Janaki Kalaganaledu June 10th: జ్ఞానాంబ తీరుపై ఆగ్రహంతో తిట్టేసిన గోవిందరాజులు.. అందరూ షాక్!

జానకి కలగనలేదు సీరియల్ ఆకట్టుకునే ఎమోషన్స్ తో ఎంతో ఆసక్తిగా కొనసాగుతోంది. ఐపీఎస్ కావాలని అనుకున్న జానకి కానిస్టేబుల్ కావాల్సి వస్తుంది. ఇక మరోసారి ఐపీఎస్ పరీక్షలు రాసి తన కలను నిజం చేసుకోవాలి అని అనుకుంటుంది. ఇక పోలీస్ స్టేషన్లో అక్కడ ఆమెకు ఎస్ఐ మనోహర్ నుంచి ఇబ్బందులు ఎదురవుతాయి.

ఇక భర్త రామ ఆమెకు సపోర్ట్ చేస్తాడు. ఇక జానకి కలగనలేదు సీరియల్ కు గత వారం కంటే ఈ వారం రేటింగ్స్ మరింత పెరిగాయి. 6.72 రేటింగ్ తో గత వారం మంచి క్రేజ్ అందుకుంటోంది. నేడు ప్రసారం కాబోయే 602 వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం..

Janaki Kalaganaledu Serial 2023 June 10th Episode 2023

అసలు నిజం తెలిసిందేమో అని: జానకి మళ్ళీ జీవితంలో తల్లి కాదు అనే నిజం తెలుసుకున్న రామచంద్ర చాలా బాధపడుతూ ఉంటాడు. ప్రతిక్షణం జానకి గురించి ఆలోచిస్తూ దీనంగా కనిపిస్తూ ఉంటాడు. ఇలాంటి పరిస్థితి జానకికి ఎందుకు వచ్చిందా దేవుడా అని అతను మనోవేదనకు గురి అవుతాడు. అయితే రామచంద్ర అలా బాధపడుతూ ఉండడంతో తండ్రి గోవిందరాజులు అతని తో మాట్లాడతాడు. అయితే కొడుకుకు తెలిసిన నిజం గురించి గోవిందరాజులు మాత్రం తెలియదు.

దీంతో పొరపాటున రామచంద్రకు అసలు నిజం తెలిసిందేమో అని ఆయన కంగారు పడతారు. ఇక వెళ్లి రామతో ఈ విధంగా మాట్లాడతాడు. నువ్వు జానకి విషయంలో చాలా తప్పుగా ఆలోచిస్తున్నావు అని, అది కరెక్ట్ కాదు అని చెబుతాడు. జానకి ఐపిఎస్ అవ్వాలని అనుకుంటోంది. ఇక ఇప్పుడు ఆమెకు పిల్లలు కావాలి అని అనుకోవడం కూడా చాలా తప్పు. అర్థం చేసుకొని వెళ్ళాలి అని గోవిందరాజులు చెబుతాడు.

Janaki Kalaganaledu Serial 2023 June 10th Episode 2023

జానకి నిద్రిస్తున్న సమయంలో: ఆ దేవుడు ఎప్పుడు ఏది ఎలా చేయాలి అనుకుంటే అలా చేస్తాడు అని గోవిందరాజులు చెప్పడంతో కొడుకు రామచంద్ర కూడా అందుకు సరే అని అక్కడి నుంచి సైలెంట్ గా వెళ్ళిపోతాడు. ఇక వారు అలా మాట్లాడుకుంటూ ఉంటున్న తరుణంలో తల్లి జ్ఞానాంబ కూడా చాలా బాధపడుతూ ఉంటుంది. అయితే ఎలాగైనా సరే జానకి మాత్రం వీలైనంత తొందరగా తల్లి కావాలని అనుకుంటుంది. కానీ ఆమెకు అసలు నిజం మాత్రం తెలియదు.

ఇక జానకి నిద్రిస్తున్న సమయంలో కూడా తనకు పిల్లలు పుట్టరు అనే విషయాన్ని గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఉంటుంది. రామచంద్ర కూడా ఆదే ఆలోచనతో కనిపిస్తాడు. ఇక ఈ తరుణంలో జ్ఞానాంబ ఊహించిన విధంగా ఒక నిర్ణయం తీసుకుంటుంది. జానకికి త్వరగా కడుపు పండాలి అని అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది.

Janaki Kalaganaledu Serial 2023 June 10th Episode 2023

అత్తగారి మాటకు ఎదురు చెప్పకుండా: అలాగే మరొక మందు కూడా ఇస్తుంది. ఇది తాగితే తొందరగా తల్లి అవుతారు అని ఆమె చెబుతుంది. అయితే జానకి మాత్రం అత్తగారి మాటకు ఎదురు చెప్పకుండా ఇది తాగితే ఏం జరుగుతుందో అని అసలు నాకు పిల్లలు పుట్టారు అనే విషయం అత్తగారికి ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు అని ఆమె తనలో తానే బాధపడుతూ ఉంటుంది.

అయితే ఆ సమయంలోనే గోవిందరాజులు వచ్చి తన భార్య జ్ఞానాంబపై చాలా సీరియస్ అవుతాడు. జానకి మందు తాగుతూ ఉండగా దాన్ని తీసి పారేస్తాడు. అసలు నీకు బుద్ధి ఉందా ఎందుకు ఇలా పిచ్చిగా ప్రవర్తిస్తున్నావ్ అంటూ భార్యపై కోపంగా మాట్లాడుతాడు. నేను ఏం చేశాను అని ఆమె అడగడంతో ఏదైనా జానకి మంచి గురించి ఆలోచిస్తాను అని ఆమెకు కడుపు పండగానే అని ఆలోచనతో ఈ మందు ఇచ్చాను అని చెబుతుంది.

Janaki Kalaganaledu Serial 2023 June 10th Episode 2023

తొందరపాటు నిర్ణయాలతో: నువ్వు చేసేది ఎంత మాత్రం కరెక్ట్ కాదు అని మొన్ననే కదా డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళావు మందులు వేసుకుంటుంది కదా వాటిని కాస్త పనిచేయనివ్వు.. నువ్వు అనుకున్నప్పుడే తొందరగా కడుపు పడాలి అంటే సాధ్యం కాదు కాస్త సమయం ఇవ్వు అని ఇలా తొందరపాటు నిర్ణయాలతో మరింత తప్పులు చేయకు అని కోప్పడతాడు.

దీంతో జ్ఞానాంబకు అలా భర్త ఎందుకో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడో కాసేపు అర్థం కాదు. ఇక జానకిని అడుగుతుంది నేను నిన్ను ఏమైనా ఇబ్బంది పెడుతున్నానా అంటూ జానకిని ప్రశ్నిస్తుంది. ఇక ఆమె అలాంటిదేమీ లేదు అని మామ గారికి సర్ది చెప్పే ప్రయత్నం చేస్తుంది. కానీ గోవిందరాజులు మాత్రం జానకి మాటలను పట్టించుకోడు. ఆమెను అర్థం చేసుకుని ఆమెకు సహాయం చేయాలని అనుకుంటాడు.

Janaki Kalaganaledu Serial 2023 June 10th Episode 2023

ఒంటరిగా కూర్చుని బాధపడుతూ: ఇక బాధతో జ్ఞానాంబ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అనంతరం ఒంటరిగా కూర్చుని బాధపడుతూ ఉంటుంది. కొడుకు వచ్చి తల్లి ఒళ్ళో పడుకోవాలని అనుకుంటాడు. కానీ ఆమె మాత్రం అసహనంతో వెళ్లి మీ నాన్న దగ్గర పడుకొని మీ అమ్మ గురించి ఆయనకు చెప్పు అని అంటుంది. నాకు నీ ఒడిలోనే పడుకోవాలని ఉంది అని రామచంద్ర చెబుతాడు. కానీ ఆమెకు మాత్రం సంతోషంగా కనిపించదు. ఇక ఈ తరుణంలో ఇంట్లో అందరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు జానకి భవిష్యత్తు ఎలా ఉంటుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X