Janaki Kalaganaledu June 6th: అఖిల్ కోసం రిస్క్ తీసుకున్న జానకి.. ఇంతలోనే మరో అనుమానం!
జానకి కలగనలేదు సీరియల్ ఆకట్టుకునే ఎమోషన్స్ తో ఎంతో ఆసక్తిగా కొనసాగుతోంది. ఐపీఎస్ కావాలని అనుకున్న జానకి కానిస్టేబుల్ కావాల్సి వస్తుంది. ఇక మరోసారి ఐపీఎస్ పరీక్షలు రాసి తన కలను నిజం చేసుకోవాలి అని అనుకుంటుంది. ఇక పోలీస్ స్టేషన్లో అక్కడ ఆమెకు ఎస్ఐ మనోహర్ నుంచి ఇబ్బందులు ఎదురవుతాయి. ఇక భర్త రామ ఆమెకు సపోర్ట్ చేస్తాడు.
కానీ రామను మనోహర్ డ్రగ్స్ కేసులో ఇరికిస్తాడు. ఇక జానకి కలగనలేదు సీరియల్ కు గత వారం కంటే ఈ వారం రేటింగ్స్ మరింత పెరిగాయి. 6.72 రేటింగ్ తో గత వారం మంచి క్రేజ్ అందుకుంటోంది. నేడు ప్రసారం కాబోయే 598 వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం..

ఎందుకు నువ్వు అలా మాట్లాడుతున్నావు?: జానకి పై ఎప్పుడు ఏదో ఒక విధంగా నిందలు వేసే మల్లిక మరోసారి కావాలని ఆమెను తిట్టడానికి ప్రయత్నం చేస్తుంది. అయితే ఈ క్రమంలో మల్లిక మాట్లాడుతున్న విధానాన్ని తప్పు పట్టిన చిన్న కోడలు జెస్సి ఎందుకు అలా అక్క గురించి తప్పుగా మాట్లాడుతున్నావు అని అడుగుతుంది. అయితే అదే సమయంలో మల్లిక భర్త విష్ణు వచ్చి జెస్సి పై కూడా సీరియస్ అవుతూ ఉంటాడు.
పెద్ద చిన్న తేడాలు తెలియకుండా ఎందుకు నువ్వు అలా మాట్లాడుతున్నావు అని అసలు నీకు ఎలాంటి హక్కు ఉంది అని మల్లికను తిడుతున్నావని అంటాడు. అయితే వారిద్దరూ అలా మాట్లాడుతున్న సమయంలో అప్పుడే రామచంద్ర కూల్ చేసే ప్రయత్నం చేస్తాడు. చిన్నవాటికి అనవసరంగా ఎందుకు గొడవపడడం అని ఇంతటితో వదిలేయాలి అని చెబుతాడు. అయినప్పటికీ మల్లిక ఏమాత్రం తగ్గకుండా తన భర్తను రెచ్చగొడుతుంది.

జెస్సిపై అఖిల్ సీరియస్: ఈ క్రమంలో విష్ణు అఖిల్ పై కూడా కాస్త అసహనం వ్యక్తం చేస్తాడు. నీ భార్య నా భార్యను ఎందుకు తిడుతుంది అని అడుగుతాడు. ఇక అఖిల్ కూడా ఆడవాళ్లు వారి గొడవలో మన తలదూర్చడం అనవసరం అని మాట్లాడుతూ ఉంటాడు. అంతేకాకుండా జెస్సిని కూడా అతను ప్రశ్నించే ప్రయత్నం చేస్తాడు.
అసలు నువ్వు ఎందుకు గొడవ పడుతున్నావు అని అడగడంతో అనవసరంగా జానకి అక్కను మల్లిక అక్క తిడుతుంది అని చెప్పడంతో, అసలు ఆమె గురించి నీకు ఎందుకు అని అఖిల్ సీరియస్ అవుతూ ఉంటాడు. అనవసరంగా నువ్వు జానకి విషయంలో ఎక్కువగా ఆలోచిస్తున్నావని చెప్పడంతో జెస్సి బాధపడుతూ ఉంటుంది. ఇక ఈ గొడవలు జరుగుతున్న సమయంలో అప్పటికే ఇంట్లోకి జ్ఞానాంబ జానకితో వస్తుంది. ఏం జరుగుతోంది ఇక్కడ అని ఆమె గట్టిగా అడుగుతుంది.

అనవసరంగా ఇంట్లో గొడవలు సృష్టించాలని: ఇక అదే సమయంలో గోవిందరాజులు కూడా వచ్చే అదే తరహాలో ప్రశ్నిస్తాడు. ఇక్కడ ఒక నాలుక అనవసరంగా ఇంట్లో గొడవలు సృష్టించాలని చూస్తోంది అని, దాని గురించి నాకు బాగా తెలుసు అని, అది ఎవరో కూడా ఇక్కడ అందరికీ తెలుసు అని అత్తగారు అంటూ ఉంటారు. ఇక అప్పుడే మల్లికా షాక్ అవుతుంది. అనవసరంగా గొడవలు పెట్టాలని చూడొద్దు అని చెప్పడంతో మెల్లగా అక్కడ నుంచి అందరూ వెళ్లిపోతారు. ఇక జానకి కూడా బాధపడుతూ వెళ్ళిపోతుంది. వెంటనే గోవిందరాజులు జానకిని ఓదార్చాలేని రామచంద్ర కు చెబుతాడు.

దేనికైనా సమయం రావాలి: ఇక మరోవైపు జ్ఞానాంబ తన భర్త గోవిందరాజులతో మల్లికపై అసహనం వ్యక్తం చేస్తూ మాట్లాడుతూ ఉంటుంది. పిల్లలు మంచి మనసుతో కలిసి మెలిసి ఉంటారు అనుకుంటే ఇప్పుడు ఈ విధంగా గొడవ పడుతున్నారు అని, పెద్దవాళ్ళు అయినా కూడా మనమే వారికి ఇంకా బుద్ధి నేర్పాల్సి వస్తుంది అని బాధపడుతూ ఉంటుంది. ఈ విషయంలో జానకి కూడా చాలా బాధపడుతుంది అని గోవిందరాజులు అంటాడు.
అంతేకాకుండా నువ్వు కూడా జానకి ఇబ్బంది పెడుతున్నావు అని చెబుతాడు. తాను ఒక ఐపీఎస్ ఆఫీసర్ అవ్వాలని అనుకుంటుంది. ఈ క్రమంలో నువ్వు తనను హాస్పిటల్కి తీసుకువెళ్లి పిల్లలు ఎందుకు అవ్వడం లేదు అని పరీక్షలు చేయించడం ఏమాత్రం కరెక్ట్ గా అనిపించడం లేదు. దేనికైనా సమయం రావాలి కాస్త ఓపిక పట్టాలని గోవిందరాజులు తన భార్యకు చెబుతాడు.

జానకి మనసులో ఆవేదన: ఇక మరోవైపు జానకి అసలు పిల్లలు పుట్టారు అనే విషయం గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది. ఆ విషయాన్ని ఇంట్లో ఎలా చెప్పాలో తెలియక ఆమె తనలో తానే ఎంతగానో ఆవేదన చెందుతూ ఉంటుంది.
ఇక అప్పుడే భర్త రామచంద్ర వచ్చి ఆమెకు సర్ది చెప్పే ప్రయత్నం చేస్తాడు. మీరు ఏ విషయంలోనైనా ఎక్కువగా బాధపడుతున్నారు అని అదేమీ పట్టించుకోవద్దని అంటాడు. ఇక భర్తకు కూడా అసలు విషయం చెప్పకుండా జానకి దాస్తుంది.
అఖిల్ లోన్ గురించి ఆలోచించిన జానకి: అప్పుడే బ్యాంకు నుంచి కొంత మంది ఆఫీసర్స్ వచ్చి జానకి రామచంద్ర తో మాట్లాడుతారు. మీ తమ్ముడు అఖిల్ బ్యాంకులో లోన్ కు అప్లై చేశాడు అని అందుకు సాక్షి సంతకాలు కావాలి అని చెప్పడంతో రామచంద్ర అతను లోన్ తీసుకుంటే మాకు ఏంటి సంబంధం? అతను తిరిగి కట్టకపోతే ఎలా? ఏదైనా అతనినే అడగండి అని అంటాడు. కానీ జానకి మాత్రం అలా కాకుండా అతను కూడా నా బిడ్డలాంటి వాడే అని అఖిల్ నాపై కోపం చూపించిన ఎప్పటికి నాకు అతనిపై కోపం కలగదు అని చెబుతూ సాక్షి సంతకం పెడుతుంది.
ఇక జానకి ఒక పోలీస్ కానిస్టేబుల్ కావడంతో ఆమె సంతకం చెల్లుతుంది. దీంతో అఖిల్ జానకి చేసిన సహాయం గురించి కొంత ఆలోచిస్తాడు. అయినప్పటికీ కూడా అతను మళ్ళీ జానకి సంతకం నిజంగానే పెట్టిందా మళ్ళీ ఏదైనా తేడాగా జరిగిందా? అని అనుమాన పడుతూ ఉంటాడు. మరి ఈ విషయంలో అతను జానకితో ఏ విధంగా ప్రవర్తిస్తాడో చూడాలి.


Click it and Unblock the Notifications











