Janaki Kalaganaledu March 1st: అత్తగారి కోసం జానకి సరికొత్త నిర్ణయం.. అలాంటి మాటలతో ఎమోషనల్
జానకి కలగనలేదు రోజురోజుకు మరింత ఆసక్తికరమైన కథనంతో కొనసాగుతోంది. తీవ్రమైన అప్పుల సమస్యల వలన విబేధాలు రావడంతో కుటుంబ సభ్యులు విడిపోవాలని అనుకుంటారు. కానీ పెద్ద కుమారుడు రామచంద్ర అందరిని బాగా చూసుకోవాలని అనుకుంటాడు. అయితే మరోవైపు జ్ఞానాంబ అనారోగ్యానికి గురవుతుంది. జానకి ఆ సమస్య నుంచి బయటపడేలా చేసి గొడవలు రాకుండా చూడాలని అనుకుంటుంది. ఇక ఇంతలోనే జ్ఞానాంబ విషయంలో జానకికి ఒక ఊహించని విషయం తెలుస్తుంది. జానకి కలగనలేదు సీరియల్ కు గత వారం కంటే ఈ వారం రేటింగ్స్ మరింత పెరిగాయి. 7.95 రేటింగ్ తో గత వారం మంచి క్రేజ్ అందుకుంటోంది. నేడు ప్రసారం కాబోయే 51 వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం..

బయటకు వెళ్లిపోవడానికి వీల్లేదు
జెస్సి గర్భవతి కావడంతో డెలివరీ కోసం పుట్టింటికి పంపించాలి అని ఆమె తండ్రి ఫోన్ చేసి మరి అడుగుతాడు. అయితే గోవిందరాజులు మాత్రం తన భార్య జ్ఞానాంబను అడిగి మీ ఇంటికి పంపిస్తాను అని అంటాడు. అయితే జ్ఞానాంబ మాత్రం అందుకు ఒప్పుకోదు. మన ఇంట్లోకి మొదటి వారసుడు రాబోతున్నాడు కాబట్టి ఈ ఇంట్లోనే కాన్పు జరగాలి అని అంటుంది. అంతేకాకుండా ఎవరూ కూడా బయటకు వెళ్లిపోవడానికి వీలు లేదు అని అందరూ కూడా కలిసి ఉండాలి అని అంటుంది. అయితే హఠాత్తుగా జ్ఞానాంబ అలా ఎందుకు మాట్లాడింది అనే విషయంపై మల్లిక ఎంతగానో ఆలోచిస్తూ ఉంటుంది.

తల్లిపై అఖిల్ అసహనం
జెస్సి నెలలు నిండింది కాబట్టి ఆమెను ఇంటికి పంపిస్తుందేమో అని మల్లిక అనుకుంటుంది. ఆమె తర్వాత తను కూడా వెళ్ళిపోవాలని అనుకుంటుంది. కానీ అత్తగారు మాత్రం ఆ విధంగా నిర్ణయం తీసుకోకుండా ఇక్కడే ఉండాలి అని చెప్పడంతో ఆమె షాక్ అవుతుంది. అంతేకాకుండా తన గదిలో భర్తతో మాట్లాడుతూ మన పరిస్థితి కూడా రేపు ఇంతే అని అసహనం వ్యక్తం చేస్తుంది. ఇక మరోవైపు జ్ఞానాంబ చిన్న కుమారుడు అఖిల్ కూడా తన భార్య జెస్సిని పుట్టింటికి పంపించకపోవడంపై కోపంగా ఉంటాడు. ఎలాగైనా ఇంట్లో నుంచి వెళ్లిపోదామని అనుకుంటే ఏదో ఒక కారణం చెప్పి ఇక్కడే ఉంచుతున్నారు. కనీసం ఈసారైనా ఈ వంకతో మీ ఇంటికి వెళదామని అనుకుంటే అది కూడా జరగనివ్వలేదు అని అఖిల్ తీవ్రస్థాయిలో తల్లి పై అసహనం వ్యక్తం చేస్తూ ఉంటాడు.

భర్తతో జ్ఞానాంబ ఎమోషనల్
ఇక జ్ఞానాంబ, జానకి చెప్పినట్లుగా సమయానికి టాబ్లెట్స్ వేసుకోవాలని అనుకుంటుంది. మొత్తానికి డాక్టర్, జ్ఞానాంబ చనిపోయే అవకాశం ఉంది అని చెప్పడంతో ఆమె ఏ మాత్రం భయపడకుండా మిగిలిన రోజులలో చాలా ఆనందంగా ఉండాలి అని అనుకుంటుంది. ఇక జ్ఞానాంబ టాబ్లెట్స్ వేసుకుంటూ ఉండటంతో గోవిందరాజులు ఆమెను అడుగుతాడు. నిన్నటి వరకు టాబ్లెట్స్ అంటేనే వేసుకునే దానివి కాదు. కానీ ఈరోజు నీ అంతట నువ్వే వేసుకుంటున్నావు ఏంటి అని అడుగుతాడు. ఇక అందుకు జ్ఞానాంబ మరణానికి సంబంధించిన మాటలతో చాలా భావోద్వేగంగా మాట్లాడుతుంది. కానీ ఆమె మాట్లాడుతున్న విధానం మాత్రం భర్త గోవిందరాజులు అర్థం కాదు. ఇప్పుడు అవన్నీ ఎందుకు అని అంటాడు.

అత్త ఆలోచనలో జానకి
ఇక మళ్ళీ జ్ఞానాంబ అలాంటిదేమీ లేదు అని మా హాస్పిటల్ కి వెళ్ళినప్పుడు నా వయసులో ఉన్న ఒక ఆమె చనిపోయింది అని ఎవరైనా ఎప్పుడైనా చనిపోవాల్సిందే కదా అంటుంది. కానీ గోవిందరాజులు మాత్రం అలా మాట్లాడకు అని అంటూ నా గుండె తట్టుకోలేదు అని చెప్తాడు. దీంతో జ్ఞానాంబ సరేనని వెళ్ళిపోతుంది. ఇక మరోవైపు జానకి అత్తగారికి కిడ్నీ మార్పిడి చేస్తే బ్రతుకుతుంది కాబట్టి తన కిడ్నీ అయితే సరిపోతుంది అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇక తన లక్ష్యం గురించి కూడా ఆమె ఆలోచనలో పడుతుంది. అయితే తన మామగారికి అసలు విషయం చెప్పకుండా తన స్నేహితురాలికి ఇలాంటి సమస్య ఒకటి వచ్చింది అని అప్పుడు అమ్మాయి ఏం చేయాలి? మీరు ఏమైనా మాట సహాయంగా సలహా ఇవ్వగలరా అని అడుగుతుంది.

జానకి నిర్ణయం ఏంటి?
అందుకు గోవిందరాజులు ఒక లక్ష్యం కంటే కూడా కుటుంబం అనేది చాలా ముఖ్యం అని అర్థమయ్యేలా జానకికి చెబుతాడు. ఇక జానకి కూడా ఒక ఈ విషయంలో ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలని అనుకుంటుంది. ఇక జ్ఞానాంబ ఇంట్లో వాళ్ళందరితో కూడా సంతోషంగా ఉండాలి అని ఎల్లప్పుడూ ఆలోచిస్తుంది. ఈరోజు అందరికీ నేనే భోజనం వడ్డిస్తాను అని చెబుతుంది. ఇలాంటి జ్ఞాపకాలు మనుషులకు చాలా అవసరం అని మళ్లీ మళ్లీ రాకపోవచ్చు అని కూడా ఆమె దీర్ఘంగా ఆలోచిస్తూ మాట్లాడుతుంది. ఇక జ్ఞానాంబ ఆ విధంగా ఎందుకు మాట్లాడుతుందో ఎవరికి అర్థం కాకపోయినా జానకి రామచంద్ర కు మాత్రం అర్థమవుతుంది. వాళ్ల గురించి ఆలోచిస్తూ కూర్చుని ఉండగా అప్పుడే రామచంద్ర వచ్చి ఆమెకు కాళ్ళు పడతాడు. నీలాంటి కొడుకు ఉండడం చాలా అదృష్టం అని జ్ఞానాంబ ఎంతగానో ఆలోచిస్తుంది. ఇక వారి సంతోషాన్ని దూరం నుంచి చూసిన జానకి మళ్ళీ ఆలోచనలు పడుతుంది. మరి అత్తగారి కోసం ఆమె ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో తదుపరి ఎపిసోడ్లో చూడాలి.


Click it and Unblock the Notifications











