా విక్రమ్ మీరు ఇక్కడికి అడుగుపెట్టినప్పుడు ఒక పోలీస్ అధికారిగా మాత్రమే ఉండాలి మీ వెనకాల ఇంటిపేరు తర్వాత మరొక పేరు ఉండకూడదు. కేవలం మీ పేరు మాత్రమే ఉండాలి అని చెప్పడంతో అందరూ ఆ పేరును తీసేస్తారు. ఇక జానకి తన పేరు పక్కన రామ్ పేరు కూడా జత చేసుకుంటుంది. ఇక ఆ పేరును కూడా ఆమె తీసేస్తుంది. మీ పోలీసు డ్యూటీకి మీరు న్యాయం చేయాలి అంటే ముందుగా చాలా కఠినంగా శిక్షణ తీసుకోవాల్సి ఉంటుంది. మీ ఇంటిని మర్చిపోవాలి మీ బంధువులను స్నేహితులను అన్ని ఎమోషన్స్ ను కూడా పక్కన పెట్టాలి అని చెబుతాడు. దీంతో జానకి అందుకు తగ్గట్టుగా సిద్ధం అవ్వాలని అనుకుంటుంది. ఇక మరోవైపు రామచంద్ర జానకిని తలుచుకుంటూ ఉంటాడు. గదిలోనే ఉండడంతో ఇంతలో బయటనుంచి ఒక వ్యక్తి వచ్చి స్వీట్స్ ఆర్డర్ కావాలి అని చెబుతాడు. అయితే రామచంద్ర అందుకు ఒప్పుకుంటాడు. మరి రామచంద్ర జానకిని తలుచుకుంటూ ఆర్డర్ ను పూర్తి చేస్తాడో లేదో తదుపరి ఎపిసోడ్లు చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X