Janaki Kalaganaledu June 8th: జీవితంలో పిల్లలు పట్టరని చెప్పేసిన జానకి.. భర్తకు మరో కొత్త ఆలోచన

జానకి కలగనలేదు సీరియల్ ఆకట్టుకునే ఎమోషన్స్ తో ఎంతో ఆసక్తిగా కొనసాగుతోంది. ఐపీఎస్ కావాలని అనుకున్న జానకి కానిస్టేబుల్ కావాల్సి వస్తుంది. ఇక మరోసారి ఐపీఎస్ పరీక్షలు రాసి తన కలను నిజం చేసుకోవాలి అని అనుకుంటుంది. ఇక పోలీస్ స్టేషన్లో అక్కడ ఆమెకు ఎస్ఐ మనోహర్ నుంచి ఇబ్బందులు ఎదురవుతాయి. ఇక భర్త రామ ఆమెకు సపోర్ట్ చేస్తాడు. ఇక జానకి కలగనలేదు సీరియల్ కు గత వారం కంటే ఈ వారం రేటింగ్స్ మరింత పెరిగాయి. 6.72 రేటింగ్ తో గత వారం మంచి క్రేజ్ అందుకుంటోంది. నేడు ప్రసారం కాబోయే 600 వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం..

అత్తగారికి చెబితే ఆమె తట్టుకోలేరు:జానకి తల్లి కావాలని కోరుకుంటుంది. అలాగే ఇంట్లో వాళ్ళు కూడా రామచంద్ర జానకి తల్లిదండ్రులు కావాలి అని చాలా ప్రేమగా కోరుకుంటారు. కానీ జానకి ఒక ప్రమాదంలో గాయం కావడంతో ఆమెకు భవిష్యత్తులో మళ్ళీ పిల్లలు పుట్టే అవకాశం లేదు అని డాక్టర్ చెబుతుంది. దీంతో జానకి ఒక్కసారిగా షాక్ అవుతుంది. అయితే ఆ విషయాన్ని మాత్రం ఆమె ఇంట్లో చెప్పడానికి భయపడుతుంది. ముఖ్యంగా అత్తగారికి చెబితే ఆమె తట్టుకోలేరు అని ఆ నిజాన్ని తనలోనే దాచుకుంటుంది. అయితే జ్ఞానాంబ మాత్రం జానకి కడుపు త్వరగా పండాలి అనేక విధాలుగా ప్రయత్నాలు చేస్తుంది. ఆమెకు కొన్ని టాబ్లెట్స్ కూడా ఇస్తుంది. కానీ జానకి మాత్రం ఆ టాబ్లెట్స్ వేసుకోకుండా బయట పడేస్తుంది.

Janaki Kalaganaledu Serial 2023 June 8th Episode 600

పిల్లలు పుట్టే అవకాశం లేదు:అయితే జానకి ఆ విధంగా చేస్తూ ఉండటంతో మామ గోవిందరాజులు గమనిస్తాడు. జానకి ఎందుకు ఈ విధంగా చేస్తుందో మొదట ఆయనకు ఏ మాత్రం అర్థం కాదు. వెంటనే ఆ విషయంలో నిజం తెలుసుకోవాలి అని గోవిందరాజులు జానకిని అడుగుతాడు. ఇక జానకి ఆ నిజాన్ని దాచుకోలేక మామ గారికి చెప్పేస్తుంది. తండ్రి తర్వాత తండ్రి లాంటివారు మీకు ఈ నిజం చెప్పాల్సిన బాధ్యత నాకు ఉంది అంటూ నాకు జీవితంలో పిల్లలు పుట్టే అవకాశం లేదు అని అసలు నిజం చెబుతుంది. దీంతో గోవిందరాజులు కూడా ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు. అయితే ఈ విషయాన్ని అత్తగారికి ఎంత మాత్రం చెప్పకూడదు అని ఆమె అసలు తట్టుకోలేదు అని జానకి చెబుతుంది.

Janaki Kalaganaledu Serial 2023 June 8th Episode 600

ఏట్టి పరిస్థితుల్లో ఈ విషయం తెలియకూడదు:దీంతో గోవిందరాజులు కూడా అది నిజమే అని అంటాడు. ఆమె ఒక్కసారిగా కుప్ప పోలిపోతుంది అని అందుకే ఈ విషయాన్ని నేను అసలు ఎవరికీ చెప్పను అని జానకికి మాట కూడా ఇస్తాడు. అయితే వీరు మాట్లాడుకుంటున్నారు తీరును గమనించిన రామచంద్ర కూడా అసలు నిజం తెలుసుకుంటాడు. కానీ రామచంద్రకు నిజం తెలిసిన విషయం జానకికి తెలియదు రామచంద్ర గారికి కూడా ఏట్టి పరిస్థితుల్లో ఈ విషయం తెలియకూడదు అనే ఆమె కోరుకుంటుంది. దీంతో రామ తన భార్య దగ్గర నిజం తెలియనట్లుగానే నటిస్తూ ఉంటాడు. ఇక రామచంద్ర నిజం తెలిసిన తర్వాత బాధపడుతూ ఉంటాడు.

Janaki Kalaganaledu Serial 2023 June 8th Episode 600

ఇబ్బంది కలగకుండా చేయాలి:ఇక అప్పుడే జానకి వెనకాల నుంచి వచ్చి అతన్ని కౌగిలించుకుంటుంది. ఇక మనసులో రామచంద్ర తన బాధను వ్యక్తపరుస్తున్నట్లుగా మాట్లాడుతూ ఉంటాడు. కానీ అదే తరహాలో జానకి కూడా తన మనసులో మాటలను బయటకు చెప్పాలని అనుకుంటుంది. కానీ ఏమాత్రం ఆమె చెప్పకుండా ఉండిపోతుంది. ఇక ఏ మాత్రం ఇబ్బంది కలగకుండా చేయాలి అని రామచంద్ర నిజం తెలియనట్లుగానే నటిస్తూ ఉంటాడు. ఇక ఆమె గదిలో ఉన్న బాబు ఫోటోలు కూడా తీసేయాలని అనుకుంటాడు. ఈ చిన్న బాబు ఫోటోలు మీ దగ్గర ఉండాల్సిన అవసరం లేదు అని ఇప్పుడు మల్లిక దగ్గర ఉంటేనే బాగుంటుంది అని చెబుతాడు.

Janaki Kalaganaledu Serial 2023 June 8th Episode 600

జానకి మరో కొత్త ఆలోచన:అయితే ఆ ఫోటోలు తీసి వేస్తే మళ్లీ అత్తయ్య గారు బాధపడతారు అని అందుకే వాటిని ఇక్కడే ఉంచాలి అని జానకి చెబుతుంది. దీంతో రామచంద్ర సరే అని అంటాడు. అయినా మనకు ఇప్పుడు పిల్లలు అవసరం లేదు అని మీరు ముందు మీ ఐపీఎస్ లక్ష్యాన్ని పూర్తి చేయాలి అని చెబుతాడు. ఇక పుస్తకాలను మళ్లీ జానకి ముందు ఉంచుతాడు. మీరు ఈ రోజు నుంచి మళ్లీ మీ లక్ష్యం గురించి మాత్రమే ఆలోచించాలి అని పిల్లల గురించి భవిష్యత్తులో ఆలోచిద్దాము అని చెబుతాడు. ఇక జానకి కూడా అదే తరహాలో మాట్లాడుతూ ఉంటుంది. ఇక తర్వాత జానకి మళ్ళీ తన చదువుపై ఫోకస్ చేయాలని అనుకుంటుంది. అలాగే జానకి రామచంద్ర కు భోజనం వడ్డించేటప్పుడు మరొక విషయం గురించి మాట్లాడుతుంది. మనకు ఎవరైనా అనాధ పిల్లలని దత్తత తీసుకుందామని ఆలోచనను బయటపడుతుంది. మళ్ళీ నాకు భవిష్యత్తులో పిల్లలు పుట్టకపోవచ్చు అని ఆమె కొంత అనుమానంగా మాట్లాడుతుంది. దీంతో రామచంద్ర మళ్ళీ వెంటనే అదేంటి అలా మాట్లాడుతారు నేను ఇప్పటికి కూడా మనకు పిల్లలు పుడతారు అని అనుకుంటున్నాను అని చెబుతాడు. మరి ఆ మాటలకు జానకి ఏ తరహాలో రియాక్ట్ అవుతుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X