Janaki Kalaganaledu June 1st: తల్లి అయిన ఆనందంలో జానకి.. ఇంతలోనే మరో ప్రమాదం

జానకి కలగనలేదు సీరియల్ ఆకట్టుకునే ఎమోషన్స్ తో ఎంతో ఆసక్తిగా కొనసాగుతోంది. ఐపీఎస్ కావాలని అనుకున్న జానకి కానిస్టేబుల్ కావాల్సి వస్తుంది. ఇక మరోసారి ఐపీఎస్ పరీక్షలు రాసి తన కలను నిజం చేసుకోవాలి అని అనుకుంటుంది. ఇక పోలీస్ స్టేషన్లో అక్కడ ఆమెకు ఎస్ఐ మనోహర్ నుంచి ఇబ్బందులు ఎదురవుతాయి.

ఇక భర్త రామ ఆమెకు సపోర్ట్ చేస్తాడు. కానీ రామను మనోహర్ డ్రగ్స్ కేసులో ఇరికిస్తాడు. ఇక జానకి కలగనలేదు సీరియల్ కు గత వారం కంటే ఈ వారం రేటింగ్స్ మరింత పెరిగాయి. 6.72 రేటింగ్ తో గత వారం మంచి క్రేజ్ అందుకుంటోంది. నేడు ప్రసారం కాబోయే 594 వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం..

Janaki Kalaganaledu Serial 2023 June 1st Episode

వారసుడిని ఇస్తేనే గౌరవంగా ఉంటుంది: జానకి తాను ప్రెగ్నెన్సీ తో ఉన్నప్పటికీ కూడా ఆ విషయాన్ని అప్పుడే ఇంట్లో చెప్పదు. పూర్తిస్థాయిలో డాక్టర్ నిర్ధారించిన తర్వాతనే అందరికీ చెప్పాలని అనుకుంటుంది. ఇక మరోవైపు అత్తగారు మాత్రం జానకి కడుపు పండితే బాగుంటుంది అని ఇంటికి పెద్ద కోడలు ముందుగా వారసుడిని ఇస్తేనే గౌరవంగా ఉంటుంది అని ఆమె ఆలోచిస్తుంది. అంతేకాకుండా జానకికి త్వరగా కడుపు పండాలి అని అమ్మవారిని ప్రార్థిస్తూ ఉపవాసం కూడా ఉంటుంది.

అయితే జానకి మాత్రం తాను తల్లి అయిన విషయాన్ని క్లారిటీగా తెలుసుకోవడానికి డాక్టర్ దగ్గరికి వెళుతుంది. ప్రత్యేకంగా డాక్టర్ తో మాట్లాడిన తర్వాత కొన్ని టెస్టులు చేస్తారు. అనంతరం నువ్వు నిజంగా గర్భవతి అని డాక్టర్ చెప్పడంతో జానకి ఎంతగానో సంతోషిస్తుంది. వెంటనే ఈ విషయాన్ని రామ గారితో చెప్పాలని ఉంది అని ఆమె అనుకుంటుంది.

Janaki Kalaganaledu Serial 2023 June 1st Episode

డైరెక్ట్ గా కలిసి చెప్పాలని: అయితే ఫోన్లో కాకుండా డైరెక్ట్ గా కలిసి చెప్పాలని ఆ సంతోషాన్ని కల్లారా చూడాలని కూడా ఆమె అనుకుంటుంది. ఇక ఆ విషయం చెప్పాలి అని జానకి ఇంటికి బయలుదేరుతుంది. ఇక మరోవైపు జానకి విషయంలో పగ తీర్చుకోవాలి అని మల్లికా ఆలోచిస్తూ ఉంటుంది. ఇంటి పక్కన ఉండే నీలావతినీ ప్రత్యేకంగా పిలిచి మరోసారి మాట్లాడుతుంది.

ఇదివరకే నువ్వు జానకి పై రివెంజ్ తీర్చుకోవడానికి ఒక నిమ్మకాయ ఇచ్చావు. కానీ అది ఏ మాత్రం పనిచేయడం లేదు అని ఆమెపై కోపంగా మాట్లాడుతుంది. దీంతో నీలావతి కూడా మల్లికపై కోపంగా మాట్లాడుతూ దేనికైనా సరే కాస్త వేచి చూడాలి అని వెంటనే ఏదీ పనిచేయదు అని అంటుంది.

Janaki Kalaganaledu Serial 2023 June 1st Episode

వాంతులు చేసుకున్నట్లుగా కష్టాలు పడుతుంది: జానకి పై పగ తీర్చుకోవాలి అంటే ఈ నిమ్మకాయ పనితీరు ఇంకొక వారం రోజులు పని చేయాలి అని, అప్పుడు ఆమె వాంతులు చేసుకున్నట్లుగా కష్టాలు పడుతుంది అని నీలావతి చెబుతుంది. దీంతో మల్లిక కూడా ఆమె మాటలు నమ్ముతుంది. ఇక తప్పకుండా జానకి ఏడుస్తూ ఉండాలి అని మల్లికా కోరుకుంటుంది.

ఇక మరోవైపు రామచంద్ర జానకి ఎలాంటి శుభవార్త చెబుతుందో అని ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తాడు. ఇదివరకే కొన్నిసార్లు జానకి తల్లి అవుతున్నట్లు కాస్త అనుమానంగా మాట్లాడినప్పటికీ రామచంద్ర కు పూర్తిస్థాయిలో అర్థం కాదు. కానీ త్వరగా తండ్రిని కావాలి అని అతను ఆశ పడుతూ ఉంటాడు.

త్వరలోనే ఒక శుభవార్త వినబోతున్నారు: ఇక షాపులో పనిచేస్తూ ఉండగా మలయాళం రామచంద్ర జాతకం చూసి అతనికి చెబుతాడు. త్వరలోనే ఒక శుభవార్త వినబోతున్నారు అని తప్పకుండా అది మీకు ఆనందాన్ని కలిగిస్తుంది అనే చెప్పడంతో రామచంద్ర కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతాడు. ఇక మరోవైపు జానకి నడుచుకుంటూ ఇంటికి బయలుదేరుతుంది. ఎలాగైనా ఈ విషయాన్ని రామచంద్ర గారితో చెప్పి ఆ సంతోషాన్ని కల్లారా చూడాలని అనుకుంటుంది మార్గం మధ్యలో ఒక చిన్న గుడి కనిపించడంతో అక్కడ దేవుడిని ప్రార్థిస్తుంది.

Janaki Kalaganaledu Serial 2023 June 1st Episode

మరో ప్రమాదంలో జానకి: ఎంతోమంది తనను ఎన్నో రకాలుగా తిట్టారు అని, పిల్లలు పుట్టలేదు అని హేళన చేశారు అని ఇప్పుడు ఆ సంతోషాన్ని నెరవేర్చుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది అని దేవుడికి చెప్పుకుంటుంది. అయితే జానకి పై రివేంజ్ తీర్చుకోవడానికి మరోవైపు ఎస్ఐ మనోహర్ కూడా ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అతను మరోసారి రౌడీలని పిలిపించి జానకి పై దాడి చేయించాలని అనుకుంటాడు. ఇక జానకి అలా వెళుతుండగా పక్కనే ఒక షాప్ చూసి ఒక ఫ్యామిలీ బొమ్మ కొనాలని దాని ద్వారా రామచంద్ర గారికి అసలు విషయం చెప్పాలి అని అనుకుంటుంది.

ఇక జానకి ఆ ఫోటో తీసుకొని వెళుతూ ఉండగా అప్పుడే ఎస్ఐ మనోహర్ పంపించిన ఇద్దరు రౌడీలు జానకిని కత్తితో పొడవడానికి ప్రయత్నిస్తారు. దీంతో ఆమె ఒక్కసారిగా కింద పడిపోతుంది. తలకు బలంగా గాయం కూడా అవుతుంది. ఇక జానకి తృటిలో తప్పించుకోవడంతో అందరూ కూడా ఆమెకు సహాయం చేస్తారు కానీ రౌడీలు మాత్రం అక్కడి నుంచి పారిపోతారు. మరి జానకి తన అనుకున్న గుడ్ న్యూస్ ను తన భర్తకు ఏ విధంగా చెబుతుంది అనేది తదుపరి ఎపిసోడ్లో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X