Janaki Kalaganaledu March 20: జానకిపై మరోసారి ఎస్ఐ మనోహర్ ఉగ్రరూపం.. అవమానించేలా చర్యలు!
జానకి కలగనలేదు సీరియల్ కథ మరో కీలక మలుపు తిరిగింది. ఐపీఎస్ కావాలని అనుకున్న జానకి ముందుగా కానిస్టేబుల్ కావాల్సి వస్తుంది. ఇక భర్త రామ ఆమెకు సపోర్ట్ చేస్తాడు. మళ్ళీ ఎలాగైనా ఐపీఎస్ కావాలని ఆమెకు ధైర్యం చెప్తాడు. ఇక జానకి కలగనలేదు సీరియల్ కు గత వారం కంటే ఈ వారం రేటింగ్స్ మరింత పెరిగాయి. 7.95 రేటింగ్ తో గత వారం మంచి క్రేజ్ అందుకుంటోంది. నేడు ప్రసారం కాబోయే 532 వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం..

నిజాయితీగా ఉన్నప్పటికీ
జానకి కానిస్టేబుల్ గా ఎంతో నిజాయితీగా ఉద్యోగం చేయాలని అనుకున్నప్పటికీ కూడా ఆమెకు ఊహించని సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ఒకవైపు కుటుంబ పరిస్థితులు మరొకవైపు ఎస్ఐ మనోహర్ తిక్క కారణంగా ఆమె ఊహించని విధంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది. అయితే ఎస్ఐ మనోహర్ ఒక దొంగ గురించి ముందుగానే తెలుసుకోవాలి అని జానకికి ఒక పని అప్పచెబుతాడు. తప్పకుండా అతన్ని పట్టుకోవాలి అని కూడా అంటాడు. అయితే జానకి అదే పని మీద ఫోకస్ చేయాలని అనుకుంటుంది. కానీ అదే రోజు ఆమె చిన్న తోడికోడలు డెలివరీ ఉండడంతో హాస్పిటల్ కి వెళ్లాల్సి వస్తుంది.

జ్ఞానాంబ ఇంటికి వారసుడు
అఖిల్ భార్య జెస్సి పండంటి మగ బిడ్డకు జన్మనిస్తుంది దీంతో జానకి ఇంట్లో అందరూ కూడా ఎంతో సంతోషంగా ఉంటారు. ముఖ్యంగా జ్ఞానాంబ మనవడిని చూసి చాలా సంబరపడుతుంది. ఇక గోవిందరాజులు కూడా తన భార్య పడుతున్న సంతోషం చూసి ఈ సంతోషం ముందు ఏదైనా చాలా తక్కువ అని పొగుడుతూ ఉంటాడు. ఇక అతనికి ఎవరి పోలికలు వచ్చాయి అని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక జానకి రామచంద్రం మళ్ళీ హాస్పిటల్ నుంచి బయటకు వస్తారు.

అఖిల్ హ్యాపీ
అప్పుడే అఖిల్ అక్కడికి వచ్చి జెస్సిని చూసేందుకు వెళ్తాడు. తన కొడుకుని చూసి అఖిల్ ఎంతగానో ఆనందపడతాడు. అయితే ఒక విషయాన్ని గుర్తు చేసుకుని అఖిల్ కొంత బాధపడుతూ కూడా ఉంటాడు. ఇంకా సెటిల్ కాకముందే తండ్రిని అయినందుకు కాస్త బాధగా ఉంది అని కూడా చెబుతాడు. అంతేకాకుండా నా అంత అదృష్టవంతుడు ఎవరు ఉండడు అని కూడా అతను హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇక తర్వాత అఖిల్ బయటకు వచ్చి నార్మల్ డెలివరీ అయింది కదా జెస్సిని తీసుకు వెళ్ళవచ్చు అని అని అంటాడు.

మరోసారి జెస్సి దగ్గరికి
అయితే అప్పుడే ఎందుకు అని రామచంద్ర కూడా చెబుతాడు. ఇక నార్మల్ డెలివరీ అయితే తీసుకు వెళ్ళవచ్చు అని జానకి చెప్పడంతో అతను ఓకే అంటాడు. ఇక తర్వాత మరోసారి జెస్సి దగ్గరికి వెళ్లి రామచంద్ర బాబుని చూడాలని అనుకుంటారు. అయితే అప్పుడే పోలీస్ స్టేషన్ నుంచి జానకి కి ఫోన్ కాల్ వస్తుంది. ఆమె సహ ఉద్యోగి లేడీ కానిస్టేబుల్ ఫోన్ చేసి జానకి అర్జెంటుగా ఫోన్ ఇవ్వాలి అని అడుగుతుంది. ఇక రామచంద్ర ఫోన్ మాట్లాడుతూ ఉంటే లోపల జానకి జెస్సిని దగ్గర ఉంటుంది.

చాలా కోపంగా..
అయితే అప్పుడే జెస్సి తల్లిదండ్రులు అక్కడికి వస్తారు జానకి ఇక్కడ ఉండవద్దు అని వాళ్ళు చెబుతారు. దీంతో జానకి కొంత బాధపడుతూ బయటకు వచ్చేస్తుంది. అయితే ఎందుకు అలా అన్నావు అని జెస్సి తన తల్లిని అంటుంది. ఇంతవరకు తనకు పిల్లలు లేరు అని అలాంటి వాళ్ళ కళ్ళు పిల్లల మీద పడకూడదు అని వేరేగా మాట్లాడుతుంది. ఇక జానకి రాగానే రామచంద్ర ఫోన్ ఇస్తాడు. ఇక జానకి తన స్నేహితురాలితో మాట్లాడుతుంది. ఎస్ఐ గారు ఇక్కడ చాలా కోపంగా ఉన్నారు అని నువ్వు డ్యూటీలో ఉండకుండా ఎక్కడ ఉన్నావు అని ఆమె అడుగుతుంది.

ఎక్కడికి వెళ్లింది?
అయితే జానకి జరిగిన విషయం గురించి చెబుతుంది. ఇక వెంటనే నువ్వు హాస్పిటల్ కి రావాలి అని కూడా అనడంతో జానకి రామచంద్ర కు చెప్పి అక్కడి నుంచి బయలుదేరుతుంది. ఇక ఎస్ఐ మనోహర్ జానకి డ్యూటీ చేయకుండా ఎక్కడికి వెళ్లింది అని పోలీస్ స్టేషన్లో చాలా కోపంగా కనిపిస్తూ ఉంటాడు. ఇక వెంటనే జానకి రాగానే అతను చాలా తిక్క తిక్కగా ప్రవర్తిస్తూ ఉంటాడు. ఆమె జరిగిన విషయం చెప్పినప్పటికీ కూడా నీకు నేను తోడికోడలు ప్రెగ్నెన్సీ కంటే అతి ముఖ్యమైన పని డ్యూటీ అని ఆమెను వాళ్ల భర్త కూడా చూసుకోవచ్చు.

నిజం తెలుసుకున్న మనోహర్
కానీ ఈ పోలీస్ డ్యూటీ ఎవరు చేస్తారు అని అతను కోపంగా చెబుతాడు. అంతేకాకుండా నా చెవిలో ఏమైనా పువ్వులు కనిపిస్తున్నాయా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. అంతేకాకుండా నువ్వు మరోసారి తప్పు చేయకుండా ఉండాలి అంటే ఇప్పుడు పోలీస్ స్టేషన్ లో ఉన్న ప్రతి ఫైల్ ప్రతి టేబుల్ అన్ని కూడా చూడాలి అని ఇది నీకు పనిష్మెంట్ అని కూడా ఆయన చెబుతారు. దీంతో జానకి సైలెంట్ గా తన పని చేసుకుంటూ వెళుతుంది. అయితే తన స్నేహితురాలు మాత్రం ఈ విధంగా నువ్వు అవమానపడడం కంటే ఉద్యోగం మానవయోచ్చు కదా అని చెబుతుంది. కానీ జానకి అలా చేయకూడదు అని అయినా నేను ఐపీఎస్ కావాలన్నది నా లక్ష్యం అని చెబుతుంది. అయితే ఆ మాటలు అప్పుడే ఎస్ఐ మనోహర్ వింటాడు. మరి అతను జానకిపై ఏ విధంగా రియాక్ట్ అవుతాడు అనేది చూడాలి.


Click it and Unblock the Notifications











