Janaki Kalaganaledu March 21: ఇంట్లో కూడా అవమానాలే.. జానకి ఆలోచనను మారుస్తున్న అత్త!
జానకి కలగనలేదు సీరియల్ కథ రోజురోజుకు మరింత ఆసక్తికరంగా మారుతోంది. ఐపీఎస్ కావాలని అనుకున్న జానకి ముందుగా కానిస్టేబుల్ కావాల్సి వస్తుంది. ఇక భర్త రామ ఆమెకు సపోర్ట్ చేస్తాడు. మళ్ళీ ఎలాగైనా ఐపీఎస్ కావాలని ఆమెకు ధైర్యం చెప్తాడు. ఇక జానకి కలగనలేదు సీరియల్ కు గత వారం కంటే ఈ వారం రేటింగ్స్ మరింత పెరిగాయి. 7.95 రేటింగ్ తో గత వారం మంచి క్రేజ్ అందుకుంటోంది. నేడు ప్రసారం కాబోయే 533 వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం..

జానకిని పై అసూయతో
జానకి ఒకవైపు ఐపీఎస్ సంబంధించిన చదువును కొనసాగిస్తూనే మరొకవైపు కానిస్టేబుల్ ఉద్యోగంలో కూడా కష్టపడుతూ ముందుకు కొనసాగుతూ ఉంటుంది. అయితే ఎస్ఐ మనోహర్ మాత్రం జానకిని పై అసూయతో ఆమెను మరింత ఇబ్బంది పెడుతూ ఉంటాడు. ఇక జానకి ఒక కేసు విషయంలో తప్పు చేసింది అని స్టేషన్లో ఉన్న అన్ని వస్తువులను తుడవాలి అని పనిష్మెంట్ ఇస్తాడు. అయితే జానకి ఎంతో అవమానంగా ఫీల్ అవుతూ ఉండటంతో ఆమె సన్నిహితురాలు వచ్చి ఈ ఉద్యోగం మానేయవచ్చు కదా అని అంటుంది. అయితే జానకి మాత్రం కొన్నిసార్లు మన అనుకున్న లక్ష్యం కోసం ఎన్ని కష్టాలు వచ్చినా కూడా భరించాలి అని జానకి చెబుతూ ఉంటుంది.

నీ కల చెదిరిపోయేలా..
అంతేకాకుండా అసలు నేను ఐపీఎస్ కావాలని అనుకుంటున్నాను అని చెబుతోంది. దీంతో అప్పుడే ఆ మాటలు విన్న ఎస్ఐ మనోహర్ ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు. ఇక ఎస్ఐ మనోహర్ జానకి పై మరింత నిర్మించి పెంచుకుంటాడు. అందుకనే ఇన్ని రోజులు ఇంతలా ఫోజులు కొడుతున్నావని ఇకనుంచి నీ కల చెదిరిపోయేలా చేసే వరకు నేను నిద్రపోను అని నా ఈగో మీద దెబ్బ కొట్టావు నేను నిన్ను ఈ జాబు వదిలి పెట్టి పారిపోయేలా చేస్తాను అని ఎస్ఐ మనోహర్ తన మనసులో అనుకుంటాడు.

ఇంట్లో హడావిడి చేస్తూ
ఇక మరోవైపు తన తమ్ముడికి కొడుకు పుట్టిన సంతోషంలో రామచంద్ర ఇంట్లో హడావిడి చేస్తూ ఉంటాడు. అఖిల్ తన భార్యను తీసుకువస్తూ ఉండడంతో ముందుగానే వెల్కమ్ అంటూ ఏర్పాట్లు కూడా చేస్తాడు. ఇక అత్త మామలతో కలిసి అఖిల్ అలాగే జెస్సి ఇద్దరు కూడా ఆటో దిగుతారు. ఇక అందరూ కూడా సంతోషంగా ఉన్నప్పటికీ కూడా జెస్సి తల్లి మేరీ మాత్రం అసంతృప్తిగానే ఉంటుంది. బయట ముచ్చట్లు పెట్టింది చాలు అని తొందరగా ఇంట్లోకి వెళ్లాలి అని అసలే పిల్లాడికి చలిగాలి తలుగుతుంది అని ఆమె అంటుంది. ఇక ఇంట్లోకి వచ్చిన తర్వాత అందరూ కూడా అఖిల్ కొడుకుని చూసి ఎంతగానో ఆనందపడుతూ ఉంటారు.

అఖిల్ కొడుకును ఎత్తుకోవాలని..
అయితే అఖిల్ కొడుకును ఎత్తుకోవాలి అని రామచంద్ర ఎంతగానో ఆరాటపడుతూ ఉంటాడు. కానీ అఖిల్ మాత్రం అందుకు ఒప్పుకోకుండా బయట ఎక్కడెక్కడో పనిచేది వాస్తవు ఇప్పుడు హఠాత్తుగా బాబుని ఎత్తుకుంటే అతని ఆరోగ్యం ఏమవుతుంది అని అసలు చిన్న పిల్లలు చాలా సెన్సిటివ్ గా ఉంటారు కాబట్టి నువ్వు దూరంగా ఉండు అని అంటాడు. నేను చేతులు కూడా కడుక్కొని వచ్చాను అని రామచంద్ర చెప్పినప్పటికీ కూడా అతని మాటలు వినకుండా తన బాబుని తీసుకుని అఖిల్ లోపలికి వెళ్ళిపోతాడు. దీంతో రామచంద్ర ఎంతగానో బాధపడతాడు.

దురదృష్టవంతురాలు
అయితే అప్పుడే తల్లి జ్ఞానాంబ చూసి చాలా బాధపడుతుంది. ఇక జానకి కూడా బాబుని ఎత్తుకోవాలని అనుకుంటుంది. కానీ జెస్సి తల్లి తప్పుగా మాట్లాడుతుంది. అలాంటి ఆమె బాబును ఎత్తుకుంటే చెడు దృష్టి పడుతుంది అని పెద్ద కోడలు అయినప్పటికీ ఇంతవరకు ఆమెకు పిల్లలు లేకపోవడం అంటే దురదృష్టవంతురాలు అని ఆ దరిద్రం బాబుకు కూడా అంటుకుంటుంది అని ఆమె అంటుంది. దీంతో జానకి ఏమీ మాట్లాడకుండా సైలెంట్ గా బయటకు వచ్చేస్తుంది.

సంతోషంగా మాట్లాడుకుంటూ
అయితే బయట రామచంద్ర కాస్త బాధతో కనిపించడంతో జానకి వెంటనే వెళ్లి మాట్లాడుతుంది. ఒకరికి ఒకరు జరిగినా అవమానాల గురించి మాట్లాడుకోకుండా బాబు గురించి సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక జానకి జెస్సీ తల్లి అన్న మాటలను గుర్తు చేసుకుని బాధపడుతూ ఉంటుంది. వంట గదిలో పాలు పొంగిపోతున్న కూడా పట్టించుకోదు. ఇక అప్పుడే అత్తగారు జ్ఞానాంబ వచ్చి జానకికి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తుంది.

కాలం పోతే మళ్ళీ తిరిగి రాదు
నువ్వు నీ లక్ష్యం కోసం ఇప్పటివరకు పిల్లలను కనకూడదు అని అనుకున్నావు. కానీ కాలం పోతే మళ్ళీ తిరిగి రాదు. లక్ష్యం కోసం జీవితాన్ని మొత్తాన్ని ఖర్చు పెట్టడం కూడా సరైనది కాదు. ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలి. నేను నీకు ఒక అత్తగా చెప్పడం లేదు అని నీ క్షేమం కోరుకునే వ్యక్తిగా చెబుతున్నాను అని జ్ఞానాంబ చెబుతుంది. ఇక రామచంద్ర కూడా నీ తరహాలోనే బాధపడుతున్నాడు అని ఆమె అనడంతో జానకి మళ్ళీ ఆలోచనలో పడుతుంది. అలాగే భార్యగా భర్త మనసు తెలుసుకోవడం నీ బాధ్యత.. ఇవన్నీ నీకు తెలియనివి కావు. చిన్నపిల్లవు కాదు అంటూ మరోసారి జ్ఞానాంబ చెప్పడంతో జానకి ఆ విషయం గురించి ఆలోచిస్తుంది. మరి ఆమె ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.


Click it and Unblock the Notifications











