Janaki Kalaganaledu June 27th: ఎస్ఐ మనోహర్ కు స్టన్ అయ్యేలా షాక్ ఇచ్చిన జానకి.. మళ్ళీ హ్యాపీగా..

జానకి కలగనలేదు సీరియల్ ఆకట్టుకునే ఎమోషన్స్ తో ఎంతో ఆసక్తిగా కొనసాగుతోంది. ఐపీఎస్ కావాలని అనుకున్న జానకి కానిస్టేబుల్ కావాల్సి వస్తుంది. ఇక మరోసారి ఐపీఎస్ పరీక్షలు రాసి తన కలను నిజం చేసుకోవాలి అని అనుకుంటుంది. ఇక పోలీస్ స్టేషన్లో అక్కడ ఆమెకు ఎస్ఐ మనోహర్ నుంచి ఇబ్బందులు ఎదురవుతాయి. ఇక భర్త రామ ఆమెకు సపోర్ట్ చేస్తాడు. ఇక జానకి కలగనలేదు సీరియల్ కు గత వారం కంటే ఈ వారం రేటింగ్స్ మరింత పెరిగాయి. 6.72 రేటింగ్ తో గత వారం మంచి క్రేజ్ అందుకుంటోంది. నేడు ప్రసారం కాబోయే 616 వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం..

జనకిపై ఫోకస్ పెంచిన మనోహర్ : జానకి ఐపీఎస్ పరీక్షల రాసి పాస్ కావడంతో ఆమె మరో స్థాయికి వెళుతుంది అని అసూయ చెందిన ఎస్ఐ మనోహర్ ఆమెపై ఎలాగైనా రివెంజ్ తీర్చుకోవాలి అనుకుంటాడు. ఒక కేసు విషయంలో తనను సస్పెండ్ చేయించిన జానకిని ఏమాత్రం వదిలిపెట్టకూడదు అని అనుకుంటాడు. ఇక మళ్ళీ తిరిగి డ్యూటీలో చేరిన తర్వాత మనోహర్ ఎక్కువగా జానకి పై ఫోకస్ పెడతాడు. ఇక సాంబశివరావు అనే వ్యక్తితో కలిసి జానకిపై అనవసరమైన నిందలు వేస్తాడు. ఒక దొంగ డబ్బులు ఎత్తుకొని పోగా జానకి ఆ దొంగను పట్టుకున్న తర్వాత కేవలం రెండు లక్షల మాత్రమే వెనక్కి తిరిగి ఇచ్చింది అని మిగతా ఎనిమిది లక్షలు ఆమె నొక్కేసింది అని సాంబశివరావు అనే వ్యక్తి ఆమెపై ఆరోపణలు చేస్తాడు.

 jkl
ఎలాగైనా సమస్య నుంచి బయటపడి : అయితే మొదట జానకి మాత్రం ఎస్ఐ మనోహర్ ఇదంతా చేయిస్తున్నాడు అని గమనించదు. కానీ మనోహర్ మాత్రం జానకిని ఎలాగైనా ఈ కారణంగా జైల్లో వేసి కేసు నమోదు చేయాలని ఆ తర్వాత ఆమె ఐపిఎస్ వరకు వెళ్లడం కష్టమే అని అనుకుంటాడు. అయితే జానకి మాత్రం టెన్షన్ లో ఉంటుంది. ఎలాగైనా తన సమస్యను తనే సొంతంగా సాల్వ్ చేసుకోవాలని అనుకుంటుంది. ఇక రామచంద్ర కూడా భార్యకు సహాయంగా ఉంటాడు. ఎట్టకేలకు దొంగను పట్టుకున్న జానకీ అతని ద్వారా అసలు నిజం తెలుసుకుంటుంది. కావాలని ఒక వ్యక్తి తన చేత నాటకం ఆడించాడు అని చెప్పడంతో జానకి ఒక్కసారిగా షాక్ అవుతుంది.

ఊహించని కౌంటర్ ఇచ్చిన జానకి : ఇక అసలు వ్యక్తి సాంబశివరావుఅని జానకి గ్రహిస్తుంది. అయితే మరోవైపు ఎస్ఐ మనోహర్ జానకి ఇంకా దొంగను పట్టుకోలేదేమో అని వెంటనే పోలీస్ స్టేషన్ కు రావాలి అని సాంబశివరావు డబ్బులు అడుగుతున్నాడు అని లేదంటే నీపై కేసు నమోదు చేస్తాను అంటున్నాడు అని చెబుతాడు. అయితే సాంబశివరావుని పోలీస్ స్టేషన్కు రమ్మని చెప్పిన జానకి ఎస్ఐ ముందే అతనికి చివాట్లు పెడుతుంది. మొదట జానకి సైలెంట్ గా వచ్చి సాంబశివరావును కొడుతుంది. అతను డబ్బులు ఇవ్వకుండా ఇలా అన్యాయంగా ప్రవర్తిస్తారు ఏంటి అని.. నేను వెంటనే కేసు నమోదు చేస్తాను అని ఎస్ఐ మనోహర్ కు చెబుతాడు.

 jkl
నిజం మొత్తం బయటపడుతుంది : ఇక మనోహర్ కూడా జానకి ఎందుకు ఇలా చేస్తుందో అర్థం కాని పరిస్థితుల్లో ఉంటాడు. ఇక అవును వెంటనే మీరు కేసు నమోదు చేయండి అని అతనికి చెబుతాడు. ఇక జానకి వెంటనే రామచంద్రను పిలుస్తుంది. రామచంద్ర అసలు దొంగను పట్టుకొని వస్తాడు. అతని ద్వారా అసలు నిజం మొత్తం బయటపడుతుంది. ఇక సాంబశివరావు వెంటనే జానకి కాలు పట్టుకుంటాడు. డబ్బులకు ఆశపడి ఈ విధంగా చేశాను అని నన్ను తండ్రి అనుకొని క్షమించు అని నువ్వు నా కూతురు లాంటి దానివి అని అంటాడు. కానీ జానకి మాత్రం అతన్ని ఏమాత్రం క్షమించదు. ఇంతటి నేరం చేసిన నిన్ను ఊరికే వదిలిపెట్టను అని నేనే కేసు నమోదు చేసి పోలీస్ స్టేషన్లో పడేస్తాను అని చెప్పి అతని సెల్లో వేసేస్తుంది.

 jkl
జానకి కోసం ప్రత్యేకంగా పూజలు : ఇక ఇన్ డైరెక్ట్ గా జానకి దీనికి కారణం ఎస్ఐ మనోహర్ అని గ్రహిస్తుంది. నీ వెనకాల కూడా ఎవరున్నారో వారికి కూడా తప్పకుండా బుద్ధి చెబుతాను అని ఆమె చెప్పడంతో ఎస్ఐ మనవరు ఒక్కసారిగా షాక్ అవుతాడు. అతను ఏమీ అనలేని పరిస్థితుల్లో ఉంటాడు. అయితే మరో వైపు ఇంట్లో అందరూ కూడా జానకి కోసం ప్రత్యేకంగా పూజలు చేస్తూ ఉంటారు. ఇక ఇంతలో నీలావతి కూడా అక్కడికి వస్తుంది. అయితే అదే అవకాశం గా భావించిన నీలావతి మల్లికకు మద్దతు పలుకుతూ జానకి ఎప్పుడు చూసినా ఇంట్లో పూజలు జరిగే సమయంలో అసలు ఉండదు అని ఆమెకు ఒక కోడలింగా ఉండాల్సిన లక్షణాలు ఏమీ లేవు అని అబద్ధాలు చెబుతుంది.

 jkl
జరిగింది చెప్పిన జానకి : అయితే తమ వదిన గురించి ఆ విధంగా మాట్లాడొద్దు అని విష్ణు తో పాటు అఖిల్ కూడా చెప్తాడు. ఇక వారు అందరూ అలా మాట్లాడుతున్న సమయంలో అప్పుడే జానకి భర్తతో కలిసి వస్తుంది. ఎంతో సంతోషంగా అమ్మవారికి నమస్కరిస్తూ అసలు విషయం చెబుతుంది. నిజం నిరూపించాను అని చెప్పడంతో అత్తమామ గారు కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తారు. ఇక వెంటనే నీలావతి మాట మార్చేసి.. నీ గురించి నాకు తెలుసు జానకి తప్పకుండా నువ్వు ఈ విధంగా తిరిగి వస్తావు అని అనుకుంటున్నాను ఆమె మాట మారుస్తుంది. ఇక జరిగిన విషయాన్ని మొత్తం జానకి అందరికీ చెబుతుంది. ఇక జానకి తెలివిని చూసి జ్ఞానాంబ కూడా ఎంతగానో సంతోషపడుతుంది. ఇక రేపు జానకి గారు ఐపీఎస్ ట్రైనింగ్ కు వెళ్లబోతున్నారు అని కూడా చెబుతాడు. మరి జానకి రాబోయే రోజుల్లో ఇంకా ఇలాంటి సవాళ్లు ఎదుర్కొంటుందో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X