Janaki Kalaganaledu March 29th: అఖిల్ డబ్బుల విషయంలో గొడవపడిన తండ్రి.. మరోసారి కోపాలు, అలకలు!
జానకి కలగనలేదు సీరియల్ కథ ఎంతో ఆసక్తిని కలోగిస్తోంది. ఐపీఎస్ కావాలని అనుకున్న జానకి కానిస్టేబుల్ కావాల్సి వస్తుంది. ఇక మళ్ళీ ఐపీఎస్ పరీక్షలు రాసి మీ కలను నిజం చేసుకోవాలి అని భర్త రామ ఆమెకు సపోర్ట్ చేస్తాడు. ఇక జానకి కలగనలేదు సీరియల్ కు గత వారం కంటే ఈ వారం రేటింగ్స్ మరింత పెరిగాయి. 7.95 రేటింగ్ తో గత వారం మంచి క్రేజ్ అందుకుంటోంది. నేడు ప్రసారం కాబోయే 539 వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం..

హ్యాపీగా ఉన్న సమయంలో
ఇంట్లో అందరూ హ్యాపీగా ఉన్న సమయంలో ఊహించిన విధంగా ఒక గొడవ జరుగుతుంది. ఇక నెలాఖరు కావడంతో ఇల్లు గడవడానికి అందరూ కూడా కలిసికట్టుగా డబ్బులు ఇవ్వాల్సి ఉంటుంది. ప్రతినెల ఒక వంతు భాగం డబ్బులు ఇవ్వాలి అని తండ్రి గోవిందరాజులు కొడుకులకు చెబుతాడు. ఇక రామచంద్ర మాత్రం అనుకున్న దానికంటే ఎక్కువగా ఇస్తూ ఉంటాడు అయితే రెండవ కొడుకు విష్ణు తన భార్య కారణంగా ఎంత ఇవ్వాలో అంతే ఇస్తాడు. ఇక అఖిల్ భార్య జెస్సి మాత్రం ఇంట్లో అందరూ బాగుండాలి అని కోరుకుంటుంది. కానీ అఖిల్ మాత్రం ఎప్పుడు బయటకు వెళ్ళిపోదామా అని చూస్తూ ఉంటాడు.

ఖర్చులు పెరిగాయి
ఇక అఖిల్ కూడా తన వాటా ఇవ్వడానికి వస్తాడు. అయితే అతను అందరూ ఇచ్చినంత డబ్బులు ఇవ్వడు. కాస్త తక్కువ ఇవ్వడంతో గోవిందరాజులు అతన్ని ప్రశ్నిస్తాడు. నాకు ఇప్పుడు ఖర్చులు పెరిగాయి అని ముందు ఇచ్చినంత ఇవ్వలేకపోవచ్చు అని అంటాడు. ఎందుకంటే నాకు ఇప్పుడు బాబు పుట్టాడు కాబట్టి ఖర్చులు ఎక్కువగా ఉంటాయి అందుకే ఈ నెల నుంచి ఇంతే రావచ్చు లేదంటే కూడా తక్కువ కావచ్చు అని కూడా అఖిల్ అంటాడు. దీంతో గోవిందరాజులు కొంత సీరియస్ అయ్యే ప్రయత్నం చేస్తాడు. ఇల్లు గడవడానికి అందరూ సమానంగా ఇస్తున్నప్పుడు అంతే ఇవ్వాలి అని ఇప్పుడు నువ్వు నీ స్వార్థం కోసం ఏదో ఖర్చులు చూసుకుంటూ తక్కువ ఇస్తాను అంటే ఎలా అని గోవిందరాజులు అడుగుతాడు.

కోపంగా సమాధానం
కానీ అఖిల్ మాత్రం మొండిగానే సమాధానం చెబుతూ ఉంటాడు. అయితే ఇంతలో తల్లి జ్ఞానంబ గొడవ పెట్టుకోవద్దు అని చెబుతుంది. కానీ అఖిల్ మాత్రం సీరియస్ అవుతూనే ఉంటాడు. ఇక ఇంట్లో వాళ్ళందరూ కూడా హాల్లోకి వచ్చి ఆ గొడవను చూస్తూ ఉంటారు. అయితే రామచంద్ర కూడా వదిలేయండి అని తన తండ్రి కి చెబుతాడు. అయితే జానకి మాత్రం మామయ్య గారితో అలా మాట్లాడవద్దని అఖిల్ కు చెబుతోంది. అఖిల్ సీరియస్ అవుతూ నువ్వు మధ్యలో మాట్లాడకు వదిన అంటే ఉంటాడు.

సమానంగా చూడడం లేదు
అంతేకాకుండా ఇంట్లో తనను సమానంగా చూడడం లేదు అని అసహనం వ్యక్తం చేస్తూ ఉంటాడు. ఎందుకంటే ఇటీవల జానకి రామచంద్ర విహారయాత్రకు వెళ్లినప్పుడు డబ్బులు ఇచ్చిన విషయాన్ని అఖిల్ కాస్త సీరియస్ గా చెబుతూ ఉంటాడు. దీంతో గోవిందరాజులు అఖిల్ పై మరింత సీరియస్ అయ్యే ప్రయత్నం చేస్తాడు. ఇక మాట మాట పెరగడంతో అఖిల్ చివరికి ఆఫీసుకు కోపంగానే వెళ్ళిపోతాడు. అయితే ఆ విషయంలో అందరూ కాస్త అఖిల్ పై జాలితో సపోర్ట్ చేస్తూ ఉంటారు.

చిన్న కొడుకు విషయంలో
ఇక గోవిందరాజులు తన భార్యను అడిగే ప్రయత్నం చేస్తాడు. నీ చిన్న కొడుకు విషయంలో నీ పద్ధతి ఏమీ కరెక్ట్ గా లేదు అని అంటాడు. అయినప్పటికీ జ్ఞానాంబ ఏమీ అనకుండా సైలెంట్ గానే ఉంటుంది. వాళ్ళు పిల్లలు ఏమీ తెలియదు. మనమే అర్థం చేసుకుని వెళ్లాలి అని అంటుంది. ఇక గోవిందరాజులు హాల్లో చాలా కోపంగా కనిపిస్తూ ఉంటాడు. ఇంట్లో పని చేసే మలయాళం వచ్చి గోవిందరాజులు ఒళ్ళు పడుతున్నప్పటికీ కూడా అతను కోపంగానే ఉంటాడు.

అఖిల్ రాలేదు అని..
అయితే ఇంతలో జెస్సి సాయంత్రం అవుతున్న ఇంకా అఖిల్ ఇంటికి రాలేదు అని కంగారుపడుతూ మామగారికి చెబుతుంది. బహుశా అఖిల్ అలిగే ఎక్కడికైనా వెళ్ళిపోయాడు ఏమో అని రెండవ కోడలు మల్లికా అనుమానం వ్యక్తం చేస్తుంది. అంతేకాకుండా పోలీస్ కంప్లైంట్ ఇస్తే బెటరేమో అని కూడా అనడంతో గోవిందరాజులు కొంత ఆశ్చర్యపోతాడు. రెండు గంటలు ఆలస్యంగా రావచ్చు అని అంత మాత్రాన పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు అని కడుపు మాడితే అతనే ఇంటికి వస్తాడు అని కోపంగా చెబుతూ ఉంటాడు. ఇక రామచంద్ర అలాగే జ్ఞానాంబ ఇద్దరు కూడా ఒకసారి శివాలయం దగ్గరికి వెళ్లి చూడాలి అని అనుకుంటారు.

కోపంగా అలిగిన గోవిందరాజులు
అయితే ఇంతలోనే అఖిల్ గుమ్మం నుంచి ఇంట్లోకి వస్తాడు. ఫ్రెండ్స్ తో బయటకు వెళ్ళాను అని ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యింది అని సింపుల్ గా సమాధానం ఇస్తాడు. ఇక ఆ విషయంలో గోవిందరాజులు మరింత అసంతృప్తిగా ఉంటాడు. నావల్ల అఖిల్ అలిగి వెళ్లిపోయాడేమో అని అన్నంతగా నన్ను అందరూ ఏదో ఒక మాట అంటూనే ఉన్నారు. ఇప్పుడు అతను తిరిగి వచ్చాడు కదా అని కోపంగా కనిపిస్తూ ఉంటాడు. ఇక అతని భార్య జ్ఞానాంబ భర్తకు సర్ది చెప్పే ప్రయత్నం చేస్తుంది. పిల్లలన్నాక తప్పులు చేస్తారు అని మనం బంధాలను కలుపుకొని పోయేలా ఉండాలి కానీ విడిపోయేలా చేయకూడదు అని చెబుతుంది. మరి గోవిందరాజులు ఆమె మాటలకు ఎలా రియాక్ట్ అవుతాడో తదుపరి ఎపిసోడ్లో చూడాలి.


Click it and Unblock the Notifications











