Janaki Kalaganaledu June 23rd: ప్లాన్ చేసి జానకిని మరో సమస్యలోకి నెట్టిన మనోహర్.. బిగ్ కన్ఫ్యూజన్
జానకి కలగనలేదు సీరియల్ ఆకట్టుకునే ఎమోషన్స్ తో ఎంతో ఆసక్తిగా కొనసాగుతోంది. ఐపీఎస్ కావాలని అనుకున్న జానకి కానిస్టేబుల్ కావాల్సి వస్తుంది. ఇక మరోసారి ఐపీఎస్ పరీక్షలు రాసి తన కలను నిజం చేసుకోవాలి అని అనుకుంటుంది. ఇక పోలీస్ స్టేషన్లో అక్కడ ఆమెకు ఎస్ఐ మనోహర్ నుంచి ఇబ్బందులు ఎదురవుతాయి. ఇక భర్త రామ ఆమెకు సపోర్ట్ చేస్తాడు. ఇక జానకి కలగనలేదు సీరియల్ కు గత వారం కంటే ఈ వారం రేటింగ్స్ మరింత పెరిగాయి. 6.72 రేటింగ్ తో గత వారం మంచి క్రేజ్ అందుకుంటోంది. నేడు ప్రసారం కాబోయే 613 వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం..

ఒక దొంగ బ్యాగ్ ఎత్తుకొని పరిగెత్తుతూ..: మొత్తానికి జానకి ఐపీఎస్ పరీక్షల్లో పాస్ అవుతుంది. అయితే శిక్షణ కోసం ఇంకా మరి కొన్ని రోజుల సమయం ఉన్నప్పటికీ కూడా ఆమె పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాన్ని కొనసాగిస్తూనే ఉంటుంది. ఇక ఎప్పటిలానే ఆమె హ్యాపీగా పోలీస్ స్టేషన్ కు బయలుదేరగా ఊహించిన విధంగా ఒక ఘటన ఎదురవుతుంది. ఒక దొంగ బ్యాగ్ ఎత్తుకొని పరిగెత్తుతూ ఉండడం జానకి చూస్తుంది. ఇక అతను పరిగెత్తుకుంటూ ఒక సైకిల్ పై వెళుతున్న వ్యక్తికి తగిలి పడిపోతాడు. ఇక వెంటనే జానకి అతన్ని వెంబడిస్తుంది. అయితే ఆ దొంగ బ్యాగ్ అక్కడ పడేసి వెళ్ళిపోతాడు. ఇక జానకి వెంటనే ఆ బ్యాగ్ తీసుకుని పోలీస్ స్టేషన్ కు వస్తుంది.

మరోసారి రివెంజ్ తీర్చుకోవాలని..: ఇక ఎస్ఐ మనోహర్ అప్పుడు జానకి గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఎలాగైనా ఆమెపై మరోసారి రివెంజ్ తీర్చుకోవాలని కూడా అతను ఆలోచిస్తూ ఉంటాడు. ఇక జానకి వచ్చి రాగానే తనకు దొరికిన బ్యాగ్ ఎస్ఐ మనోహర్ ముందు పెడుతుంది. ఈ బ్యాగ్ ఎక్కడిది అని అతను అడుగుతాడు. అయితే ఇంతలో మరొక వ్యక్తి బాధపడుతూ వస్తూ నా బ్యాగ్ ఎవరో దొంగతనం చేశారు అని చెబుతాడు. నా కూతురి కోసం బ్యాంకు నుంచి డబ్బులు డ్రా చేసుకొని రాగా ఆ బ్యాగును ఒక దొంగ వ్యక్తి ఎత్తుకొని పారిపోయాడు. అతన్ని ఎలాగైనా పట్టుకోవాలి అని ఎస్ఐ మనోహర్ కు అతను రిక్వెస్ట్ చేస్తాడు.

బ్యాగ్ తీసుకొని ఆ బ్యాగ్ ఇలానే: అయితే జానకి వెంటనే తను తెచ్చిన బ్యాగ్ తీసుకొని ఆ బ్యాగ్ ఇలానే ఉంటుందా అని అడగడంతో ఇదే తన బ్యాగ్ అని ఆ వ్యక్తి చెబుతాడు. అయితే ఆ వ్యక్తి అందులో ఉన్న డబ్బులు చూశాక మొత్తం కనిపించవు. ఇందులో టోటల్ గా పది లక్షలు ఉండాలి అని.. కానీ రెండు లక్షలు మాత్రమే కనిపిస్తున్నాయి అని చెబుతాడు. అయితే దొంగ ఈ డబ్బును ఎత్తుకొని పోయి ఉంటాడా అని అతను అడుగుతాడు. అయితే ఆ వ్యక్తి మాత్రం దొంగ ఎత్తుకుపోతే మొత్తం ఎత్తుకుపోవాలి కదా ఈ రెండు లక్షలు ఎందుకు ఉంచుతాడు అని అతను అడుగుతాడు.
మరో సమస్యలో జానకి: ఇక వెంటనే మనోహర్ చాకచక్యంగా ఏం మాట్లాడుతున్నావ్ నువ్వు? ఆ డబ్బు ఏమైనా మా జానకి తీసుకుందా అని మాట్లాడడంతో అవును తీసుకొని ఉండవచ్చు కదా అనే అతను అంటాడు. దీంతో జానకి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏం మాట్లాడుతున్నావ్ అంటూ అతన్ని బెదిరిస్తుంది. ఇక జానకిని కంట్రోల్ లో పెట్టిన ఎస్ఐ మనోహర్ నేను మాట్లాడతాను ఉండు అని కంట్రోల్ చేస్తాడు. అయితే జానకి మాత్రం ఆ విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గకుండా మాట్లాడుతుంది. అయితే ఆ వ్యక్తి మాత్రం నేను బ్యాంకులో నుంచి డబ్బులు తీసుకువచ్చిన స్లిప్ కూడా ఉంది. మొత్తం పది లక్షలు ఉండాలి. ఇందులో రెండు లక్షలు మాత్రమే ఉన్నాయి. మిగతా ఎనిమిది లక్షలు కానిస్టేబుల్ తీసుకుని ఉండవచ్చు అని అతను అనుమానిస్తాడు.

పోలీస్ స్టేషన్ కు వచ్చిన గోవిందరాజులు: అంతేకాకుండా ముందు కానిస్టేబుల్ పై కేసు నమోదు చేస్తాను అని అంటాడు. ఇక జానకి సీరియస్ కావడంతో ఎస్ఐ మనోహర్ ఆమెను పక్కకు తీసుకువెళ్లి మాట్లాడుతాడు. నువ్వు ఇప్పుడు ఏదో ఒక విధంగా అతనిని ఒప్పించాలి అని లేకపోతే ఇప్పుడు కేసు నమోదు అయితే నీ ఐపిఎస్ కల నెరవేరదు అని అప్పుడు ఇబ్బంది అవుతుంది అని మనోహర్ చెబుతాడు. ఇక జానకీ దొంగను పట్టుకుని అసలు నిజాన్ని రుజువు చేయాలి అని లేదంటే ఆమె మిగతా ఎనిమిది లక్షలు ఇవ్వాలి అని అతను చెప్పడంతో అందుకు మనోహర్ ఓకే అంటాడు. అంతేకాకుండా సాక్షిగా వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉండాలి అని చెప్పడంతో మనోహర్ జానకి మామ గోవిందరాజులును పిలిపిస్తాడు. అతను ఈ విషయంలో భరోసా ఇవ్వాలి అని కూడా చెప్పడంతో గోవిందరాజులు కాస్త టెన్షన్ పడినప్పటికీ సంతకం చేయడానికి ఒప్పుకుంటాడు. ఇక జానకి మాత్రం ఏమీ అర్థం కాని పరిస్థితుల్లో ఉంటుంది. ఇక ఎస్ఐ మనోహర్ అయితే జానకి పై రివెంజ్ తీర్చుకోవడానికి ఇదంతా ప్లాన్ చేస్తాడు. మరి జానకి ఈ విషయంలో ఎలా నిర్దోషిగా బయటపడుతుందో చూడాలి.


Click it and Unblock the Notifications











