Janaki Kalaganaledu June 19th: తండ్రిపై అఖిల్ ప్రేమ.. మరోసారి జానకిపై మల్లిక ఫోకస్!
జానకి కలగనలేదు సీరియల్ ఆకట్టుకునే ఎమోషన్స్ తో ఎంతో ఆసక్తిగా కొనసాగుతోంది. ఐపీఎస్ కావాలని అనుకున్న జానకి కానిస్టేబుల్ కావాల్సి వస్తుంది. ఇక మరోసారి ఐపీఎస్ పరీక్షలు రాసి తన కలను నిజం చేసుకోవాలి అని అనుకుంటుంది. ఇక పోలీస్ స్టేషన్లో అక్కడ ఆమెకు ఎస్ఐ మనోహర్ నుంచి ఇబ్బందులు ఎదురవుతాయి. ఇక భర్త రామ ఆమెకు సపోర్ట్ చేస్తాడు. ఇక జానకి కలగనలేదు సీరియల్ కు గత వారం కంటే ఈ వారం రేటింగ్స్ మరింత పెరిగాయి. 6.72 రేటింగ్ తో గత వారం మంచి క్రేజ్ అందుకుంటోంది. నేడు ప్రసారం కాబోయే 609 వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం..
ముందు మీ లక్ష్యం గురించి ఆలోచించాలి: జానకి ఎట్టి పరిస్థితుల్లోనూ ఐపీఎస్ ఆఫీసర్ కావాలని రామచంద్ర చాలా బలంగా కోరుకుంటు ఉంటాడు. ఇక ఆమె చదువుకోవడానికి అన్నవిధాలుగా కూడా సహకరిస్తూ ఉంటాడు. జానకి కడుపు పోగొట్టుకున్న బాధలో ఉన్నప్పటికీ ఆమెను ఆ బాధ నుంచి బయటకు తీసుకు వచ్చిన రామచంద్ర ముందు మీ లక్ష్యం గురించి ఆలోచించాలి అని గట్టిగా చెబుతాడు. ఇక భర్త చెప్పినట్లుగానే జానకి కూడా తన చదువు గురించి ఎంతో సీరియస్ గా ఆలోచిస్తూ ఉంటుంది. ఇక ఎలాంటి పనులు పెట్టుకోకుండా పూర్తిస్థాయిలో చదువుపై ఫోకస్ చేస్తుంది. ఇక ఆమెకు అన్న విధాలుగా ఇంట్లో పనివాడు మలయాళం సహకారం గా ఉంటాడు. అయితే మల్లిక మాత్రం జానకిని ఎప్పటిలానే డిస్టర్బ్ చేయాలని అనుకుంటూ ఉంటుంది.

ఇంతలోనే రామచంద్ర ఇంట్లోకి: ఇక ఆమె పాప ఏడుస్తూ ఉంది అని జానకి ఆడిస్తే బాగుంటుంది అని చెబుతుంది. మలయాళం అమ్మగారు చదువుకుంటున్నారు అని చెప్పినప్పటికీ కూడా మల్లికా చాలా సీరియస్ అవుతుంది. ఇక జానకి ప్రేమతోనే మల్లిక కూతురుని ఆడించి పడుకోబెట్టాలని అనుకుంటుంది. ఇక ఇంతలోనే రామచంద్ర ఇంట్లోకి వస్తాడు జానకి చాలా సీరియస్ గా చదువుకుంటుంది అని ఎంత మాత్రం డిస్టర్బ్ చేయకూడదు అని అనుకుంటాడు. అయితే అప్పుడే ఇంట్లోకి రాగానే జానకి మాత్రం చదువుకోకుండా మల్లికా కూతురుని ఎత్తుకొని ఉంటుంది. ఇక వెంటనే ఆమె దగ్గరికి వచ్చి నేను చెప్పింది ఏమిటి మీరు చేస్తుంది ఏమిటి అని అంటాడు. అయితే పాప ఏడుస్తోంది అని చెప్పడంతో నేను పడుకోబెడతానని ఇవ్వండి అంటూ మీరు వెళ్లి ముందు చదువుకోవాలి అని చెబుతాడు.

తండ్రి కోసం కొత్తగా చెప్పులు తీసుకొని..: ఇక జానకి భర్త చెప్పినట్లుగానే లోపలికి వెళ్లి చదువుకోవడానికి కూర్చుంటుంది. ఇక ఇంతలో మల్లిక భర్త విష్ణు వచ్చి పాపను తీసుకుని తన భార్య దగ్గరికి వస్తాడు. నువ్వు కావాలి అని జానకి వదినను డిస్టర్బ్ చేయకు అని మరోసారి ఇలా జరిగితే బాగుండదు అని హెచ్చరిస్తాడు. ఇక మరోవైపు చిన్న కొడుకు అఖిల్ తన తండ్రి కోసం కొత్తగా చెప్పులు తీసుకొని వస్తాడు. ఇంతకుముందు చాలాసార్లు తండ్రిపై సీరియస్ అయిన అఖిల్ ఈసారి తండ్రి పడుతున్న కష్టం చూసి తట్టుకోలేక పోతాడు. ఇక వెంటనే కొత్త చెప్పులు తీసుకుని తన తల్లికి ఇస్తాడు. నేను ఇస్తే బాగుండదు అని నాన్న ముందు కాస్త మొహం చెల్లడం లేదు అని నేను ఇంతకుముందు చాలా తప్పులు చేశాను అని చెబుతాడు ఇక తల్లి సహకారంతోనే అతను కొత్త చెప్పులు అక్కడే ఉంచుతాడు.

విష్ణు మాత్రమే చూసుకుంటూ ఉంటాడు.: ఇక జానకి విషయంలో మల్లిక కూడా చాలా సీరియస్ గా ఆలోచిస్తూ ఉంటుంది. అసలు జానకి తన కడుపు విషయంలో ఏదో దాస్తోంది అని అనవసరంగా ఆ నిందను రామచంద్ర తనపై వేసుకోవడం ఏదో అనుమానంగా ఉంది అని ఆలోచిస్తుంది. అయితే పాప ఏడుస్తున్నప్పటికీ కూడా విష్ణు మాత్రమే ఆమెను చూసుకుంటూ ఉంటాడు. ఇక మల్లికకు చెప్పినప్పటికీ ఆమె సీరియస్ అవుతుంది. పాప బాధ్యత ఇకనుంచి నీదే అని ఎంత మాత్రం ఈ విషయంలో వెనక్కి తగ్గేది లేదు అని చెబుతుంది. అయినప్పటికీ విష్ణు మల్లిక ఒడిలోనే పాపను పెట్టి వెళ్లిపోతాడు. ఇక గోవిందరాజులు ఇంతలోనే బయటకు వస్తాడు. అయితే అక్కడ తన చెప్పులు కనిపించకపోవడం చూస్తాడు.

గోవిందరాజులు ఎమోషనల్ మూమెంట్ : తన పాత చెప్పులు ఏవి అని ఇక్కడ ఎవరో కొత్త చెప్పులు పెట్టారు అని అంటాడు. ఇక వెంటనే భార్య జ్ఞానాంబ అసలు విషయం చెబుతుంది. మీకోసం మీ కొడుకు ప్రేమతో కొత్త చెప్పులు తెరుసుకొచ్చాడు అని వాటిని వేసుకోవాలి అని చెప్పడంతో అతను కూడా ఒక్కసారిగా ఎమోషనల్ అవుతాడు. నాకే ఇవ్వచ్చు కదా అని అన్నప్పుడు మీరంటే వాడికి భయం అని, కానీ చాలా ప్రేమ ఉంది అని చెబుతోంది. ఇక అఖిల్ మారిన విధానాన్ని గమనించిన అతని భార్య జెస్సి చాలా ఎమోషనల్ అవుతుంది. మరోవైపు రామచంద్ర జానకి నిదురపోతుంటే ఆమెను లేపడానికి ప్రయత్నం చేస్తాడు. మీరు ఐపీఎస్ పరీక్షలు రాసే వరకు ఎంత మాత్రం విశ్రాంతి తీసుకోవడానికి వీలులేదు అని చెబుతాడు. ఇక జానకిని నిద్రలేపిన రామచంద్ర ఆమెకు కాఫీ ఇచ్చి చదువుకోవాలి అని అంటాడు. మరి జానకి భర్త కోరిక మేరకు ఈసారి పరీక్షల్లో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.


Click it and Unblock the Notifications











