Janaki Kalaganaledu March 27th: ఏకాంతంగా ప్రేమలో మునిగి తేలుతున్న జానకి.. రొమాంటిక్ ప్లాన్!
జానకి కలగనలేదు సీరియల్ ఊహించని మలుపులతో ఎంతో ఆసక్తికరంగా మారుతోంది. ఇక ఐపీఎస్ కావాలని ఎన్నో కలలు కన్న జానకి కానిస్టేబుల్ కావాల్సి వస్తుంది. ఇక భర్త రామ ఆమెకు సపోర్ట్ చేస్తాడు. మళ్ళీ ఎలాగైనా ఐపీఎస్ కావాలని ఆమెకు ధైర్యం చెప్తాడు.
ఇక జానకి కలగనలేదు సీరియల్ కు గత వారం కంటే ఈ వారం రేటింగ్స్ మరింత పెరిగాయి. 7.95 రేటింగ్ తో గత వారం మంచి క్రేజ్ అందుకుంటోంది. నేడు ప్రసారం కాబోయే 537 వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం..

ఏకాంతంగా గడపాలని..
జానకి తన భర్త రామచంద్రతో రెండు రోజులు హ్యాపీగా ఏకాంతంగా గడపాలని అనుకుంటుంది. ఇక అతనికి ఎక్కడికో చెప్పకుండా సైలెంట్ గా తీసుకు వెళుతుంది. ఇక రామ జానకి ఏమి చెప్పకపోయినా కూడా ఆమె చెప్పిన మాట వింటూ ఉంటాడు. ఇక కపుల్స్ కు స్పెషల్ గా ఉండే ఒక రెస్టారెంట్ లో ఇద్దరు కూడా హ్యాపీగా సరదాగా ఉంటారు.
అక్కడ కపుల్స్ కోసం ప్రత్యేకంగా కొన్ని టాస్క్ లు కూడా ఇస్తారు. అయితే ఇచ్చిన టాస్క్ లను కలిసి కట్టుగా ఫినిష్ చేసిన రామ జానకి ఇద్దరు కూడా బెస్ట్ కపుల్స్ గా సెలెక్ట్ అవుతారు.

బెస్ట్ కపుల్స్ అంటూ
ఇక ఇద్దరి మధ్యలో ఏ మేరకు అన్యోన్యత ఉంది అని టాస్క్ లో కూడా రామ కళ్ళు మూసుకొని జానకి నుదుటిపై బొట్టు పెడతాడు. ఇక ఆ విషయంలో జానకి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అంతే కాకుండా ఆ రెస్టారెంట్ వారు జానకి, రామ ఇద్దరు కూడా బెస్ట్ కపుల్స్ అంటూ ప్రత్యేకంగా మర్యాదలు అందిస్తూ ఉంటారు.
ఇక ఆ తరువాత రామ తండ్రి గోవిందరాజులు ఇంటి దగ్గర రామ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. తన భార్య జ్ఞానాంబ కొడుకు కోడలిని ఎందుకు బయటకు పంపిందో అని ఆయన కాస్త కన్ఫ్యూజన్ లో ఉంటాడు.

డిస్టర్బ్ చేయకూడదని
ఇక రామాకు ఒకసారి ఫోన్ చేయాలని అనుకుంటూ ఉండగా జ్ఞానాంబ వద్దని చెబుతుంది. వారు ఏకాంతంగా ఉండాలని బయటకు వెళ్లారు. రెండు రోజుల వరకు వారిని డిస్టర్బ్ చేయకూడదని అంటుంది. అలాగే ఒక స్వీట్ ఆర్డర్ వచ్చిందని చెప్పగా అవసరం లేదని జ్ఞానాంబ అంటుంది.
ఇక అసలు విషయం చెప్పడంతో గోవిందరాజులు సంతోషంగా ఫీల్ అవుతాడు. మనకు కూడా అంత వయసు ఏమి కాలేదని మనం కూడా అలా సరదాగా వెళదామా అని అంటారు. కానీ జ్ఞానాంబ మాత్రం మనవడిని ఎత్తుకొస్తాను ఉండండి అంటు పంచ్ వేస్తుంది.

రామ, జానకి రొమాన్స్
ఇక రెస్టారెంట్ లో జానకి రామ రొమాంటిక్ మాట్లాడుకుంటు ఉంటారు. ఇన్నాళ్లకు మనం భార్య భర్తలుగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాము అని రామ అంటాడు. ఇక ఎప్పటికి ఇలానే ఉండాలని ఉందా అని జానకి అడుగుతుంది. ఇక జానకి అలా అనడంతో రామ కంటేగా చూస్తూ ఉంటాడు. ఇక ఇద్దరు కూడా ఒక కూల్ డ్రింక్ తాకుతూ రొమాంటిక్ గా చూసుకుంటూ ఉంటారు. అయితే అప్పుడే రెస్టారెంట్ లో ఒక చిన్న పాప గోల్డ్ చేయిన్ పోతుంది. ఇక జానకి వెంటనే ఆ దోంగను పట్టించేలా చేయాలని అనుకుంటుంది. మేనేజర్ కు చెప్పి వెంటనే రెస్టారెంట్ గేట్లు మూసేయమని అంటుంది.

దొంగను పట్టించిన జానకి
ఇక జానకి మాటలను విన్న ఒక వ్యక్తి ఇక్కడ అందరిని చెక్ చేస్తారా అని లేస్తాడు. ఇక అతన్ని అనుమానించిన జానకి అతనే దోంగ అని అంటుంది. నన్ను దొంగా అంటావా ఎలా కనిపిస్తున్నాను అని అతను అంటాడు. ఇక అతని భార్య కూడా కాస్త కంగారు పడడం జానకి గమనిస్తుంది. ఆ వ్యక్తి కావాలంటే చెక్ చేసుకోండి అంటూ ఛాలెంజ్ చేస్తాడు.
ఇక జానకి మరింత అనుమానంగా అతని భార్యను చెక్ చేయాలి అని అంటుంది. ఇక ఆ దొంగ భార్య భయపడి గొలుసు ఇస్తుంది. ఇక ఆ గొలుసు తీసుకున్న జానకి వారిని స్టేషన్ కు పంపించాలని మేనేజర్ కు చెబుతుంది. అంతే కాకుండా జానకి రికవరీ చేసిన గొలుసును పాప మెడలో వేస్తుంది. ఇక జానకి ప్రతిబకు అందరూ క్లాప్స్ కొడతారు.
మలయాళం చేసిన పనికి..
ఇక ఇంటి దగ్గర పనివాడు మలయాళం చాలా హ్యాపీగా చిల్ అవుతూ ఉంటాడు. అతను ఒక అరటి గుత్తిని తీసుకొని దాన్ని పైన తాడుతో కట్టేయాలని అనుకుంటాడు. అయితే అతను టేబుల్ వేసి తాడును కడుతున్న సమయములో ఉరి వేసుకుంటేన్నాడెమో అనే అనుమానంతో మల్లిక పరుగు పరుగున అక్కడికి వస్తుంది.
వెంటనే మలయాళం నిలుచున్న టేబుల్ ను తన్నేస్తుంది. ఇక కిందపడిన మలయాళం గట్టిగా అరుస్తాడు. అప్పుడే గోవిందరాజులు ఏం జరిగిందో అని పెరిగెత్తుకుంటు వస్తాడు. ఇక ఏం జరిగింది అంటూ మల్లికను అడుగుతాడు. మలయాళం పెళ్లి కాలేదు అనే బాధతో ఆత్మహత్య చేసుకుంటే నేనే కాపాడాను అని మల్లిక చెబుతుంది. దీంతో మలయాళం షాక్ అవుతాడు. మరి అతను గోవిందరాజులకు ఎలాంటి సమాధానం ఇస్తాడో చూడాలి.


Click it and Unblock the Notifications











