Janaki Kalaganaledu June 15th: నిజం చెప్పే సమయంలో రామచంద్ర షాకింగ్ ట్విస్ట్.. జానకి షాక్

జానకి కలగనలేదు సీరియల్ ఆకట్టుకునే ఎమోషన్స్ తో ఎంతో ఆసక్తిగా కొనసాగుతోంది. ఐపీఎస్ కావాలని అనుకున్న జానకి కానిస్టేబుల్ కావాల్సి వస్తుంది. ఇక మరోసారి ఐపీఎస్ పరీక్షలు రాసి తన కలను నిజం చేసుకోవాలి అని అనుకుంటుంది. ఇక పోలీస్ స్టేషన్లో అక్కడ ఆమెకు ఎస్ఐ మనోహర్ నుంచి ఇబ్బందులు ఎదురవుతాయి.

ఇక భర్త రామ ఆమెకు సపోర్ట్ చేస్తాడు. ఇక జానకి కలగనలేదు సీరియల్ కు గత వారం కంటే ఈ వారం రేటింగ్స్ మరింత పెరిగాయి. 6.72 రేటింగ్ తో గత వారం మంచి క్రేజ్ అందుకుంటోంది. నేడు ప్రసారం కాబోయే 604 వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం..

Janaki Kalaganaledu Serial 2023 June 15th Episode 2023

నిందలు వేయడానికి ప్రయత్నం: అసలే పిల్లలు పుట్టడం లేదు అని జానకి ఎంతో బాధలో ఉంటుంది. ఇక ఆమెను ఎప్పుడు దెబ్బ కొట్టాలా అని తోడికోడలు మల్లిక కూడా చాలా ఆత్రుతగా ఎదురు చూస్తూ ఉంటుంది. ఏమాత్రం ఛాన్స్ దొరికినా కూడా ఆమెపై నిందలు వేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది.

తనకి ఒక యాక్సిడెంట్ కారణంగా అసలు పిల్లలు పుట్టే భాగ్యాన్ని కోల్పోతుంది. వైద్యులు కూడా ఆమెకు అదే విషయాన్ని చాలా క్లారిటీగా చెబుతారు. ఇక ఆ విషయాన్ని మాత్రం జానకి ఇంట్లో చెప్పకుండా దాస్తుంది. కేవలం తన మామగారు గోవిందరాజులకు మాత్రమే అసలు నిజం తెలుస్తుంది. భర్తకు కూడా తెలియకూడదు అనుకుంటుంది.

డాక్టర్ను బ్రతిమాలిన జానకి: ఇక అత్తగారు మాత్రం జానకి కడుపు త్వరగా పండాలి అని అనేక రకాలుగా ఆమె ప్రయత్నాలు చేయాలని కూడా అనుకుంటుంది. డాక్టర్ దగ్గరికి కూడా ప్రత్యేకంగా తీసుకు వెళుతుంది కానీ జానకి మాత్రం డాక్టర్ను బ్రతిమాలి ఆ నిజాన్ని కూడా దాచేస్తుంది.

ఇక జానకి డాక్టర్ ఇచ్చిన మందులు వేసుకుంటాను అని అత్తగారికి చెబుతుంది. కానీ ఆమె ప్రతిసారి కూడా ఆ మందులను తీసి ఒక కుండిలో పడేస్తుంది. అయితే జానకి అలా చేస్తున్న విధానానికి ఒక రోజు మల్లిక చూస్తుంది. ఇక వెంటనే ఆ విషయాన్ని అత్తగారికి చెప్పాలని అనుకుంటుంది. ఇక అత్తగారికి అలా చెప్పగానే ఆమె చాలా సీరియస్ అవుతుంది.

Janaki Kalaganaledu Serial 2023 June 15th Episode 2023

మీరంటే నాకు చాలా గౌరవం: అసలు నన్ను ఎందుకు మోసం చేశావు అని అని, ఐపిఎస్ కోసం నువ్వు అనుకున్న డ్రీం కోసం నా కొడుకు జీవితాన్ని నాశనం చేస్తున్నావని ఆమె చాలా సీరియస్ అవుతుంది. ముందే ఈ విషయాన్ని చెప్పి ఉంటే నేను అసలు నిన్ను ఇబ్బంది పెట్టేదాన్ని కాదు కదా అని ఆమె మరోసారి గట్టిగా మాట్లాడుతుంది.

అయితే జానకి మాత్రం ఏమీ మాట్లాడకుండా సైలెంట్ గా ఉండిపోతుంది. మీరంటే నాకు చాలా గౌరవం అని మిమ్మల్ని మోసం చేయాలని ఆలోచన నాకు ఎంత మాత్రం లేదు అని ఏడుస్తూ చెబుతుంది. ఇక గోవిందరాజులు మాత్రం జానకి బాధను చూసి చాలా ఆవేదన చెందుతాడు. ఇక గుండెల్లో ఆ బాధను అలా దాచుకోవడం కరెక్ట్ కాదు అని అసలు నిజాన్ని చెప్పాల్సిన సమయం వచ్చింది అని అంటాడు.

Janaki Kalaganaledu Serial 2023 June 15th Episode 2023

రామ్ ఊహించని ట్విస్ట్: కానీ జానకి మాత్రం ఆ నిజాన్ని చెప్పడానికి మొదట ఏమాత్రం ఒప్పుకోదు కానీ ఆ తర్వాత ఆమె అసలు నిజాన్ని చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఇక జానకి తనకు పిల్లలు పుట్టరు అనే విషయాన్ని చెప్పబోతుండగా అప్పుడే రామచంద్రా ఎంట్రీ ఇచ్చి ఊహించని ట్విస్ట్ ఇస్తాడు.

పిల్లలు జానకి గారి తప్పు ఏమి లేదు అని లోపం నాలో ఉంది అని చెప్పడంతో ఆమె ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇంట్లో వాళ్ళందరూ కూడా రామచంద్ర.. చూసి ఆశ్చర్యపోతారు ఇక జానకి మాత్రం భర్త ఇలా ఎందుకు చెబుతున్నాడో అర్థం కాని అయోమయంలో ఉంటుంది. ఇక రామచంద్ర తన తల్లికి కొన్ని విషయాలు చెప్పే ప్రయత్నం చేస్తాడు.

నాకు అభ్యంతరం లేదు: నా కారణంగా జానకి గారు నిజాన్ని దాచి ఎంతగానో బాధపడుతున్నారు. అది నాకు నచ్చడం లేదు అని ఎవరు నన్ను తక్కువ చూసినా నాకు అభ్యంతరం లేదు అయినా పిల్లలు పుట్టకపోవడం అనేది పెద్ద నేరం ఏమీ కాదు అని, మాకు పిల్లలు లేరు అని ఎవరు అన్నారు? నా తమ్ముడి ఇద్దరు పిల్లలు కూడా నా పిల్లలతో సమానమే మేము ఇలానే ఉంటాము అని రామచంద్ర చెబుతాడు. జానకిని లోపలికి రమ్మని పిలిచిన రామచంద్ర మాట్లాడే ప్రయత్నం చేస్తాడు.

ఇది అసలు కరెక్ట్ కాదు: అసలు మీరు ఎందుకు ఇలా అబద్దం చెప్పారు అని జానకి అడుగుతుంది. అయితే రామ్ అసలు నిజం చెబుతాడు. మీకు పిల్లలు పుట్టరు అనే విషయం నాకు తెలుసు అని ఇప్పుడు ఆ విషయం ఇంట్లో చెబితే మళ్ళీ అనవసరమైన గొడవలు జరుగుతాయి అని ముఖ్యంగా మల్లికా మిమ్మల్ని మరింత బాధ పెట్టే ప్రయత్నం చేస్తుంది అని అర్థమైంది. అందుకే ఈ అబద్ధం ఆడాల్సి వచ్చింది అని ఇది ఎవరికి నష్టపరిచే అబద్ధం అయితే కాదు అని అతను చెప్పడంతో జానకి ఏమాత్రం వినదు.

ఇది అసలు కరెక్ట్ కాదు అని నాకు జరిగిన దురదృష్టాన్ని మీరు భరించడం అనేది నేను ఎంత మాత్రం ఒప్పుకోను అని, ఆమె అసలు నిజం చెప్పాలని అనుకుంటుంది. కానీ రామచంద్ర మాత్రం జానకిని దగ్గరికి తీసుకొని బాధపడకండి అని ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తాడు. ఇక ఆమె వెనక్కి తగ్గుతుంది ఇక తర్వాత విష్ణు మల్లిగా తీరును చూసి కాస్త సంతృప్తి చెందుతాడు. ఇక జానకి రామచంద్ర తదుపరి విషయాల్లో ఎలా ఆలోచిస్తారో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X