Janaki Kalaganaledu March 17: ఉద్యోగం వలన సతమతమవుతున్న జానకి.. మరోసారి అత్తగారిలో కోపం

జానకి కలగనలేదు సీరియల్ విభిన్నమైన ఎమోషన్స్ తో ముందుకు సాగుతోంది. జానకి ఐపీఎస్ కావాలని అనుకుని చివరికి కానిస్టేబుల్ కావాల్సి వస్తుంది. ఇక భర్త రామ ఆమెకు సపోర్ట్ చేస్తాడు. మళ్ళీ ఎలాగైనా ఐపీఎస్ కావాలని ఆమెకు ధైర్యం ఇస్తాడు. ఇక జానకి కలగనలేదు సీరియల్ కు గత వారం కంటే ఈ వారం రేటింగ్స్ మరింత పెరిగాయి. 7.95 రేటింగ్ తో గత వారం మంచి క్రేజ్ అందుకుంటోంది. నేడు ప్రసారం కాబోయే 530 వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం..

 ఉద్యోగం వలన

ఉద్యోగం వలన

జానకి తన కానిస్టేబుల్ ఉద్యోగానికి కొనసాగిస్తూనే కుటుంబ బాధ్యతలను కూడా సమానంగా నిర్వర్తించాలని అనుకుంటుంది. అయితే ఈ క్రమంలో జానకి ఎక్కువగా ఉద్యోగానికి వాల్యూ ఇవ్వడంతో అత్త జ్ఞానాంబ కాస్త అసహనం వ్యక్తం చేస్తుంది. అయితే ఇంట్లో ప్రత్యేకంగా వ్రతం నిర్వహించాలి అని అనుకున్న అత్తగారు ఒకరోజు జానకిని డ్యూటీకి వెళ్ళకూడదు అని చెబుతుంది. కానీ జానకీ తప్పనిసరిగా వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆమెకు మామ గోవిందరాజులు భర్త రామచంద్ర కూడా సపోర్ట్ గా ఉంటారు.

చుట్టుపక్కల వారు

చుట్టుపక్కల వారు


ఇక జ్ఞానాంబ ఒప్పుకుంటుంది. అయితే పూజ సమయానికి రావాలని అనుకున్న జానకి ఎస్ఐ మనోహర్ చేసిన పని వల్ల ఆలస్యం గా ఇంటికి వెళ్లాల్సి వస్తుంది. అయితే అదే అవకాశంగా భావించిన రెండవ కోడలు మల్లికా తనే బాధ్యత తీసుకుని జానకి ఇంత సమయం అయినా కూడా రాలేదు అని అనవసరంగా లేనిపోని మాటలు ఎక్కిస్తుంది. దీంతో చుట్టుపక్కల వారు కూడా జానకి జ్ఞానాంబ చేయి దాటేసింది అని ఎంతైనా చదువుకున్న అమ్మాయి కదా అని ఇలాంటి పూజలకు వ్రతాలకు ఎందుకు హాజరు అవుతుంది అని అందరూ విభిన్నంగా మాట్లాడుతూ ఉంటారు.

 చాలా సంతోషంగా

చాలా సంతోషంగా


ఇక మల్లికకు అక్కడ చాలా సంతోషంగా అనిపిస్తుంది. అందరూ జానకిని తిడుతూ ఉండడంతో ఇప్పుడు అత్తగారికి ఆమెకి గ్యాప్ వస్తుంది అని.. నా రేంజ్ పెరుగుతుంది అని మల్లికా అనుకుంటూ ఉంటుంది. ఇక మొత్తానికి జానకి ఆలస్యమైనప్పటికీ కూడా ఇంటికి వస్తుంది. అప్పుడు పూజకు వచ్చిన చుట్టుపక్కల వాళ్ళు అందరూ కూడా వెళ్లిపోవాలని అనుకుంటూ ఉంటారు. ఇక వారి నుంచి ఆశీర్వాదం తీసుకోవాలని అనుకున్న జానకి ఒక్క పది నిమిషాలు ఆగితే తాను స్నానం చేసుకుని వచ్చి మీ ఆశీర్వాదం తీసుకుంటాను అని చెబుతుంది.

 జానకి మాటలు పట్టించుకోకుండా

జానకి మాటలు పట్టించుకోకుండా

కానీ వాళ్లు మాత్రం జానకి మాటలు పట్టించుకోకుండా నీకు కుటుంబ పద్ధతుల మీద ఏ మాత్రం గౌరవం లేదు అని మాకు అంత ఓపిక లేదు అంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. అయితే జానకి అలా తిడుతూ ఉంటే అందరూ కూడా మౌనంగా ఉండిపోతూ ఉంటారు. ఇక జానకి చివరికి అత్తగారికి క్షమాపణలు చెప్పాలని అనుకుంటుంది. కానీ ఆమె జానకి మాటలు పట్టించుకోకుండా లోపలికి వెళ్ళిపోతుంది. రామచంద్ర ఒక్కడే ఆమెకు సపోర్ట్ గా ఉంటాడు. ఇక మరోసారి జానకి అత్తగారి గదిలోకి వెళ్లి ఆమె కాళ్ళ మీద పడే క్షమాపణలు చెప్పాలని అనుకుంటుంది.

 తలదించుకోవాల్సి వచ్చింది

తలదించుకోవాల్సి వచ్చింది

కానీ జ్ఞానాంబ మాత్రం నువ్వు నేను చదువుకున్న అహంకారంతో ఇప్పుడు పూజకు హాజరు కాలేదు ఇలాంటి పరిస్థితుల వలన నీ నిండు నూరేళ్ల సంసారాన్ని నాశనం చేసుకుంటున్నావు అనిపిస్తోంది. ఈరోజు రామచంద్ర అందరి ముందు తలదించుకోవాల్సి వచ్చింది. నీకు నీ ఉద్యోగం ముఖ్యమే కావచ్చు కానీ నీ కుటుంబం కూడా అంతకంటే ఎక్కువగా ముఖ్యమని ఆమె గుర్తు చేస్తుంది. ఇక జానకి ఏమీ అనలేక అక్కడి నుంచి మౌనంగా వెళ్ళిపోతుంది.

ఒక్కసారిగా ఎమోషనల్

ఒక్కసారిగా ఎమోషనల్

అయితే జానకి పై అత్తగారు కోపంగా ఉండడంతో రెండవ కోడలు మల్లిక మాత్రం చాలా సంతోషంగా ఉంటుంది. ఇక జానకి జరిగిన పరిస్థితి గురించి ఆలోచిస్తూ ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. అందరూ కూడా అలా మాట్లాడడంతో ఆమె ఒక్కసారిగా ఎమోషనల్ అయిపోతుంది. ఇక రామచంద్ర మాత్రం జానకితో మాట్లాడుతూ.. మీరు ఏమి బాధపడకండి. మీరు అనుకోకుండా ఈ పొరపాటు చేశారు అని నచ్చజెప్పే ప్రయత్నం చేస్తాడు. అయితే జానకి జరిగిన అసలు విషయం గురించి చెబుతుంది.

 ఎస్ఐ గురించి చెప్పిన జానకి

ఎస్ఐ గురించి చెప్పిన జానకి


ఎస్ఐ మనోహర్ మీరు అనుకుంటున్నంత మంచివాడు కాదు అని అతను కావాలనే నేను ఆలస్యంగా ఇంటికి వచ్చేలా చేశారు అని అంటాడు. అంతేకాకుండా ఇంతకుముందు మీతో కావాలనే తన బూట్లను తుడిపించుకున్నాడు అని పైకి మంచిగా నటిస్తూనే తనపై కోపాన్ని చూపిస్తున్నాడు అని జానకి జరిగిన విషయం గురించి చెబుతుంది. దీంతో రామచంద్ర మళ్లీ ఒక్కసారిగా ఆలోచనలో పడతాడు. అయితే అవన్నీ మీరు పట్టించుకోవద్దు అని ముందు మీరు నా ఆశీర్వాదం తీసుకోవాలి అని అంటాడు. ఎందుకు అని అడగ్గా పంతులుగారు అక్షింతలు వేసి ఆశీర్వదించమని అన్నారు అని చెప్పడంతో జానకి ఎంతో సంతోషంగా రామచంద్ర కాళ్లు మొక్కుతూ ఆశీర్వాదం తీసుకుంటుంది. ఇక జానకి పోలీస్ స్టేషన్లో జరిగిన విషయాల గురించి రామచంద్ర తో మాట్లాడుతూ ఉంటుంది. మరి ఎస్సై మనోహర్ విషయంలో రామచంద్ర ఎ విధంగా సలహాలు ఇస్తాడో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X