Janaki Kalaganaledu June 13th: జ్ఞానాంబ ఇంట్లో మొదలైన మారో ఆనందం.. ఇంతలోనే మల్లిక ట్విస్ట్!

జానకి కలగనలేదు సీరియల్ ఆకట్టుకునే ఎమోషన్స్ తో ఎంతో ఆసక్తిగా కొనసాగుతోంది. ఐపీఎస్ కావాలని అనుకున్న జానకి కానిస్టేబుల్ కావాల్సి వస్తుంది. ఇక మరోసారి ఐపీఎస్ పరీక్షలు రాసి తన కలను నిజం చేసుకోవాలి అని అనుకుంటుంది. ఇక పోలీస్ స్టేషన్లో అక్కడ ఆమెకు ఎస్ఐ మనోహర్ నుంచి ఇబ్బందులు ఎదురవుతాయి. ఇక భర్త రామ ఆమెకు సపోర్ట్ చేస్తాడు. ఇక జానకి కలగనలేదు సీరియల్ కు గత వారం కంటే ఈ వారం రేటింగ్స్ మరింత పెరిగాయి. 6.72 రేటింగ్ తో గత వారం మంచి క్రేజ్ అందుకుంటోంది. నేడు ప్రసారం కాబోయే 604 వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం..

ఇంట్లో చెప్పకుండా మౌనంగా ఉన్న జానకి:జానకి తనకి పిల్లలు కలగలేరని చాలా కాలం నుంచి బాధపడుతూ ఉంటుంది. ఇక మొత్తానికి కడుపు పండిన సమయంలోనే ఒక ప్రమాదం కారణంగా తన కడుపులో బిడ్డను కోల్పోతుంది. అంతేకాకుండా వైద్యులు ఆమెకు పరీక్ష చేసిన తర్వాత అసలు నీకు ఈ జన్మలో పిల్లలు పుట్టరు అని చెప్పడంతో ఆమె మరింతగా బాధకు గురి అవుతుంది. అయితే ఆ విషయాన్ని మాత్రం ఆమె ఇంట్లో చెప్పకుండా మౌనంగా ఉంటుంది. చివరికి మామ గారికి చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. అయితే అత్తగారు మాత్రం జానకికి తప్పకుండా పిల్లలు కలగాలని కోరుకుంటూ ఉంటుంది. అయితే అత్తగారి ప్రేమను చూసిన జానకి ఆ నిజాన్ని చెప్పకుండా దాచేస్తుంది. ఎప్పుడైనా ఆమె పరిస్థితి బాగున్నప్పుడు చెప్పాలని అనుకుంటుంది. ఇప్పుడే చెబితే ఆమె తట్టుకోలేదు అని తన మామగారికి కూడా నిజం చెప్పవద్దని చెబుతుంది.

Janaki Kalaganaledu Serial 2023 June 13th Episode 604

జానకి ఐపిఎస్ ఆఫీసర్ కావాలి అని..:ఇక మామ గోవిందరాజులు కూడా కోడలికి ఎంతగానో సహకారం చేస్తూ ఉంటాడు. జానకి అత్తగారు ఇచ్చిన టాబ్లెట్స్ వేసుకోకుండా వాటిని పూల కుండీలో పడేస్తుంది. ఇక జానకి అంత హ్యాపీగా ఉంది అనుకుంటున్న సమయంలోనే రామచంద్ర కూడా ఆమెకు ఎంతగానో సహాయం చేస్తూ ఉంటాడు. జానకికి పిల్లలు పుట్టరు అనే విషయం రామచంద్ర కు తెలుసు. కానీ తనకు తెలిసినట్లు తెలిస్తే బాధపడుతుంది అని ఆమెకు అలానే చెప్పకుండా ఉంటాడు. ఇక జానకి ఐపిఎస్ ఆఫీసర్ కావాలి అని ఆమెను ఎప్పటికప్పుడు ఉత్తేజపరుస్తూ ఉంటాడు. ఇక జానకి కూడా భర్త చేస్తున్న సపోర్టుకు ఎంతగానో ఆనందపడుతుంది. భర్త కోరిక మేరకు మళ్ళీ మంచిగా చదివి ఐపీఎస్ కావాలని అనుకుంటుంది.

Janaki Kalaganaledu Serial 2023 June 13th Episode 604

మనవడితో ఆటలు:ఇక మరోవైపు మల్లికకు నెలలు నిండడంతో ఆమె కొన్ని విషయాల్లో అజాగ్రత్తగా ఉంటుంది. దీంతో భర్త విష్ణు అన్ని దగ్గరుండి చూసుకుంటూ ఉంటాడు. వాకింగ్ చేయాలి అని చెబుతూ ఉంటాడు. ఇక మల్లిక మాత్రం తిండి వైపు ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉంటుంది. దీంతో అదే ఫార్ములాతో విష్ణు ఆమెను చుట్టూ నడిపించేలా చేస్తాడు. ఇక జ్ఞానాంబ, గోవిందరాజులు ఇద్దరు కూడా అఖిల్ కొడుకుతో హ్యాపీగా ఆడుకుంటూ ఉంటారు. వీలు చిక్కినప్పుడల్లా ఇద్దరు కలిసి మనవడితో కలిసి నడుస్తూ ఉంటారు. ఇక వారిని చూసిన విష్ణు కూడా ఎంతగానో సంతోషిస్తాడు. ప్రత్యేకంగా ఇంట్లో కొన్ని పనులు కూడా తీసుకువస్తాడు. అయితే మొత్తానికి అఖిల్ జానకి పై ఉన్న కోపాన్ని తగ్గించుకుంటాడు.

Janaki Kalaganaledu Serial 2023 June 13th Episode 604

ఆనందంగా ఉంటున్న సమయంలో:దీంతో అతని భార్య జెస్సి కూడా ఎంతగానో ఆనందపడుతుంది. అంతా ఇంట్లో అందరూ కూడా ఆనందంగా ఉంటున్న సమయంలో హఠాత్తుగా మల్లికకు డబ్బులు వస్తాయి. దీంతో వెంటనే ఇంటికి డాక్టర్ను పిలుస్తారు. ఇక వైద్యులు వచ్చి మీకు పండంటి ఆడపిల్ల పుట్టింది అని చెప్పడంతో అందరూ కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతారు. మల్లిక కూడా ఆనందంగా ఫీల్ అవుతుంది. అయితే నువ్వు ఏం పేరు పెడతావు అని విష్ణు ని అడిగినప్పుడు అమ్మ పేరు పెట్టుకుంటాను అని అతను చెబుతాడు. దీంతో మల్లికా కొంత ఆందోళన చెందుతుంది. ఆ తరువాత అందరూ కూడా చాలా సంతోషంగా పాపతో ఆడుకుంటూ ఉంటారు.

Janaki Kalaganaledu Serial 2023 June 13th Episode 604

జానకి గుట్టు బయటపెట్టేసిన మల్లిక:ఇక మరికొన్ని నెలలు గడవగానే మల్లిక కూతురికి అన్నప్రాసన జరిపిస్తారు. ఈ క్రమంలో అప్పుడే నీలవతి కూడా ఆ వేడుకకు వస్తుంది. ఇక మల్లికకు ఎప్పుడు ఏదోక అనుమానం కలిగేలా మాట్లాడుతూ ఉంటుంది. ఈసారి కూడా జానకితో అన్నప్రాసన ఏమాత్రం చేయించకు అని చెబుతుంది. ఇక మల్లిక కూడా అదే తరహాలో ఆలోచిస్తుంది. జానకి గొడ్రాలు అనేలా ఆమె చేయి మంచిది కాదని అంటుంది. మల్లిక బిడ్డకు జానకి అన్నం తినిపిస్తూ ఉండగా మల్లిక ఆపేస్తుంది. అన్నం ఎక్కువైతే పాపకు బాగుండదు అని చెబుతుంది. దీంతో జానకి కూడా ఏమీ అనకుండా సైలెంట్ గా బాధపడుతూ ఉంటుంది. ఇక ఆ తరువాత జానకి అసలు విషయం బయట పెట్టాలి అని మల్లిక అనుకుంటుంది. మీరు రోజు జానకికి టాబ్లెట్స్ ఇస్తున్నారు కానీ ఆమె మాత్రం వాటిని వేసుకోకుండా బయట పాడవేస్తోంది అని మల్లికా అత్తగారికి చూపిస్తుంది. దీంతో జ్ఞానాంబ షాక్ అవుతుంది. మరి వాటిని చూసిన తర్వాత ఆమె జానకి పై ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X