Janaki Kalaganaledu June 7th: కోడలిపై గోవిందరాజుల అనుమానాలు.. నిజం చెప్పిన జానకి

జానకి కలగనలేదు సీరియల్ ఆకట్టుకునే ఎమోషన్స్ తో ఎంతో ఆసక్తిగా కొనసాగుతోంది. ఐపీఎస్ కావాలని అనుకున్న జానకి కానిస్టేబుల్ కావాల్సి వస్తుంది. ఇక మరోసారి ఐపీఎస్ పరీక్షలు రాసి తన కలను నిజం చేసుకోవాలి అని అనుకుంటుంది. ఇక పోలీస్ స్టేషన్లో అక్కడ ఆమెకు ఎస్ఐ మనోహర్ నుంచి ఇబ్బందులు ఎదురవుతాయి.

ఇక భర్త రామ ఆమెకు సపోర్ట్ చేస్తాడు. ఇక జానకి కలగనలేదు సీరియల్ కు గత వారం కంటే ఈ వారం రేటింగ్స్ మరింత పెరిగాయి. 6.72 రేటింగ్ తో గత వారం మంచి క్రేజ్ అందుకుంటోంది. నేడు ప్రసారం కాబోయే 599 వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం..

Janaki Kalaganaledu Serial 2023 June 7th Episode 2023

కాస్త అనుమానంగా చూసినప్పటికీ: జానకి తల్లి కావాలని ఎన్నో కలలు కంటుంది కానీ ఆమె ఒక ఆక్సిడెంట్ వలన గాయపడి గర్భసంచిని కోల్పోతుంది. దీంతో ఆమెకు జీవితంలో మళ్లీ పిల్లలు పుట్టే అవకాశం లేదని డాక్టర్ కూడా చెబుతుంది. ఇక జానకి ఆ విషయంలో చాలా బాధపడుతుంది.

ఇంట్లో నిజాన్ని కూడా చెప్పకుండా ఆమె ఎంతగానో మనోవేదనకు గురి అవుతుంది. ఇతరులు ఆమెను కాస్త అనుమానంగా చూసినప్పటికీ కూడా అసలు నిజం చెప్పదు. ఇక జానకి ఎందుకు ఈ మధ్య ఎక్కువగా బాధపడుతోంది అని భర్త రామచంద్ర కూడా అడుగుతాడు కానీ అసలు నిజం మాత్రం తెలియదు.

Janaki Kalaganaledu Serial 2023 June 7th Episode 2023

అఖిల్ తన తప్పు తెలుసుకుని: ఇంట్లో పరిస్థితులు ఎలా ఉన్నా కూడా జానకి మాత్రం చాలా సంతోషంగా ఉండాలని అనుకుంటుంది. అయితే తన చిన్న మరిది అఖిల్ కొడుకును ఎత్తుకొని ఆమె ఎంతో సంతోషంగా ఉంటుంది. ఇక అఖిల్ కోసం కూడా జానకి ఆలోచిస్తుంది. అతను బ్యాంకులో లోన్ కోసం అప్లై చేయగా ఆమె సాక్షి సంతకం పెట్టి ఆ లోన్ వచ్చేలా చేస్తుంది. అయితే అఖిల్ జానకి మీద మొదట అనుమానంగానే చూస్తాడు.

నా కోసం వదిన ఇంత మంచి పని చేసిందా అంటే నమ్మలేకుండా ఉన్నాను అని ఇక వెంటనే బ్యాంకు మేనేజర్ కు ఫోన్ చేసి అడగగా అతను అసలు నిజం చెబుతాడు. మీ వదిన బ్యాంకు మేనేజర్ కు తెలుసు అని ఆమె మీద నమ్మకంతోనే మీకు లోన్ ఇస్తున్నారని దాదాపు ఫినిష్ అయినట్లే అని అతను చెబుతాడు. ఇక అఖిల్ తన తప్పు తెలుసుకుని జానకిని మంచి దృష్టితో చూస్తాడు.

Janaki Kalaganaledu Serial 2023 June 7th Episode 2023

రామచంద్ర ఎమోషనల్: ఇక జానకి అఖిల్ కొడుకుతో ఎక్కువగా ఆడుకుంటూ ఉంటుంది. ఇక తన గదిలోకి తీసుకువెళ్లి భర్త కూడా బాబును ఇస్తుంది. అయితే అప్పుడే రామచంద్ర మాత్రం చాలా ఎమోషనల్ గా మాట్లాడుతుంటాడు. జానకి నిఖిల్ గురించి కూడా భర్తతో మాట్లాడుతుంది. అఖిల్ నిఖిల్ కవల పిల్లలు అని నిఖిల్ చనిపోయాడు అనే విషయాన్ని జానకి అత్తగారు నుంచి తెలుసుకుంటుంది.

ఇక ఈ బాబును మీరు నిఖిల్ అనుకోండి అని రామచంద్ర కు చెప్పగా అతను మాత్రం అసలు ఒప్పుకోడు. నిఖిల్ అంటే నాకు చాలా ఇష్టం.. వాడు మళ్ళీ నా కడుపులోనే పుట్టాలని అనుకున్నాను. తప్పకుండా అతను మన కడుపులోనే పుడతాడు అని రామచంద్ర మళ్ళి ఎమోషనల్ గా మాట్లాడడంతో జానకి ఆశ్చర్య పోతుంది.

ఎంతైనా ఎవరి బాబు వారి బాబే: అసలు విషయాన్ని ఎలా చెప్పాలో తెలియక సతమధ్యమవుతున్న సమయంలో ఇంకా తన భర్త నేను గర్భవతిని అవుతాను అని ఆశలు పెట్టుకున్నాడు అని జానకి ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే బాబు తల్లి జెస్సి వచ్చి బాబును తీసుకువెళ్తానని చెబుతోంది. పాలు పట్టించిన తర్వాత మళ్ళీ ఇక్కడికి తీసుకురావాలి అని ఈరోజు బాబు మా దగ్గర పడుకుంటాడు అని జానకి చెబుతుంది.

కానీ జెస్సీ మాత్రం అందుకు ఒప్పుకోదు వాడిని విడిచి నేను ఉండలేను అని తీసుకువెళ్తాను అని చెప్పి వెళ్ళిపోతుంది. దీంతో రామచంద్ర మళ్ళి జానకి తో మాట్లాడుతూ ఎంతైనా ఎవరి బాబు వారి బాబు అని అంటాడు. దీంతో మళ్ళీ జానకి ఎమోషనల్ అవుతుంది.

Janaki Kalaganaledu Serial 2023 June 7th Episode 2023

గోవిందరాజులు అనుమానాలు: ఇక మరోవైపు గోవిందరాజులు భార్య జ్ఞానాంబ పై అసంతృప్తి తో ఉంటాడు. ఆమె కూడా భర్త మాట్లాడిన విధానంపై కూడా ఏమాత్రం సంతోషంగా ఉండదు. జానకి తల్లి కావాలి అని ఆమె కోరుకుంటూ ఉంటుంది. కానీ అలా తొందర పెట్టవద్దని గోవిందరాజులు ఆమెకు చెప్పే ప్రయత్నం చేస్తాడు. ఇక జానకి మందులు వేసుకుందా అని మరోసారి జ్ఞానాంబ అడుగుతుంది. కానీ ఆమె మర్చిపోయాను అని చెప్పడంతో మళ్ళీ అత్తగారు సీరియస్ అవుతారు. ఇక వెంటనే నేను మళ్ళీ టాబ్లెట్స్ తెస్తాను అని లోపలికి వెళ్ళిన జ్ఞానాంబ తన ముందే టాబ్లెట్స్ వేసుకోవాలి అని చెబుతుంది.

కానీ జానకి మాత్రం పక్కకు వెళ్లి ఆ టాబ్లెట్స్ ను ఒక కుండీలో పడేస్తుందిమ్ ఇక అలా పడేయడాన్ని మామ గోవిందరాజులు చూస్తాడు. దీంతో జానకి ఇలా ఎందుకు చేస్తుందో అని ఆయన అనేక రకాలుగా ఆలోచిస్తూ ఉంటాడు. వెంటనే జానకిని నిజం అడిగే ప్రయత్నం కూడా చేయాలని అనుకుంటాడు. ఇక జానకి నిజం చెప్పే ప్రయత్నం చేస్తుంది. తనకు ఇక పిల్లలు పుట్టే అవకాశం లేదు అని ఆమె చెప్పడంతో ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఇక రామచంద్ర కూడా ఆ నిజాన్ని తెలుసుకుంటాడు. మరి జానకి విషయంలో రామ ఏ విధంగా నిర్ణయం తీసుకుంటాడో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X