Janaki Kalaganaledu March 13: జానకి డ్యూటీపై రామ గొప్పలు.. తట్టుకోలేక మల్లిక పిచ్చి నవ్వులు

జానకి కలగనలేదు సీరియల్ రోజురోజుకు మరింత ఆసక్తికరంగా కొనసాగుతోంది. ఎలాగైనా ఐపీఎస్ కావాలని అనుకున్న జానకి బాగా చదివి పరీక్షలో పాసవ్వాలని అనుకుంటుంది. కానీ ఆమె కుటుంబ పరిస్థితుల ఒత్తిడి వలన ఫెయిల్ అవుతుంది. ఆమె మళ్ళీ ఒక్కసారిగా వెనుకడుగు వేస్తుంది. ఇక రామ ఆమెకు సపోర్ట్ చేస్తాడు. ఇక జానకి కలగనలేదు సీరియల్ కు గత వారం కంటే ఈ వారం రేటింగ్స్ మరింత పెరిగాయి. 7.95 రేటింగ్ తో గత వారం మంచి క్రేజ్ అందుకుంటోంది. నేడు ప్రసారం కాబోయే 526 వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం..

జాగ్రత్తగానే ఉన్నప్పటికీ

జాగ్రత్తగానే ఉన్నప్పటికీ


ఐపీఎస్ కాకపోవడంతో చివరికి కానిస్టేబుల్ పరీక్షలు వ్రాసిన జానికి అందులో పాస్ అవుతుంది. ఇక మొత్తానికి కానిస్టేబుల్ గా ఆమె తన ప్రయాణాన్ని మొదలుపెడుతుంది. అయితే ఆమె మొదటి రోజు పోలీస్ స్టేషన్లోనే ఊహించని విధంగా ఒక కేసును ఎదుర్కోవాల్సి వస్తుంది. గుడిలో అమ్మవారి నగలు కాజేసిన దొంగను జానకి తెలివిగా పట్టుకుంటుంది. దీంతో ఆమెను ఎమ్మెల్యే కూడా అందరి ముందు ప్రశంసింస్తారు. ఇక ఆ కారణంగా ఎస్సై మనోహర్ జానకి పై అసూయ చెందుతాడు. అతనికి తిక్క అని ముందుగానే జానకికి తెలుస్తుంది. ఇక జానకి ఆ విషయంలో జాగ్రత్తగానే ఉన్నప్పటికీ ఎస్సై అసూయ కారణంగా ఆమెపై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తాడు.

అందరూ గౌరవించేలా

అందరూ గౌరవించేలా

ఇక జానకి కాస్త టెన్షన్ గానే ఇంటికి వస్తుంది. ఆమెతో పాటు రామ్ కూడా చాలా హ్యాపీగా ఇంటికి వస్తాడు. ఇక రామ జానకి తో ఇంటికి రాగానే మొదట ఆమెకు దిష్టి తీయించాలని అనుకుంటాడు. అందుకోసం ప్రత్యేకంగా ఎర్ర నీళ్లు తీసుకురావాలి అని ఇంట్లో పనిచేసే మలయాళంకు చెబుతాడు. ఇక ఎందుకు ప్రత్యేకంగా రామచంద్ర ఇలా చేస్తున్నాడు అని ఇంట్లో అందరూ కూడా కాస్త ఆశ్చర్యపోతాడు. అయితే అందరూ గౌరవించేలా జానకి గారు ఈరోజు గొప్ప పని చేశారు అని అమ్మవారి నగలను దోచేసిన దొంగను ఆమె తెలివిగా పట్టుకున్నారు అని అందరికీ చెబుతాడు.

ఎమ్మెల్యే పొగడ్తలు

ఎమ్మెల్యే పొగడ్తలు


కానీ మల్లిక మాత్రం పోలీస్ అన్నాక దొంగను పట్టుకోవడం సహజమే కదా అని అంటాడు. అయితే కేవలం అది మాత్రమే కాదు అని జానకి గారిని ఒక ఎమ్మెల్యే ఎంతగానో ప్రశంసించారు అని కూడా చెప్పడంతో అందుకు అత్తగారు గోవిందరాజులు ఇద్దరు కూడా సంతోషపడతారు. ఇక ఒకవైపు రామచంద్ర ఆనందంగా తన గురించి చెబుతూ ఉండడంతో జానకి మాత్రం ఎస్సై గురించి కాస్త ఆందోళన చెందుతూ ఉంటుంది. ఇక మొత్తానికి నన్ను దిష్టి తీసి ఇంట్లోకి ఆహ్వానిస్తారు.

 మల్లిక పిచ్చి నవ్వులు

మల్లిక పిచ్చి నవ్వులు

అయితే జానకికి గొప్ప పేరు వస్తూ ఉండడంతో మల్లికా తట్టుకోలేక పోతుంది. పిచ్చిగా నవ్వుతూ తన టెన్షన్ ను తగ్గించుకోవాలని అంటుంది. అయితే ఆమె భర్త విష్ణు మల్లిక అలా ఎందుకు నవ్వుతుందో అర్థం కాక ఆమె నోట్లో ఒక బట్ట పెడతాడు. ఇక తరువాత మల్లికా అతనిపై కోప్పడి ఎలాగైనా జానకి పై రివెంజ్ తీర్చుకుంటాను అని ఆ ఉద్యోగం మాన్పించేలా చేస్తాను అని ఛాలెంజ్ చేస్తుంది. అలా చేయడం తప్పు అని భర్త చెప్పినప్పటికీ ఇప్పుడు తనకు మంచి పేరు ఏమీ వద్దు అని మల్లికా అసూయ చెందుతూ మాట్లాడుతూ ఉంటుంది.

వదిన విషయంలో

వదిన విషయంలో

అలాగే మరోవైపు రామచంద్రా చిన్న తమ్ముడు అఖిల్ కూడా వదిన విషయంలో ఆనందంగా ఉండలేక పోతాడు. ఇంట్లో వాళ్ళందరూ కూడా ఆమెను పొగుడుతూ నన్ను తక్కువగా చూస్తున్నారు అని అనుకుంటాడు. అందుకే చెవిలో ఎవరి మాటలు వినపడకుండా దూది పెట్టుకున్నాను అని అంటాడు. అయితే అతని భార్య జెసి మాత్రం అలాంటి తప్పుడు ఆలోచనలు పెంచుకోవద్దని జానకి వదిన ఎప్పుడూ కూడా ఒకరిని తక్కువగా చేయదు అని నువ్వే అలా అనుకుంటే అది కరెక్ట్ కాదు అని నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తుంది.

కొత్తలోనే ఇలా ఉందంటే..

కొత్తలోనే ఇలా ఉందంటే..


ఇక అంతా హ్యాపీగా కొనసాగుతున్న సమయంలో రామచంద్ర కూడా తన భార్య గురించి మాట్లాడుతూ ఎంతగానో హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇక బెడ్రూంలో జానకితో తన ఆనందాన్ని పంచుకుంటూ ఉంటాడు. ఈ రోజు మిమ్మల్ని ఒక ఎమ్మెల్యే గారు పొగడం ఎంత ఆనందంగా ఉందో తెలుసా అని అంటాడు. అయితే ఒకవైపు రామచంద్ర ఆనందంగా మాట్లాడుతుంటే జానకి మాత్రం పోలీస్ స్టేషన్లో ఎస్ఐ గారి కోపాన్ని గుర్తు చేసుకుంటూ ఆందోళన చెందుతూ ఉంటుంది. రామచంద్ర ఎస్ఐ గారు చాలా మంచి వారు అయి ఉంటారు అని కూడా అంటుంటాడు. కానీ జానకి మాత్రం అతని గురించి మీకు నిజం తెలియదు అని మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక వచ్చిన కొత్తలోనే జాబ్లో ఇలా ఉంది అంటే ఇక రాబోయే రోజుల్లో ఎస్ఐ గారు ఇంకా ఎలా తిక్కగా ప్రవర్తిస్తారో అని జానకి మళ్ళీ ఆలోచనలో పడుతుంది. మరి రాబోయే రోజుల్లో జానకి ఎలాంటి ఒడిదుడుకులను ఎదుర్కొంటుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X