Janaki Kalaganaledu June 30th: భార్య లేక సతమతమవుతున్న రామ.. ఆ బాధలోనే జానకి!

జానకి కలగనలేదు సీరియల్ ఆకట్టుకునే ఎమోషన్స్ తో ఎంతో ఆసక్తిగా కొనసాగుతోంది. ఐపీఎస్ కావాలని అనుకున్న జానకి కానిస్టేబుల్ కావాల్సి వస్తుంది. ఇక మరోసారి ఐపీఎస్ పరీక్షలు రాసి తన కలను నిజం చేసుకోవాలి అని అనుకుంటుంది. ఇక పోలీస్ స్టేషన్లో అక్కడ ఆమెకు ఎస్ఐ మనోహర్ నుంచి ఇబ్బందులు ఎదురవుతాయి. ఇక భర్త రామ ఆమెకు సపోర్ట్ చేస్తాడు. ఇక జానకి కలగనలేదు సీరియల్ కు గత వారం కంటే ఈ వారం రేటింగ్స్ మరింత పెరిగాయి. 6.72 రేటింగ్ తో గత వారం మంచి క్రేజ్ అందుకుంటోంది. నేడు ప్రసారం కాబోయే 620 వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం..

సడన్ గా జానకి నిజం చెప్పడంతో..: జానకి ఐపిఎస్ ట్రైనింగ్ కోసం వెళుతూ ఉండడంతో ఇంట్లో అందరూ కూడా కాస్త బాధతో ఉంటారు అయితే ఆమె లక్ష్యం కోసం వెళుతోందని అందరూ కూడా సంతోషంగా పంపించాలి అని గోవిందరాజులు చెబుతాడు. అయితే జానకి మొదట కేవలం రెండు నెలల్లో ట్రైనింగ్ ఉంటుంది అని చెబుతుంది కానీ అందరూ టెన్షన్ పడతారు అని ఆమె అబద్ధం చెబుతుంది. ఇక సడన్ గా మళ్ళీ దాదాపు 11 నెలల వరకు శిక్షణ ఇస్తారు అని అసలు నిజం చెప్పడంతో అందరూ కూడా షాక్ అవుతారు. ఇక రామచంద్రకు కూడా ఆ విషయాన్ని జానకి ముందుగా చెప్పదు. దీంతో అందరూ కూడా కాస్త బాధపడుతూ ఉంటారు. ఇక గోవిందరాజులు జానకికి సపోర్ట్ చేస్తూ ఐపీఎస్ అంటే మామూలు విషయం కాదు అని ఆ మాత్రం టైం పడుతుంది అనే అందరికీ సర్ది చెప్పే ప్రయత్నం చేస్తాడు.

Janaki Kalaganaledu

ముందుగా చెబితే మీరు అప్సెట్ అవుతారు: ఇక జానకిని ఆటోలో బస్ స్టాప్ వరకు తిప్పడానికి రామచంద్ర తోడుగా వెళతాడు. అయితే అతను ఆటోలో చాలా దిగులుగా కనిపిస్తూ ఉండడంతో జానకి కూడా బాధపడుతుంది. కేవలం రెండు నెలల్లోనే ఉంటుంది అని అబద్ధం చెప్పాను.. మోసం చేశానా అని ఆమె అడగడంతో రామచంద్ర బాధపడుతూ అలా ఏమీ లేదు అని చెబుతాడు. ముందుగా చెబితే మీరు అప్సెట్ అవుతారు అని అందుకే చెప్పలేదు అని ఆమె చెప్పడంతో పరవాలేదు అని.. ఒకవైపు బాధగా ఉన్నా కూడా మీరు అనుకున్న లక్ష్యం కోసం వెళుతున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది అని చెబుతాడు.

Janaki Kalaganaledu

భర్తతో మరింత ప్రేమగా: ఇక జానకి కాస్త బాధపడుతూ ఉండడంతో రామచంద్ర ఆమెను ఆ బాధలో నుంచి బయటకు తీసుకురావడానికి చెరుకు రసం తాగండి అని చెబుతాడు. ఆటో డ్రైవర్ మా ఇద్దరికీ చెరుకు రసం తీసుకురా అని చెప్పి పంపిస్తాడు. ఆ సమయంలో జానకి భర్తతో మరింత ప్రేమగా మాట్లాడే ప్రయత్నం చేస్తుంది. ఇక చెరుకు రసం తాగడంతో ఆమె నోటికి నురగ అంటుకుంటుంది. దాన్ని చూసి రామచంద్ర సరదాగా నవ్వుకుంటూ ఉంటాడు. ఇక అలా హ్యాపీగా ఉండగా మరోవైపు మల్లిక మాత్రం జానకి వెళ్ళిపోతున్నందుకు కుళ్ళి కుళ్ళి బాధపడుతూ ఉంటుంది. జానకి ఐపిఎస్ అవుతున్నందుకు నాకు ఎంత మాత్రం సంతృప్తిగా లేదు అని వెంటనే ఏదో ఒకటి జరిగే జానకి మళ్ళీ వెనక్కి రావాలి అని కోరుకుంటూ ఉంటుంది.

Janaki Kalaganaledu

మలయాళంను రిస్క్ లో పెట్టిన మల్లిక:ఇక టెన్షన్ లో మల్లిక మిరపకాయ బజ్జి కొరికేసి గట్టిగా అరుస్తూ ఉండడంతో పనివాడు మలయాళం వచ్చి ఏం జరిగింది అని అంటాడు. వెంటనే మంచినీళ్లు తీసుకురా అని చెప్పినప్పటికీ అతను ఏదో అనుమానంగా చూస్తూ ఉంటాడు. అయితే మరోవైపు నుంచి గోవిందరాజులు కూడా వస్తూ ఉండడంతో మళ్లీ ఆయన ఏమంటారో అని మల్లిక వెంటనే మలయాళం కళ్ళు మూసుకోమని చెప్పి మిగతా రెండు మిరపకాయ బజ్జీలను అతని నోట్లో పెట్టేస్తుంది. దీంతో అతను ఏమీ మాట్లాడలేని పరిస్థితుల్లో ఉంటాడు. ఇక అక్కడి నుంచి సైలెంట్ గా మల్లికా జంప్ అవుతుంది. ఇక గోవిందరాజులు మలయాళం పై సరదాగా సీరియస్ అవుతూ మాకు చెప్పకుండా నువ్వే మిరపకాయ బజ్జీలు చేసుకుని తింటావా అని.. అతని వెంటపడి కొట్టే ప్రయత్నం చేస్తాడు. నెక్స్ట్ టైం ఇలా చేయకు అని కూడా అతనికి హెచ్చరిక చేస్తాడు. ఇక గండం తప్పింది అని మల్లికా జారుకుంటుంది.

Janaki Kalaganaledu

మర్చిపోలేక రామ ఇబ్బందులు: ఇక జానకితో బస్ స్టాప్ వరకు రావడంతో రామచంద్ర ఆమెను పంపించేందుకు చాలా ఇబ్బంది పడుతూ ఉంటాడు. 11 నెలలు మిమ్మల్ని వదిలి ఎలా ఉండాలో అర్థం కావడం లేదు అని అతను తన మనసులో బాధపడుతూ ఉంటాడు. ఇక జాగ్రత్తగా ఉండాలి అని జానకి అతనికే ఎంతో ప్రేమగా చెబుతూ ఉంటుంది. ఇక జానకి ఫైనల్ గా బస్సు ఎక్కగా రామచంద్ర దీనంగా ఆమెను చూస్తూ ఉంటాడు. ఇక ఆమెకు సంబంధించిన జ్ఞాపకాలు ఎక్కువగా తలుచుకుంటూ ఉంటాడు. అలాగే జానకి కూడా భర్తతో ఇన్నేళ్లు గడిపిన క్షణాలను గుర్తు చేసుకుంటూ ఉంటుంది. చివరికి వీడ్కోలు పలికి వెళ్ళిపోతుంది. ఇక గోవిందరాజులు జ్ఞానాంబ ఇద్దరు కూడా జానకి వెళ్ళిపోయింది అని.. మరి రామచంద్ర ఎలా ఉంటాడో అని వాళ్ళు కూడా ఆలోచిస్తూ ఉంటారు. ఇక రామచంద్ర రాగానే తనకు అలాంటి బాధ ఏమీ లేదు అని చెబుతాడు. కానీ అతను మలయాళం పిలిచినా కూడా జానకి పిలిచిందేమో అని అనుకుంటాడు. దీంతో తల్లిదండ్రులు కూడా కొంత అప్సెట్ అవుతారు. ఇక సైలెంట్ గా ఏమీ అనకుండా రామచంద్ర ఇంట్లోకి వెళ్లిపోతాడు. మరి రామచంద్ర లేని జానకి ఏ విధంగా ఫీల్ అవుతుందో తదుపరి ఎపిసోడ్ లో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X