Janaki Kalaganaledu March 14 అత్తగారి నిర్ణయంతో జానకి షాక్.. పొలీస్ డ్యూటీలో మరో ఇబ్బంది!

జానకి కలగనలేదు సీరియల్ ఊహించని ట్విస్ట్ లతో కొనసాగుతోంది. ఐపీఎస్ కావాలని అనుకున్న జానకి బాగా చదివి పరీక్షలో పాసవ్వాలని అనుకుంటుంది. కానీ ఆమె కుటుంబ పరిస్థితుల ఒత్తిడి వలన ఫెయిల్ అవుతుంది. దీంతో జానకి కానిస్టేబుల్ ఉద్యోగంలో జాయిన్ కావాల్సి వస్తుంది.

ఇక రామ ఆమెకు సపోర్ట్ చేస్తాడు. ఇక జానకి కలగనలేదు సీరియల్ కు గత వారం కంటే ఈ వారం రేటింగ్స్ మరింత పెరిగాయి. 7.95 రేటింగ్ తో గత వారం మంచి క్రేజ్ అందుకుంటోంది. నేడు ప్రసారం కాబోయే 527 వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం..

ఇంట్లో చెప్పకుండా

ఇంట్లో చెప్పకుండా

జానకి కానిస్టేబుల్ ఉద్యోగంలో చేరిన తర్వాత కొన్ని ఊహించని సమస్యలను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆమె పోలీస్ స్టేషన్లో ఉండే ఎస్ఐ మనోహర్ కాస్త తిక్క మనిషి కావడంతో జానకి ఊహించని విధంగా సమస్యలను ఎదుర్కొంటుంది. అయితే ఆ విషయాన్ని మాత్రం ఆమె ఇంట్లో చెప్పకుండా ఉంటుంది. ఇంట్లోకి అడుగు పెట్టినప్పుడు బయట సమస్యలను ప్రస్తావించకూడదు అని నిర్ణయం తీసుకుంటుంది. అంతేకాకుండా రామచంద్ర ఎంతగా అడిగినప్పటికీ కూడా ఆమె ఉద్యోగం కోసం సంబంధించిన విషయాలను చెప్పకూడదని డిసైడ్ అవుతుంది.

 అస్సలు తట్టుకోలేను

అస్సలు తట్టుకోలేను

మీరు బాధపడితే నేను మాత్రం అస్సలు తట్టుకోలేను అంటూ రామచంద్ర ఒక మాట కూడా తీసుకుంటాడు. మీరు ఏ విషయమైనా సరే ముందు నాతో చెప్పాలి అని అంటాడు. ఇక జానకి అందుకోసం ఓకే అని ఉంటుంది. ఇక జానకి కోసం ప్రత్యేకంగా రామచంద్ర గదిలోకి భోజనం తీసుకొని వస్తాడు. తన చేతితో భార్యకు తినిపించాలని అనుకుంటాడు. అయితే మొదట జానకి మాత్రం అందుకు ఒప్పుకోదు. చూసే వాళ్ళు ఏమని అనుకుంటారు అని అంటుంది. ఇక భార్యాభర్తలు అన్నాక ఈ విధంగా ఉండడంలో తప్పులేదు అని రామచంద్ర ఉంటాడు.

సంతోషంగా ఉంది

సంతోషంగా ఉంది

అంతేకాకుండా మీలో నన్ను చూసుకుంటున్నాను అని చిన్నప్పటినుంచి పోలీస్ ఆఫీసర్ కావాలని అనుకున్నాను నేను కాలేకపోయాను ఇప్పుడు మీరు అయినందుకు నాకు సంతోషంగా ఉంది అని అలాగే మీరు ఐపీఎస్ ఆఫీసర్ కూడా కావాలి అని కోరుకుంటున్నట్లుగా రామచంద్ర చెబుతాడు. ఇక హాల్లో జ్ఞానాంబ అలాగే మల్లికా ఇద్దరూ కూడా పూలు అల్లుతూ ఉంటారు. అయితే అప్పుడే వచ్చిన గోవిందరాజులు మల్లికకు అలాంటి పెద్ద పనులు చెప్పవద్దు అని సెటైర్ వేస్తూ ఉంటాడు. ఇక వారిని చూసి జ్ఞానాంబ నవ్వుతుంది.

షాక్ ఇచ్చిన జ్ఞానాంబ

షాక్ ఇచ్చిన జ్ఞానాంబ

అయితే ఉదయం కావడంతో జానకి మళ్ళీ ఉద్యోగానికి వెళ్లాలని అనుకుంటుంది. అయితే ఈరోజు జానకి డ్యూటికి వెళ్లడానికి వీలు లేదు అని జ్ఞానాంబ చెబుతుంది. ఎందుకంటే ఈరోజు సాయంత్రం సౌభాగ్యవ్రతం చేయబోతున్నామని చాలా కాలంగా ఆ వ్రతాన్ని మనం చేయకపోవడం వల్లనే ఇంట్లో అనర్ధాలు జరిగాయి అని నేను చావు అంచుల వరకు వెళ్లాల్సి వచ్చింది అని జ్ఞానాంబ అంటూంది. అయితే అందుకు జానకి ఆలోచిస్తుంది. ఇంత హఠాత్తుగా అంటే పోలీస్ డ్యూటీలో సెలవులు ఇవ్వరు అని చెబుతోంది.

అలా చేయడం కరెక్ట్ కాదు

అలా చేయడం కరెక్ట్ కాదు

అయితే పక్కనే ఉన్న మల్లికా మరింత గొడవలు క్రియేట్ చేయాలని అనుకుంటుంది. ఇంట్లో కుటుంబాన్ని వదిలేసి అలా చేయడం కరెక్ట్ కాదు అని ఇప్పుడు డ్యూటీ కంటే కుటుంబం ఎక్కువ కాదు కదా అని అంటుంది. అయితే పక్కనే ఉన్న గోవిందరాజులు మాత్రం ఆమెను కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తాడు. ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు దాంట్లో గొడవను పెద్దది చేయకూడదు అని ఆమెపై సెటైర్ వేస్తాడు. అయితే ఈ తరుణంలో జ్ఞానాంబ కూడా కాస్త ఆ అసహనంగానే మాట్లాడుతుంది.

చావు అంచుల వరకు

చావు అంచుల వరకు

మొన్నటికి మొన్న తాను చావు అంచుల వరకు వెళ్లి వచ్చాను అని ఇప్పుడు నాకు ఏమైనా కూడా పరవాలేదు కదా అని కాస్త అసహనంతో మాట్లాడుతుంది. దీంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. అలా మాట్లాడవద్దు అని ఆమెను కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తారు. ఈ తరుణంలో గొడవలు రాకుండా చూడాలి అని జానకి పూజ సాయంత్రం కదా అని మళ్ళీ నేను పర్మిషన్ తీసుకుని వచ్చేస్తాను అని అంటుంది. ఇక గోవిందరాజులు కూడా జానకి మాటలకు సపోర్ట్ చేస్తాడు. మిగతా పనులు మీరు చూసుకోవాలి అని సాయంత్రం లోపు జానికి వస్తుంది అని అంటాడు.

మాట్లాడితే ఒప్పుకుంటారు

మాట్లాడితే ఒప్పుకుంటారు

అయితే రామచంద్ర కూడా ఎస్సై గారు చాలా మంచివారు అని తప్పకుండా నేను మాట్లాడితే ఒప్పుకుంటారు అని అంటాడు. అయితే నువ్వు హామీ ఇస్తావా అని తల్లి అడగడంతో జానకి గారు చెప్పారు అంటే తప్పకుండా మాటమీద ఉంటారు అని నాకు నమ్మకం ఉంది అని రామచంద్ర అంటాడు. ఇక జ్ఞానాంబ చివరికి ఒప్పుకోక తప్పదు అనేలా కనిపిస్తూ ఉంటుంది.

పేపర్ లో జానకి ఫొటో

పేపర్ లో జానకి ఫొటో

ఇక జానకి పోలీస్ స్టేషన్ కు బయలుదేరుతుంది. అయితే అక్కడ మిగతా కానిస్టేబుల్స్ అందరూ కూడా పేపర్ చూస్తూ ఉంటారు. అయితే అందులో జానకి దొంగను పట్టించిన వార్త రావడంతో అందరూ కూడా ప్రశంసలు కురిపిస్తారు. అయితే ఈ విషయం ఎస్ఐ గారు చూస్తే ఆయన కుళ్ళు కుంటారు అని మొహం మాడిపోతుంది అని ఒక కానిస్టేబుల్ అంటాడు. అయితే అప్పుడే ఎస్ఐ గారు వచ్చి పేపర్ చూస్తారు. ఇక అతను మరింత అసూయ చెందుతూ ఉంటాడు. ఇక జానకి రాగానే ఎస్ఐ మనోహర్ కు సెల్యూట్ చేస్తుంది. ఇక అతను కూడా వెటకారంగా తిరిగి సెల్యూట్ చేస్తాడు. మరి వీరి మధ్య సంభాషణ ఎలా కొనసాగుతుందో తదుపరి ఎపిసోడ్ లో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X