Janaki Kalaganaledu June 16th: జానకి మనసు మార్చేందుకు రామ రొమాన్స్.. మరోసారి అవమానం!
జానకి కలగనలేదు సీరియల్ ఆకట్టుకునే ఎమోషన్స్ తో ఎంతో ఆసక్తిగా కొనసాగుతోంది. ఐపీఎస్ కావాలని అనుకున్న జానకి కానిస్టేబుల్ కావాల్సి వస్తుంది. ఇక మరోసారి ఐపీఎస్ పరీక్షలు రాసి తన కలను నిజం చేసుకోవాలి అని అనుకుంటుంది. ఇక పోలీస్ స్టేషన్లో అక్కడ ఆమెకు ఎస్ఐ మనోహర్ నుంచి ఇబ్బందులు ఎదురవుతాయి. ఇక భర్త రామ ఆమెకు సపోర్ట్ చేస్తాడు. ఇక జానకి కలగనలేదు సీరియల్ కు గత వారం కంటే ఈ వారం రేటింగ్స్ మరింత పెరిగాయి. 6.72 రేటింగ్ తో గత వారం మంచి క్రేజ్ అందుకుంటోంది. నేడు ప్రసారం కాబోయే 607 వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం..
ఇన్ని రోజులు జానకి మిమ్మల్ని మోసం చేస్తోంది : జానకికి పిల్లలు పుట్టారు అనే విషయం అత్తగారికి తెలియదు. కానీ ఆమె కోడలు వీలైనంత త్వరగా తల్లి అవ్వాలి అని తన కొడుక్కి సంతోషాన్ని ఇవ్వాలి అని అంటుంది. అంతేకాకుండా జానకిని ప్రత్యేకంగా హాస్పిటల్ కు తీసుకు వెళ్ళడమే కాకుండా ఆమెకు రోజు మందులు కూడా ఇస్తుంది. ఇక ఫైనల్ గా జానకి మాత్రం ఆ మందులు వేసుకోదు. ఇక ఆమె మందులు వేసుకోలేదు అని మల్లిక చూసి అత్తగారికి చెబుతుంది. ఇన్ని రోజులు జానకి మిమ్మల్ని మోసం చేస్తోంది అని చెప్పడంతో జ్ఞానాంబ ఒక్కసారిగా షాక్ అవుతుంది. వెంటనే జానకిని పిలిచి సీరియస్ గా అడుగుతుంది. ఇక లాభం లేదు అనుకొని ఫైనల్ గా నిజం చెప్పాలి అని జానకి అనుకుంటుంది. ఒక యాక్సిడెంట్ లో తనకు కడుపు పోయింది అని మళ్ళీ జీవితంలో పిల్లలు పుట్టరు అనే విషయం అత్తగారికి చెప్పాలని అనుకుంటుంది.

పిల్లలు అవసరం లేదు అని : కానీ అప్పుడే రామచంద్ర వచ్చి ఆ విషయాన్ని చెబితే మళ్ళీ తల్లి తట్టుకోలేదు అని లోపం జానకీలో లేదు అని తనలో మాత్రమే ఉంది అని చెబుతాడు. దీంతో మళ్ళీ అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు ఇక అందరూ ఏమీ మాట్లాడలేని పరిస్థితుల్లోనే ఉంటారు. రామచంద్ర తమకు పిల్లలు అవసరం లేదు అని అయినా నా తమ్ముడు పిల్లలు అందరూ కూడా నా పిల్లలు అని అనుకుంటాను అని చెప్పాడు. మరోసారి ఈ విషయంలో ఎవరూ కూడా తనతో గాని అలాగే జానకితో గాని మాట్లాడడానికి వీలు లేదు అని చెప్పడంతో తల్లి ఒక్కసారిగా సైలెంట్ అయిపోతుంది.
మీరు నాకు చంటి పాప : ఇక జానకి బాధపడుతూ ఉండడంతో రామచంద్ర ఆమెను ఒంటరిగా ఓదారుస్తూ ఉంటాడు. మీరు అసలు బాధ పడవద్దు అని ముందు మీ లక్ష్యంపై ఫోకస్ చేయాలని అంటాడు. అయినా మనకు పిల్లలు లేరు అని ఎవరు అన్నారు మీరు నాకు చంటి పాప నేను మీకు చంటి అబ్బాయిని అని చెబుతూ సరదాగా మాట్లాడుతుంటాడు. ఇక మరోవైపు జ్ఞానాంబ తో పాటు గోవిందరాజులు కూడా రామచంద్ర మాట్లాడిన విధానానికి ఆశ్చర్యపోతూ ఉంటారు. అసలు రామచంద్రకు నిజం ఎలా తెలిసింది అని గోవిందరాజులు కూడా కొంత ఆలోచనలు పడతాడు. అయితే మరోసారి కొడుకుతో మాట్లాడాలి అని తల్లి చెబుతూ ఉంటుంది.

జానకి ఒంటరిగా కూర్చొని బాధపడుతూ : ఏదైనా వైద్యం చేయిస్తే మార్పు ఉంటుందేమో అని ఒక్కసారి మాట్లాడండి అని భర్తతో జ్ఞానాంబ మాట్లాడుతూ ఉంటుంది. ఇక హాస్పిటల్ కి వెళ్ళినందుకే అతనిలో లోపం ఉంది అని తెలిసింది అంటున్నాడు కదా మళ్లీ ఇప్పుడు వెళ్లి ఆ విషయం గురించి అడిగి బాధ పెట్టడం కరెక్ట్ కాదు అని గోవిందరాజులు తన భార్యకు చెబుతాడు. ఇక మరోవైపు జానకి ఒంటరిగా కూర్చొని బాధపడుతూ ఉంటుంది. ఇంతలో అత్తగారు జ్ఞానాంబ వచ్చి ఆమెను ఓదార్చే ప్రయత్నం చేస్తారు. అంతేకాకుండా నేను మాట్లాడిన మాటలు నీకు తప్పుగా అనిపిస్తే క్షమించు అని పెద్దదానివి అయితే నీ కాళ్లు పట్టుకునే దాన్ని అంటుంది. కానీ కోడలు జానకి మాత్రం మీరు పెద్దవారు అని నాకు తల్లి లాంటి వారు అని అలాంటి మాటలు మాట్లాడకూడదు అని జానకి చెబుతుంది.

రొమాంటిక్ గా మాట్లాడిన రామ : ఇక వారిని చూసి రామచంద్ర కూడా బాధపడుతూ ఉంటాడు. ఇక తండ్రి గోవిందరాజులు వచ్చి నువ్వు బాధపడుతున్న విషయం నాకు తెలుస్తోంది అని చెప్పి అతనిని ఓదార్చే ప్రయత్నం చేస్తాడు. ఇక ఉదయాన్నే జానకి పొద్దు పొడిచిన కూడా లేవదు. దీంతో ఆమెను సరదాగా లేపాలని రామచంద్ర అనుకుంటాడు. భర్త కంటే ముందుగా భార్యలు నిద్రలేవాలి కానీ మీరు మాత్రం అలానే పడుకున్నారు. లేవండి మనం బయటకు వెళ్లాలి అని చెబుతాడు. కానీ జానకి అయినా కూడా లేవకపోవడంతో ఆమెను ఎత్తుకుంటాడు. అవసరమైతే మిమ్మల్ని సిద్ధం చేస్తాను అని అనడంతో చీర కూడా మారుస్తారా అని అడుగుతుంది. ఇక అంత అదృష్టం నాకు ఇస్తారా అని రామచంద్రం మళ్ళీ రొమాంటిక్ గా మాట్లాడుతూ ఉంటాడు.

మరోసారి అవమానపడిన జానకి : ఇక మరోవైపు చిన్న కుమారుడు అఖిల్ తన భార్యతో కూడా సరదాగా మాట్లాడుతూ ఉంటాడు. అతనిలో చాలా మార్పు వస్తుంది. అతను తండ్రి గురించి కూడా ఆలోచిస్తాడు. ఇక ఇంట్లో అందరూ హ్యాపీగా ఉంటున్న సమయంలో పక్కింటి నుంచి ఒక మహిళ వచ్చి జ్ఞానాంబ ను తన ఇంట్లో వ్రతం జరుగుతుంది అని దానికి రావాలి అని ఆహ్వానిస్తుంది. ఆమె కోడలు చేత బొట్లు కూడా పెట్టిస్తుంది. అయితే వారి కోడలు జానకికి బొట్టు పెడుతూ ఉండగా ఆమె ఒక్కసారిగా అడ్డుపడుతుంది. ఎవరికి పడితే వారికి బొట్టు పెట్టకూడదు అని పిల్లలు లేని వారికి అసలు పెట్టకూడదు అని ఆమె ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. దీంతో జానకీ ఒక్కసారిగా షాక్ అవుతుంది. మరి ఈ విషయంలో అత్తగారు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి


Click it and Unblock the Notifications











