Janaki Kalaganaledu June 28th: రామ, జానకి రొమాంటిక్ నైట్.. మరోసారి భయపడిన మల్లిక దొంగబుద్ది

జానకి కలగనలేదు సీరియల్ ఆకట్టుకునే ఎమోషన్స్ తో ఎంతో ఆసక్తిగా కొనసాగుతోంది. ఐపీఎస్ కావాలని అనుకున్న జానకి కానిస్టేబుల్ కావాల్సి వస్తుంది. ఇక మరోసారి ఐపీఎస్ పరీక్షలు రాసి తన కలను నిజం చేసుకోవాలి అని అనుకుంటుంది. ఇక పోలీస్ స్టేషన్లో అక్కడ ఆమెకు ఎస్ఐ మనోహర్ నుంచి ఇబ్బందులు ఎదురవుతాయి. ఇక భర్త రామ ఆమెకు సపోర్ట్ చేస్తాడు. ఇక జానకి కలగనలేదు సీరియల్ కు గత వారం కంటే ఈ వారం రేటింగ్స్ మరింత పెరిగాయి. 6.72 రేటింగ్ తో గత వారం మంచి క్రేజ్ అందుకుంటోంది. నేడు ప్రసారం కాబోయే 617 వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం..

సమస్యలన్నీటిని తొలగించుకున్న జానకి: జానకి ఐపిఎస్ కావడానికి సమయం దగ్గర పడుతూ ఉంటుంది. పరీక్షల్లో పాస్ అయిన తర్వాత ఎస్ఐ మనోహర్ నుంచి ఆమెకు కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా మళ్లీ వాటి అన్నిటినీ ఎదిరించిన జానకి తనది ఏ తప్పు లేదు అని నిరూపించుకుంటుంది.

Janaki Kalaganaledu June 28th:

తన ఎదురుగా ఉన్న సమస్యలన్నీటిని తొలగించుకున్న జానకి ఇప్పుడు ఐపిఎస్ ట్రైనింగ్ కోసం సిద్ధమవుతూ ఉంటుంది. ఇక ఇంట్లో అత్తగారు కూడా ప్రత్యేకంగా పూజలు కూడా చేస్తూ ఉంటారు. అయితే అందరూ సంతోషంగా ఉన్న సమయంలో రేపటి నుంచి జానకి గారు ఐపీఎస్ ట్రైనింగ్ కోసం కొన్ని వారాలపాటు మనకు దూరంగా ఉంటారు అని రామ చెబుతాడు.

బాధలో రామచంద్ర: అయితే రామచంద్ర జానకి దూరంగా వెళుతూ ఉండడంతో కొంత బాధపడుతూ ఉంటాడు. ఇక అతను గదిలోన ఒంటరిగా కూర్చుంటూ బాధపడుతూ మాట్లాడుకుంటూ ఉంటాడు. ఇక జానకి తన భర్తను ఓదార్చు ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ముందుగా రామచంద్ర జానకికి ఇష్టమైన బొమ్మను పట్టుకొని రేపటి నుంచి ఈ ఇంట్లో మనం ఒంటరిగా ఉండాలి అని మీ అమ్మ ఐపిఎస్ ట్రైనింగ్ కు వెళుతుంది అని ఒక చిన్న పిల్లడి తరహాలో చెబుతూ ఉంటాడు. ఇక జానకి రామచంద్ర మాట్లాడుతున్న మాటలు వెనకాల నుంచి వింటూ ఉంటుంది.

Janaki Kalaganaledu June 28th:

రామచంద్రను అంత నమ్మకండి: ఇక వెంటనే రామ వెనకాల నుంచి పట్టుకున్న జానకి నేను ఐపిఎస్ ట్రైనింగ్ కు వెళ్లాను అని అంటుంది. దీంతో రామచంద్ర ఎందుకు వెళ్లారు అంటూ ఆశ్చర్యపోతాడు. మీరు ఇలా బాధపడుతూ ఉంటే నేను ఎలా వెళ్తాను అని ఆమె అనడంతో ఈ రామచంద్రను అంత నమ్మకండి అంటూ అతను మంచివాడు కాదు అన్నట్లుగా రామచంద్ర తనపై తానే తిట్టుకుంటూ ఉంటాడు. దీంతో జానకి ఒక్కసారిగా ప్రేమతో సీరియస్ అవుతూ నా రామచంద్రను ఏమైనా అంటే బాగుండదు అని హెచ్చరికలు చేస్తుంది. ఇక ఒకరికొకరు ప్రేమగా తిట్టుకుంటూ చూసుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు.

Janaki Kalaganaledu June 28th:

అందరూ సంతోషంగా ఉన్నారు: ఇక మరోవైపు గోవిందరాజులు కూడా చాలా సంతోషంగా ఉంటాడు. జానకి ఇబ్బందులు లేకుండా ఉంది కాబట్టి నాకు చాలా సంతోషంగా ఉంది అని ఈ సమయంలో నాకు పాయసం తినాలని ఉంది అన్నట్లుగా గోవిందరాజులు తన భార్యను అడుగుతాడు. ఇక ఆమె కూడా చాలా సంతోషంగా సరే అని అంటుంది. గోవిందరాజులు అయితే ప్రశాంతంగా ఉండు ఇప్పుడు ఇంట్లో అందరూ కూడా ప్రశాంతంగా ఉన్నారు అని అనుకుంటూ ఉంటాడు. కానీ మరోవైపు జానకి తోటి కోడలు మల్లిక మాత్రం అసలు ఏమాత్రం సంతోషంగా ఉండదు.

Janaki Kalaganaledu June 28th:

తన కోపాన్ని భర్త పై చూపిస్తూ:జానకి ఒక కానిస్టేబుల్ గా ఉన్నప్పుడే నన్ను ఇంట్లో చాలా తక్కువ చేసి చూసారు. ఇక ఇప్పుడు ఆమె ఐపిఎస్ అయ్యింది అంటే నన్ను ఒక పని మనిషి కంటే దారుణంగా చూస్తారు అని అసూయ చెందుతూ ఉంటుంది. ఒక మిరపకాయ తింటూ తనలో తన కోపాన్ని భర్త పై చూపిస్తూ ఉంటుంది. ఇక అతను మాత్రం మల్లికకు సర్ది చెప్పే ప్రయత్నం చేస్తాడు.

ఇలా అనవసరంగా కోపాన్ని తెచ్చుకోవద్దు అని ప్రశాంతంగా ఉండాలి అని చెబుతాడు. అయినప్పటికీ మల్లిక తన కోపాన్ని చూపిస్తూనే ఉంటుంది. ఇక మరోవైపు రామచంద్ర జానకి ఆ రాత్రి ఆనందంగా గడపాలని అనుకుంటారు చాలా రోజులు భర్తకు దూరంగా ఉండాలి కాబట్టి జానకీ ఇక అతనికి గుర్తుండిపోయేలా అందంగా రెడీ అవుతూ ఉంటుంది. ఎంతో రొమాంటిక్ గా మాట్లాడుకుంటూ రామచంద్ర జానకితో ఆ రాత్రిని గడిపేస్తారు.

మరోసారి మల్లిక దొంగబుద్ది: ఇక ఉదయాన్నే అత్తగారు జానకి కోసం ప్రత్యేకంగా పిండి వంటలు తయారు చేస్తూ ఉంటారు. జానకి అక్కడ ఎలాంటి తిండి పెడతారో అని ఆమె స్పెషల్ గా స్వీట్లు తయారు చేస్తూ ఉంటుంది ఇక రెడీ చేస్తున్న సమయంలోనే గోవిందరాజులు వచ్చి ఇలా చేయకూడదు అని జానకి వెళ్ళేది ఐపిఎస్ ట్రైనింగ్ కు అని నువ్వు ఇలా స్వీట్లు అవి పెడితే అక్కడ ఒప్పుకోరు అని చెబుతాడు.

అయినప్పటికీ కూడా జ్ఞానాంబ బాగానే సిద్ధం చేస్తూ ఉంటుంది. ఇక మరోవైపు మల్లిక కావాలని కొన్ని స్వీట్లు పక్కకు తప్పించే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. తన కొంగు చాటున వాటిని దాచుకుంటూ ఉంటుంది. అయితే పనివాడు మలయాళం చుస్తాడు. దీంతో మల్లికా నోరు మూసుకోవాలని అతనికి వార్నింగ్ ఇస్తుంది. ఇక చివరికి మలయాళం తెలివిగా మీ పక్కన బల్లి అంటూ హఠాత్తుగా చెప్పడంతో మల్లికా భయపడి లేస్తుంది. దీంతో అసలు విషయం బయటపడుతుంది. మరి మల్లిక ఆ విషయంలో ఎలాంటి సమాధానం చెబుతుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X