Janaki Kalaganaledu July 5th: జెస్సి బిజినెస్ తో మల్లిక న్యూ ప్లాన్.. జానకి, రామ తియ్యని జ్ఞాపకాలు!
జానకి కలగనలేదు సీరియల్ ఆకట్టుకునే ఎమోషన్స్ తో ఎంతో ఆసక్తిగా కొనసాగుతోంది. ఐపీఎస్ కావాలని అనుకున్న జానకి కానిస్టేబుల్ కావాల్సి వస్తుంది. ఇక మరోసారి ఐపీఎస్ పరీక్షలు రాసి తన కలను నిజం చేసుకోవాలి అని అనుకుంటుంది. ఇక పోలీస్ స్టేషన్లో అక్కడ ఆమెకు ఎస్ఐ మనోహర్ నుంచి ఇబ్బందులు ఎదురవుతాయి. ఇక భర్త రామ ఆమెకు సపోర్ట్ చేస్తాడు. ఇక జానకి కలగనలేదు సీరియల్ కు గత వారం కంటే ఈ వారం రేటింగ్స్ మరింత పెరిగాయి. 6.72 రేటింగ్ తో గత వారం మంచి క్రేజ్ అందుకుంటోంది. నేడు ప్రసారం కాబోయే 623 వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం..
వ్యాపారం స్టార్ట్ చేయాలని..:అఖిల్ భార్య జెస్సి ఎలాగైనా సొంతంగా బిజినెస్ పెట్టుకోవాలని అనుకుంటుంది. అందుకే ముందుగా తన భర్త సలహా కూడా తీసుకుంటుంది. ఎక్కడైనా బ్యూటీ పార్లర్ పెట్టుకొని సొంతంగా డబ్బులు సంపాదించుకోవాలని ఆమె అనుకుంటుంది. ఇక అదే విషయాన్ని అత్తమామలతో కూడా చెబుతుంది. ఇంట్లో తన భర్త జీతం ఏ మాత్రం సరిపోవడం లేదు అని ఎప్పుడూ ఏదో ఒక ఖర్చు వస్తుంది అని చెప్పిన జెస్సి నేను కూడా వ్యాపారం చేద్దామని అనుకుంటున్నాను అని అంటుంది. అయితే ఇంతలో మల్లిక వచ్చి మరో లింకు పెడుతుంది. అసలు జెస్సికి నేనే ఈ విధంగా సలహా ఇచ్చాను అని మేము ఇద్దరం కలిసి ఆ బిజినెస్ చేస్తామని చెబుతుంది. ఇక ఆమె మాట్లాడిన విధానానికి జెస్సి ఆశ్చర్యపోతోంది. కానీ మల్లిక మాత్రం తనకు కూడా ఈ ఇంట్లో వాల్యూ పెరగాలి అని ఆ విధంగా జెస్సికి తానే చెప్పినట్లుగా ఆమె మాట్లాడుతూ ఉంటుంది.

గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన జ్ఞానాంబ:అయితే గోవిందరాజులు మొదట ఈ విషయంలో అభ్యంతరం చెప్పినప్పటికీ ఆ తర్వాత అత్తగారు గ్రీన్ సిగ్నల్ ఇస్తారు. వారు ఇష్టపూర్వకంగా చేస్తానని అంటున్నారు కదా చేసుకొనివ్వండి అని అంటుంది. మీ పిల్లలను నేను చూసుకుంటాను అని ఆమె చెప్పడంతో మల్లిక సంతోషిస్తుంది. అయితే జెస్సి మాత్రం మల్లికను ప్రశ్నించాలని అనుకున్నప్పటికీ ఆమె సమయం ఇవ్వదు. లోపలికి వెళ్ళిపోతుంది. ఇక మరోవైపు ఐపీఎస్ ట్రైనింగ్ సెంటర్లో జానకి అందరితో కూడా ఫ్రెండ్లీగా ఉండాలని అనుకుంటుంది. ఇక ఆమె లంచ్ సమయంలో పొగరుగా ఉన్నావు ఒక అమ్మాయి దగ్గరికి వెళ్లి కూర్చోవాలని అనుకుంటుంది. కానీ ఆమె జానకిని పక్కన కూర్చొనివ్వదు. ఇక మరో పక్కన మైత్రి అనే మరో అమ్మాయి జానకిని పిలిపించి మాట్లాడుతుంది.

స్వీట్స్ జ్ఞాపకాలలో జానకి:వాళ్ళిద్దరూ కూడా చాలా సరదాగా మాట్లాడుకుంటారు. అలాగే మరొక తమిళ్ వ్యక్తి కూడా వారితో కలిసి సరదాగా మాట్లాడుతుంటాడు. ఇక ఐపీఎస్ విక్రమ్ సార్ మాట్లాడిన స్పీచ్ అద్భుతంగా అనిపించింది అని జానకి అంటుంది. అయితే స్వీట్స్ గురించి మాట్లాడుకుంటూ ఉండగా జానకికి తన భర్త గుర్తుకు వస్తాడు. రామచంద్ర గతంలో జానకి కోసం ప్రత్యేకంగా చేసిన స్వీట్స్ తినిపిస్తాడు. అదే విషయాన్ని జానకి గుర్తు చేసుకుంటుంది. జానకి అవే తీయగా ఉన్నాయని అన్నప్పటికీ రామచంద్ర మొదట ఒక స్వీట్ తిని అసలు బాగోలేవు అని అంటాడు. అయితే వెంటనే జానకి తిన్న మరొక స్వీటు తినడంతో ఇవి చాలా తీయగా ఉన్నాయని మీ పెదాలు తాగితే ఏదైనా చాలా తియ్యగా అవుతుంది అని చెబుతాడు. ఇక అదే విషయాన్ని గుర్తు చేసుకున్న జానకి ఆనందంగా నవ్వుకుంటూ ఉంటుంది.

అసలు విషయం తేల్చాలని..:ఇక తన భర్త గురించి ఆమె తోటి స్నేహితురాలితో మాట్లాడుతుండడంతో అప్పుడే పొగరుగా ఉన్న మరొక అమ్మాయి వచ్చి ఇక్కడ ఐపిఎస్ ట్రైనింగ్ సెంటర్లో బంధాలు భర్తల గురించి ఆలోచించకూడదు అని ఇన్ డైరెక్ట్ గా సెటైర్ వేస్తుంది. ఇక జానకి మళ్ళీ సైలెంట్ అవుతుంది. ఇక మరోవైపు ఇంటిదగ్గర జెస్సి మల్లికతో అసలు విషయం తేల్చాలని అనుకుంటుంది. అసలు నేను నీతో ఎప్పుడు వ్యాపారం చేస్తాను అని చెప్పాను. ఎందుకు అత్తమ్మ గారితో అలా మాట్లాడావు అని మల్లికను అడుగుతుంది. దీంతో మల్లిక ఓపెన్ అవుతుంది. ఓవైపు జానకి ఐపీఎస్ ట్రైనింగ్ కి వెళ్ళింది. ఇప్పుడు నువ్వు బ్యూటీ పార్లర్ పెట్టి బిజినెస్ చేస్తాను అంటున్నావు. ఇక ఖాళీగా ఉన్నది నేను మాత్రమే. ఇప్పుడు నా పరువు నిలబడాలి అంటే నేను కూడా ఏదో ఒకటి చేయాలి కదా అని ఆమె జెస్సి కి ముఖం మీద చెబుతుంది.

ఏమీ అనలేని పరిస్థితుల్లో..:ఇక చివరికి మల్లికా చేస్తే నువ్వు నాతో బిజినెస్ చెయ్ లేకపోతే సైలెంట్ గా కూర్చో. లేదంటే నేను అత్తగారితో మీ బిజినెస్ జరగనివ్వకుండా చూస్తాను అని ఆమె హెచ్చరిక చేస్తుంది. దీంతో ఏమీ అనలేని పరిస్థితుల్లో జెస్సి కన్ఫ్యూజన్ లో ఉంటుంది. ఇక రామచంద్ర తన భార్య గురించి ఆలోచిస్తూ తన గదిలోనే ఉంటాడు. భోజనానికి పిలిచినా కూడా అతను రాడు. ఇక గోవిందరాజులు తన భార్య జ్ఞానాంబను పిలిచి పెద్ద కొడుకు సరిగ్గా భోజనం చేయడం లేదని, వెంటనే నువ్వే పిలిపించి తినిపించు లేదంటే గోరు ముద్దలు పెట్టాలని అంటాడు. జ్ఞానాంబ కూడా అదే తరహాలో వెళ్లి కొడుకుతో మాట్లాడుతూ ఉంటుంది.

మీ ఆయన టెన్షన్ పెడుతున్నాడు:నువ్వు భోజనం చేస్తావా చేయవా అని గట్టిగా అడుగుతుంది. అయితే జానకి గారు ఫోన్ చేస్తారేమో అని ఎదురుచూస్తున్నాను అని అంటాడు. రక జ్ఞానాంబ అతన్ని బలవంతంగా డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకువెళ్లి భోజనం పెడుతుంది. అయితే అప్పుడే జానకి ఫోన్ కాల్ వస్తుంది. ఇక రామచంద్ర వెంటనే వెళ్లి ఆ ఫోన్ తీసుకుంటాడు. సరదాగా మాట్లాడుతుండగా నేను ముందు అత్తయ్య గారితో మాట్లాడాలి అని జానకి చెబుతుంది. ఇక జ్ఞానాంబ ఇక్కడ అంతా బాగానే ఉన్నాము అని కాకపోతే మీ ఆయన టెన్షన్ పడుతున్నాడు అని చెబుతోంది. మరి ఆ విషయంలో జానకి భర్తతో ఎలా మాట్లాడుతుందో చూడాలి.


Click it and Unblock the Notifications











