Janaki Kalaganaledu March 24th: మనోహర్ కంట పడకుండా తప్పించుకున్న జానకి.. అనుమానం మొదలైంది!

జానకి కలగనలేదు సీరియల్ కథ సరికొత్త కథనంతో ఎంతో ఆసక్తికరంగా కొనసాగుతోంది. ఐపీఎస్ కావాలని ఎన్నో కలలు కన్న జానకి ముందుగా కానిస్టేబుల్ కావాల్సి వస్తుంది. ఇక భర్త రామ ఆమెకు సపోర్ట్ చేస్తాడు. మళ్ళీ ఎలాగైనా ఐపీఎస్ కావాలని ఆమెకు ధైర్యం చెప్తాడు. ఇక జానకి కలగనలేదు సీరియల్ కు గత వారం కంటే ఈ వారం రేటింగ్స్ మరింత పెరిగాయి. 7.95 రేటింగ్ తో గత వారం మంచి క్రేజ్ అందుకుంటోంది. నేడు ప్రసారం కాబోయే 535 వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం..

కేవలం లక్ష్యం కోసం

కేవలం లక్ష్యం కోసం

అత్తగారు చెప్పిన మాటలకు జానకి మళ్ళీ ఆలోచనలు పడుతుంది. ఒకవైపు ఐపీఎస్ చదువుకున్న సాగిస్తూనే అలాగే తన కానిస్టేబుల్ ఉద్యోగాన్ని కూడా జానకి ఎంతో నిజాయితీగా చేస్తుంది. అయితే తన లక్ష్యం కోసం భర్త సంతోషానికి దూరం అవుతుంది అని అత్తగారు గుర్తు చేస్తూ ఉంటారు. అంతేకాకుండా ఈ వయసులోనే పిల్లలను కంటే బాగుంటుంది అని కేవలం లక్ష్యం కోసం మాత్రమే ఆలోచించి ఈ వయసును వృధా చేసుకోవద్దు అని ఎంతగానో అర్థమయ్యేలా చెబుతుంది.

అత్తగారు చెప్పిన విషయంలో..

అత్తగారు చెప్పిన విషయంలో..

దీంతో అత్తగారు చెప్పిన విషయంలో కూడా చాలా అర్థం ఉంది అని జానకి ఆ విషయం గురించి ఆలోచిస్తుంది. ఇక వెంటనే రామచంద్రకు చెబితే ఒప్పుకోడు అని తన ఐపీఎస్ లక్ష్యం కోసం ఆయన కూడా పిల్లలను వద్దు అని అంటారు అని జానకి మరొక విధంగా ప్రణాళిక వేస్తుంది. ముందుగా రామచంద్ర కు ఏ విషయాన్ని చెప్పకుండా ఒక రెండు రోజులు మనం బయటకు వెళుతున్నాము అని చెబుతుంది అంతేకాకుండా ఎక్కడికి వెళ్తున్నామని విషయాన్ని కూడా అడగకూడదు అని జానకి తన భర్త నుంచి మాట తీసుకుంటుంది.

 అలా సరదాగా బయటకు

అలా సరదాగా బయటకు

ఇక భర్తతో అలా సరదాగా బయటకు వెళ్లిన జానకి ముందుగా షాపింగ్ చేస్తు విభిన్నమైన బట్టలను కొనుక్కోవాలని అనుకుంటుంది. అంతేకాకుండా తనకు ఒక ఫ్యాషన్ డ్రెస్ కొనడంతో రామచంద్ర ఇలాంటి డ్రెస్ మీరు వేసుకుంటారా? అని ఆశ్చర్యపోతూ ఉంటాడు. అంతేకాకుండా మీరు ఈరోజు ఒక స్టైలిష్ డ్రెస్ వేసుకోవాలి అని జానకి అర్థమయ్యేలా చెబుతుంది. దీంతో రామచంద్ర కూడా అందుకు ఓకే అంటాడు. అయితే వాళ్లు షాపింగ్ చేస్తున్న సమయంలోనే ఎస్సై మనోహర్ అక్కడికి వస్తాడు. తన భార్య కోసం ఒక దుపట్టా కొనుక్కోవాలి అని జానకి చేస్తున్న షాపింగ్ మాల్లోకి వస్తాడు.

ఆరోగ్యం బాగోలేదు అని

ఆరోగ్యం బాగోలేదు అని

అయితే అక్కడ జానకి ఎస్ఐ మనోహర్ ను చూసి షాక్ అవుతుంది. ఎందుకంటే తనకు ఆరోగ్యం బాగోలేదు అని సెలవు పెట్టిన జానకి హఠాత్తుగా ఇప్పుడు ఎస్సై చూశారు అంటే ఏమంటారో అని అసలే తిక్కమనిషి అని భయపడుతూ ఉంటుంది. ఇక అతని కంటపడకుండా జానకి జాగ్రత్త పడుతూ దాక్కొని ఉంటుంది. ఇక అలాగే రామచంద్ర కూడా అతని కంటపడనివ్వకుండా చేస్తుంది. అయితే ఇంతలో ఎస్ఐ మనోహర్ కు కాస్త అనుమానం వస్తుంది. అక్కడ ఎవరో దాక్కొని ఉన్నారు అని వారి వద్దకు వెళ్లగా అక్కడ జానకి ఉండదు. మరొక అమ్మాయి ఉంటుంది.

అతని కంటపడకుండా

అతని కంటపడకుండా

అంతేకాకుండా రామచంద్ర పక్కనే ఒక డ్రెస్ చూస్తున్నట్లుగా అటువైపు తిరిగే ఉంటాడు. మొహం చూపించకపోవడంతో ఇక్కడ ఇందాక ఒక అమ్మాయి ఉండేది నువ్వు ఏమైనా చూసావా అని అంటాడు. చూశాను అని చెప్పిన రామచంద్ర ఇప్పుడే బయటికి వెళ్లిపోయింది అని చెబుతాడు. ఇక ఎస్సై మనోహర్ అనుమానంగా ఉన్నప్పటికీ కూడా సైలెంట్ గా మళ్లీ తన పని తాను చూసుకుంటూ ఉంటాడు. ఇక అతని కంటపడకుండా జానకి రామచంద్ర మెల్లగా వెనకాల వైపు నుంచి బయటకు వెళ్ళిపోతారు.

 మల్లికకు షాక్

మల్లికకు షాక్

అయితే మరోవైపు మల్లికా జానకి విషయంలో మరింత బాధపడుతూ ఉంటుంది. ఇంట్లో పనివాడు మలయాళం మల్లికకు అసలు విషయం చెబుతాడు. ఈ రెండు రోజులు జానకి రామచంద్ర గారు విహారయాత్రలకు వెళ్లారు అని చెప్పడంతో మల్లిక ఒక్కసారిగా షాక్ అవుతుంది. నేను పూజలు చేస్తుంటే వరాలు మాత్రం వాళ్లకి దేవుడు ఇస్తున్నాడు అని కుళ్ళుకుంటుంది. ఇక ఆ విషయాన్ని వెంటనే మామగారిని అడగాలని అనుకుంటుంది. నాకు ఎందుకు ఇలాంటి ఆఫర్ ఇవ్వరని గొడవ చేయాలని అనుకుంటుంది. ఇక మలయాళం ఆమె పక్కన ఉండకుండా జంప్ అవుతాడు.

జానకి అలక

జానకి అలక

అయితే మరోవైపు జానకి రామ ఇద్దరు కూడా జాలీగా బైక్ మీద తిరుగుతూ ఉంటారు. ఇక రామ ఈ రోజు స్వీట్ బండి పెట్టకపోవడంతో కాస్త అసంతృప్తితో ఉంటాడు. దీంతో జానకి రామ మీద అలుగుతుంది. వెంటనే బైక్ ఆపండి అంటూ దిగేసి మీరు వెళ్లిపోండి అంటుంది. ఇక రామ జానకిని బుజ్జగించే ప్రయత్నం చేస్తాడు. అనంతరం జానకి కూల్ అయ్యి రామ చంద్రను ఒక రిసార్ట్ కు తీసుకు వెళుతుంది. ఇక రామచంద్రకు అప్పటికి కూడా అర్థం కాదు. ఇక నుంచి ఇక్కడే మనం రెండు రోజులు ఉండాలి అని అంటుంది. మరి రామ జానకి ఆలోచనలను ఏ విధంగా ఒప్పుకుంటుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X