Janaki Kalaganaledu June 22nd: అనాధలకు అండగా నిలిచిన జానకి.. మరో ప్లాన్ వేసిన మనోహర్
జానకి కలగనలేదు సీరియల్ ఆకట్టుకునే ఎమోషన్స్ తో ఎంతో ఆసక్తిగా కొనసాగుతోంది. ఐపీఎస్ కావాలని అనుకున్న జానకి కానిస్టేబుల్ కావాల్సి వస్తుంది. ఇక మరోసారి ఐపీఎస్ పరీక్షలు రాసి తన కలను నిజం చేసుకోవాలి అని అనుకుంటుంది. ఇక పోలీస్ స్టేషన్లో అక్కడ ఆమెకు ఎస్ఐ మనోహర్ నుంచి ఇబ్బందులు ఎదురవుతాయి. ఇక భర్త రామ ఆమెకు సపోర్ట్ చేస్తాడు. ఇక జానకి కలగనలేదు సీరియల్ కు గత వారం కంటే ఈ వారం రేటింగ్స్ మరింత పెరిగాయి. 6.72 రేటింగ్ తో గత వారం మంచి క్రేజ్ అందుకుంటోంది. నేడు ప్రసారం కాబోయే 612 వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం..
రామచంద్రతో కలిసి గుడికి..:జానకి ఐపీఎస్ కావడంతో రామచంద్ర ఎంతో సంతోషంగా ఉంటాడు. ప్రతి విషయంలో కూడా ఆమెకు సలహాలు ఇస్తూ భవిష్యత్తు గురించి కూడా ఆలోచిస్తూ ఉంటాడు. అయితే ఈ క్రమంలో జానకి మాత్రం అంత స్వవ్యంగానే కొనసాగుతోంది అనుకున్నప్పటికీ కూడా ఆమె వెనకాల మాత్రం శత్రువులు ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టేలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. జానకి తన భర్తను తీసుకుని గుడికి వెళ్లడానికి రెడీ అవుతుంది. ఇక బయలుదేరిన కొద్దిసేపటికి రోడ్డు మధ్యలో కొంతమంది చిన్నారులు ఒక మహిళ విరాళాలు సేకరిస్తూ ఉంటుంది. అయితే వారిని చూసి ఆగిన జానకి అసలు విషయం తెలుసుకుంటుంది. వీరంతా అనాధ పిల్లలు అని వీరిని నేనే పోషిస్తున్నాను అని చెప్పినా మహిళ గత కొంతకాలంగా విరాళాలు పెద్దగా రావడం లేదు అని అందుకే ఈ విధంగా చేస్తున్నట్లుగా ఆమె చెబుతుంది.

చిన్నారులకు సహాయంగా ఉండవచ్చు అని..:ఇక ఆమె చెప్పిన విధానంతో జానకి ఎంతో జాలి పడుతుంది. ఇక తన భర్త దగ్గర కొన్ని డబ్బులు తీసుకొని వారికి ఇస్తుంది. నేను కూడా మీకు ఏదో ఒక విధంగా సహాయం చేస్తాను అంటూ తన భర్త ద్వారా ఒక వీడియో తీస్తుంది. అందులో జానకి మంచి మనసున్న ఎవరైనా సరే ఈ చిన్నారులకు సహాయంగా ఉండవచ్చు అని విరాళాలు ఇవ్వడానికి ఆశ్రమం యొక్క బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కూడా నేను ఇస్తాను అని వీడియోలో చెబుతుంది. ఇక ఆ వీడియో చూసిన ఎస్ఐ మనోహర్ జానకి పై మరింత కోపం పెంచుకుంటాడు. ఎలాగైనా ఈ వీడియోతోనే జానకిని ఇబ్బంది పెట్టాలి అనుకుంటాడు. అతనికి తెలిసిన మనిషికి ఫోన్ చేసి ఒక ప్రణాళిక కూడా రచిస్తాడు. మరోవైపు జానకి మాత్రం అంతా మంచే జరుగుతుంది అని గుడిలో కొబ్బరికాయ కొడుతుంది. ఎలాగైనా ఆ చిన్నారులకు కూడా సహాయం గా ఎవరైనా తోడ్పడితే బాగుంటుంది అని ఆమె అనుకుంటుంది.

ఎస్ఐ మనోహర్ ప్లాన్ :ఇంతలోనే ఒక ఫోన్ కాల్ వస్తుంది. అయితే అతను ఫోన్ చేసి మీరు చెప్పిన వీడియో ఒకటి చూశాను నేను మీకు అభిమానిని మీరు చేసే సహాయంలో నేను కూడా ఒక అడుగు వేయాలని అనుకుంటున్నాను కొంత నాకు తోచినంత డబ్బులు మీకు ఇవ్వాలని అనుకుంటున్నట్లుగా అతను చెప్పడంతో జానకి ఎంతగానో సంతోషిస్తుంది. అయితే అతను మాత్రం ఎస్సై మనోహర్ ప్లాన్ చేసిన వ్యక్తి అని జానకికి తెలియదు. ఇక జానకి మాత్రం అది నిజమే అని అనుకుంటుంది. వెంటనే ఆ డబ్బులు తమ మరిదికి ఇవ్వాలి అని చెప్పడంతో అతను విష్ణు దగ్గరికి వెళ్లి డబ్బులు ఇవ్వడానికి ఒప్పుకుంటాడు. కానీ అక్కడ మాత్రం విరాళం కోసం ఇస్తున్నట్లుగా చెప్పకుండా అబద్ధం ఆడుతాడు. మీ జానకి గారు పోలీస్ కాబట్టి ఆమె ఒక ల్యాండ్ సెటిల్మెంట్ చేశారు అని అందుకే డబ్బులు ఇవ్వాలని అనుకుంటున్నట్లుగా అతను అబద్ధాలు చెబుతాడు.

వదిన గురించి మాకు పూర్తిగా తెలుసు:ఇక విష్ణు మాత్రం మొదట అబ్విషయాలను అతను నమ్మడు. నువ్వు ఈ విధంగా మాట్లాడితే అస్సలు బాగుండదు. మా వదిన గురించి మాకు పూర్తిగా తెలుసు అని తను నిజాయితీగల పోలీస్ ఆఫీసర్ అని చెబుతాడు. ఇక ఆ వ్యక్తి మనోహర్ కు ఫోన్ చేసి అతను డబ్బులు తీసుకోలేదు అని చెబుతాడు. ఇక ఎస్ఐ మనోహర్ మరొక ప్రణాళిక రచించాలని అనుకుంటాడు. ఇక జానకి రామచంద్ర అప్పుడే ఇంటికి వెళతారు రేపు మన ఇంట్లో వ్రతం చేయాలని అనుకుంటున్నట్లు అత్తగారు చెప్పడంతో ఆమె సంతోషిస్తుంది.

మల్లిక అలా చెప్పినప్పటికీ..:ఇక జానకి పోలీస్ స్టేషన్కు వెళ్లడానికి యూనిఫామ్ వేసుకొని రెడీ అవుతుంది. అయితే జరిగిన విషయాన్ని విష్ణు ఆమెకు చెప్పాలని అనుకుంటాడు. కానీ చెప్పడానికి అతను ఇష్టపడడు. ఇక విష్ణునీ గమనించిన అతని భార్య మల్లికా ఏదో అనుమానిస్తూ ఉంటుంది. ఇంతకీ ఏం మాట్లాడాలని అనుకుంటున్నారు అని అడగడంతో మొదట విష్ణు అసలు విషయం చెప్పడానికి వెనుకడుగు వేస్తాడు. కానీ మల్లిక ఇబ్బంది పెట్టడంతో అసలు విషయం చెబుతాడు. వదిన వెనకాల ఎవరో తెలియకుండా ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు అనిపిస్తోంది అని, ఒక వ్యక్తి డబ్బు తెచ్చి ఇవ్వడానికి ప్రయత్నం చేశాడు అని అంటాడు. కానీ మల్లిక మాత్రం అది నిజమే అయ్యి ఉండవచ్చు కదా అని కూడా అతనికి లేనిపోని అబద్ధాలు చెబుతుంది. కానీ విష్ణు మాత్రం వదిన అలా ఎన్నటికీ చేయదు అని ఆమె చాలా నిజాయితీపరురాలు అని అంటాడు. మరి ఈ విషయం జానకికి ఎప్పుడు తెలుస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











