Janaki Kalaganaledu July 4th: ఒకవైపు ఆశయం, మరోవైపు భర్తపై జానకి ప్రేమ.. లింక్ పెట్టిన మల్లిక
జానకి కలగనలేదు సీరియల్ ఆకట్టుకునే ఎమోషన్స్ తో ఎంతో ఆసక్తిగా కొనసాగుతోంది. ఐపీఎస్ కావాలని అనుకున్న జానకి కానిస్టేబుల్ కావాల్సి వస్తుంది. ఇక మరోసారి ఐపీఎస్ పరీక్షలు రాసి తన కలను నిజం చేసుకోవాలి అని అనుకుంటుంది. ఇక పోలీస్ స్టేషన్లో అక్కడ ఆమెకు ఎస్ఐ మనోహర్ నుంచి ఇబ్బందులు ఎదురవుతాయి. ఇక భర్త రామ ఆమెకు సపోర్ట్ చేస్తాడు. ఇక జానకి కలగనలేదు సీరియల్ కు గత వారం కంటే ఈ వారం రేటింగ్స్ మరింత పెరిగాయి. 6.72 రేటింగ్ తో గత వారం మంచి క్రేజ్ అందుకుంటోంది. నేడు ప్రసారం కాబోయే 621 వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం..
కఠినమైన శిక్షణ తీసుకుంటు:జానకి ఐపీఎస్ శిక్షణ కోసం హైదరాబాద్ కు వెళుతుంది. ఇక ఆమె వెళ్లినప్పటి నుంచి రామ చాలా బాధలో ఉంటాడు. దాదాపు 11 నెలలు విడిచి ఉండాలి అని బాధలోనే సరిగా భోజనం కూడా చేయడు. ప్రతీక్షణం ఆమె గురించే ఆలోచిస్తూ ఉంటాడు. ఇక జానకి మరోవైపు ఐపీఎస్ ట్రైనింగ్ లో కఠినమైన శిక్షణ తీసుకుంటు ఉంటుంది. అక్కడ ఫ్యామిలీ గురించి ఎలాంటి ఎమోషన్స్ కూడా పెట్టికోవద్దని బలంగా ఇక్కడ ఒక ఐపీఎస్ ఆఫీసర్ గా సిద్ధం కావాలి అని అక్కడ ట్రైనింగ్ ఆఫీసర్లు చెబుతారు. కానీ రామ మాత్రం జానకి గురించే ఎక్కువగా ఆలోచోస్తూ ఉంటుంది.

ఎవరితో సరిగ్గా మాట్లాడకుండా..:ఇక మరోవైపు రామచంద్ర ఇంట్లోనే బాధపడుతూ కూర్చుంటాడు. జానకి లేని లోటును అతను ఎంత మాత్రం మర్చిపోలేక సతమతమవుతుంటాడు. ఇక జానకి ఆలోచనలో పడి ఎవరితో సరిగ్గా మాట్లాడకుండా ఉంటాడు. ఇక తల్లి జ్ఞానాంబతో పాటు తండ్రి గోవిందరాజులు ఇద్దరు కూడా రామ పడుతున్న బాధను చూసి ఏం చేయాలో అర్థం కాదు. ఇక కొడుకు గురించి అలా ఆలోచిస్తున్న సమయంలో ఒక వ్యక్తి ఇంటికి వస్తాడు. మాకు స్వీట్స్ ఆర్డర్ చేయాలి అని రేపు మా ఇంట్లో మా మనవడి భారసాలు ఉన్నాయని రేపు సాయంత్రానికి స్వీట్స్ ఆర్డర్ చేయాలి అమీ అంటాడు. ఇక రామచంద్ర అందుకు ఒప్పుకుంటాడు. ఇక అతను అడ్వాన్స్ కూడా ఇస్తాడు. రామ తప్పకుండా రెడీ చేస్తావు కదా అని ఆ వ్యక్తి మరిమరి అడుగుతాడు.

రామపై జ్ఞానాంబ సీరియస్:ఇక జ్ఞానాంబ కలుగజేసుకొని అడ్వాన్స్ కూడా ఇచ్చారు కదా తప్పకుండా మీకు రావాల్సిన ఆర్డర్ వస్తుంది అని అతనికి చెబుతారు. ఇక అతను హ్యాపీగా లిస్ట్ ఇచ్చి వెళ్ళిపోతాడు. ఇక రామ నీరసంగా ఉండడంతో ఆర్డర్స్ చేయగలవా అని ఎందుకు అలా ఉన్నవాని అడుగుతారు. దీంతో మలయాళం వచ్చి జానకి అమ్మ గారు వెళ్లిపోయినప్పటి నుంచి సరిగ్గా భోజనం కూడా చేయడం లేదని చెప్పడంతో తల్లి జ్ఞానాంబ సీరియస్ అవుతుంది. రామ నువ్వు ఇలా ఉండడం కరెక్ట్ కాదని ఇలా బాధగా ఉంటే నేను అసలు మాట్లాడను అని అంటుంది. అలా ఏమీ లేదమ్మా తింటాను అని చెబుతాడు. ఇక జానకి మరోవైపు తన లక్ష్యం గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అయితే అక్కడ అకాడమీ సెంటర్ లో ఒక ఛాంపియన్ ట్రోపీ ఉంటుంది.

మాట తీసుకున్న జ్ఞానాంబ:ఒక అమ్మాయి దాన్ని చూస్తూ నేనే తప్పకుండా దాన్ని సాధిస్తాను అని బ్యాచ్ టాపర్ గా ఉండాలి అని పొగరుగా మాట్లాడుతుంది. అంతే కాకుండా టాప్ లో నిలబడితే మనకు నచ్చిన చోట పోస్టింగ్ ఇస్తారని కూడా అంటుంది. ఇక జానకి ఆ ట్రోఫీ చూసి తన గతాన్ని గుర్తు చేసుకుంటుంది. అత్తగారికి గతంలోనే జానకి మాట ఇస్తుంది. ఎందుకంటే ఐపీఎస్ ట్రైనింగ్ తీసుకున్న తరువాత ఎక్కడెక్కడో పోస్టింగ్స్ పడతాయి. నువ్వు ఇంటి నుంచి వెళ్లిపోతే ఇల్లు నాలుగు ముక్కలు అవుతుంది. ఈ ఇంటి బాధ్యత పూర్తిగా నీ చేతుల్లోనే ఉంది. కాబట్టి నువ్వే బాధ్యత తీసుకొని ఈ ఫ్యామిలీని కలిసి ఉండేలా చూసుకోవాలి అని చెబుతుంది.

జానకి జ్ఞాపకంలో రామ:ఇక అందుకు అత్త గారికి జానకి మాట ఇస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో అలా జరగదు అని మన ఊర్లోనే ఉండే విధంగా ఉద్యోగం సంపదిస్తాను అని జానకి గతంలో మాట ఇస్తుంది. ఇక బ్యాచ్ లో అందరికంటే టాప్ పొజిషన్ లోకి రావాలని జానకి అనుకుంటుంది. ఇక మరోవైపు జానకి కోసం రామ ఆలోచిస్తూ ఉంటాడు. ఆమె చీరను చూస్తూ గతంలో ఆమెతో గడిపిన ఆనంద క్షణాలను తలచుకుంటూ ఉంటాడు. ఇక జానకి కూడా భర్త గురించి ఆలోచిస్తోంది. కానీ పరిస్థితులు అక్కడ కఠినంగా ఉంటాయి.

జెస్సి విషయంలో మల్లిక మాటలు:ఇక ఆమె అక్కడ టైమ్ టేబుల్ ఫాలో అవ్వాలని ఆఫీసర్లు చెబుతారు. కనీసం రామచంద్రజు ఫోన్ చేసి అవకాశం కూడా దొరకదు. ఇక రామ సైతం జానకికి ఫోన్ చేయాలని అనుకుంటాడు కానీ ఆమె బిజీగా ఉంటుందేమో అని ఫోన్ చేయడానికి వెనుకడుగు వేస్తాడు. ఇక మరోవైపు జెస్సి అత్తగారితో మాట్లాడాలని అనుకుంటుంది. అఖిల్ చేసే ఉద్యోగం వలన ఖర్చులు ఏమాత్రం సరిపోవడం లేదని అందుకే నేను బ్యూటీ పార్లర్ పెట్టాలని అనుకుంటున్నట్లు అత్తగారికి చెబుతుంది. కానీ అప్పుడే మల్లిక మల్లిక వచ్చి జోక్యం చేసుకుంటుంది. జెస్సి మాత్రమే కాదు తాను కూడా ఆమెతో తోడుగా ఉంటాను అంటుంది. మరి ఆమె మాటలకు జ్ఞానాంబ ఏ విధంగా రియాక్ట్ అవుతుందో చూడాలి.


Click it and Unblock the Notifications











