Janaki Kalaganaledu March 10: తెలివిగా దొంగను పట్టుకున్న జానకి.. అసూయ చెందిన మనోహర్!

జానకి కలగనలేదు సీరియల్ మరో ఆసక్తికరమైన కథనంతో కొనసాగుతోంది. జానకి ఐపీఎస్ పరీక్షలో ఫెయిల్ కావడం వలన ఆమె మళ్ళీ ఒక్కసారిగా వెనుకడుగు వేస్తుంది. ఇక రామ ఆమెకు సపోర్ట్ చేస్తాడు. మధ్యలో అత్త జ్ఞానాంబ అనారోగ్యానికి గురవుతుంది. జానకి ఆ సమస్య నుంచి బయటపడేలా చేసి గొడవలు రాకుండా చూడాలని అనుకుంటుంది. ఇక జానకి కలగనలేదు సీరియల్ కు గత వారం కంటే ఈ వారం రేటింగ్స్ మరింత పెరిగాయి. 7.95 రేటింగ్ తో గత వారం మంచి క్రేజ్ అందుకుంటోంది. నేడు ప్రసారం కాబోయే 524 వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం..

 జానకిపై ఆలోచన

జానకిపై ఆలోచన


జ్ఞానాంబ ఆలోచన మొత్తం కూడా జానకి మీదే ఉంటుంది. ఆమె దేవుడి కోసం ప్రత్యేకంగా పువ్వులు అల్లుతూ ఉండగా అప్పుడే గోవిందరాజులు వస్తాడు. అయితే జ్ఞానాంబ ఆ పువ్వులను సరిగ్గా అళ్లకపోవడంతో ఆయన అడుగుతారు. ఇంకా ఏదో ఆలోచనలో ఉన్న జ్ఞానాంబ వెంటనే కోలుకొని అయ్యో నేను ఇలా చేశాను ఏంటి అని ఆశ్చర్య పోతుంది. అయితే మనసు ఎక్కడో పెట్టి ఆందోళన చెందుతూ ఉంటే ఇలానే ఉంటుంది అని భర్త అనడంతో జ్ఞానాంబ అవునని అంటుంది.

 చాలా బాధగా ఉంది

చాలా బాధగా ఉంది

పెద్ద కోడలు జానకి ఐపిఎస్ కావాలని ఎంతగానో కష్టపడింది. కానీ చివరికి ఆమెకు కానిస్టేబుల్ ఉద్యోగం దొరికింది. ఆ విషయంలో నాకు చాలా బాధగా ఉంది అని చెప్పడంతో గోవిందరాజులు అలా బాధ పడవద్దు అని అంటాడు. మళ్ళీ జానకి బాగా చదివి తను అనుకున్న లక్ష్యాన్ని నెరవేరుస్తుంది అని ఈ రోజుల్లో ఆడవాళ్లు ఏ ఉద్యోగమైనా సరే చేస్తున్నారు అని ఒక విధంగా చెప్పాలి అంటే మగవారి కంటే వారే ఎక్కువగా కష్టపడుతున్నారు అని కూడా గోవిందరాజులు చెబుతాడు.

అమ్మవారి నగలు పోవడంతో..

అమ్మవారి నగలు పోవడంతో..


ఇక మరోవైపు జానకి ఉద్యోగంలో చేరిన మొదటి రోజే కానిస్టేబుల్ గా ఒక దొంగను పట్టుకోవాలి అని అనుకుంటుంది. గుడిలో అమ్మవారి నగలు ఎవరో దొంగతనం చేశారు అని మొదటి కేసు నమోదు కాగా జానకి ఒక వ్యక్తిపై అనుమానం వ్యక్తం చేస్తుంది. ఇక స్టేషన్ లో ఎవరికీ చెప్పకుండా ఆమె రామచంద్రకు ఫోన్ చేసి వెంటనే పోలీస్ స్టేషన్ కు రమ్మంటుంది. ఇక జానకి అనుమానం కలిగిన గుడి వాచ్మెన్ ఇంటికి వెళుతుంది. అక్కడ అతను కాస్త కంగారు పడుతూ ఉంటాడు. అంతేకాకుండా నేను దొంగతనం చేయలేదు అని కూడా అంటాడు.

దోంగను పట్టేసిన జానకి

దోంగను పట్టేసిన జానకి

ఇక జానకి కాస్త సీరియస్ గా అడుగుతుంది. అసలు నువ్వు గత వారం రోజులు ఎక్కడ ఉన్నావు అని అడుగుతుంది. ఇక అందుకు అతను మా భార్యకు బాగోలేకపోతే హాస్పిటల్ కు తీసుకు వెళ్ళాను అని చెబుతాడు. అయితే డాక్టర్లు ఇచ్చిన స్లిప్పులు ఒకసారి చూపించండి అనడంతో.. అతను తన కూతురికి చూపించిన స్లిప్పును జానకి చూపించడంతో వెంటనే ఆమె పసిగడుతుంది. నువ్వే అసలు దొంగ అని నగలు ఎక్కడ దాచావో చెప్పు అని అంటుంది. అయితే అతను తప్పించుకోవాలి అని చూడగా వెంటనే రామచంద్ర అతన్ని పట్టుకుంటాడు.

జెస్సి ఆరోగ్యం

జెస్సి ఆరోగ్యం

ఇక దొంగతనం చేసిన వ్యక్తి భార్య నగలు తెచ్చి ఇస్తుంది. ఇక ఆ నగల గురించి వెంటనే తన ఎస్ఐకి ఫోన్ చేసి చెప్పాలని జానకి అనుకుంటుంది. కానీ ఆయన పోలీస్ స్టేషన్ లో ఉండడు. ఇక మరోవైపు జ్ఞానాంబ జెస్సి ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అని అంటుంది. ఆమెకు కడుపుతో ఉండడంతో బట్టలు ఆరేయడానికి వెళుతూ ఉంటుంది. అయితే ఇలాంటి పనులు చేయకూడదు అని అత్తగారు ప్రేమగా చెబుతూ ఉంటారు.

మల్లిక మనసులో

మల్లిక మనసులో


కానీ పక్కనే ఉన్న మల్లిక అసూయ చెందుతూ ఉంటుంది. నీకు కూడా అంతా బాగా జరిగి ఉంటే ఈపాటికి జెస్సి తరహా లోనే కాన్పుకు సిద్ధంగా ఉండేదనివి అని అంటుంది. అయితే మల్లిక మాత్రం తన మనసులో అసలు విషయం తెలిస్తే మీరు తట్టుకోలేరు అని నేను ఆడిన నాటకం నీకు తెలియదు అని అనుకుంటుంది. ఇక జ్ఞానాంబ మాత్రం జెస్సిని ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి అని ఏ అవసరం ఉన్న తలను పిలవాలి అని చెబుతుంది. అందుకు జెస్సి కూడా సరే అని అంటుంది.

 మనోహర్ అసూయ

మనోహర్ అసూయ

ఇక మరోవైపు జానకి దొంగను పట్టుకొని గుడి దగ్గరికి వెళుతుంది. అక్కడ ఎమ్మెల్యే తో పాటు చాలామంది జనాలు ఉంటారు. ఇక డైరెక్టుగా జానకి దొంగను అక్కడికి తీసుకు వెళుతుంది. ఇక ఎమ్మెల్యే ఎస్ఐకి ఫోన్ చేసి గుడి దగ్గరకు రమ్మని చెబుతాడు. అక్కడికి రాగానే ఎస్సై జానకి చేసిన పనిని చూసి ఆశ్చర్యపోతాడు. అయితే అంతకు ముందు రోజే రామచంద్రతో అతనికి గొడవ జరుగుతుంది. ఆ తరహాలో రివేంజ్ తెలుసుకోవడానికి దొంగను పట్టుకుని ఇక్కడికి తీసుకువచ్చి ఉండవచ్చు అని అనుకుంటాడు. ఇక ఎమ్మెల్యే అయితే జానకిని ఎంతగానో పొగుడుతాడు. ఎస్సై మనోహర్ ఆ విషయాన్ని తట్టుకోలేక పోతాడు. పైకి నవ్వుతూ కనిపించినప్పటికీ అతను ఆమెపై అసూయ పెంచుకుంటాడు. ఇక రామచంద్ర ఎస్ఐని చూసి నిన్న జరిగిన దానికి క్షమాపణ చెబుతాడు. ఎస్సై మాత్రం అలాంటిదేమీ లేదు అని దాన్ని నేను అప్పుడే మర్చిపోయాను అని అబద్ధం చెబుతాడు. మరి ఈ పరిస్థితులలో జానకి, ఎస్ఐ నుంచి ఎలాంటి అనుభవాలను ఎదుర్కొంటుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X