Janaki Kalaganaledu June 26th: తెలివిగా దొంగను కనిపెట్టిన జానకి.. మనోహర్ గుండెల్లో గుబులు!
జానకి కలగనలేదు సీరియల్ ఆకట్టుకునే ఎమోషన్స్ తో ఎంతో ఆసక్తిగా కొనసాగుతోంది. ఐపీఎస్ కావాలని అనుకున్న జానకి కానిస్టేబుల్ కావాల్సి వస్తుంది. ఇక మరోసారి ఐపీఎస్ పరీక్షలు రాసి తన కలను నిజం చేసుకోవాలి అని అనుకుంటుంది. ఇక పోలీస్ స్టేషన్లో అక్కడ ఆమెకు ఎస్ఐ మనోహర్ నుంచి ఇబ్బందులు ఎదురవుతాయి. ఇక భర్త రామ ఆమెకు సపోర్ట్ చేస్తాడు. ఇక జానకి కలగనలేదు సీరియల్ కు గత వారం కంటే ఈ వారం రేటింగ్స్ మరింత పెరిగాయి. 6.72 రేటింగ్ తో గత వారం మంచి క్రేజ్ అందుకుంటోంది. నేడు ప్రసారం కాబోయే 614 వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం..
ఏమీ తెలియని పరిస్థితుల్లో జానకి:జానకి పై కావాలి అని ఎస్ఐ మనోహర్ ఒక దొంగ కేసు నమోదు చేయాలని అనుకుంటాడు. పోలీస్ కానిస్టేబుల్ గా నిజాయితీగా ఉద్యోగం చేసుకుంటున్న జానకి ఒక వ్యక్తి దొంగతనం చేస్తే దొంగతనం చేసిన డబ్బును తీసుకువచ్చి ఇవ్వగా కావాలని ఎస్ఐ జానకినిఇరికించే ప్రయత్నం చేస్తాడు. ముందుగానే జానకి పది లక్షల్లో 8 లక్షల నొక్కేసి ఉంటుంది అని కూడా సాంబశివరావు అనే వ్యక్తి జానకిపై అబద్ధం చెబుతాడు. ఇక ఎస్ఐ మనోహర్ మిగతా డబ్బు తెచ్చి ఇవ్వాలి అని లేకపోతే సాంబశివరావు కేసు నమోదు చేస్తాడు అని చెబుతాడు. దీంతో జానకి ఏమీ తెలియని పరిస్థితుల్లో ఉంటుంది. ఆమెకు సపోర్ట్ గా రామచంద్ర ఉంటాడు. అయితే జానకి ఆలస్యం చేయకూడదు అని ఎలాగైనా దొంగను పట్టుకొని అసలు నిజం బయటపెట్టాలని అనుకుంటుంది.

నిజాయితీగా ఇంటికి తిరిగి రావాలని..:ఆమె ఇంటి నుంచి బయలుదేరేముందు అత్తగారి నుంచి ఆశీర్వాదం తీసుకుంటుంది. అక్కడ ప్రత్యేకంగా జ్ఞానాంబ పూజలు కూడా చేస్తూ ఉంటారు. ఇక జానకి పోలీస్ కానిస్టేబుల్ డ్రెస్ లో వచ్చి మీ ఆశీర్వాదం నాకు తప్పకుండా ఉండాలి అని ఇప్పుడు నేను నిజాయితీగా ఇంటికి తిరిగి రావాలని ఉంది అని చెబుతుంది. ఈ పూజ చేసేదే నీకోసం తప్పకుండా నువ్వు నిర్దోషిగా తిరిగి వస్తావని ఆమె భరోసా ఇస్తుంది. ఇక మరోవైపు గోవిందరాజులు కూడా ఒకవేళ దొంగ దొరకకపోతే ఆ ఎనిమిది లక్షలు ఇల్లు తాకట్టు పెట్టి ఇస్తాను అని చెబుతాడు. అయితే అంతవరకు వెళ్ళకూడదు అని తప్పకుండా నేనే ఈ సమస్య నుంచి బయటపడతాను అని చెబుతుంది.

దొంగ ఫోటోలను తీసుకున్న జానకి:ఇక జానకి నమ్మకంతో బయటికి వెళ్లి ఆ ఘటన జరిగిన చోటికి వెళుతుంది. అయితే అక్కడ ఒక సీసీ కెమెరా ఉండడంతో దాని నుంచి ఆధారాలు సంపాదించాలని అనుకుంటుంది. ఇక దొంగ ఫోటోలను తీసుకున్న జానకి ఆ ఫోటోలను ఆధారంగా వివరాలు సేకరించే ప్రయత్నం చేస్తుంది. అతని అడ్రస్ కూడా కనుక్కుంటుంది. మరోవైపు ఎస్ఐ మనోహర్ జానకి ఈసారి నా చేతిలో నుంచి తప్పించుకోవడం లేదు అని ఆమె ఐపిఎస్ ఆఫీసర్ కాలేదు అని తన కానిస్టేబుల్ తో మాట్లాడుతూ ఉంటాడు. అయితే మరొక కానిస్టేబుల్ కూడా జానకి పై ఇంటిపై ఒక కన్నేసి ఉంచాలి అని చెబుతాడు.

మల్లిక మాటలు బయటకు:ఇక జానకి విషయంలో ఇంట్లో అందరూ పూజలు చేస్తూ ఆమె గురించి ఆలోచిస్తూ ఉండగా మల్లిక మాత్రం జానకి పై మరోసారి తన అసూయను బయటపెడుతుంది. పూజ చేసే సమయంలోనే అనుకోకుండా ఆమె మనసులో అనుకున్న మాటలు బయటికి చెప్పేస్తుంది. ఈ ఇంట్లో ఏదైనా సరే జానకి కోసమే జరుగుతున్నట్లు ఉంటుంది ఆమెకు పిల్లలు పుట్టాలని ఉద్యోగాలు రావాలి అని మంచి జరగాలి అని నిత్యం పూజలు చేస్తూ ఉంటారు. ఏంటో ఏమో అని కాస్త అసంతృప్తితో మాట్లాడుతూ ఉంటుంది. ఇక ఆమె భర్త విష్ణు ఆమెను కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తాడు.

జానకి తెలివి.. ఎస్ఐ షాక్:ఇక జానకి నిందితుడి అడ్రస్ కనుక్కొని అతని ఇంటికి వెళుతుంది. అయితే ఇంతకుముందు జానకి ఆ ఇంటికి వెళ్లినట్లు గమనిస్తుంది. కాలింగ్ బెల్ కొట్టగానే ఒక యువతి డోర్ తెరుస్తుంది. ఆమె ఇంతకుముందు జానకికి కనపడుతుంది. పరీక్షల్లో ఫెయిల్ అయినందుకు సూసైడ్ చేసుకోవాలని అనుకున్న యువతికి జానకి మంచి మాటలు చెప్పి ధైర్యం చెబుతుంది. అయితే ఆమెను అక్కడ చూడడంతో జానకి సంతోషపడుతుంది. అయితే ఇక్కడికి ఎందుకు వచ్చారు అని అడగగానే జానకి ఫోటో చూపిస్తుంది. అతను మా అన్నయ్య అని చెప్పడంతో ఒకసారి బయటకు పిలవాలి అని జానకి చెబుతుంది. ఇక అతను దూరం నుంచి జానకి రామచంద్రలను చూసి పారిపోవాలని ప్రయత్నం చేస్తాడు. ఇక రామచంద్ర అతన్ని పట్టుకుని అసలు నిజం చెప్పాలని అంటాడు. అతని తల్లి కూడా అతన్ని కొడుతుంది. ఇక మరొక వ్యక్తి తనను ఈ విధంగా నాటకం ఆడించాడు అని చెప్పడంతో జానకి షాక్ అవుతుంది. ఇక జానకి అతను ఎవరో గుర్తుపడతావా అని అడగగానే అతను గుర్తుపడతానని చెబుతాడు. ఇక జానకి పోలీస్ స్టేషన్కు ఫోన్ చేసి సాంబశివరావును పోలీస్ స్టేషన్కు రమ్మని చెప్పాలి అని డబ్బులు తిరిగి ఇచ్చేస్తానని చెబుతుంది. దీంతో ఎస్ఐ షాక్ అవుతాడు. మరి జానకి ఈ కేసు నుంచి ఎలా బయటపడి ఎస్ఐ మనోహర్ కు షాక్ ఇస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











