Janaki Kalaganaledu June 21st: భార్యపై రామచంద్ర గోరింటాకు ప్రేమ.. సడన్ ట్వీస్ట్ ఇచ్చిన జానకి!
జానకి కలగనలేదు సీరియల్ ఆకట్టుకునే ఎమోషన్స్ తో ఎంతో ఆసక్తిగా కొనసాగుతోంది. ఐపీఎస్ కావాలని అనుకున్న జానకి కానిస్టేబుల్ కావాల్సి వస్తుంది. ఇక మరోసారి ఐపీఎస్ పరీక్షలు రాసి తన కలను నిజం చేసుకోవాలి అని అనుకుంటుంది. ఇక పోలీస్ స్టేషన్లో అక్కడ ఆమెకు ఎస్ఐ మనోహర్ నుంచి ఇబ్బందులు ఎదురవుతాయి. ఇక భర్త రామ ఆమెకు సపోర్ట్ చేస్తాడు. ఇక జానకి కలగనలేదు సీరియల్ కు గత వారం కంటే ఈ వారం రేటింగ్స్ మరింత పెరిగాయి. 6.72 రేటింగ్ తో గత వారం మంచి క్రేజ్ అందుకుంటోంది. నేడు ప్రసారం కాబోయే 611 వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం..
ఐపిఎస్ పరీక్షలో పాస్ కావడంతో..:జానకి అనుకున్నట్లుగానే ఐపిఎస్ పరీక్షలో పాస్ కావడంతో రామచంద్ర ఎంతో సంతోషంగా ఉంటాడు. అలాగే అత్తగారు మామగారు కూడా జానకి పై ప్రశంసలు కురిపిస్తారుమ్ కానీ తోడికోడలు మల్లికా మాత్రం జానకిపై మరింత కోపాన్ని పెంచుకుంటూ ఉంటుంది. జానకికి అంతా మంచి జరుగుతుంది అని ఆమెపై ఎలాగైనా మరోసారి రివెంజ్ తీర్చుకోవాలి అని అనుకుంటుంది. మంచి అవకాశం కోసం మల్లిక ఎదురు చూస్తూ ఉంటుంది. ఇక జానకి భర్తతో ప్రతిక్షణం ఎంతో ఆనందంగా ఉంటుంది. రామచంద్ర కూడా తన భార్యను ఇంకా గారాబంగా చూసుకుంటూ ఉంటాడు. ఇక అత్తగారు ప్రత్యేకంగా జానకి కోసం గోరింటాకును కూడా సిద్ధం చేస్తూ ఉంటుంది.

జానకి కోసం గోరింటాకు:అయితే తల్లి గోరింటాకు సిద్ధం చేస్తూ ఉండగా రామచంద్ర వచ్చి ఏదో రుబ్బుతూ ఉన్నారు ఏంటి అని అడుగుతాడు. ఇక పక్కనే ఉన్న అతని చెల్లెలు వెన్నెల అమ్మ నీకోసం గోంగూర పచ్చడి చేస్తోంది అని అబద్ధం చెబుతుంది. దీంతో రామచంద్ర అది నిజమే అని అనుకుంటాడు. ఇక తల్లి కూడా అతని చేతిలో గోరింటాకు పెడుతుంది. దాన్ని టేస్ట్ చేయాలి అని రామచంద్ర అనుకుంటాడు. ఇక వెంటనే తల్లి అతన్ని గోరింటాకుకు గోంగూర పచ్చడి కి ఇంకా తేడా తెలియదా అని ప్రేమగా తిడుతుంది. ఇక వెంటనే అందులో నుంచి కాస్త గోరింటాకు తీసి ఇది జానకికి పెట్టు అని అంటుంది. జానకి వదినకు నేను పెడతాను అని వెన్నెల చెప్పినప్పటికీ రామచంద్ర మాత్రమే నేను పెడతాను అంటూ తీసుకువెళ్తాడు.

ఎంతో జాగ్రత్తగా ఉంటాడు:ఇక జానకి మాత్రం నిద్రలో ఉంటుంది. లేచేసరికి సమయం పడుతుంది కాబట్టి మనమే చేతులకు పెట్టేద్దామని అనుకుంటాడు. ఇక ఎంతో ప్రేమగా జానకి అలా పడుకుని ఉండగానే రామచంద్ర గోరింటాకు పెడుతూ ఉంటాడు. ఎక్కడ చెడిపోకుండా ఎంతో జాగ్రత్తగా ఉంటాడు. ఆమె లేచే వరకు పక్కనే ఉంటాడు. అయితే రామచంద్ర గోరింటాకు పెట్టడంతో అది చూసిన మల్లికా తన భర్త చేత కూడా అలానే గోరింటాకు పెట్టించుకోవాలని అనుకుంటూ ఉంటుంది. మీ అన్న వదిన బాగానే ఉన్నారు కదా మనకు ఏం అయింది అని మీరు కూడా నాకు గోరింటాకు పెట్టండి అని మల్లికా అడుగుతుంది. ఇక విష్ణు మాత్రం తనకు గోరింటాకు పెట్టడం రాదు అని చెబుతాడు. ఇక నేను చెబుతాను ఎలా పెట్టాలో అలా చేయండి అని మల్లికా ఆదేశాలు జారీ చేస్తుంది. ఇక భర్త విష్ణు ఆమె గోల భరించలేక గోరింటాకు పెట్టాలని అనుకుంటాడు.
గోరింటాకు ఎవరు పెట్టారు?:ఇక మరోవైపు జానకి నిద్ర లేవగానే తన చేతులకు గోరింటాకు ఎవరు పెట్టారు అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇక రామచంద్ర ఎవరు పెట్టారు చెప్పండి అని అడుగుతాడు. మా అత్తయ్య గారు పెట్టి ఉంటారా అని అడగడంతో కాదు అని రామచంద్ర అంటాడు. ఇక వెన్నెల లేదా మల్లికా పెట్టి ఉంటుందేమో అని జానకి అనుకుంటూ ఉంటుంది. కాదు అని ఇక ఫైనల్ గా రామచంద్ర నవ్వడంతో.. మా ఆయన గారు పెట్టి ఉంటారా అని అడుగుతూ ఉంటుంది. అవును అని రామచంద్ర కూడా ఎంతో సంతోషంగా చెబుతాడు. ఇక అవి ఎర్రగా పండాయో లేవో అని రామచంద్ర ఆలోచిస్తూ ఉంటాడు. ఇక కాస్త టెన్షన్ పడుతూ ఉంటాడు.

ఆ చిన్నారులకు సహాయం చేసిన జానకి:ఇక జానకి అతన్ని కొద్దిసేపు ఆడుకుంటూ ఉంటుంది. చేతులు ఎర్రగా కాలేదు అని చెబుతూ టెన్షన్ పెడుతూ ఉంటుంది. ఇక రామచంద్ర టెన్షన్ పడగానే తన వెనకాల నుంచి హత్తుకున్నా జానకి చాలా ఎర్రగా పండింది అని చెబుతుంది. ఇక వాళ్ళు ఇద్దరు కూడా ఎంతో ప్రేమగా బయటకు వెళ్లాలని అనుకుంటారు. ఇక మార్గం మధ్యలో కొంతమంది అనాధ పిల్లలు వారికి డబ్బులు కావాలి అని అంటారు. ఒక మహిళ ఆ చిన్నారులను చేరదీసి పెంచుతూ ఉంటుంది. ఇక జానకి ఎంతో మంచి మనసుతో వారికి కొన్ని డబ్బులు ఇస్తుంది. జానకి ఆ సంతోషాలతో రామచంద్రను గుడికి తీసుకు వెళుతుంది. ఇక రాబోయే రోజుల్లో జానకి అత్త గారి ఇంట్లో ఎలాంటి సవాళ్ళను ఎదుర్కొంటుందో చూడాలి.


Click it and Unblock the Notifications











