Janaki Kalaganaledu March 16: మనోహర్ కారణంగా పూజకు దూరమైన జానకి.. మల్లికకు మరో ఛాన్స్

జానకి కలగనలేదు రోజురోజుకు మరింత ఆసక్తికరంగా కొనసాగుతోంది. జానకి ఐపీఎస్ కావాలని అనుకుని చివరికి కానిస్టేబుల్ కావాల్సి వస్తుంది. ఇక భర్త రామ ఆమెకు సపోర్ట్ చేస్తాడు. మళ్ళీ ఎలాగైనా ఐపీఎస్ కావాలని ఆమెకు ధైర్యం ఇస్తాడు. ఇక జానకి కలగనలేదు సీరియల్ కు గత వారం కంటే ఈ వారం రేటింగ్స్ మరింత పెరిగాయి. 7.95 రేటింగ్ తో గత వారం మంచి క్రేజ్ అందుకుంటోంది. నేడు ప్రసారం కాబోయే 529 వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం..

గోవిందరాజులు చెప్పడంతో..

గోవిందరాజులు చెప్పడంతో..


ఇక జానకి రెగ్యులర్ గా కానిస్టేబుల్ ఉద్యోగానికి వెళ్లాలని అనుకుంటుంది. అయితే రెండవ రోజే జ్ఞానాంబ ఇంట్లో వ్రతం చేయాలని ఉంది అని ఈరోజు నువ్వు డ్యూటీకి వెళ్లడానికి వీల్లేదు అని చెబుతుంది. అయినప్పటికీ ఆమె భర్త గోవిందరాజులు కోడలికి మద్దతు ఇస్తూ పోలీస్ జాబ్ అన్నాక సమయానికి వెళుతూ ఉండాలి అని నచ్చ చెబుతాడు. అంతేకాకుండా సాయంత్రం తిరిగి తొందరగానే వస్తుంది అని ఆయన చెప్పడంతో అందరూ కూడా ఒప్పుకుంటారు. ఇక జానకి కూడా ఉద్యోగం పనులను ముగించుకొని త్వరగా ఇంటికి చేరుకోవాలని అనుకుంటుంది.

రివేంజ్ తీర్చుకోవాలని..

రివేంజ్ తీర్చుకోవాలని..


ముందుగానే ఎస్ఐ మనోహర్ ను కూడా ఆమె పర్మిషన్ అడుగుతుంది. అతను కూడా సాయంత్రం కదా చూద్దాములే అని అంటాడు. అయితే అతను జానకిపై మాత్రం కాస్త కోపంగా ఉంటాడు. ముందు రోజు జరిగిన పరిణామాలను గుర్తుచేసుకొని మనోహర్ జానకి పై ఎప్పటికప్పుడు రివేంజ్ తీర్చుకోవాలని అనుకుంటున్నాడు. అయితే ఇంటి దగ్గర నుంచి మాత్రం జానకికి ఫోన్లు వస్తూ ఉంటాయి. ఇక రామచంద్ర కూడా తల్లి అడగడంతో అతను వెంటనే జానకికి ఫోన్ చేసి మీరు త్వరగా ఇంటికి రావాలి అని అంటాడు. అయితే ఇప్పుడు కాస్త బిజీగా ఉన్నాను అని అత్తయ్య గారికి నేను దారి మధ్యలోనే ఉన్నాను అని చెప్పేయండి అని జానకి చెపుతుంది.

మల్లిక సంతోషం

మల్లిక సంతోషం

ఇక వ్రతం కూడా మొదలైపోతుంది. మల్లిక మాత్రం జానకి రాలేనందుకు చాలా సంతోషపడుతుంది. ఆ విషయంతో అత్తగారికి మరింత కోపం తెప్పించాలని అనుకుంటుంది. ఇక పెద్ద కోడలి స్థానం ఈ ఇంట్లో తనదే అని కూడా ఆమె ఆనందపడుతుంది. ఇక మరోవైపు ఎస్ఐ మనోహర్ జానకిపై తన రివెంజ్ ను తీర్చుకుంటూ ఉంటాడు. ఇక సాయంత్రం కావడంతో జానకి మరోసారి ఎస్ఐ మనోహర్ ను కలిసి తొందరగా ఇంటికి వెళ్ళేది ఉంది అని పర్మిషన్ అడగాలని అనుకుంటుంది. అయితే అప్పుడే ఏటీఎం దొంగతనం చేసిన వ్యక్తి నిజం చెప్పడం లేదు అని వెంటనే ఆ కేసు విషయం తేల్చి అతనితో నిజం చెప్పించాలి అని జానకికి ఒక పని అప్పచెబుతాడు.

 నిజం వెంటనే చెప్పాలి అని..

నిజం వెంటనే చెప్పాలి అని..


అయితే అప్పుడు సమయం లేకపోవడంతో జానకి మరోసారి రిక్వెస్ట్ చేస్తుంది. నేను రేపు ఆ పని చూస్తాను అని అడిగినప్పటికీ ఎస్సై మనోహర్ జానకి ఇంటికి వెళ్లకుండా అలానే ప్రవర్తిస్తూ ఉంటాడు. ఇక జానకి లాకప్ లో ఉన్న దొంగ దగ్గరకు వెళ్లి అసలు నిజం వెంటనే చెప్పాలి అని అడుగుతుంది. తనకు ఇప్పుడు సమయం కూడా లేదు అని నిన్ను కొట్టే ఓపిక, ప్రశ్నించే సమయం కూడా ఇప్పుడు తన దగ్గర లేదు అని జానకి అంటుంది. జానకి అలా మాట్లాడుతుండడంతో అతను అక్క నాకు ఏమీ తెలియదు వీళ్ళు అనవసరంగా నన్ను ఇక్కడికి తీసుకువచ్చారు అని అంటాడు. అయితే అప్పుడే ఎస్ఐ మనోహర్ వచ్చి అలా అడిగితే దొంగ అసలు నిజం చెప్పడు అని కొడితేనే చెబుతాడు అని అతన్ని ఇష్టం వచ్చినట్లు కొడుతూ ఉంటాడు.

పట్టింపు లేకపోతే ఎలా?

పట్టింపు లేకపోతే ఎలా?


ఇక జానకి కూడా అదే తరహాలో ఆలోచిస్తుంది. మరోవైపు ఇంట్లో మాత్రం అత్తగారు పూజ పనులను మొదలు పెట్టేస్తారు. అయితే వచ్చిన వారు జానకి ఎక్కడా అని అడుగుతారు. అసలు పూజ సమయంలో ఇంట్లో ఉండకుండా ఆమె ఏం చేస్తుంది అని ఇంతగా పట్టింపు లేకపోతే ఎలా అని అంటూ ఉంటారు. ఇక మరోవైపు రామచంద్ర మరోసారి తన భార్యకు ఫోన్ చేస్తాడు మళ్లీ జానకి దారి మధ్యలోనే ఉన్నాను అని చెబుతూ ఉంటుంది.

మల్లికకు అలా చెప్పిన గెస్టులు

మల్లికకు అలా చెప్పిన గెస్టులు

ఇక మళ్ళీ వెంటనే మనోహర్ దగ్గరికి వెళ్లిన జానకి ఆ దొంగ నిజం చెప్పాడు అని ఇప్పుడైనా వెళ్లవచ్చా అని అడుగుతుంది. సరే అని ఎస్ఐ మనోహర్ చెబుతూ ఉంటాడు. ఇక జానకి ఆటోలో ఇంటికి బయలుదేరుతూ ఉంటుంది. అయితే అప్పటికే పూజ కార్యక్రమాలు అయిపోతాయి. ఇక పంతులుగారు అక్షింతలు ఇచ్చి వారి భార్యలను దీవించమని అంటాడు. అయితే రామచంద్ర భార్య జానకి రాకపోవడంతో మల్లిక మళ్లీ గొడవలు ఎక్కువ అయ్యే విధంగా మాట్లాడుతూ ఉంటుంది. అంతేకాకుండా వచ్చిన చుట్టాలు అందరూ కూడా జానకి అత్తగారి మాట ఎప్పుడో దాటేసింది అని నువ్వైనా మీ అత్తగారిని జాగ్రత్తగా చూసుకొ అని మల్లికకు చెబుతారు. ఆ విషయంలో మల్లికా మరింత సంతోషపడుతుంది. మరి జానకి వచ్చిన తర్వాత ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X