Janaki Kalaganaledu June 24th: ఊహించని చిక్కుల్లో జానకి.. దారి లేకుండా చేసిన మనోహర్
జానకి కలగనలేదు సీరియల్ ఆకట్టుకునే ఎమోషన్స్ తో ఎంతో ఆసక్తిగా కొనసాగుతోంది. ఐపీఎస్ కావాలని అనుకున్న జానకి కానిస్టేబుల్ కావాల్సి వస్తుంది. ఇక మరోసారి ఐపీఎస్ పరీక్షలు రాసి తన కలను నిజం చేసుకోవాలి అని అనుకుంటుంది. ఇక పోలీస్ స్టేషన్లో అక్కడ ఆమెకు ఎస్ఐ మనోహర్ నుంచి ఇబ్బందులు ఎదురవుతాయి.
ఇక భర్త రామ ఆమెకు సపోర్ట్ చేస్తాడు. ఇక జానకి కలగనలేదు సీరియల్ కు గత వారం కంటే ఈ వారం రేటింగ్స్ మరింత పెరిగాయి. 6.72 రేటింగ్ తో గత వారం మంచి క్రేజ్ అందుకుంటోంది. నేడు ప్రసారం కాబోయే 614 వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం..

జానకిపై రివెంజ్ తీర్చుకోవాలని: జానకి పరీక్షలు పాస్ కావడంతో అందరూ కూడా ఎంతో సంతోషంగా ఉంటారు. జానకి ఐపిఎస్ ఉద్యోగంలో జాయిన్ కావడానికి ఇంకాస్త సమయం ఉన్నప్పటికీ కూడా ఆమె తన కానిస్టేబుల్ ఉద్యోగాన్ని కొనసాగిస్తూనే ఉంటుంది.
అయితే మరోవైపు ఎస్ఐ మనోహర్ మాత్రం జానకిపై రివెంజ్ తీర్చుకోవాలని అనుకుంటాడు. గతంలో జానకి చేసిన పని వలన మూడు నెలలు ఉద్యోగం లేకుండా సస్పెండ్ కావలసి వస్తుంది. అందుకే అతను రివెంజ్ తీర్చుకోవాలని అనుకుంటాడు. ఇక జానకి ఊహించని విధంగా ఒక సమస్యలో చిక్కుకుంటుంది.
సాక్ష్యాలు అతని వైపుగా ఉన్నాయి: ఒక దొంగ డప్పున్న బ్యాగును దొంగిలించి పరిగెత్తుతూ ఉండగా అతన్ని వెంబడించి బ్యాగ్ పట్టుకుంటుంది. అయితే ఆ దొంగ మాత్రం దొరకడు. ఇక ఆ బ్యాగ్ ను పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చిన జానకి అసలు విషయం చెబుతూ ఉండగా మరొక వ్యక్తి వచ్చి అది తన బ్యాగ్ అని చెబుతాడు. అయితే ఆ బ్యాగులో మాత్రం రెండు లక్షలు మాత్రమే ఉంటాయి.
కానీ 10 లక్షలు ఉండాలి అని చెబుతాడు. అయితే ఆ డబ్బు జానకి తీసుకుని ఉంటుంది అని అతను కేసు వేస్తానని చెబుతాడు. ఇక ఎస్సై మనోహర్ కూడా అతనికి మద్దతు పలుకుతూ సాక్ష్యాలు అతని వైపుగా ఉన్నాయి అని చెబుతూ జానకిని ఇబ్బంది పెట్టె ప్రయత్నం చేస్తాడు.

ఆ దొంగను పట్టుకొని నిజం చెప్పించాలి: జానకి ఎట్టి పరిస్థితుల్లోనూ ఐపిఎస్ కాకూడదు అని మనోహర్ ఆ విధంగా నాటకం ఆడిస్తూ ఉంటాడు. ఇక నిజం తెలియని జానకికి ఏం జరుగుతుందో అర్థం కాదు. ఇక వెంటనే జానకి మామ గోవిందరాజులని పోలీస్ స్టేషన్ కు పిలిపించి ఎస్ఐ మనోహర్ మీరు హామీ సంతకం పెట్టాలి అని రేపటిలోగా జానకి డబ్బు వెనక్కి తిరిగి ఇవ్వాలి లేదంటే ఆ దొంగను పట్టుకొని నిజం చెప్పించాలి అని మనోహర్ హామీ తీసుకుంటాడు.
ఇక జానకి ఇంటికి రాగానే అసలు విషయం అందరికీ చెబుతోంది. అయితే అందరూ ఆమెకు సపోర్ట్ చేసినప్పటికీ కూడా మల్లిక మాత్రం కఠినంగా మాట్లాడుతూ ఉంటుంది. జానకి నిజంగానే ఆ డబ్బు తీసుకొని ఉండవచ్చు కదా అని అంటుంది.

ఇల్లును తాకట్టు పెట్టాలి అని: ఇక గోవిందరాజులు మాత్రం ఆమెను బెదిరించే ప్రయత్నం చేస్తాడు. జానకి ఇలాంటి తప్పు చేయదు అని ఆమె ఎంత నిజాయితీపరురాలో ఇక్కడ ఉన్న అందరికీ తెలుసు అని అంటాడు. అంతేకాకుండా వాళ్ళకు డబ్బు ఇవ్వాలి అంటే ఈ ఇల్లును తాకట్టు పెట్టాలి అని అతను సలహా ఇస్తాడు. కాని జానకి మాత్రం అందుకు ఒప్పుకోదు. అలాగే మల్లిగా కూడా కఠినంగా మాట్లాడుతుంది.
షాప్ పై ఉన్న అప్పు వెనక్కి తీసుకురావడానికి ఇంకా సమయం సరిపోవడం లేదు. వడ్డీల మీద వడ్డీలు కట్టాల్సి వస్తుంది. అలాంటిది ఇప్పుడు మళ్లీ ఇల్లును తాకట్టు పెడతాను అంటే కరెక్ట్ కాదు అని ఆమె అంటుంది. అయితే మరోవైపు జానకి మల్లిక మాటలు విని మరింత బాధపడుతుంది. బయటి వాళ్ళ మాటల కంటే మీ మాటలే నన్ను ఎక్కువగా బాధిస్తున్నాయి అని జానకి ఏడుస్తూ లోపలికి వెళ్ళిపోతుంది.
మనోహర్ వేసిన ప్లాన్: ఇక జానకిని పరిస్థితిని చూసి రామచంద్ర కూడా బాధపడుతూ ఉంటాడు. ఇక ఎస్ఐ మనోహర్ మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. నాటకమాడి జానకిని భలే ఇరికించారు అని మిగతా కానిస్టేబుల్స్ కూడా అతనితో మాట్లాడుతూ ఉంటారు.
ఇక ఇంట్లో ఉన్న జానకి తనకోసం భర్త పడుతున్న తాపత్రయాన్ని చూసి ఎంతో బాధపడుతుంది. మీరు నా కోసం ఎంతో కష్టపడి ఇక్కడికి తీసుకు వచ్చారు. కానీ నాకు ఆ దేవుడు ఐపిఎస్ ఉద్యోగాన్ని ఇవ్వడానికి ఇష్టపడడం లేదు అని బాధపడుతూ ఉంటుంది.
జానకి కోసం మంచి జరగాలి: అయితే ఇప్పుడు నాకు ఈ సమస్య నుంచి బయటపడడానికి ఎటువైపు దారి దొరకడం లేదు అని అంతా చీకటిగా కనిపిస్తోంది అని ఆమె బాధ పడుతూ ఉంటుంది. ఇక చీకటిని చీల్చుకొని మనం సమస్యకు సమాధానం వెతకాలి అని ఇలాంటి సమస్యలు మీకు భవిష్యత్తులో ఇంకా ఎన్నో వస్తాయి. ధైర్యంగా ఎదుర్కోవాలి అని రామ అంటాడు.
ఇక అత్తగారు జానకి జీవితం బాగుండాలి అని ఈ సమస్యలు తొలగిపోవాలి అని పూజలు చేయాలని అనుకుంటుంది. ఇక మొదట గోవిందరాజులు పూజలు చేయడానికి ఒప్పుకోదు. కానీ ఆ తర్వాత ఆమె అంత మంచి జరుగుతుంది అని నచ్చ చెప్పడంతో ఒప్పుకుంటాడు. మరి జానకి పరిస్థితి ఏ విధంగా మారుతుందో తదుపరి ఎపిసోడ్ లో చూడాలి.


Click it and Unblock the Notifications











