Janaki Kalaganaledu March 15: జానకి ముందే భర్తను అవమానించిన మనోహర్.. ఇంట్లో మరో ట్విస్ట్!
జానకి కలగనలేదు సీరియల్ మరో కీలక మలుపుతో మరింత ఆసక్తికరంగా కొనసాగుతోంది. ఐపీఎస్ కావాలని అనుకున్న జానకి చివరికి కానిస్టేబుల్ కావాల్సి వస్తుంది. ఇక భర్త రామ ఆమెకు సపోర్ట్ చేస్తాడు. మళ్ళీ ఎలాగైనా ఐపీఎస్ కావాలని ఆమెకు ధైర్యం ఇస్తాడు. ఇక జానకి కలగనలేదు సీరియల్ కు గత వారం కంటే ఈ వారం రేటింగ్స్ మరింత పెరిగాయి. 7.95 రేటింగ్ తో గత వారం మంచి క్రేజ్ అందుకుంటోంది. నేడు ప్రసారం కాబోయే 528 వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం..

కానిస్టేబుల్ ఉద్యోగం
జానకి ఎలాగైనా ఐపీఎస్ కావాలని అనుకుంటుంది. ఇక చివరికి కానిస్టేబుల్ ఉద్యోగం రావడంతో ఆమె ఏమాత్రం నిరాశ చెందకుండా మళ్ళీ అవకాశం వచ్చినప్పుడు ఐపిఎస్ పరీక్షల కోసం సిద్ధం కావాలని అనుకుంటుంది. ఇక నిజాయితీగా కానిస్టేబుల్ ఉద్యోగం కూడా కొనసాగించాలని అనుకుంటుంది. అయితే ఈ క్రమంలో జానకి పోలీస్ స్టేషన్లో ఉన్న ఎస్ఐ మాత్రం ఆమెపై అసూయతో ప్రవర్తిస్తూ ఉంటాడు. ఒక దొంగను పట్టించడంతో జానకి ఫోటో పేపర్లో కూడా వస్తుంది. ఇక ఆ విషయాన్ని ఎస్ఐ మనోహర్ తట్టుకోలేక పోతాడు.

సెల్యూట్ చేసిన ఎస్ఐ
ఇక జానకి ఆలస్యంగా పోలీస్ స్టేషన్ కు రావడంతో ఆమెకు తిరిగి సెల్యూట్ చేస్తాడు. మీరు నాకు ఎందుకు సెల్యూట్ చేస్తున్నారు అని జానకి అడిగినప్పుడు మీరు చాలా గొప్పవారు కదా గొప్ప కానిస్టేబుల్ కదా.. అంటూ తిక్కగా మాట్లాడుతూ ఉంటాడు. మీ ఆయన ద్వారా ఈ విధంగా పేపర్లో ఫోటో వేయించుకున్నావా అని అడుగుతాడు. అంతేకాకుండా నన్ను అవమానించేందుకే ఈ విధంగా చేశారు అని ఈ ఊర్లో ఉన్న ఎస్ఐ గారు ఏమీ చేయలేరు అని అంతా మా జానకి గారు చేశారు అని అన్నట్లుగా మీ ఆయన భావిస్తున్నట్లు ఉన్నాడు అని ఎస్ఐ మనోహర్ అసహనం వ్యక్తం చేస్తూ ఉంటాడు.

కోపంగా ఉన్న మనోహర్
అయితే జానకి మాత్రం నా భర్త అలాంటి వ్యక్తి కాదు అని చెబుతుంది. ఇక జానకిపై కాస్త కోపంగా ఉన్న మనోహర్ ఇకనుంచి నువ్వు అత్యుత్సాహం ప్రదర్శించకూడదు అని నేను ఏది చెబితే అదే చేయాలి అని మిగతా వారు ఎలాగైతే లిమిట్స్ దాటకుండా పనిచేస్తున్నారో నువ్వు కూడా అలాగే వర్క్ చేయాలి అని అతను చెబుతాడు. ఇక తర్వాత మిగతా వాళ్లకు పనులు చెప్పిన ఎస్ఐ మనోహర్ జానకిని పిలిచి మంత్రిగారు రోడ్డుమీద నుంచి వెళ్తున్నారు అని ట్రాఫిక్ క్లియర్ చేయడానికి వెళ్లాలి అని అంటాడు.

అవమానపరిచే విధంగా
ఇక ఆమెతో పాటు ఎస్ఐ మనోహర్ కూడా పోలీస్ జీప్ లో కలిసి వెళ్తూ ఉంటారు. అయితే ఎస్ఐ మనోహర్ మాత్రం జానకి భర్తను తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటాడు. ఇక రామచంద్రను మిఠాయి పొట్లం గాడు అంటూ అవమానపరిచే విధంగా మాట్లాడుతూ ఉంటాడు. అలా మాట్లాడవద్దని నా భర్త పేరు రామ అని చెబుతుంది. ఇక రామచంద్ర స్వీట్ బండి రాగానే అతని దగ్గరికి వెళ్లి ఒక పొట్లం స్వీట్స్ తీసుకురావాలి అని ఎస్ఐ మనోహర్ జానకికి చెబుతాడు. ప్రత్యేకంగా డబ్బులు కూడా ఇస్తాను అని అంటాడు.

తప్పుగా అర్థం చేసుకుని
ఇక జానకితో పాటు మనోహర్ కూడా మిఠాయి బండి దగ్గరికి వెళతాడు. ఇక ఆ తర్వాత ఎస్ఐ మనోహర్ నీ భార్య గురించి ప్రచారం బాగానే చేస్తున్నవు అని అంటాడు. ఇక రామచంద్ర మాత్రం ఎస్సై మంచి వారు అనుకొని అతన్ని కూడా పొగుడుతూ ఉంటాడు. మీలాంటి వారి వల్లే మా జానకి గారు పేరు పేపర్లో పడింది అని మీరు కూడా బాగుండాలి అని అతను మాట్లాడుతాడు. కానీ ఎస్సై మనోహర్ మాత్రం రామచంద్రాన్ని తప్పుగా అర్థం చేసుకుని అతని అవమానపరిచే విధంగా చేస్తాడు.

మనోహర్ తీరుపై జానకి అసహనం
తన కాలి షూస్ లేస్ ఉడిపోవడంతో కావాలని రామచంద్ర చేత కట్టించేలా చేస్తాడు. మీలాంటి పోలీసులు అంటే నాకు చిన్నప్పటి నుంచి గౌరవమని రామచంద్ర ఎంతో నిజాయితీతో మాట్లాడుతూ ఉంటాడు. ఇక రామచంద్ర ఆ పని చేసిన తర్వాత అతనికి మనోహర్ 20 రూపాయలు కూడా ఇస్తాడు. అయితే జానకి మాత్రం ఎస్సై మనోహర్ చేసిన పనికి అసంతృప్తిగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక ఆ తర్వాత ఒక బిచ్చగాడు రావడంతో జానకి సైలెంట్ గా ఎస్సై మనోహర్ ఇచ్చిన డబ్బులను బిచ్చగాడికి ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.

జానకి రాకపోవడంతో..
అయితే మరోవైపు అత్తగారు ఇంట్లో పూజకు కావాల్సిన ఏర్పాట్లు సిద్ధం చేస్తూ ఉంటారు. ఇక ముందుగానే జానకిని తొందరగా వ్రతానికి రావాలి అని చెబుతుంది. అయితే జానకి మాత్రం ఎస్సై మనోహర్ కారణంగా ఇంటికి వెళ్ళలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఇక ఒకసారి జానకికి ఫోన్ చేయని జ్ఞానాంబ తన చిన్న కోడలు మల్లికాకు చెబుతుంది. కానీ ఆమె మాత్రం నన్ను ఈ విషయంలో తలదూర్చకండి అని అంటుంది. ఇక జ్ఞానంబ సైలెంట్ గా బయటకు వెళ్లి తన భర్తతో మాట్లాడుతుంది. మీ పెద్ద కోడలిని వద్దని చెప్పిన కూడా ఉద్యోగానికి పంపించారు. ఇప్పుడు ఆమె ఇంకా రాలేదు అని అంటుంది. ఇక రామచంద్ర కూడా రాగానే అదే మాట చెబుతుంది. మరి జానకి అనుకున్న సమయానికి వస్తుందో లేదో తదుపరి ఎపిసోడ్లో చూడాలి.


Click it and Unblock the Notifications











