Janaki Kalaganaledu March 23: భర్త సంతోషం కోసం ఊహించని ప్లాన్ వేసిన జానకి.. జ్ఞానాంబ సపోర్ట్!

జానకి కలగనలేదు సీరియల్ కథ సరికొత్త ట్విస్ట్ లతో ఎంతో ఆసక్తికరంగా మారుతోంది. ఐపీఎస్ కావాలని ఎన్నో కలలు కన్న జానకి ముందుగా కానిస్టేబుల్ కావాల్సి వస్తుంది. ఇక భర్త రామ ఆమెకు సపోర్ట్ చేస్తాడు. మళ్ళీ ఎలాగైనా ఐపీఎస్ కావాలని ఆమెకు ధైర్యం చెప్తాడు. ఇక జానకి కలగనలేదు సీరియల్ కు గత వారం కంటే ఈ వారం రేటింగ్స్ మరింత పెరిగాయి. 7.95 రేటింగ్ తో గత వారం మంచి క్రేజ్ అందుకుంటోంది. నేడు ప్రసారం కాబోయే 534 వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం..

కుటుంబ బాధ్యతలు

కుటుంబ బాధ్యతలు

జానకి ఒకవైపు కుటుంబ బాధ్యతలు చూసుకుంటూనే మరొకవైపు కానిస్టేబుల్ ఉద్యోగాన్ని కూడా కొనసాగిస్తూ ఉంటుంది. మొదటినుంచి కూడా ఐపీఎస్ కావాలని అనుకున్న జానకి ఇప్పుడు కానిస్టేబుల్ ఉద్యోగం చేయాల్సి వస్తుంది కానీ మళ్ళీ చదువుకొని ఐపిఎస్ పరీక్షల కోసం సిద్ధం కావాలి అని ఆమె భర్త రామచంద్ర ఎంతగానో సపోర్ట్ చేస్తాడు. అయితే ఈ తరుణంలో జానకిని మరొక సమస్య చుట్టుముడుతుంది. ఆమెకు పిల్లలు లేకపోవడంతో అందరూ కూడా ఎన్నో మాటలు అంటూ ఉంటారు జెస్సి తల్లి కూడా అలాంటి వారి చూపు నీ బిడ్డ మీద పడకూడదు అని మాట్లాడడంతో జానకి అత్తగారు కాస్త బాధపడుతూ ఉంటారు.

 నీ లక్ష్యం కోసం

నీ లక్ష్యం కోసం


ఇక అదే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని జ్ఞానాంబ జానకితో ప్రత్యేకంగా మాట్లాడుతుంది. నువ్వు నీ లక్ష్యం కోసం ఇప్పుడు పిల్లలు వద్దు అని అనుకుంటున్నావు. కానీ రేపు సరైన సమయంలో పిల్లలు లేకపోతే అప్పుడు మళ్ళీ బాధపడాల్సి వస్తుంది. లక్ష్యం కోసం మనం జీవిత కాలాన్ని మొత్తం కూడా ఒకే దానికి ఖర్చు చేయడం కూడా న్యాయం కాదు అని ఒక ఆడపిల్ల అమ్మ అనే పిలుపు కోసం ఎంతగానో ఎదురుచూస్తుంది అని దాన్ని కాలంతో పరిగెడుతూ చేజార్చుకునే పరిస్థితి వస్తే చాలా బాధగా ఉంటుంది అని జ్ఞానాంబ ఎంతగానో అర్థమయ్యేలా చెబుతారు.

 ఆలోచనలో పడిన జానకి

ఆలోచనలో పడిన జానకి

దీంతో జానకి మరోసారి ఆ విషయం గురించి ఆలోచనలో పడుతుంది. అంతేకాకుండా భర్తకు కూడా ఎలాంటి సంతోషం ఇవ్వడం లేదు అని అత్తగారు చెప్పిన మాటలను గుర్తు చేసుకుంటుంటుంది. అయితే భర్తతో ఆమె కలవాలని అనుకుంటుంది. అయితే రామచంద్ర మాత్రం ముందుగానే జానకి లక్ష్యం కోసం ఆలోచించి ఆమెకు దూరంగా ఉంటాడు. అనవసరంగా ఇప్పుడే పిల్లలను కనవద్దు అని కూడా చెబుతాడు. ఇక డైరెక్ట్ గా అడిగితే రామచంద్ర వద్దు అంటాడు జానకి మరో విధంగా ప్లాన్ చేస్తుంది. మనం రేపు ఉదయమే బయటకు వెళ్తున్నామని ఒక రెండు రోజుల వరకు మీరు నాకు సమయం కేటాయించాలి అని అంటుంది. ఇక రామచంద్ర ఎన్ని ప్రశ్నలు వేసినా కూడా జానకి ఊహించని విధంగా సమాధానాలు ఇస్తుంది. అంతేకాకుండా అతని రెచ్చగొట్టే విధంగా కూడా మాట్లాడుతుంది. రామచంద్ర మళ్లీ ఆలోచిస్తూ ఉండగా అలా ఆలోచిస్తూ ఉంటే సమయం వృధా అని జానకి మళ్ళీ అతని మీద పంచులు కూడా వేస్తుంది. దీంతో రామచంద్ర ఏమీ తెలియని కన్ఫ్యూజన్లో కూడా ఉండిపోతాడు.

ప్రశ్నలు అడగకూడదు

ప్రశ్నలు అడగకూడదు

అదేవిధంగా ఎక్కడికి వెళుతున్నాము ఎందుకు అని ప్రశ్నలు అడగకూడదు అని కూడా జానకి చెబుతుంది. దీంతో రామచంద్ర కాస్త కన్ఫ్యూజన్లో పడతాడు. ఇక ఉదయమే లేచిన తర్వాత జానకి స్నానం చేసి అందంగా కనిపిస్తూ ఉంటుంది. దీంతో రామచంద్ర ఆమెను చూసి ఎంతగానో ఆనందపడతాడు. అంతేకాకుండా తన మాటలతో జానకి రామచంద్రను టెంప్ట్ చేస్తూ ఉంటుంది. ఇంతకు మనం ఎక్కడికి వెళ్తున్నామో చెప్పలేదు అని అడిగితే మళ్లీ కన్ఫ్యూజన్ కూడా చేస్తుంది. దీంతో రామచంద్ర సైలెంట్ గా బయటకు వస్తాడు. అయితే బయట తల్లి జ్ఞానాంబ పాటు గోవిందరాజులు ఇద్దరు కూడా మనవడితో ఎంతో సంతోషంగా కనిపిస్తూ ఉంటారు.

సరైన నిర్ణయమే..

సరైన నిర్ణయమే..

ముఖ్యంగా తల్లి అఖిల్ కొడుకుకు స్నానం చేయిస్తూ చాలా హ్యాపీగా ఉంటుంది. అయితే రామచంద్ర జానకి మళ్ళీ అత్తగారి దగ్గరికి వెళ్లి బయటకు వెళుతున్నట్లు చెబుతారు. అయితే ఎక్కడికి అని గోవిందరాజులు అడుగుతారు. దీంతో రామచంద్ర జానకి ఏమి చెప్పలేదు కాబట్టి మౌనంగా ఉండిపోతాడు. నాకు జానకి ఏమి చెప్పలేదు అని నువ్వైనా అడిగి తెలుసుకో అమ్మ అంటూ తన తల్లిని అడుగుతాడు. అయితే జ్ఞానాంబ కాస్త ఆలోచించి జానకి సరైన నిర్ణయమే తీసుకుంది అని గ్రహిస్తుంది. వెంటనే వారికి డబ్బులు ఇచ్చి పంపించాలి అని తన భర్తకు చెబుతోంది. అయితే రామచంద్ర మళ్లీ ఎక్కడికి అని అడిగితే అలా అడగకూడదు అని తల్లి కూడా చెబుతుంది. దీంతో రామచంద్ర సైలెంట్ గా జానకి తో పాటు బయటకు వెళ్తాడు. తన స్నేహితుడిని బండి అడిగి జానకిని బైక్ మీద తీసుకువెళ్తాను అని చెబుతాడు. ఇక ఇద్దరు షాపింగ్ చేయడానికి కూడా వెళతారు. అక్కడ జానకి ప్రత్యేకంగా రామచంద్ర కోసం బట్టలు కూడా కొనుగోలు చేస్తుంది. మరి మీరు ఇద్దరి మధ్య ఏం జరుగుతుందో తదుపరి ఎపిసోడ్ లో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X