Janaki Kalaganaledu June 9th: జానకి నిర్ణయానికి రామచంద్ర సీరియస్.. గోవిందరాజులు కొత్త ఆలోచన!

జానకి కలగనలేదు సీరియల్ ఆకట్టుకునే ఎమోషన్స్ తో ఎంతో ఆసక్తిగా కొనసాగుతోంది. ఐపీఎస్ కావాలని అనుకున్న జానకి కానిస్టేబుల్ కావాల్సి వస్తుంది. ఇక మరోసారి ఐపీఎస్ పరీక్షలు రాసి తన కలను నిజం చేసుకోవాలి అని అనుకుంటుంది. ఇక పోలీస్ స్టేషన్లో అక్కడ ఆమెకు ఎస్ఐ మనోహర్ నుంచి ఇబ్బందులు ఎదురవుతాయి. ఇక భర్త రామ ఆమెకు సపోర్ట్ చేస్తాడు. ఇక జానకి కలగనలేదు సీరియల్ కు గత వారం కంటే ఈ వారం రేటింగ్స్ మరింత పెరిగాయి. 6.72 రేటింగ్ తో గత వారం మంచి క్రేజ్ అందుకుంటోంది. నేడు ప్రసారం కాబోయే 601 వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం..

మాతృత్వాన్ని కోల్పోయిన జానకి:జానకి ఒక ప్రమాదంలో తన మాతృత్వాన్ని కోల్పోతుంది. అందరూ కూడా జానకి రామచంద్ర తల్లిదండ్రులవుతారని ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉన్న సమయంలోనే జానకి ప్రమాదం కారణంగా గర్భసంచిని కోల్పోతుంది. వైద్యులు ఆమెకు పరీక్షలు చేసిన తర్వాత మళ్ళీ మీకు పిల్లలు పుట్టే అవకాశం లేదని చెప్పేస్తారు. దీంతో జానకి ఆ విషయం తట్టుకోలేక పోతుంది. అయితే ఆ నిజం ఇంట్లో తెలిస్తే బాధపడతారు అని ఆమె చెప్పకుండా ఉంటుంది. ముఖ్యంగా రామచంద్రకు అలాగే అత్తగారికి తెలియకూడదు అని అనుకుంటుంది. కానీ మామ గోవిందరాజులు మాత్రం జానకి తీరును చూసి ఆమె నుంచి నిజం తెలుసుకుంటాడు. అయితే ఆయన కూడా జానకి సపోర్ట్ చేస్తూ ఇబ్బంది పడకుండా చూసుకోవాలని అనుకుంటాడు.

Janaki Kalaganaledu Serial 2023 June 9th Episode 601

జానకి కడుపు పండాలి అని..:మరోవైపు అత్తగారు మాత్రం జానకి కడుపు పండాలి అని తన ప్రయత్నాలు చేస్తూనే ఉంటుంది. మరోసారి తెలిసిన హాస్పిటల్కు తీసుకువెళ్లాలని అనుకుంటుంది. ఇక ఇంతలో గోవిందరాజులు వచ్చి మళ్ళీ హాస్పిటల్ కి ఎందుకు అని, అనవసరంగా నువ్వు జానకి విషయంలో తొందర పడుతున్నావని మొన్ననే కదా ఒక హాస్పిటల్కు తీసుకు వెళ్ళాము, అప్పుడే మళ్ళీ ఇంకో హాస్పిటల్ కు ఎందుకు తీసుకువెళ్లడం అని అడుగుతాడు. అంతేకాకుండా పిల్లలను కనడం అనేది వారి ఇష్టం అని మనం అనవసరంగా జోక్యం చేసుకోవద్దు అని గోవిందరాజులు చెబుతాడు. కానీ అత్తగారు మాత్రం మన ప్రయత్నం చేయాలి అని వాళ్ళు సైలెంట్ గా ఉంటే మనం కూడా మౌనంగా ఉండడం కరెక్ట్ కాదు అని చెబుతోంది.

Janaki Kalaganaledu Serial 2023 June 9th Episode 601

నిజం తెలిసినప్పటికీ కూడా..:ఇక ఇంతలో రామచంద్ర రావడంతో తల్లి అతనితో కూడా మాట్లాడుతుంది. చూసావా మీ నాన్నగారు ఏమంటున్నారో అని అంటుంది. రామచంద్ర కూడా నిజం తెలిసినప్పటికీ కూడా అక్కడ మౌనంగానే ఉంటాడు. కొన్నిసార్లు నాన్నగారి అనుభవంతో కూడా చెప్పే విషయాలు కూడా కరెక్ట్ అనే అనడంతో తల్లి మౌనంగా ఉండిపోతుంది. ఇక రామచంద్ర సైలెంట్ గా లోపలికి వెళ్ళిపోతాడు. ఇక జానకికి ఎలాగైనా చెడు జరగాలని మల్లిక ఒక మంత్రించిన నిమ్మకాయను ఆమె గదిలో పెడుతుంది. ఇక మరోవైపు పనివాడు మలయాళం జ్ఞానాంబ ఎదుట కొత్త నిమ్మకాయలను శుభ్రం చేస్తూ ఉంటాడు. ఇక మల్లికా అనవసరంగా ఆ నిమ్మకాయ పనిచేయడం లేదు అని వెంటనే దాన్ని తీసేసి బయట పారాయాలని అనుకుంటుంది.

Janaki Kalaganaledu Serial 2023 June 9th Episode 601

సైలెంట్ గా ఉన్న మల్లిక:ఇక మల్లిక ఆ నిమ్మకాయను తీసుకువస్తూ ఉండగా పొరపాటున అది అత్తగారి కాళ్ళ దగ్గర పడుతుంది. ఇక తర్వాత అటు నుంచి మలయాళం తుడుస్తున్న నిమ్మకాయల గుంపులు చేరిపోతుంది. ఇక దాన్ని చూసిన మలయాళం మళ్లీ ఇలాంటి నిమ్మకాయతో తెచ్చావు ఏమిటి అని తిడతారేమో అని దాన్ని తీసి బయట పారాయలని అనుకుంటాడు. ఇక మల్లిక కూడా ఆ విషయంలో సైలెంట్ గా జారుకుంటుంది. ఇక ఎంతసేపటికి రామచంద్ర రాకపోవడంతో భార్య జానకి కాంత ఆందోళన చెందుతుంది. ఎందుకు రామచంద్ర గారు ఈ మధ్య బాధగా ఉంటున్నారు అని ఆలోచిస్తుంది. ఫోన్ చేసిన కూడా కలవకపోవడంతో వెంటనే ఆమె బయటకు వెళ్లి చూడాలని అనుకుంటుంది.

Janaki Kalaganaledu Serial 2023 June 9th Episode 601

జానకి పరిస్థితిని తలుచుకుంటూ:ఇక రామచంద్ర జానకి పరిస్థితిని తలుచుకుంటూ చాలా బాధపడుతూ ఉంటాడు. తనకే ఎందుకు భగవంతుడు ఇలాంటి పరిస్థితి తీసుకు వచ్చాడో అని కన్నీరు పెట్టుకుంటాడు. అక్కడే ఓ తల్లి తన కొడుకుకు గోరుముద్దలు పెడుతూ ఉండడంతో అలానే చూస్తూ ఉండిపోతాడు. ఆ అదృష్టం జానకికి లేకపోయింది అని బాధపడుతూ ఉంటాడు. ఇక ఇంతలో జానకి అతని వెతుక్కుంటూ వస్తుంది. ఇక రామచంద్ర ఎంత అడిగినా కూడా అతను అసలు నిజం చెప్పకుండా ఇక్కడ ఏదో చల్లగాలికి ఇలా తిరుగుతున్నాను అని, పదండి ఇంటికి వెళ్దాం అని అంటాడు.

Janaki Kalaganaledu Serial 2023 June 9th Episode 601

జానకి ఆలోచన, రామ సీరియస్:ఇక జానకి అప్పుడే రామచంద్ర బాధపడుతున్నట్లుగా తెలుసుకుంటుంది. ఇక ఇంటి దగ్గర తల్లిదండ్రులు వారి కోసమే ఎదురు చూస్తూ ఉంటారు. ఎంత అడిగినప్పటికీ కూడా రామచంద్ర నిజం చెప్పడు. అలా సరదాగా ఫ్రెండ్ ఇంటికి వెళ్లి వచ్చాను అని అంటాడు. ఇక జానకి ప్రత్యేకంగా రామచంద్ర కోసం భోజనం తీసుకువస్తుంది. అతనికి తన చేతులతో తినిపించాలని అనుకుంటుంది. నా కడుపు పండే వరకు మీరే నా చంటి పిల్లాడు అని అంతే కాకుండా జానకి ఒక పాపను మనము దత్తత తీసుకుందామని చెప్పడంతో రామచంద్ర ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఇక వెంటనే మనకు పిల్లలు తప్పకుండా పుడతారు అని నేను అనుకుంటున్నాను అని రామచంద్రా మళ్ళీ చెబుతాడు. ఇక జానకి కూడా షాక్ అవుతుంది ఇక మరోవైపు గోవిందరాజులు కొడుకు విషయంలో ఆలోచించి జానకిని ఇబ్బంది పడకుండా చేయాలి అని అనుకుంటాడు. మరి ఆయన రామతో ఏ విధంగా మాట్లాడతారో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X