Janaki Kalaganaledu March 28th: జానకి గ్రీన్ సిగ్నల్.. శృంగారంలో మునిగి తేలిన రామ.. స్వీట్ రొమాన్స్!
జానకి కలగనలేదు సీరియల్ రోజురోజుకు మరింత ఆసక్తిని కలోగిస్తోంది. ఐపీఎస్ కావాలని అనుకున్న జానకి కానిస్టేబుల్ అవుతుంది. ఇక భర్త రామ ఆమెకు సపోర్ట్ చేస్తాడు. మళ్ళీ ఎలాగైనా కష్టపడి చదివి ఐపీఎస్ కావాలని ఆమెకు ధైర్యం చెప్తాడు. ఇక జానకి కలగనలేదు సీరియల్ కు గత వారం కంటే ఈ వారం రేటింగ్స్ మరింత పెరిగాయి. 7.95 రేటింగ్ తో గత వారం మంచి క్రేజ్ అందుకుంటోంది. నేడు ప్రసారం కాబోయే 538 వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం..

మలయాళం ఆత్మహత్య గోల
ఇంట్లో పని చేసే మలయాళం హఠాత్తుగా ఆత్మహత్య చేసుకుంటున్నాడు అనే అనుమానంతో మల్లిక అతనిని కింద పడేస్తుంది. అయితే నిజానికి మలయాళం అరటి గోలను తాడుకు కట్టాలని అనుకుంటాడు. కానీ మల్లిక మాత్రం అతను ఉరి వేసుకుంటున్నాడు అనే అనుమానంతో అతను ఎక్కిన టేబుల్ను తన్నేస్తుంది.
దీంతో ఒక్కసారిగా కింద పడిపోయిన మలయాళం గట్టిగా అరుస్తాడు. అయితే ఇంతలో గోవిందరాజులు అక్కడికి పరిగెత్తుకుంటూ వస్తాడు. ఏం జరిగింది అని అడుగుతాడు అయితే మలయాళం పెళ్లి కాలేదు అనే బాధతో ఆత్మహత్య చేసుకోబోతున్నాడు అని నేను వచ్చి కాపాడాను అని చెబుతుంది.

నిజం చెప్పడంతో..
అంతేకాకుండా మలయాళ మాట్లాడుతున్నా కూడా మల్లికనే అన్ని విషయాలు మాట్లాడుతూ ఉంటుంది. అతన్ని ఏమీ చెప్పనివ్వదు. ఇక గోవిందరాజులు మల్లికా చెప్పింది నిజం అనుకొని అంత కర్మ నీకెందుకురా పెళ్లి చేసుకుని మా విష్ణు ఏమైనా సుఖపడుతున్నాడా? అంటూ మల్లిక పై మరో కౌంటర్ వేస్తాడు. ఎవరో ఒకరు దొరుకుతారులే అని కూడా గోవిందరాజులు చెబుతాడు.
ఇక చివరికి మలయాళం నోరు విప్పి మాట్లాడి అంత కర్మ నాకు ఏమి పట్టలేదు అని ఎవరో ఒకరు దొరుకుతారు అని నాకు తెలుసు అని నేను ఆత్మహత్య చేసుకోవాలని అనుకోలేదు అని నిజం చెబుతాడు. కేవలం అరటి గోల కట్టేందుకు ఈ టేబుల్ ఎక్కనట్లు చెప్పడంతో మల్లికా ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇక నోరు మెదపకుండా ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.

శోభనం గది తరహాలో
ఇక మరోవైపు ఆనందంగా విహార యాత్రలు వెళ్లిన జానకి రామచంద్ర రొమాంటిక్ గా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అయితే హఠాత్తుగా రిసార్ట్ రూమ్ లోకి రావడంతో అక్కడ శోభనం గది తరహాలో డిజైన్ చేసి ఉంటుంది. అయితే పొరపాటున మరొక రూమ్ కి వచ్చామేమో అని రామచంద్ర మాట్లాడుతూ ఉంటాడు.
అంతేకాకుండా ఈ రూమ్ ఎవరి డిజైన్ చేయించారో గాని చాలా అదృష్టవంతులు అని కూడా అంటుంటాడు.అయితే అప్పుడే జానకి ఆ అదృష్టవంతులు మీరే అని కూడా అంటుంది. దెబ్బకి రామచంద్ర మళ్ళి ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు.

రామ రొమాన్స్
నేను నిర్ణయం మార్చుకున్నాను అని మనం భార్యాభర్తలు గా మరొక అడుగు ముందుకు వేయాల్సిన సమయం వచ్చింది అని జానకి చెబుతుంది. అయితే మీ లక్ష్యం గురించి మీరు ఆలోచించాలని రామచంద్ర అడిగినప్పుడు దాన్ని వదలను అని, అలాగే దంపత్య జీవితంలో కూడా ఇలాంటివి వదులుకోలేను అని సంతోషంగా ఉండాలని అంటుంది.
ఇక రామచంద్ర కు ఆమె రొమాంటిక్ గా పాలు ఇచ్చేస్తుంది. ఇక రామ కూడా ఆ రాత్రి జానకీతో రొమాంటిక్ లైఫ్ లో ఎంజాయ్ చేస్తాడు.

ఎంతో ప్రేమగా..
ఉదయాన్నే జానకి నిద్రలేచి రామచంద్రను ఎంతో ప్రేమగా చూస్తూ ఉంటుంది ఇక రామచంద్ర భార్యను మరోసారి దగ్గరికి తీసుకునే ప్రయత్నం చేస్తాడు. మనం ఇప్పుడే వెళ్లిపోవాలి అని కూడా రామచంద్ర ఆమె చెబుతుంది. ఇక్కడే కొన్ని రోజులు ఉందామని రామ అనడంతో లేవండి అంటూ జానకి అతని తొందర పెడుతుంది. ఇక వారు తిరిగి ఇంటికి బయలుదేరుతారు.

వెన్నెల చెప్పిన మాటలకు
ఇక మరోవైపు జ్ఞానాంబ కూతురు వెన్నెల చదువుకోవాలని అనుకుంటున్నట్లుగా తల్లితో చెబుతూ ఉంటుంది. ఇప్పుడు నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు కదా పెళ్లి చేస్తే చదువుకునే వీలు ఉండదు అని మళ్ళీ భర్త పిల్లలు అంటూ బిజీగా అయిపోయి ఉండాలి అని అంటుంది. దీంతో జ్ఞానాంబ మళ్ళీ ఆలోచనలు పడుతుంది.
అయితే పక్కనే ఉన్న మల్లికా మాత్రం వెన్నెల చెప్పిన మాటలకు కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. అయినా ఇప్పుడు చదువుకొని ఎవరు బాగుపడ్డారు అని చదువుకున్నా చదువుకోకపోయినా కూడా భర్త పిల్లలు అంటూ మరొక జీవితంలోకి వెళ్లాలి అని దాని వల్ల ఉపయోగం లేదు అని మల్లికా మాట్లాడుతుంది.
అందరూ ఒకేలా ఉండరు..
దీంతో అత్తగారు కలుగజేసుకొనే అందరూ ఒకేలా ఉండరు అని ఒక్కొక్కరికి ఒక్కోలా ఉండాలని ఇష్టం ఉంటుంది అని నువ్వు అనవసరంగా ఇష్టం వచ్చినట్లు వాగకు అని చెబుతోంది. ఇక మల్లిక ఏమీ అనకుండా సైలెంట్ గా ఉంటుంది. అలా బయట వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా జానకి రామచంద్ర వస్తారు. వారిని చూసిన జ్ఞానాంబ ఎంతగానో సంతోషపడుతుంది.
ఇక జానకి సిగ్గుపడుతూ ఉండడంతో ఆమెకు విషయం కూడా అర్థమవుతుంది. అయితే ఎందుకు వీళ్ళు ఇలా ప్రవర్తిస్తున్నారు అని మల్లిక మళ్ళీ ఆలోచనలు పడుతుంది. మరి అసలు విషయం ఆమెకు తెలిస్తే ఎంతలా ఆశ్చర్యపోతుందో తదుపరి ఎపిసోడ్ లో చూడాలి.


Click it and Unblock the Notifications











