Janaki Kalaganaledu June 12th: జానకిపై మరోసారి మల్లిక అనుమానం.. ఆ నిజం తెలుసుకోవాలని ప్రయత్నం!
జానకి కలగనలేదు సీరియల్ ఆకట్టుకునే ఎమోషన్స్ తో ఎంతో ఆసక్తిగా కొనసాగుతోంది. ఐపీఎస్ కావాలని అనుకున్న జానకి కానిస్టేబుల్ కావాల్సి వస్తుంది. ఇక మరోసారి ఐపీఎస్ పరీక్షలు రాసి తన కలను నిజం చేసుకోవాలి అని అనుకుంటుంది. ఇక పోలీస్ స్టేషన్లో అక్కడ ఆమెకు ఎస్ఐ మనోహర్ నుంచి ఇబ్బందులు ఎదురవుతాయి. ఇక భర్త రామ ఆమెకు సపోర్ట్ చేస్తాడు. ఇక జానకి కలగనలేదు సీరియల్ కు గత వారం కంటే ఈ వారం రేటింగ్స్ మరింత పెరిగాయి. 6.72 రేటింగ్ తో గత వారం మంచి క్రేజ్ అందుకుంటోంది. నేడు ప్రసారం కాబోయే 603 వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం..
జానకి కడుపు త్వరగా పండాలని: జానకి విషయంలో అత్తగారు జ్ఞానాంబ తీసుకునే కొన్ని నిర్ణయాలు గోవిందరాజులుకు చాలా ఆగ్రహాన్ని తీసుకువస్తూ ఉంటాయి. జానకి అసలే తన కడుపు పోయిన బాధలో ఉంటుంది కానీ ఆ నిజం తెలియక అత్తగారు ఆమెకు త్వరగా కడుపు పండాలి అని అనేక రకాల ప్రయోగాలు చేస్తూ ఉంటుంది. ముఖ్యంగా డాక్టర్ కి చూపించిన తర్వాత జానకి కడుపు త్వరగా పండాలి అని ఆమె ఒక పసరు మందు ఇవ్వడానికి కూడా సిద్ధమవుతుంది. కానీ అలాంటివి ఇవ్వకూడదు అని గోవిందరాజులు సీరియస్ అవుతాడు. అయితే అలా తన భర్త ఎందుకు సీరియస్ అవుతున్నాడో అర్థం కాని పరిస్థితిలో ఆమె చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక రామచంద్ర వచ్చి తల్లి ఒళ్లో పడుకుంటాడు.

తల్లితో ప్రేమగా మాట్లాడిన రామ: కానీ అప్పుడు జ్ఞానాంబ కోపంగానే ఉంటుంది. నేను జానకిని చాలా ఇబ్బంది పెడుతున్నాను అని మీ నాన్నగారు నా మీద కోప్పడుతున్నారు. నాకు ఎవరు అవసరం లేదు అంటూ ఆమె మీ నాన్నగారు ఒడిలో పడుకో అని కాస్త కోపంగా చెబుతుంది. కానీ రామచంద్ర మాత్రం తల్లి ఒడిలో పడుకునే హక్కు తన బిడ్డకు ఉంది అని ప్రేమగా మాట్లాడుతుంటాడు. అయినా కూడా జ్ఞానాంబ కాస్త కోపంగా కనిపించడంతో రామచంద్ర కింద పడిపోయినట్లుగా నాటకం ఆడుతాడు. దీంతో మళ్ళీ ఆమె వెంటనే తన తల్లి ప్రేమను చూపిస్తుంది. అయితే జానకి విషయంలో నేను నిజంగా తప్పు చేస్తున్నానంటూ మీ నాన్నగారు నన్ను అనవసరంగా తిడుతున్నారు అని జ్ఞానాంబ చెబుతుంది.
ఆలోచించాల్సిన అవసరం లేదని..: అయితే జానకి విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం కరెక్ట్ కాదు అని కూడా రామచంద్ర చెబుతాడు. నువ్వు కూడా మీ నాన్న లాగా మాట్లాడుతున్నావు ఏమిటి అని ఆమె అంటుంది. అయినప్పటికీ రామచంద్రా జానకి గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదని తన నిర్ణయాన్ని తనకే వదిలేయాలి అని రామచంద్ర చెబుతాడు. ఇక రామచంద్ర ఆ మాటలు కూడా సైలెంట్ అయిపోతుంది. ఇక జానకి తల్లి కొడుకుల మాట్లాడుకున్న విధానాన్ని చూసి బాధపడుతుంది. అత్తగారికి ఎలా చెప్పాలో తెలియక ఆమె తనలో తానే ఎంతగానో బాధపడుతూ ఉంటుంది.

మళ్ళీ నీకు ఏమైనా అయితే..: ఇక గోవిందరాజులు వచ్చి జానకిని ఓదార్చే ప్రయత్నం చేస్తాడు. నువ్వు నాకు ఒక కూతురు లాంటిదానివి అని మీ బాధ నాకు అర్థమవుతుంది అని అతను చెబుతాడు. నువ్వు కడుపు పోయిన బాధతో ఎంతగా బాధపడుతున్నావో నేను అర్థం చేసుకోగలను. ఆ పసరు మందు కారణంగా మళ్ళీ నీకు ఏమైనా అయితే చూస్తూ ఊరుకోలేను. మీ అత్తయ్య తొందరపాటు ప్రేమలో ఏదో ఒక పొరపాటు చేయవచ్చు. అందుకే నేను ఆ విధంగా సీరియస్ కావాల్సి వచ్చింది అని అంటాడు. అయితే అత్తయ్య గారి మనస్తత్వం అంత ఈజీగా మారదు అని ఈ బాధ నుంచి ఆమె బయటపడాలి అంటే మల్లికకు కొడుకు లేదా పాప ఎవరో ఒకరు పుట్టే వరకు ఓపిక పట్టాలి అని జానకి అంటుంది. ఆ తర్వాత మనవడు మనవరాళ్ళాతో ఆమె ఆడుకుంటూ నా గురించి మర్చిపోతుంది అని ఆ తర్వాత అసలు విషయం చెబుతానని జానకి అంటుంది.
మల్లిక అనుమానాలు: అప్పటివరకు కూడా తెలియకుండా ఉంటేనే మంచిది అని కూడా ఆమె అడగడంతో గోవిందరాజులు కూడా అందుకు ఒప్పుకుంటాడు. అయితే పక్కనే వీరు మాట్లాడుకుంటున్న విధానాన్ని చూసి మల్లిక కాస్త అనుమానిస్తుంది. ఆమెకు పూర్తిస్థాయిలో విషయం అర్థం కాదు. కానీ ఏదో నిజం మాత్రం దాస్తున్నారు అని నా ప్రెగ్నెన్సీ తర్వాత చెబుతానని అంటున్నారు అది నాకు అర్థమవుతుంది. వెంటనే ఆ నిజాన్ని తెలుసుకోవాలని మల్లిక ఆలోచిస్తూ ఉంటుంది. ఇక తన భార్య జ్ఞానాంబను ఓదార్చాలని గోవిందరాజులు బెడ్ రూమ్ లోకి వెళ్తాడు.

జానకికి ధైర్యం చెప్పిన జానకి: కానీ మొదట ఆమె భర్తతో మాట్లాడడానికి అంతగా ఆసక్తి అసలు చూపించదు. ఎవరు నా గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు అని ఉంటుంది. టాబ్లెట్స్ వేసుకోవాలి అని గోవిందరాజులు చెప్పినప్పటికీ కూడా అసలు మాటలు పట్టించుకోదు. దీంతో గోవిందరాజులు ఎమోషనల్ గా మాట్లాడుతూ ఉంటాడు. ఎవరు ఎన్ని రోజులు బ్రతుకుతామో తెలియదు కాబట్టి ఎవరి నిర్ణయాలు వాళ్ళు తీసుకోవాలి అని అనవసరంగా మన ఇష్టాల కోసం ఒకరిని బాధ పెట్టకూడదు అని అర్థమయ్యేలా చెబుతాడు. దీంత జ్ఞానాంబ అందుకు సరే అంటుంది. మరోవైపు జానకి తల్లి కాలేదేనే బాధలో ఉంటుంది. ఈ దురదృష్టం ఎవరికి రాకూడదు అని బాధపడుతూ ఉండడంతో రామచంద్ర ఓదార్చే ప్రయత్నం చేస్తాడు. అంతే కాకుండా నవ్వుల్లోకి తీసుకువస్తాడు. మరి జానకి భవిష్యత్తులో ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటుందో చూడాలి.


Click it and Unblock the Notifications











